ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ ప్రమాణస్వీకారం | Naveen Patnaik Takes Oath As Odisha Chief Minister For Fifth Term | Sakshi
Sakshi News home page

ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ ప్రమాణస్వీకారం

Published Wed, May 29 2019 12:39 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ వరుసగా ఐదోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్‌తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ను ఒడిషా గవర్నర్‌ గణేషి లాల్‌ ఆదివారం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశంలో దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో నవీన్‌ పట్నాయక్‌ (72) ముందువరసలో నిలుస్తారు. లోక్‌సభతో పాటు జరిగిన ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్ధానాల నుంచి పోటీ చేసిన పట్నాయక్‌ రెండింటిలోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement