ఢిల్లీలో హీట్‌ పాలిటిక్స్‌.. సీఎం ఇంటి వద్ద ఆప్‌ ఎంపీ వినూత్న నిరసన | AAP MP Swati Maliwal Polluted water Throws Outside Of CM Atishi Residence | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో హీట్‌ పాలిటిక్స్‌.. సీఎం ఇంటి వద్ద ఆప్‌ ఎంపీ వినూత్న నిరసన

Published Sat, Nov 2 2024 5:10 PM | Last Updated on Sat, Nov 2 2024 5:53 PM

AAP MP Swati Maliwal Polluted water Throws Outside Of CM Atishi Residence

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నివాసం వద్ద ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌ వినూత్న నిరసన చేపట్టారు. ఓ వాటర్‌ బాటిల్‌లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోసి ఆప్‌ సర్కార్‌పై మండిపడ్డారు. దీంతో, ఆమ్‌ ఆద్మీ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.

ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌ తాజాగా సీఎం అతిషి నివాసం వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఓ వాటర్‌ బాటిల్‌లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోశారు. అనంతరం స్వాతి మాలివాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాగర్‌పూర్, ద్వారక ప్రజలు నాకు ఫోన్ చేసారు. దీంతో, నేను అక్కడికి వెళ్లాను. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఒక ఇంటికి వెళ్లి అక్కడ నల్లానీరు సరఫరాను గమనించాను. ఆ నల్లా నీటిని బాటిల్‌లో నింపాను.

నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉంది. అదే నీటిని ఇప్పుడు నేను సీఎం అతిషి ఇంటి వద్దకు తెచ్చాను. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో​ ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్‌లో నింపి సీఎం నివాసం వద్ద పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్‌ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్‌ మాత్రమే.

ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా? తాగితే వారు ప్రాణాలతో ఉంటారా?. ఢిల్లీలో ఛత్ పూజ వస్తోంది. ఈరోజు గోవర్ధన్‌ పూజ జరిగింది. నిన్న దీపావళి. పండుగ వేళ ఇలాంటి నీటితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి అతిషి వద్దే నీటి పారుదల శాఖ కూడా ఉంది. నీటి సమస్యపై ఆమె ప్రతీరోజు మీటింగ్‌ పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఇక, ఆప్‌ ఎంపీ నిరసన రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement