taking charge
-
మరింత బలోపేతం చేద్దాం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని.. ప్రజలు, కిందిస్థాయి కార్యకర్తల ఆలోచనలకు దగ్గరగా మన పనితీరు ఉండాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సూచించారు. ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుందామన్నారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించారు.అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని విస్మరించి అరాచకాలతో బిహార్‌లా మారుస్తున్నారని.. సూపర్‌సిక్స్‌కు బొందపెట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేసుకోవాలని.. జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశముందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మన మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా పార్టీ కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జనసేన శ్రేణులు టీడీపీ పల్లకీ మోస్తున్నారు : పేర్ని నానిమాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను ఓడిస్తే తమకు మంచి జరుగుతుందని జనసేన కార్యకర్తలు భ్రమపడ్డారని.. కానీ, ఇప్పుడేమో వారు టీడీపీ పల్లకీలు మోస్తున్నారని ఎద్దేవా చేశారు. మానసికంగా వారంతా చచ్చి బతుకుతున్నారని, వాళ్ల పరిస్థితి పగోడికి కూడా రాకూడదన్నారు. వైఎస్సార్సీపీకి ఆధారం, మూలం, బలం కార్యకర్తలేనన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రజలను మోసంచేశారని ఆరోపించారు.వాళ్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని.. కేసులు పెట్టారని, రోడ్ల మీద కొట్టి దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. ఇలా ఓవరాక్షన్ చేసిన వారెవరినీ వదిలిపెట్టబోమని, వాళ్లని పరిగెత్తించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అధికార మదంతో వైఎస్సార్సీపీని అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. ఇక మూడు పార్టీలు కాదు.. 30 పార్టీలు కలిసొచ్చినా వైఎస్సార్సీపీకి ఏమీకాదని, తాము తగ్గేదేలేదని పేర్ని నాని స్పష్టంచేశారు. ఎవరూ అధైర్యపడొద్దని.. తాము అండగా ఉంటామని పార్టీ శ్రేణులకు పేర్ని భరోసా ఇచ్చారు.ప్రజలకు కష్టమొస్తే జగన్‌ను తలుచుకుంటున్నారు : అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని తలుచుకుంటున్నారని.. ఆయన ఉంటే ఇలా జరిగేది కాదని గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయడమే అందుకు కారణమన్నారు. టీడీపీ సోషల్ మీడియా, వారి అనుకూల మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని.. మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
నాదీ భరతుడి వ్యథే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆతిశి బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై తనకున్న ప్రభు భక్తిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన కూర్చున్న ఎర్ర రంగు కుర్చీని ఖాళీగానే ఉంచి, ఆ పక్కనే మరో తెల్ల రంగు కుర్చీలో కూర్చుని సాదాసీదాగా సోమవారం సచివాల యంలో ఆమె ఢిల్లీ 8వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆతిశి మీడియాతో మాట్లాడారు.ఈ కుర్చీ కేజ్రీవాల్దిరామాయణంలో శ్రీరాముడి సోదరుడు భరతుడి మాదిరిగానే తాను వ్యథ చెందుతున్నానని ఆతిశి అన్నారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఆనాడు భరతుడి వ్యథలాగే.. నేడు నా మనసు వ్యథ చెందుతోంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య రాజ్య పాలన బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఆయన రాజ్యపాలన చేశారు. అదే తీరుగా వచ్చే నాలుగు నెలలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశారు. అందుకే మనం ఆయనను మర్యాద పురుషోత్తముడిగా పిలుచుకుంటాం. శ్రీరాముడి జీవితం మర్యాద, నైతికతకు నిదర్శనం. అదే విధంగా కేజ్రీవాల్ కూడా మర్యాద, నైతికతకు నిదర్శనంగా నిలిచారు. గత రెండేళ్లుగా కేజ్రీవాల్‌పై బురదజల్లేందుకు బీజేపీ ఏ అవకాశాన్నీ వదిలి పెట్టలేదు. అయితే, నిజాతీపరుడినని నిరూపించుకునే వరకూ సీఎం పీఠంలో కూర్చోనని ఆయన పదవికి రాజీమా చేశారు. కానీ, ఈ కుర్చీ (తన పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీని చూపెడుతూ) కేజ్రీవా ల్ది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తమ ఆశీర్వాదంతో కేజ్రీవాల్‌ను సీఎం పీఠంపై కూర్చో బెడతారనే నమ్మకం నాకుంది’’ అని ఆతిశి అన్నారు. సీఎం పదవికే అవమానంకేజ్రీవాల్ వాడిని కుర్చీలో కూర్చోరాదంటూ సీఎం ఆతిశి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి. ‘ఆతిశి చేసిన పని ఆదర్శం ఎంతమాత్రమూ కాదు. ఆమె సీఎం పదవిని అవమా నించడమే కాదు, ఢిల్లీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు’’ అని ఆ పార్టీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. -
రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మల
-
రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖా మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించారు. నిజానికి బుధవారమే ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ ఎందుకనో కార్యక్రమం వాయిదా పడింది. ఇక గురువారం ఉదయం సౌత్ బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మరో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యారు. ఇటీవల కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు రక్షణ శాఖ పగ్గాలను మోదీ అప్పగించిన విషయం తెలిసిందే. స్వతంత్ర్య భారతావనికి ఆమె రెండో మహిళా రక్షణ శాఖా మంత్రి. కాగా, ఇందిరాగాంధీ(ప్రధానిగా ఉన్న సమయంలో తాత్కాలిక బాధ్యతలు) తర్వాత పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందారు. నిర్మలా సీతారామన్ బయోడేటా... తమిళనాడులోని ముధురై లో 1959 ఆగష్టు 18న ఆమె జర్మించారు. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూఢిల్లీ లోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్యూ) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఇండో-యూరోపియన్ టెక్స్టైల్ ట్రేడ్ పై దృష్టిసారించిన ఆమె ఆ అంశంలోనే పీహెచ్డీ చేశారు. లండన్ లోని అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోషియేషన్ లో ఆర్థిక విభాగంలో సహయకురాలికి ఆమె విధులు నిర్వహించారు. ఆపై ప్రైస్ వాటర్‌హౌజ్ కు సీనియర్ మేనేజర్ గా పని చేశారు. అదే సమయంలో ఆమె బీబీసీ అంతర్జాతీయ సేవా విభాగంలో పని చేశారు కూడా. తిరిగి ఇండియాకొచ్చాక హైదరబాద్ లోని సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ సర్వీస్ విభాగానికి డిప్యూటీ డైరక్టర్ గా సేవలు అందించారు. అటుపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సభ్యురాలిగా(2003-05) ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే మహిళా సాధికారకత పలు ప్రసంగాలు ఆమె వినిపించారు. 2008లో బీజేపీలో చేరిన ఆమె జాతీయ కార్యవర్గ సంఘంలో సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2010 మార్చి లో అధికార ప్రతినిధిగా పార్టీ నియమించటంతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె చివరకు 2014 మే 26న కొలువుదీరిన కేబినెట్ లో కేంద్ర వాణిజ్య శాఖ(స్వతంత్ర్య హోదా) మంత్రిగా ఆమె బాధ్యతుల స్వీకరించారు. చివరకు ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి విస్తరణలో నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ కు ప్రమోట్ అయ్యారు. వ్యక్తిగత జీవితం... జేఎన్‌యూలో తన సహచర విద్యార్థి అయిన పరకాల ప్రభాకర్ ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీతారామన్ @nsitharaman పేరిట ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు పోస్టులు అప్ డేట్ చేస్తుంటారు. -
పాక్‌తో సత్ సంబంధాలు కొనసాగిస్తాం : సుష్మా
ప్రపంచంలో సార్క్ దేశాలను బలమైన శక్తిగా అవతరించేందుకు కృషి చేస్తానని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్ఫష్టం చేశారు. న్యూఢిల్లీలో బుధవారం ఆమె విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ... పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో సత్ సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు మరిన్ని చర్యలు చేపడతామన్నారు. సార్క్ సభ్య దేశాలు బలీయమైన శక్తిగా ఎదగాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కాలంగా ఆకాంక్షిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టి... అందులో సఫలీకృతమవుతామని సుష్మా ఆశాభావం వ్యక్తం చేశారు.