న్యూఢిల్లీ : బన్సూరి స్వరాజ్‌ను న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడంపై బీజేపీపై ఢిల్లీ ఆప్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. న్యాయవాద వృత్తికి కళంకం తెచ్చేలా ఆమె కోర్టులో దేశ ద్రోహులకు అండగా నిలిచారని ఆరోపిస్తోంది. బన్సూరి టికెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
ఇటీవల బీజేపీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో బన్సూరి స్వరాజ్ చోటు దక్కించుకున్నారు. అయితే ఇదే అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
మీడియా సమావేశంలో ఆప్ మంత్రి ఆతిశీ మాట్లాడుతూ బన్సూరి న్యాయవాదిగా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని, అలాంటి వారికి బీజేపీ లోక్‌సభ సీటు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. లోక్‌సభ అభ్యర్ధిగా ప్రజల్ని ఓట్లు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బన్సూరికి టికెట్ ఇచ్చే అంశంపై బీజేపీ పునరాలోచించానలి డిమాండ్ చేశారు.
అయితే ఆప్ విమర్శలపై స్పందించిన బన్సూరి న్యూఢిల్లీ లోక్‌సభ ఆమ్ ఆద్మీ అభ్యర్ధి సోమనాథ్ భారతిపై మండిపడ్డారు. సోమనాథ్ భారతీ ఢిల్లీ రాజేంద్రనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ క్యాడర్ ఆయనపై దాడికి దిగిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
AAP candidate from New Delhi Loksabha Somnath Bharti who's accused of assaulting his own wife is beaten by his own Karyakartas... 💀 pic.twitter.com/cGkwarcNIr
— Mr Sinha (Modi's family) (@MrSinha_) March 2, 2024
ఆ వీడియోలపై బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ ‘నేను ఆప్‌ని అడగాలనుకుంటున్నాను. రాజేంద్ర నగర్‌లో తన సొంత క్యాడర్‌తో కొట్టించుకున్న అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ఎందుకు నిలబెట్టింది. సొంత పార్టీ సభ్యులకే నచ్చని అభ్యర్ధిని ఎలా ఎంపిక చేసుకున్నారు. అలాంటి వారి మాపై ఆరోపణలు చేయోచ్చా? అని అడిగారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment