కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీని ఖాళీగా వదిలేసిన ఆతిశి
ఢిల్లీ సీఎంగా బాధ్యతల స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆతిశి బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై తనకున్న ప్రభు భక్తిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన కూర్చున్న ఎర్ర రంగు కుర్చీని ఖాళీగానే ఉంచి, ఆ పక్కనే మరో తెల్ల రంగు కుర్చీలో కూర్చుని సాదాసీదాగా సోమవారం సచివాల యంలో ఆమె ఢిల్లీ 8వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆతిశి మీడియాతో మాట్లాడారు.
ఈ కుర్చీ కేజ్రీవాల్‌ది
రామాయణంలో శ్రీరాముడి సోదరుడు భరతుడి మాదిరిగానే తాను వ్యథ చెందుతున్నానని ఆతిశి అన్నారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఆనాడు భరతుడి వ్యథలాగే.. నేడు నా మనసు వ్యథ చెందుతోంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య రాజ్య పాలన బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఆయన రాజ్యపాలన చేశారు. అదే తీరుగా వచ్చే నాలుగు నెలలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను.
తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశారు. అందుకే మనం ఆయనను మర్యాద పురుషోత్తముడిగా పిలుచుకుంటాం. శ్రీరాముడి జీవితం మర్యాద, నైతికతకు నిదర్శనం. అదే విధంగా కేజ్రీవాల్ కూడా మర్యాద, నైతికతకు నిదర్శనంగా నిలిచారు. గత రెండేళ్లుగా కేజ్రీవాల్‌పై బురదజల్లేందుకు బీజేపీ ఏ అవకాశాన్నీ వదిలి పెట్టలేదు. అయితే, నిజాతీపరుడినని నిరూపించుకునే వరకూ సీఎం పీఠంలో కూర్చోనని ఆయన పదవికి రాజీమా చేశారు. కానీ, ఈ కుర్చీ (తన పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీని చూపెడుతూ) కేజ్రీవా ల్‌ది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తమ ఆశీర్వాదంతో కేజ్రీవాల్‌ను సీఎం పీఠంపై కూర్చో బెడతారనే నమ్మకం నాకుంది’’ అని ఆతిశి అన్నారు.
సీఎం పదవికే అవమానం
కేజ్రీవాల్ వాడిని కుర్చీలో కూర్చోరాదంటూ సీఎం ఆతిశి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి. ‘ఆతిశి చేసిన పని ఆదర్శం ఎంతమాత్రమూ కాదు. ఆమె సీఎం పదవిని అవమా నించడమే కాదు, ఢిల్లీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు’’ అని ఆ పార్టీ ప్రతినిధులు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment