సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల పంపిణీ మార్గదర్శకాలకు ఆమోదం తెలిపేందుకు ప్రధాని మన్మోహన్ నిరాకరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం, ప్రధానమంత్రి పదవికి కూడా రాజీనామా చేసినందున ఈ ఫైలుపై సంతకం చేయడానికి మన్మోహన్ నిరాకరించినట్లు ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి. దీంతో మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాతగానీ విభజన మార్గదర్శకాలకు మోక్షం లభించదని ఆ వర్గాలు చెప్పాయి. అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలను ప్రత్యూష సిన్హా కమిటీ ఖరారు చేసింది. ఏ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తారు లేదా ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారా అని అధికారుల నుంచి డిక్లరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర కేడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులందరూ ప్రాధాన్యతలను తెలియజేస్తూ సీల్డ్ కవర్లను ప్రభుత్వానికి పంపారు.
మోడీ వచ్చాకే ఐఏఎస్‌ల పంపిణీ
Published Sun, May 18 2014 2:54 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
Advertisement
Advertisement