లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పంపించిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో ఆవేదనతో చదివి వినిపించారు. దీనిపై బీజేపీ నాయకురాలు, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ కౌంటర్ ఇచ్చారు.
"ఈ రోజు ఆమె (సునీతా కేజ్రీవాల్) బహిరంగంగా వ్యక్తం చేసిన భావాలను నేను అర్థం చేసుకోగలను. దానికి (అరెస్ట్) బాధ్యత వహించే ఏకైక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని నేను చెబుతాను. ఈ మద్యం పాలసీ కారణంగా ఏడ్చిన మహిళలందరికీ ఆయన జవాబుదారీగా ఉండాలి" అని బన్సూరి స్వరాజ్ అన్నారు.
లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ రూ.100 కోట్లు తీసుకున్నారని బన్సూరి స్వరాజ్ ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన తొమ్మిది సమన్లను కేజ్రీవాల్ ఖాతరు చేయకపోవడంపై విరుచుకుపడిన బన్సూరి స్వరాజ్.. "ఈడీ జారీ చేసిన తొమ్మిది సమన్లను దాటవేసేందుకు ఢిల్లీ ప్రజలకు, తన సొంత కుటుంబానికి ఆయనే బాధ్యుడు. దీంతోనే ఈడీ అదుపులోకి తీసుకుంది" అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment