Sunita Kejriwal: గొప్ప కార్యాలు సాధించేందుకే పుట్టారు! | God wants Kejriwal to do something says Sunita Kejriwal | Sakshi
Sakshi News home page

Sunita Kejriwal: గొప్ప కార్యాలు సాధించేందుకే పుట్టారు!

Published Sun, Jul 28 2024 6:10 AM | Last Updated on Sun, Jul 28 2024 6:10 AM

God wants Kejriwal to do something says Sunita Kejriwal

కేజ్రీవాల్‌పై సునీతా కేజ్రీవాల్‌ 

యమునానగర్‌: అరవింద్‌ కేజ్రీవాల్‌కు భగవంతుడి అనుగ్రహం ఉందని, గొప్ప కార్యాలను సాధించేందుకే ఆయన పుట్టారని భార్య సునీత కేజ్రీవాల్‌ అన్నారు. ‘1968 ఆగస్టు 16న అరవింద్‌ కేజ్రీవాల్‌ పుట్టారు. ఆ రోజు కృష్ణ జన్మాష్టమి. ఇది యాధృచ్చికం కాదు. ఆయన ద్వారా దేవుడు ఏదో చేయించాలని అనుకుంటున్నాడని భావిస్తున్నా’ అని ఆమె పేర్కొన్నారు. 

మూడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వొద్దని హరియాణ ప్రజలను కోరారు. శనివారం సునీత హరియాణాలో సదౌరాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. పాఠశాలలు, ఆసుపత్రుల స్థితిగతులను మార్చడం, మొహల్లా క్లినిక్‌లు, ఉచిత విద్యుత్‌.. ఇవి ఆప్‌తోనే సాధ్యమన్నారు. హరియాణా పుత్రుడు కేజ్రీవాల్‌తోనే ఇవి సాధ్యమని చెప్పారు. తప్పుడు కేసులో తన భర్తను బీజేపీ జైలుకు పంపిందని ఆరోపించారు. ‘మోదీ.. కేజ్రీవాల్‌ను కాదు హరియాణా పుత్రుడిని జైళ్లో పెట్టారు. నేను మీ కోడలిని. ఈ అవమానాన్ని మీరు సహిస్తారా? నిశ్శబ్దంగా ఉంటారా? కేజ్రీవాల్‌ ఒక సింహం. ఆయన మోదీ ముందు మోకరిల్లరు’ అని సునీత అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement