
13న వసుంధరా రాజే ప్రమాణం
రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే మరోసారి అధిరోహించనున్నారు. ఈనెల 13న ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజేను గవర్నరు మార్గరెట్ అల్వా మంగళవారం ఆహ్వానించారు. దీంతో వసుంధరా పార్టీ ఎమ్మెల్యే గులాబ్‌చంద్ కటారియా, మరో ఇద్దరు నేతలతో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. వారు గవర్నరుతో భేటీ అయినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. రాజే సోమవారం బీజేపీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.