ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. హిందీలో ఈశ్వరుడి సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. లోక్‌సభలో ప్రధాని మోదీ పేరు ప్రకటించగానే బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మోదీ జిందాబాద్ అంటూ నినదించారు. ప్రమాణం చేశాక సభలోని సభ్యులందరికీ రెండు చేతులు జోడించి మోదీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు.. భారత్ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు.