
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకురాలు అతిషి ఇవాళ (శనివారం) ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎంగా అతిషితో సహా ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అతిశి నియామకం సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అతిషి సీఎం నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేసింది. ఇక.. ఇవాళ జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
President Murmu officially appoints Atishi as Delhi CM; accepts Kejriwal's resignation
Read @ANI Story | https://t.co/R278OnyQt6#DroupadiMurmu #Atishi #ArvindKejriwal pic.twitter.com/RwgGCmrHXn— ANI Digital (@ani_digital) September 20, 2024
ఇటీవల ఢిల్లీ సీఎంగా రెండు రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఆయన రాజీమానా చేసి.. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకురాలు అతిషిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ముందు ఆమెను శాసనసభా పక్షనేత ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణస్వీకార తేదీని ప్రతిపాదిస్తూ.. లెఫ్టినెంట్ గరర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు లేఖ అందజేశారు. ఇక.. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కానున్నారు. ఆమె ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నారు.
చదవండి: ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా..
Comments
Please login to add a commentAdd a comment