take oath
-
ఈనెల 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ ప్రమాణ స్వీకారం!
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. 90 స్థానాలకుగానూ 48 స్థానాల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 15న హర్యానాలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 15న పంచకులలో సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పంచకులలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుబాటులో ఉంటారో లేదో అనేది తెలియాల్సి ఉందని, ఆయన ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.హర్యానా ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచకుల డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కూడిన అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంచకుల అదనపు డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా సభ్యులుగా ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ ప్రసాద్ గురువారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు.కాగా ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసిన విషయం తెలిసిందే. సైనీ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది బీజేపీ... మరోసారి బీసీ నేత అయిన ఆయనకే రాష్ట్ర పగ్గాలను అప్పగించనుంది అధిష్టానం. ముఖ్యమంత్రితోపాట మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. -
ఆరుసార్లు ఎమ్మెల్యే.. 15 నిమిషాల్లో రెండుసార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సోమవారం మంత్రివర్గ మినీ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రభుత్వంలో ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్ నివాస్ రావత్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే తొలుత రామ్ నివాస్ తప్పుగా ప్రమాణం చేశారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉండగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం తన తప్పును గ్రహించడంతో 15 నిమిషాల తరువాత కేబినెట్ మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది.రావత్ గ్వాలియర్-చంబల్ ప్రాంతానికి చెందిన శక్తివంతమైన ఓబీసీ నేత. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావత్‌కు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవి, ప్రతిపక్ష నేత వంటి కీలక పదవులు అప్పజెప్పనందుకు అసంతృప్తి చెంది పార్టీ మారారు. రావత్ బీజేపీలో చేరిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ మోరెనా సీటు గెలవడంలో కృషి చేశారు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా కుటుంబానికి విధేయుడిగా ఉన్న రావత్.. 2020 మార్చిలో 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి సింధియా పార్టీని వీడి బీజేపీలో చేరిప్పటికీ రావత్ కాంగ్రెస్‌లోనే కొనసాగారు.ప్రస్తుతం సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మినహా 30 మంది మంత్రులు ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 18 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అంతేగాక అతని ప్రభుత్వంలో 3 ఖాళీలు ఉన్నాయి. -
నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు గన్నవరం ఐటీ పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైంది. మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చేలా ప్రమాణ స్వీకార వేదికపైనే సంబంధిత ఫైలుపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు సంబంధించిన అంశంపైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. హాజరుకానున్న ప్రధాని, రాజకీయ ప్రముఖులుఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్‌షా, నడ్డా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులను తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు అతిథులుగా ఆహ్వానించగా చిరంజీవి కుటుంబంతో సహా ఇప్పటికే విజయవాడ వచ్చారు. ఐటీ పార్కు ప్రాంగణం సిద్ధం ప్రమాణ స్వీకారానికి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల ప్రాంగణాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ, మిగిలిన 11.5 ఎకరాల్లో నాయకులు, ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, వెలుపల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటుకు సమీపంలోనే ఉన్న సభా వేదిక వద్దకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునే సౌకర్యం కల్పించారు.వీఐపీల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. నాయకులు, కార్యకర్తల కోసం 36 గ్యాలరీలుగా విభజించారు. ఈ కార్యక్రమానికి వచ్చే బస్సులు, కార్లు, ఇతర వాహనాల కోసం గన్నవరం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుధ్యం వంటి పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ సమన్వయాధికారి ప్రద్యుమ్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సమావేశం నిర్వహించారు.రద్దీగా మారిన గన్నవరం ఎయిర్పోర్టుప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది వీఐపీలు వస్తుండడంతో గన్నవరం ఎయిర్ పోర్టు రద్దీగా మారిపోయింది. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల నుంచి పలు ప్రత్యేక విమానాల్లో అతిథులు రావడంతో గన్నవరం ఎయిర్‌పోర్టు సందడిగా మారింది. బుధవారం ఉదయం ఇంకా రద్దీగా మారే పరిస్థితి ఉండడంతో ఎయిర్‌పోర్టులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని, కానీ ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని సూచిస్తున్నారు.తిరుమల వెళ్లనున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
12న చంద్రబాబు ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినా అదేరోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండడం.. ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి వుండడంతో చంద్రబాబు తన కార్యక్రమాన్ని 12కు వాయిదా వేసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆ రోజున రాజధాని ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి ముందు 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.తొలి విడతలో 10 మందికి మంత్రులుగా అవకాశం..చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి విడతగా కొందరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. సుమారు పది మందికి తొలి విడతలో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఐదారుగురు, జనసేన, బీజేపీ నుంచి నలుగురు ఆ జాబితాలో ఉండే అవకాశం ఉంది. తొలి విడతలో కింజరాపు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పి.నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు వంటి వారికి అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.జనసేన నుంచి పవన్‌కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరితే చంద్రబాబుతోపాటే ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే, నాదెండ్ల మనోహర్ కూడా తొలివిడతలోనే ఛాన్స్ దక్కించుకోనున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున సుజనాచౌదరికి తొలి విడతలోనే మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నారు. మంత్రి పదవులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో తొలి విడతలో ముఖ్యులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది సమయం తీసుకుని సామాజిక సమీకరణలు, సీనియారిటీ, జిల్లాల ప్రాతిపదికన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి?మరోవైపు.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ప్రధాన పార్టీగా ఉండడంతో టీడీపీ లోక్‌సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ అగ్రనేతలు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్పీకర్ పదవిని తన వద్దే ఉంచుకోవాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు ఆ పదవి కావాలని గట్టిగా పట్టుబడితే ఏమైనా నిర్ణయం మారే అవకాశం ఉందంటున్నారు.కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ఐదుకి పైగా స్థానాలు కోరుతుండడం, కీలకమైన జల్‌శక్తి, రవాణా వంటి శాఖలు అడుగుతుండడంతో దానిపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ పౌర విమానయాన, ఉక్కు శాఖలను టీడీపీకి ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. శుక్రవారం జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం తర్వాత దీనిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.అసెంబ్లీ స్పీకర్‌గా ‘ఆనం’..?ఇదిలా ఉంటే.. అసెంబ్లీ స్పీకర్‌గా ఆనం రామనారాయణరెడ్డిని నియమించే యోచనలో టీడీపీ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనైతే సభను హుందాగా నడిపిస్తారనే ఆలోచన ఉన్నట్లు భావిస్తున్నారు. ‘ఆనం’ కాదనుకుంటే గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పదవి తనకు కావాలని ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కనుమూరి రఘురామకృష్ణరాజు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా అందుకు చంద్రబాబు అంత సుముఖంగా లేరని సమాచారం. -
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎంలుగా మోహన్ యాదవ్, విష్ణుదేవ్ ప్రమాణం
భోపాల్/రాయ్‌పూర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మంగూభాయి పటేల్ సీఎంగా మోహన్ యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవ్దా, రాజేంద్ర శుక్లా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తానని చెప్పారు. అలాగే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో సీఎంగా విష్ణుదేవ్ సాయితో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయి ప్రమాణం స్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కొత్త మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు ఇవే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నూతన సర్కార్ కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కింది విధంగా శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి- హోం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు-ఆర్థికశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి-నీటి పారుదలశాఖ మంత్రి కొండా సురేఖ-మహిళా సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు- పౌరసరఫరాలశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్- బీసీ సంక్షేమశాఖ మంత్రి సీతక్క- గిరిజన సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాల శాఖ మంత్రి -
సామాన్యుడికే పెద్దపీట: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుల సేవే తన తొలి ప్రాథమ్యమని భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (62) పేర్కొన్నారు. ‘‘టెక్నాలజీ కావచ్చు, న్యాయ సంస్కరణలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణకే అగ్రతాంబూలమిస్తా’’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. మంగళవారం సీజేఐగా రిటైరైన జస్టిస్ యు.యు.లలిత్ నుంచి జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. దైవసాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, హర్దీప్సింగ్ పురి, కిరణ్ రిజుజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భార్య కల్పనా దాస్‌తో కలిసి నూతన సీజేఐ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించడం గొప్ప అవకాశం, బాధ్యత అని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా చేతల్లో చూపిస్తానని బదులిచ్చారు. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబరు 10 దాకా రెండేళ్లపాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16వ సీజేఐగా చేసిన ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉండటం విశేషం. అత్యధిక కాలం సీజేఐగా ఉన్న రికార్డు ఆయనదే. తర్వాత 44 ఏళ్లకు ఆయన కుమారుడు చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి కుమారులిద్దరూ సీజేఐ కావడం దేశంలో ఇదే తొలిసారి. జస్టిస్ చంద్రచూడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలంటూ వారిద్దరూ ట్వీట్ చేశారు. జస్టిస్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్) అనంతరం ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం, డాక్టరేట్ ఇన్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎస్జేడీ) చేశారు. ఆయన ప్రస్థానం 1998లో బాంబే హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా మొదలైంది. బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. అదే ఏడాది అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2013 నుంచి మూడేళ్లపాటు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2016 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. చరిత్రాత్మక తీర్పులు అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమలకు రుతుక్రమ మహిళల ప్రవేశం, అవివాహితలకూ 24 వారాల దాకా అబార్షన్ హక్కు తదితర కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఆర్మీలో మహిళా ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్, కమాండ్‌పోస్టింగులు ఇవ్వాల్సిందేనని ఆయన సారథ్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇటీవల జస్టిస్ యు.యు.లలిత్ హయాంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం సభ్యుల అభిప్రాయాల సేకరణకు సర్క్యులేషన్లు జారీ చేసే పద్ధతిని వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. అసమ్మతిని స్వాగతిస్తారు అసమ్మతిని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా జస్టిస్ చంద్రచూడ్ అభివర్ణిస్తుంటారు. ఆధార్ చెల్లుబాటును ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించిన తీరు చాలాకాలం పాటు వార్తల్లో నిలిచింది. ఆధార్ చెల్లుతుందంటూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో మిగతా నలుగురు వెలువరించిన తీర్పుతో తీవ్రంగా విభేదించారు. యునిక్ బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయప్రక్రియను డిజిటైజ్ చేయడంలోనూ ఆయనది కీలకపాత్ర. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తి అని, ఏ అంశం మీదైనా స్పష్టమైన భావాలు కలిగి ఉంటారని, వాటిని అంతే సూటిగా వ్యక్తీకరిస్తారని పేరు. తొలి రోజు ఇలా... బుధవారం బాధ్యతలు స్వీకరించాక మధ్యాహ్న వేళ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులోని సీజేఐ కోర్టు గదిలోకి ప్రవేశించారు. ‘‘ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా బహుశా నా కెరీర్లో తొలిసారి ఆలస్యంగా విధులకు వచ్చాను. మళ్లీ ఇలా జరగదనుకుంటున్నా. ఇంతసేపూ లాయర్లు తదితరులందరినీ వేచిచూసేలా చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా’’ అన్నారు. వాదనలు, కేసుల నిర్వహణల్లో లాయర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా చూస్తానన్నారు. భవిష్యత్తులో కూడా బార్ సహకారం కొనసాగాలని కోరారు. సహచర న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కలిసి విచారణలు ప్రారంభించారు. సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ అనర్హత కేసు సహా తొలి రోజు సీజేఐ ధర్మాసనం ముందు 30 ప్రస్తావనలు జరిగాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితర న్యాయవాదులు సీజేఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రెండేళ్ల పదవీకాలం ఫలవతంగా సాగాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. దేశ చరిత్రలో తండ్రీకొడుకులిద్దరూ.. -
తెలంగాణ హైకోర్టులో 10 మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
తెలంగాణ హైకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో 10 మంది నూతన న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్ శ్రవణ్‌కుమార్ వెంకట్, గుణ్ణు అనుపమ చక్రవర్తి, గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్‌దేవరాజ్ నాగార్జునలతో హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. -
సర్వోన్నత న్యాయస్థానంలో... సరికొత్త చరిత్ర
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తు లుగా నియమితులైన తొమ్మిది మంది మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు అదనపు బిల్డింగ్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఉద యం 10.30 నిమిషాలకు వారితో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియారిటీ ప్రకారం వారితో ప్రమాణం చేయించారు. ఏడు దశాబ్దాల చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. ప్రమాణం చేసిన తొమ్మిది మందిలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పీఎస్ నరసింహలు వరుసగా ఫిబ్రవరి 2027 నుంచి మే, 2028 వరకూ ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు న్యాయమూర్తులు తదనంతర కాలంలో సీజేఐలు కానుండటం ఇదే తొలిసారి. మంగళవారం ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ప్రమాణం చేయడంతో కోర్టులో ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీతో కలిపి మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగు చేరింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి నలుగురు సిట్టింగ్ మహిళా న్యాయమూర్తులు ఉండటం కూడా ఇదే తొలిసారి. 71 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇంతకుముందు ఎనిమిది మంది మహిళలు మాత్రమే న్యాయమూర్తులుగా పనిచేశారు. మంగళవారం ప్రమాణం చేసిన ముగ్గురితో కలుపుకుంటే మొత్తం 11 మంది మహిళలకే అవకాశం దక్కింది. 1980లో జస్టిస్ ఫాతిమా బీవి తొలి మహిళా జడ్జీగా నియమితులయ్యారు. అనంతరం జస్టిస్ సుజాత వి.మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞానసుధా మిశ్రా, జస్టిస్ రంజనా పి దేశాయ్, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఎవరు ఎప్పటిదాకా సుప్రీంలో... 1.జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. ఆయన పేరెంట్ హైకోర్టు బాంబే హైకోర్టు. సుప్రీంకోర్టులో మే 25, 2025 వరకూ సేవలు అందించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ప్రధాన ధర్మాసనంలో కూర్చొన్నారు. 2. జస్టిస్ విక్రమ్‌నాథ్: గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయయూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. పేరెంట్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు. ఫిబ్రవరి 2027 నుంచి సుమారు ఏడు నెలలపాటు సీజేఐగా ఉండడనున్నారు. రెండో కోర్టులో జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనంలో కూర్చొన్నారు. 3. జస్టిస్ జేకే మహేశ్వరి: సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. పేరెంట్ హైకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు. సుప్రీంకోర్టులో జూన్ 29, 2026 వరకూ సేవలందించనున్నారు. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన మూడో ధర్మాసనంలో కూర్చొన్నారు. 4. జస్టిస్ హిమా కోహ్లి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. పేరెంట్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు. సెప్టెంబరు 2, 2024 వరకూ సుప్రీంకోర్టులో సేవలందించనున్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన నాలుగో ధర్మాసనంలో కూర్చొన్నారు. 5. జస్టిస్ బీవీ నాగరత్న: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. సీనియారిటీ ప్రకారం 2027లో సీజేఐ కానున్నారు. సెప్టెంబరు 24, 2027 నుంచి అక్టోబరు 30, 2027 వరకూ 36 రోజులపాటు సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్న తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్రకెక్కనున్నారు. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ఐదో ధర్మాసనంలో కూర్చొన్నారు. 6. జస్టిస్ సీటీ రవికుమార్: కేరళ హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జనవరి 6, 2025న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ హృషీకేశ్‌రాయ్‌లో కూడిన ఆరో ధర్మాసనంలో కూర్చొన్నారు. 7. జస్టిస్ ఎంఎం సుందరేశ్: మద్రాస్ హైకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జులై 21, 2027న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణమురారిలతోకూడిన ఏడో ధర్మాసనంలో కూర్చొన్నారు. 8. జస్టిస్ బేలా ఎం త్రివేది: గుజరాత్ హైకోర్టులో ఐదో సీనియర్ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జూన్ 10, 2025న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ఎనిమిదో ధర్మాసనంలో కూర్చొన్నారు. 9. జస్టిస్ పీఎస్ నరసింహ: సుప్రీంకోర్టు బార్ నుంచి పదోన్నతి పొందారు. సీనియారిటీ ప్రకారం అక్టోబరు 30, 2027 నుంచి మే 2028 వరకూ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన తొమ్మిదో ధర్మాసనంలో కూర్చొన్నారు. -
ఎమ్మెల్సీగా వాణీదేవి ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఎమ్మెల్సీగా ఆదివారం ప్రమాణం స్వీకారం చేశారు. శాసనమండలిలో వాణీదేవి చేత ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వాణీదేవి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ, టీఆర్ఎస్కు ఆమెకు కృతఙ్ఞతలు తెలిపారు. ‘‘రాజకీయ వాతావరణంలో పెరిగాం. ప్రజాసేవ చేయడానికి పదవి అక్కర్లేదని అనుకున్నా. కానీ అధికారం ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చని భావించా. అప్పుడే తనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు’’ అని వాణీదేవి అన్నారు. ఇవీ చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్ శ్మశానంలో ‘డాక్టర్’ చదువు -
ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సోమవారం పార్లమెంట్ తొలిసారి సమావేశమైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవీ స్వీకారం ప్రమాణం చేశారు. లోక్‌సభలో రాహుల్ పేరు ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో సోనియా గాంధీ కూడా సభలోనే ఉన్నారు. కాగా సిట్టింగ్ స్థానం అమేథి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్.. వయనాడులో మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. ‘‘వరుసగా నాలుగోసారి లోక్‌సభకు ఎన్నికయినందుకు సంతోషంగా ఉంది. ఎంపీగా నాపై ఉన్న బాధ్యతలను నెరవేరుస్తా. రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రజల హక్కుల కోసం పనిచేస్తా’’ అంటూ తన ట్విటర్ ద్వారా రాహుల్ వెల్లడించారు. -
హిందీలో తెలుగు ఎంపీల ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 25 మంది ఎంపీలు సోమవారం సభలో ప్రమాణం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణం చేయించారు. ఆంగ్ల అక్షర క్రమంలో మొదటగా అండమాన్ నికోబార్ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేశారు. ఏపీ ఎంపీల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ముందుగా తెలుగులో ప్రమాణం చేశారు. 12 మంది తెలుగులో, 11 మంది ఇంగ్లీషులో, ఇద్దరు హిందీలో ప్రమాణం చేశారు. 2. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు హిందీలో ఈశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 3. విజయనగరం వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలుగులో పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. 4. విశాఖపట్నం వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలుగులో దేవుడి సాక్షిగా ప్రమాణం స్వీకరించారు. 5. అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 6. కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 7. అమలాపురం వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనురాధ హిందీలో ప్రమాణం స్వీకారం చేశారు. 8. రాజమండ్రి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 9. నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 10. ఏలూరు వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 11. మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలుగులో పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. 12. విజయవాడ టీడీపీ కేశినేని శ్రీనివాస్(నాని) ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 13. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 14. నర్సరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 15. బాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 16. ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 17. నంద్యాల వైఎస్సార్సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 18. కర్నూల్ వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 19. అనంతపురం వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య తెలుగులో పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. 20. హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 21. కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. 22. నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 23. తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 24. రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 25. చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. -
ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీ
-
ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. హిందీలో ఈశ్వరుడి సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. లోక్‌సభలో ప్రధాని మోదీ పేరు ప్రకటించగానే బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మోదీ జిందాబాద్ అంటూ నినదించారు. ప్రమాణం చేశాక సభలోని సభ్యులందరికీ రెండు చేతులు జోడించి మోదీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు.. భారత్ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ప్రధాని తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత సురేశ్ కొడికున్నిల్ ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, హర్సిమ్రత్ కౌర్, స్మృతి ఇరానీ ప్రమాణం చేశారు. వీడిన సందిగ్ధం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనేదానిపై సందిగ్ధం వీడిపోయింది. కేరళ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేశ్ కొడికున్నిల్ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎన్నికయినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఆయన ప్రమాణం చేయడంతో దీనిపై స్పష్టత వచ్చినట్టయింది. -
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పేర్ని నాని
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గుమ్మనూరు జయరామ్
-
ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకారం
-
సీఎం పీఠంపై వరుసగా ఐదోసారి..
భువనేశ్వర్ : ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుసగా ఐదోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్‌తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌ను ఒడిషా గవర్నర్ గణేషి లాల్ ఆదివారం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశంలో దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో నవీన్ పట్నాయక్ (72) ముందువరసలో నిలుస్తారు. లోక్‌సభతో పాటు జరిగిన ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్ధానాల నుంచి పోటీ చేసిన పట్నాయక్ రెండింటిలోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర జాతీయ నేతలను పట్నాయక్ ఆహ్వానించారు. ఇక క్యాబినెట్ మంత్రులుగా రవీంద్ర ప్రతాప్ స్వాన్, నవ కిషోర్ దాస్, ప్రతాప్ జెనా, సుశాంత సింగ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147 స్ధానాలకు గాను బీజేడీ 112 స్ధానాల్లో గెలుపొంది ఘనవిజయం సాధించింది. బీజేపీ 23 స్ధానాల్లో, కాంగ్రెస్ 9 స్ధానాల్లో గెలుపొందాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నేడు జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
-
నేడు అమరీందర్ సింగ్ ప్రమాణస్వీకారం
-
సీఎంగా నేడు పెమా ఖండూ ప్రమాణం
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన పెమా ఖండూ(36) ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. నబమ్ టుకీ స్థానంలో నిన్న ఖండూ శాసన సభా పక్షనేత గా ఎన్నికైన విషయం తెలిసిందే. మొత్తం 60 మంది సభ్యులున్న శాసనసభలో కాంగ్రెస్ కు 45 మంది సభ్యులున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెండ్ సభ్యుల మద్ధతు ఆపార్టీకి ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిన్న బలపరీక్ష నిర్వహించాల్సి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేకపోవడంతో అది వాయిదా పడింది. పెమా ఖండూ బాధ్యతలు చేపట్టిన తర్వాత బల పరీక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది. -
టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్‌లు నూతన ఎమ్మెల్సీలుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావును మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా కొనసాగించాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచరం. -
చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక వద్ద కోలాహలం
-
మోడీ వచ్చాకే ఐఏఎస్‌ల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల పంపిణీ మార్గదర్శకాలకు ఆమోదం తెలిపేందుకు ప్రధాని మన్మోహన్ నిరాకరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం, ప్రధానమంత్రి పదవికి కూడా రాజీనామా చేసినందున ఈ ఫైలుపై సంతకం చేయడానికి మన్మోహన్ నిరాకరించినట్లు ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి. దీంతో మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాతగానీ విభజన మార్గదర్శకాలకు మోక్షం లభించదని ఆ వర్గాలు చెప్పాయి. అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలను ప్రత్యూష సిన్హా కమిటీ ఖరారు చేసింది. ఏ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తారు లేదా ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారా అని అధికారుల నుంచి డిక్లరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర కేడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులందరూ ప్రాధాన్యతలను తెలియజేస్తూ సీల్డ్ కవర్లను ప్రభుత్వానికి పంపారు. -
13న వసుంధరా రాజే ప్రమాణం
రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే మరోసారి అధిరోహించనున్నారు. ఈనెల 13న ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజేను గవర్నరు మార్గరెట్ అల్వా మంగళవారం ఆహ్వానించారు. దీంతో వసుంధరా పార్టీ ఎమ్మెల్యే గులాబ్‌చంద్ కటారియా, మరో ఇద్దరు నేతలతో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. వారు గవర్నరుతో భేటీ అయినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. రాజే సోమవారం బీజేపీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.