అవినీతి రహిత పాలన అందిస్తామని నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో వినూత్న, విప్లవాత్మకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను 72 గంటల్లోనే ప్రజల ముంగిటకు చేరుస్తామని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను ప్రజల ముందుకు తెస్తూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలోని అవినీతి కాంట్రాక్టులను రద్దు చేసి, దోచుకున్నదెంతో ప్రజల ఎదుట ఉంచుతామన్నారు.