Odhisa
-
సంక్షేమ పాలనకే ‘కొటియా’ ఓటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల ప్రజల మనోగతంపై ‘ఒడిశా వద్దు మొర్రో’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం ఇరు రాష్ట్రాల్లోని పాలకులను కదిలించింది. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొటియా ప్రజలకు ప్రయోజనాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవడానికి దోహదపడింది. కొటియా వివాదంపై ట్విట్టర్లో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆదివారం స్పందించారు. ‘కొటియా గ్రామాలన్నీ ఆంధ్రాలోనే ఉంటాం. ఒడిశా వద్దు మొర్రో అంటున్నాయి. సీఎం జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ఇదే సాక్ష్యం. వైఎస్సార్ తర్వాత ఆ గిరిజన గ్రామాలను పట్టించుకున్న నాయకుడు సీఎం జగనే. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం వల్ల ఆంధ్ర స్కూల్స్‌లోనే వారి పిల్లల్ని చేర్పిస్తున్నారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ కొటియా గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా ఐడీటీఏ పీఓ కూర్మనాథ్ చర్యలు చేపట్టారు. పట్టుచెన్నూరులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పట్టుచెన్నూరు, సల్ఫగుడ, ఎగువ మెండంగి గ్రామాలకు, పగులు చెన్నూరులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పగులు చెన్నూరు, డోలియాంబ, ముడకారు గ్రామాలకు, నేరెళ్లవలసలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పనుకువలస, దొరలతాడి వలస, రణశింగి, ఫణికి, సింహాగెడ్డ, గాలిగబడారు, మూలతాడివలస గ్రామాలకు, దూలిభద్రలోని స్టాక్ పాయింట్ నుంచి ఎగువ శంభి, కొటియ, దూలిభద్ర, ఎగువ గంజాయి భద్ర, దిగువ గంజాయి భద్ర గ్రామాలకు నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా ప్రభుత్వం, అక్కడి పోలీసులు కొటియా ప్రజలను అడ్డుకోవడాన్ని ఆంధ్రా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కొటియా సర్కిల్ ఇన్స్పెక్టర్ వీఎంసీఎం ఎర్రంన్నాయుడు వివాదాస్పద గ్రామాల్లో పర్యటించారు. -
దేశంలో ఓటమి ఎరుగని ముఖ్యమంత్రి
-
ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకారం
-
సీఎం పీఠంపై వరుసగా ఐదోసారి..
భువనేశ్వర్ : ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుసగా ఐదోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్‌తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌ను ఒడిషా గవర్నర్ గణేషి లాల్ ఆదివారం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశంలో దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో నవీన్ పట్నాయక్ (72) ముందువరసలో నిలుస్తారు. లోక్‌సభతో పాటు జరిగిన ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్ధానాల నుంచి పోటీ చేసిన పట్నాయక్ రెండింటిలోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర జాతీయ నేతలను పట్నాయక్ ఆహ్వానించారు. ఇక క్యాబినెట్ మంత్రులుగా రవీంద్ర ప్రతాప్ స్వాన్, నవ కిషోర్ దాస్, ప్రతాప్ జెనా, సుశాంత సింగ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147 స్ధానాలకు గాను బీజేడీ 112 స్ధానాల్లో గెలుపొంది ఘనవిజయం సాధించింది. బీజేపీ 23 స్ధానాల్లో, కాంగ్రెస్ 9 స్ధానాల్లో గెలుపొందాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బీజేడీ ఎంపీ రామచంద్ర అరెస్ట్
న్యూఢిల్లీ: ఒడిశా ఛిట్ ఫండ్ కేసులో బీజేడీ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రామచంద్ర హన్సడాహ్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను సీబీఐ అదుపులోకి తీసుకుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హితేష్ కుమార్ బగర్టీ, బీజేడీ మాజీ ఎమ్మెల్యే సుబర్న నాయక్ అరెస్టయిన వారిలో ఉన్నారు. నవ దిగంత గ్రూపు నుంచి నిధులను అక్రమంగా మళ్లించినట్టు వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం కేసులో పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.