ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండ్‌రింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్‌లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ పట్టుపడుతోంది. అరెస్ట్ అయిన మొదటి నుంచి కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ రాజీనామా వ్యవహారంపై మంగళవారం కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి కూడా స్పందించారు.
‘నేను రాజ్యాంగ నిబంధనలు అధికంగా తెలిసిన నిష్ణాతున్ని కాదు. అయితే, కేజ్రీవాల్ సీఎంగా కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ, 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఉన్న నేను.. కేజ్రీవాల్ ఇంకా సీఎం కోనసాగటం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నా. అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్నాక కూడా సీఎం పదవికీ రాజీనామా చేయకపోవటం సిగ్గులేనితనం. రాజకీయ విలువలు తెలిసిన వారు.. జైలులో వెళ్లిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తారు. పార్టీలో ఒకరికీ ఢిల్లీ సీఎం బాధ్యతలు అప్పగిస్తారు. జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపటం సరికాదు’ అని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా వెంటనే రాజీనామా చేయాలని మరో బీజేపీ నేత బాన్సూరి స్వరాజ్ డిమాండ్ చేశారు. ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ చాలా కీలకమైన వ్యక్తి అని హైకోర్టు తేల్చిచెప్పింది. కేజ్రీవాల్ సీఎంగా ఉంటూ మనీలాండరింగ్ చేశారు. ఈడీ చెప్పిన విషయాలను హైకోర్టు నిజాలుగా చెప్పింది. కేజ్రీవాల్ అరెస్ట్ సైతం చట్టవ్యతిరేకం కాదని హైకోర్టు వెల్లడించింది. నైతిక బాధ్యత వహిస్తూ.. కేజీవాల్ సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలి. లిక్కర్ స్కామ్‌లో సుమారు రూ. 100 కోట్లను పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. ఈడీ పేర్కొన్న దర్యాప్తు విషయాలను హైకోర్టు పరిశీలించింది’ అని బాన్సూరి స్వరాజ్ తెలిపారు.
ఇక.. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌కు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నయని, హవావలా ద్వారా డబ్బు తరలింపుకు సంబంధించి ఈడీ ఆధారాలు చూపించిందని పేర్కొంది. గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్ట విరుద్ధం కాని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment