న్యూఢిల్లీ:ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం(అక్టోబర్4) కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి కేజ్రీవాల్‌కు ఏర్పడింది. సీఎంగా పదవి చేపట్టిన 2015 నుంచి సివిల్ లైన్స్ ఏరియా 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న ఇంటిలోనే కేజ్రీవాల్ కుటుంబం నివసించింది.
ఇక నుంచి ఢిల్లీలోని 5, ఫిరోజ్‌షా రోడ్డులోని ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్‌మిట్టల్ ఇంట్లో కేజ్రీవాల్ కుటుంబం నివాసం ఉండనుంది. కేజ్రీవాల్ తన ఇంటిని ఎంచుకోవడం పట్ల ఎంపీ అశోక్‌మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు.ఆప్ పార్టికి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు తమ ఇళ్లు తీసుకోవాల్సిందిగా కేజ్రీవాల్‌ను కోరినప్పటికీ ఆయన మాత్రం ఎంపీ అశోక్‌మిట్టల్ ఇంటినే ఎంచుకున్నారు.లిక్కర్ కేసులో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన తర్వాత కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
Comments
Please login to add a commentAdd a comment