లోక్‌సభ బరిలో డాటర్‌ ఆఫ్‌ సుష్మా స్వరాజ్‌ | Lok Sabha Elections 2024: Sushma Swaraj Daughter Bansuri Poll Debut Details Inside - Sakshi

లోక్‌సభ బరిలో సుష్మా స్వరాజ్‌ కూతురు బన్సూరి.. ఆమె నేపథ్యం ఏంటంటే..

Mar 2 2024 9:20 PM | Updated on Mar 3 2024 1:49 PM

Elections 2024: Sushma Swaraj Daughter Bansuri Poll Debut Details - Sakshi

బన్సూరి స్వరాజ్‌ డాటర్‌ ఆఫ్‌ సుష్మా స్వరాజ్‌

బీజేపీ లోక్‌సభ ఎన్నికల కోసం ప్రకటించిన తొలి జాబితాలో చర్చనీయాంశంగా మారిన ఓ అభ్యర్థి.. బన్సూరి స్వరాజ్‌(39).  ‘తెలంగాణ చిన్నమ్మ’.. కేంద్ర మాజీ మంత్రి .. దివంగత సుష్మా స్వరాజ్ తనయే ఈ బన్సూరి కావడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

బన్సూరి స్వరాజ్‌కు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది బీజేపీ. బన్సూరి స్వరాజ్ వృత్తి రీత్యా న్యాయవాది.  ప్రస్తుతం బీజేపీ లీగల్ సెల్‌ విభాగంలో ఆమె  కో-కన్వీనర్‌గాసేవలు అందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తొలిసారి.

న్యాయవాద వృత్తిలో మొత్తం ఆమె 15 ఏళ్ల అనుభవం ఉంది. 2007లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో ఆమె తన పేరును నమోదు చేసుకున్నారు. లండన్‌లోని బీపీపీ లా స్కూల్‌లో న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వర్‌విక్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్.. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ నుంచి పీజీ చేశారు. ప్రాక్టీస్‌ చేసే సమయంలోనే ఆమె హర్యానా అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గానూ నియమితులు కావడం గమనార్హం.

సుష్మా స్వరాజ్‌ బతికుండగా తన రాజకీయ గురువైన.. బీజేపీ కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అద్వానీ ప్రతీ పుట్టిన రోజుకి స్వయంగా కేక్‌ తీసుకెళ్లి అందించేవారు. అయితే ఆమె మరణాంతరం కూతురు బన్సూరి ఆ ఆనవాయితీని తప్పకుండా వస్తోంది.  

న్యూఢిల్లీ లోక్‌సభ సీటును తనకు ఖరారు చేయడం పట్ల బన్సూరీ స్వరాజ్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement