Bansuri Swaraj
-
సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
ఎన్నికల్లో సింపతి పొందేందుకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లారని అయ్యారని బీజేపీ న్యూఢిల్లీ లోక్‌సభ అభ్యర్ధి బన్సూరీ స్వరాజ్ అన్నారు.కేజ్రీవాల్ తన వ్యూహంలో భాగంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపిన తొమ్మిది సమన్లపై స్పందించ లేదన్నారు. కాబట్టే దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు తీసుకెళ్లాయని అన్నారు.ఈ సారి దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాల్ని కైవసం చేసేలా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా బీజేపీ గెలుపు గుర్రాల్ని బరిలోకి దించింది. కాగా, బన్సూరీ స్వరాజ్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆప్- కాంగ్రెస్ ఒప్పందంలో భాగంగా అదే స్థానం నుంచి ఆప్ నేత సోమనాథ్ భారతి పోటీ చేస్తున్నారు. -
బాసురీ స్వరాజ్.. డాటరాఫ్ సుష్మ
బాసురీ స్వరాజ్. సక్సస్ఫుల్ సుప్రీంకోర్టు లాయర్. అయినా సరే, అక్షరాలా అమ్మకూచి. సుష్మా స్వరాజ్ అంతటి గొప్ప వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టమంటారు. తల్లితో కలిసున్న ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటారు. విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న బాసురి బీజేపీ లీగల్ సెల్ కన్వినర్‌గా న్యాయవాద వృత్తిలోనూ రాజకీయాలను కొనసాగించారు. ఈసారి న్యూఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగి ఎన్నికల అరంగేట్రమూ చేస్తున్నారు... వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ కూడా ఆ తాను ముక్కేనని ఇటీవల విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. బాçసురీకి టికెటివ్వడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. కానీ తన తల్లి ప్రజాప్రతినిధిగా చేసినంత మాత్రాన తనవి వారసత్వ రాజకీయాలు కావంటారు బాసురీ. ‘‘రావడమే సీఎం, పీఎం వంటి ఉన్నత పదవులతోనో పార్టీ అధినేతగానో రాజకీయాల్లో అడుగు పెడితే వారసత్వ రాజకీయం అవుతుంది. కానీ నాలా కార్యకర్త నుంచి మొదలైతే కాదు’’ అంటూ తిప్పికొడుతున్నారు. ‘‘నా రాజకీయ ప్రస్థానం పార్టీ కార్యకర్తగానే మొదలైంది. న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టే ముందే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీ నాకో అవకాశమిచి్చంది. ఇప్పుడూ అందరిలాగే కష్టపడుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీ సిటింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీని పక్కనపెట్టి మరీ బాసురీకి అవకాశమిచి్చంది బీజేపీ. దీనిపై మీనాక్షి బాగా అసంతృప్తితో ఉన్నారన్న వార్తలను బాసురీ కొట్టిపడేశారు. ఆమె ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయన్నారు. హై ప్రొఫైల్ కేసులతో... బాసురీ 1984 జనవరి 3న జని్మంచారు. లండన్‌లోని వారి్వక్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో డిగ్రీ చదివారు. బీపీపీ లా స్కూల్లో న్యాయశా్రస్తాన్ని అభ్యసించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని సెంట్ కేథరీన్స్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2007 నుంచి ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నారు. నాలుగేళ్ల కిందట ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో–కన్వినర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హరియాణా అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గానూ నియమితులయ్యారు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, పన్నులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వాలు, నేరాల కేసులను వాదించారు. ఆమె క్లయింట్స్ హై ప్రొఫైల్ వాళ్లే కావడంతో న్యాయవాద రంగంలో అతికొద్ది కాలంలోనే కీర్తి సంపాదించారు. మీడియా ముందు అంతగా కనిపించని బాసురీ.. ఐపీఎల్ వివాదంలో లలిత్ మోడీ న్యాయవాద బృందంలో ఒకరిగా తొలిసారి వార్తల్లోకెక్కారు. గతేడాది ఆప్ ప్రభుత్వంపై విమర్శలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారామె. తల్లికి స్వయంగా అంత్యక్రియలు... సుష్మా స్వరాజ్ 2019లో కన్నమూశారు. ఆమె అంత్యక్రియలను స్వయంగా నిర్వహించి బాసురీ అప్పట్లో వార్తల్లోకెక్కారు. మహిళలను చైతన్యవంతులను చేసే దిశగా ఆమె ప్రసంగాలు చేస్తుంటారు. ఆ క్రమంలో 2021లో తనకు దక్కిన ‘తేజస్విని’ అవార్డును తల్లికి అంకితమిచ్చారు. ప్రతి విషయంలోనూ గురువుగా మారి తనకు అమూల్యమైన జీవిత విలువలను నేరి్పందంటూ తల్లిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ‘చిన్నమ్మ’ కుమార్తె కంటికి గాయం
ఢిల్లీ, సాక్షి : బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి, తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఎన్నికల ప్రచారంలో గాయపడ్డారు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆమె ఎడమ కంటికి స్వల్ప గాయమైంది. కంటికి గాయంపై తన మద్దతు దారులకు బన్సూరి స్వరాజ్ ఎక్స్ వేదికగా సమాచారం అందించారు. ఈ సందర్భంగా వైద్య సహాయం అందించిన మోతీ నగర్‌కు చెందిన డాక్టర్ నీరజ్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. స్వరాజ్ మాట్లాడుతూ.. “ఎన్నికల ప్రచారంలో నా కంటికి స్వల్ప గాయమైంది. మోతీ నగర్‌కు చెందిన డాక్టర్ నీరజ్ వర్మకు ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Mildly injured my eye during campaigning today. Thank you Dr. Neeraj Varma ji of Moti Nagar, for taking care of me and patching me up. #pirateswag @BJP4Delhi @BJP4India pic.twitter.com/8lrNeneyyS — Bansuri Swaraj (Modi Ka Parivar) (@BansuriSwaraj) April 9, 2024 కంటి గాయం ఉన్నప్పటికీ, స్వరాజ్ తన కంటికి కట్టుతో ప్రచార కార్యక్రమాలను తిరిగి ప్రారంభించారు. రమేష్ నగర్‌లోని సనాతన్ ధర్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన మాతా కీ చౌకీ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. -
‘కేజ్రీవాల్‌ది సిగ్గులేనితనం’.. సీఎంగా రాజీనామా చేయాలి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండ్‌రింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ పట్టుపడుతోంది. అరెస్ట్ అయిన మొదటి నుంచి కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ రాజీనామా వ్యవహారంపై మంగళవారం కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి కూడా స్పందించారు. ‘నేను రాజ్యాంగ నిబంధనలు అధికంగా తెలిసిన నిష్ణాతున్ని కాదు. అయితే, కేజ్రీవాల్ సీఎంగా కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ, 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఉన్న నేను.. కేజ్రీవాల్ ఇంకా సీఎం కోనసాగటం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నా. అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్నాక కూడా సీఎం పదవికీ రాజీనామా చేయకపోవటం సిగ్గులేనితనం. రాజకీయ విలువలు తెలిసిన వారు.. జైలులో వెళ్లిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తారు. పార్టీలో ఒకరికీ ఢిల్లీ సీఎం బాధ్యతలు అప్పగిస్తారు. జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపటం సరికాదు’ అని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా వెంటనే రాజీనామా చేయాలని మరో బీజేపీ నేత బాన్సూరి స్వరాజ్ డిమాండ్ చేశారు. ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ చాలా కీలకమైన వ్యక్తి అని హైకోర్టు తేల్చిచెప్పింది. కేజ్రీవాల్ సీఎంగా ఉంటూ మనీలాండరింగ్ చేశారు. ఈడీ చెప్పిన విషయాలను హైకోర్టు నిజాలుగా చెప్పింది. కేజ్రీవాల్ అరెస్ట్ సైతం చట్టవ్యతిరేకం కాదని హైకోర్టు వెల్లడించింది. నైతిక బాధ్యత వహిస్తూ.. కేజీవాల్ సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలి. లిక్కర్ స్కామ్‌లో సుమారు రూ. 100 కోట్లను పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. ఈడీ పేర్కొన్న దర్యాప్తు విషయాలను హైకోర్టు పరిశీలించింది’ అని బాన్సూరి స్వరాజ్ తెలిపారు. ఇక.. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌కు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నయని, హవావలా ద్వారా డబ్బు తరలింపుకు సంబంధించి ఈడీ ఆధారాలు చూపించిందని పేర్కొంది. గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్ట విరుద్ధం కాని కోర్టు పేర్కొంది. -
కేజ్రీవాల్ సతీమణికి బన్సూరి స్వరాజ్ కౌంటర్
లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పంపించిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో ఆవేదనతో చదివి వినిపించారు. దీనిపై బీజేపీ నాయకురాలు, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ కౌంటర్ ఇచ్చారు. "ఈ రోజు ఆమె (సునీతా కేజ్రీవాల్) బహిరంగంగా వ్యక్తం చేసిన భావాలను నేను అర్థం చేసుకోగలను. దానికి (అరెస్ట్) బాధ్యత వహించే ఏకైక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని నేను చెబుతాను. ఈ మద్యం పాలసీ కారణంగా ఏడ్చిన మహిళలందరికీ ఆయన జవాబుదారీగా ఉండాలి" అని బన్సూరి స్వరాజ్ అన్నారు. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ రూ.100 కోట్లు తీసుకున్నారని బన్సూరి స్వరాజ్ ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన తొమ్మిది సమన్లను కేజ్రీవాల్ ఖాతరు చేయకపోవడంపై విరుచుకుపడిన బన్సూరి స్వరాజ్.. "ఈడీ జారీ చేసిన తొమ్మిది సమన్లను దాటవేసేందుకు ఢిల్లీ ప్రజలకు, తన సొంత కుటుంబానికి ఆయనే బాధ్యుడు. దీంతోనే ఈడీ అదుపులోకి తీసుకుంది" అన్నారు. -
అది ఊరికే అన్న మాట కాదు.. సుష్మా స్వరాజ్ కూతురి ధీమా!
‘ఈసారి 400కు పైగా సీట్లు’ అనేది ఊరికే అన్న మాట కాదు.. నిజం అయి తీరుతుంది అంటున్నారు బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ కూటమి "స్వప్రయోజనం"పై ఆధారపడి ఉందని, తమ పార్టీ అవకాశాలపై ఆ కూటమి ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారామె. ఢీల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాలనూ మరోసారి బీజేపీ గెలుచుకుంటుందన్నారు. ఢిల్లీలోని అత్యంత పిన్న వయస్కురాలైన బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "అబ్కీ బార్ 400 పార్ (ఈసారి 400కు పైగా సీట్లు)" అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది ఒక సంకల్పమని అన్నారు. అంకితభావంతో ఉన్న బీజేపీ కార్యకర్తల సహాయం, ప్రజల మద్దతుతో వాస్తవం అయి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నీ చెప్పినట్లే చేసింది. ఆర్టికల్ 370ని తొలగించడం, రామమందిర నిర్మాణం, రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకురావడం వంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని బన్సూరి స్వరాజ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఇద్దరు మహిళా అభ్యర్థుల్లో బన్సూరి స్వరాజ్ ఒకరు. దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లో వరుసగా మూడోసారి క్లీన్‌స్వీప్ చేసేందుకు బీజేపీ పోటీపడుతోంది. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తోంది. ఆ స్థానం నుంచి సోమనాథ్ భారతిని బరిలోకి దింపింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తనకు ప్రజల నుండి ఎంతో అభిమానం లభిస్తోందని బన్సూరి స్వరాజ్ తెలిపారు. వేదికపై కూర్చొని ప్రసంగాలు చేయడం తనకు ఇష్టం ఉండదని, ప్రజల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడటమే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. -
ఇరకాటంలో సుష్మా స్వరాజ్ కుమార్తె..
న్యూఢిల్లీ : బన్సూరి స్వరాజ్‌ను న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడంపై బీజేపీపై ఢిల్లీ ఆప్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. న్యాయవాద వృత్తికి కళంకం తెచ్చేలా ఆమె కోర్టులో దేశ ద్రోహులకు అండగా నిలిచారని ఆరోపిస్తోంది. బన్సూరి టికెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇటీవల బీజేపీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో బన్సూరి స్వరాజ్ చోటు దక్కించుకున్నారు. అయితే ఇదే అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మీడియా సమావేశంలో ఆప్ మంత్రి ఆతిశీ మాట్లాడుతూ బన్సూరి న్యాయవాదిగా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని, అలాంటి వారికి బీజేపీ లోక్‌సభ సీటు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. లోక్‌సభ అభ్యర్ధిగా ప్రజల్ని ఓట్లు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బన్సూరికి టికెట్ ఇచ్చే అంశంపై బీజేపీ పునరాలోచించానలి డిమాండ్ చేశారు. అయితే ఆప్ విమర్శలపై స్పందించిన బన్సూరి న్యూఢిల్లీ లోక్‌సభ ఆమ్ ఆద్మీ అభ్యర్ధి సోమనాథ్ భారతిపై మండిపడ్డారు. సోమనాథ్ భారతీ ఢిల్లీ రాజేంద్రనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ క్యాడర్ ఆయనపై దాడికి దిగిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. AAP candidate from New Delhi Loksabha Somnath Bharti who's accused of assaulting his own wife is beaten by his own Karyakartas... 💀 pic.twitter.com/cGkwarcNIr — Mr Sinha (Modi's family) (@MrSinha_) March 2, 2024 ఆ వీడియోలపై బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ ‘నేను ఆప్‌ని అడగాలనుకుంటున్నాను. రాజేంద్ర నగర్లో తన సొంత క్యాడర్‌తో కొట్టించుకున్న అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ఎందుకు నిలబెట్టింది. సొంత పార్టీ సభ్యులకే నచ్చని అభ్యర్ధిని ఎలా ఎంపిక చేసుకున్నారు. అలాంటి వారి మాపై ఆరోపణలు చేయోచ్చా? అని అడిగారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని సూచించారు. -
లోక్‌సభ బరిలో డాటర్ ఆఫ్ సుష్మా స్వరాజ్
బీజేపీ లోక్‌సభ ఎన్నికల కోసం ప్రకటించిన తొలి జాబితాలో చర్చనీయాంశంగా మారిన ఓ అభ్యర్థి.. బన్సూరి స్వరాజ్(39). ‘తెలంగాణ చిన్నమ్మ’.. కేంద్ర మాజీ మంత్రి .. దివంగత సుష్మా స్వరాజ్ తనయే ఈ బన్సూరి కావడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బన్సూరి స్వరాజ్‌కు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది బీజేపీ. బన్సూరి స్వరాజ్ వృత్తి రీత్యా న్యాయవాది. ప్రస్తుతం బీజేపీ లీగల్ సెల్ విభాగంలో ఆమె కో-కన్వీనర్‌గాసేవలు అందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తొలిసారి. న్యాయవాద వృత్తిలో మొత్తం ఆమె 15 ఏళ్ల అనుభవం ఉంది. 2007లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో ఆమె తన పేరును నమోదు చేసుకున్నారు. లండన్‌లోని బీపీపీ లా స్కూల్లో న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వర్విక్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్.. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ నుంచి పీజీ చేశారు. ప్రాక్టీస్ చేసే సమయంలోనే ఆమె హర్యానా అదనపు అడ్వొకేట్ జనరల్‌గానూ నియమితులు కావడం గమనార్హం. आदरणीय #आडवाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। अनकी दीर्घायु व स्वास्थ्य के लिये ईश्वर से प्रार्थना करती हूँ। उनके आवास पर जाकर आशीर्वाद लेने का अवसर मिला। मेरी माँ @SushmaSwaraj द्वारा स्थापित मीठी प्रथा के अनुसार मैं उनका पसंदीदा चॉकलेट केक ले गई थी।#LKAdvaniBirthday pic.twitter.com/h1x7yjbKKO — Bansuri Swaraj (@BansuriSwaraj) November 8, 2021 సుష్మా స్వరాజ్ బతికుండగా తన రాజకీయ గురువైన.. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రతీ పుట్టిన రోజుకి స్వయంగా కేక్ తీసుకెళ్లి అందించేవారు. అయితే ఆమె మరణాంతరం కూతురు బన్సూరి ఆ ఆనవాయితీని తప్పకుండా వస్తోంది. న్యూఢిల్లీ లోక్‌సభ సీటును తనకు ఖరారు చేయడం పట్ల బన్సూరీ స్వరాజ్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | BJP fields former External Affairs Minister late Sushma Swaraj's daughter, Bansuri Swaraj from New Delhi seat, she says, "I feel grateful. I express gratitude towards PM Modi, HM Amit Shah ji, JP Nadda ji and every BJP worker for giving me this opportunity. With the… pic.twitter.com/szfg055rzf — ANI (@ANI) March 2, 2024