ఛత్తీస్ సీఎంగా విష్ణుదేవ్ ప్రమాణం; మోహన్ యాదవ్‌ను అభినందిస్తున్న ప్రధాని మోదీ
భోపాల్/రాయ్‌పూర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మంగూభాయి పటేల్ సీఎంగా మోహన్ యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవ్‌దా, రాజేంద్ర శుక్లా ప్రమాణం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తానని చెప్పారు.
అలాగే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో సీఎంగా విష్ణుదేవ్ సాయితో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయి ప్రమాణం స్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment