పాక్తో సత్ సంబంధాలు కొనసాగిస్తాం : సుష్మా
ప్రపంచంలో సార్క్ దేశాలను బలమైన శక్తిగా అవతరించేందుకు కృషి చేస్తానని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్ఫష్టం చేశారు. న్యూఢిల్లీలో బుధవారం ఆమె విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ... పొరుగున ఉన్న పాకిస్థాన్తో సత్ సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు మరిన్ని చర్యలు చేపడతామన్నారు. సార్క్ సభ్య దేశాలు బలీయమైన శక్తిగా ఎదగాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కాలంగా ఆకాంక్షిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టి... అందులో సఫలీకృతమవుతామని సుష్మా ఆశాభావం వ్యక్తం చేశారు.