Woman chief minister
-
నాదీ భరతుడి వ్యథే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆతిశి బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై తనకున్న ప్రభు భక్తిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన కూర్చున్న ఎర్ర రంగు కుర్చీని ఖాళీగానే ఉంచి, ఆ పక్కనే మరో తెల్ల రంగు కుర్చీలో కూర్చుని సాదాసీదాగా సోమవారం సచివాల యంలో ఆమె ఢిల్లీ 8వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆతిశి మీడియాతో మాట్లాడారు.ఈ కుర్చీ కేజ్రీవాల్దిరామాయణంలో శ్రీరాముడి సోదరుడు భరతుడి మాదిరిగానే తాను వ్యథ చెందుతున్నానని ఆతిశి అన్నారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఆనాడు భరతుడి వ్యథలాగే.. నేడు నా మనసు వ్యథ చెందుతోంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య రాజ్య పాలన బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఆయన రాజ్యపాలన చేశారు. అదే తీరుగా వచ్చే నాలుగు నెలలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశారు. అందుకే మనం ఆయనను మర్యాద పురుషోత్తముడిగా పిలుచుకుంటాం. శ్రీరాముడి జీవితం మర్యాద, నైతికతకు నిదర్శనం. అదే విధంగా కేజ్రీవాల్ కూడా మర్యాద, నైతికతకు నిదర్శనంగా నిలిచారు. గత రెండేళ్లుగా కేజ్రీవాల్‌పై బురదజల్లేందుకు బీజేపీ ఏ అవకాశాన్నీ వదిలి పెట్టలేదు. అయితే, నిజాతీపరుడినని నిరూపించుకునే వరకూ సీఎం పీఠంలో కూర్చోనని ఆయన పదవికి రాజీమా చేశారు. కానీ, ఈ కుర్చీ (తన పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీని చూపెడుతూ) కేజ్రీవా ల్ది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తమ ఆశీర్వాదంతో కేజ్రీవాల్‌ను సీఎం పీఠంపై కూర్చో బెడతారనే నమ్మకం నాకుంది’’ అని ఆతిశి అన్నారు. సీఎం పదవికే అవమానంకేజ్రీవాల్ వాడిని కుర్చీలో కూర్చోరాదంటూ సీఎం ఆతిశి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి. ‘ఆతిశి చేసిన పని ఆదర్శం ఎంతమాత్రమూ కాదు. ఆమె సీఎం పదవిని అవమా నించడమే కాదు, ఢిల్లీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు’’ అని ఆ పార్టీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. -
ఏకైక మహిళా సీఎం పేరు కూడా గల్లంతు!
సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక మహిళ స్యాదా అన్వర తైమూర్‌కు ఇటీవల ఎన్ఆర్సీ విడుదల చేసిన పౌరసత్వ జాబితాలో చోటు లభించలేదు. భారత ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సమీప బంధువులకు కూడా చోటు లభించని విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తైమూర్ కుటుంబం ఎన్ఆర్సీలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి త్వరలో భారత్‌కు రానున్న తెలిపింది. ఎన్ఆర్సీలో తమ పేర్లను నమోదు చేయించాల్సిందిగా అస్సాంలో ఉన్న తమ బంధువులకు చెప్పామని, అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని ఆస్ట్రేలియా నుంచి తైమూర్ కుమారుడు మీడియాకు ఫోన్ ద్వారా తెలిపారు. తైమూర్ 1980, డిసెంబర్ ఆరవ తేదీ నుంచి 1981, జూన్ 30 వరకు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమెకు ముందుగానీ వెనకగానీ సీఎం పదవిని చేపట్టిన మహిళలు లేరు. ఆమె 1988లో రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఉన్నారు. చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తైమూర్ 2011లో ఆ పార్టీని వదిలిపెట్టి అఖిల భారత ఐక్య ప్రజాస్వామ్య సంఘటన (ఏఐయూడీఎఫ్)లో చేరారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక మహిళ పేరు కూడా పౌరసత్వ జాబితాలో లేకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఏఐయూడీఎఫ్ ప్రధాన కార్యదర్శి అమినల్ ఇస్లాం వ్యాఖ్యానించారు. జాబితా పునర్ పరిశీలన సందర్భంగా పౌరసత్వం తీసుకునే అవకాశం సరైన డాక్యుమెంట్లు ఉన్న వారందరికి లభిస్తుందని రిజిస్టర్ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలా తెలిపారు. తైమూర్ కుటుంబానికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేకపోవడం వల్ల రిజిస్టర్లో ఆ కుటుంబానికి చోటు లభించలేదని, ఆ కుటుంబం దరఖాస్తు చేసుకున్నా లభించేదని అన్నారు. ఇప్పటికైనా నష్టమేమీ లేదని, ఫిర్యాదుల సందర్భంగా వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. పౌరసత్వ రిజిస్టర్లో ఇలా చాలా పేర్లు గల్లంతయ్యాయని తెలిసి, వాటిని సరిదిద్దేందుకు ఆగస్టు నాటికి సరైన ప్రమాణాలను ఖరారు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కూడా ఎన్ఆర్సీని ఆదేశించింది. -
అధికార పీఠంపై ఐరన్ లేడీ
ఆనందీబెన్... గుజరాత్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితురాలు. ఆ రాష్ట్ర ప్రజలు ఆమెను ‘ఐరన్ లేడీ’ అని పిలుస్తారు. బాల్యం నుంచి ఎన్నో అవార్డులందుకున్న ఘనత ఆమెది. ఆనందీబెన్‌కు రంగురంగుల చీరలంటే చాలా ఇష్టం. నుదుటి మీద ఎర్రటి బొట్టుతో హుందాగా కనిపించే ఆమెను చూస్తే ఎవరూ ఏడు పదులు నిండిన వ్యక్తి అనుకోరు. సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించే చరిష్మా ఆమెలో లేదంటారు కొందరు. కొద్దిగా పెడసరంగా ఉంటారని చెవులు కొరుక్కొనేవారూ లేకపోలేదు. ప్రభుత్వం తరపున గుజరాత్ రాష్ర్ట అభివృద్ధికి కృషి చేశారనే విషయాన్ని మాత్రం అందరూ అంగీకరిస్తారు. పటేల్ కుటుంబాలలో అందరికీ సహజంగా ఉండే సహనగుణం, పట్టిన పట్టు వదలని దృఢచిత్తం ఆనందీబెన్లో పుష్కలంగా ఉంది. మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆనందీబెన్ పార్టీలో చేరిన నాలుగు సంవత్సరాలకు బిజెపి తర ఫున గుజరాత్ శాసనసభకు ఎన్నికయ్యారు. మోడీ గుజరాత్ బిజెపి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఆమె రాజ్యసభ సభ్యులయ్యారు. విద్య, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. మోడీ ఆధ్వర్యంలో ఆమె బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవరకూ, వివిధ శాఖలలో పనిచేసి సత్తా చాటారు. ఆర్థిక, రోడ్లు - భవనాలు, ఉపద్రవాల నివారణ, పట్టణాభివృద్ధి శాఖ వంటి పలు శాఖలలో పనిచేశారు. ఏదైనా పని మోడీ ద్వారా జరగాలంటే, ఆనందీబెన్‌ను అడిగేవారంటే... ఆమె ఎంతటి ప్రాముఖ్యం సంతరించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. పదహారు సంవత్సరాలు నిరంతరాయంగా మంత్రిగా చేసిన అనుభవం ఆమెది. బాల్యం నుంచి ఆనందీబెన్ పురుషాధిపత్యానికి వ్యతిరేకం. ఆమె పాఠశాలలో చేరినప్పుడు ఆ క్లాసులో ఆమె ఒక్కతే ఆడపిల్ల. 1960లో కాలేజీలో చేరినప్పుడు కూడా ఆమె ఒక్కతే మహిళా విద్యార్థి. మోడీ సూచనల మేరకు ఆమె జిల్లాలలో విస్తృతంగా పర్యటించి, కలెక్టర్లను కలిసి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆమె మునుపటిలానే... భ్రూణ హత్యలు, స్త్రీ విద్య, రైతుల కష్టనష్టాల లాంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తారని గుజరాతీయుల ఆశ. మునుపటి ప్రభుత్వంలాగానే, తాను కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు, ఆర్థిక పురోగతికీ అనుకూలమనే ముద్రను వేసుకుంటూ, ఆరు కోట్ల జనాభా ఉన్న గుజరాత్‌కు... త్వరితగతిన పురోగమిస్తున్న రాష్ట్రమనే కీర్తికిరీటాన్ని నిలుపుతారని గుజరాతీయులు ఆశిస్తున్నారు. నరేంద్రమోడీకి కుడి భుజం మాత్రమే కాదు ఎడమ భుజం కూడా ఆమే అంటారు స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నప్పుడు, సర్దార్ సరోవర్‌లో దూకి ఇద్దరు అమ్మాయిలను కాపాడారు ఆనందికి నవ్వడం తెలియదని చాలామంది అంటుంటే అందుకు ఆమె ‘ఒకరు పనిచేస్తున్నారా లేదా అన్నది వారి ముఖంలో ఉండే చిరునవ్వుని బట్టి కాదు, వారు చేసే పనిని బట్టి గుర్తించాలి’ అంటారు. స్త్రీ సంక్షేమం కోసం మహిళా వికాస్ గృహ్‌లో చేరి, సుమారు 50 మంది వితంతువులకు వృత్తి విద్య నేర్పారు విద్యామంత్రిగా ఉన్న రోజుల్లో టీచర్ల బదిలీలలో లంచాన్ని పూర్తిగా నిరోధించారు. వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటుచేశారు.