
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అల్కా లాంబా(Alka Lamba) ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. రాజకీయాలకు పక్కనపెట్టి రేఖతో ఉన్న స్నేహబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షురాలిగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ తరఫున ఆల్కా లాంబా ప్రమాణం చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఏబీవీపీ తరఫున రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రేఖాకు అభినందనలు తెలియజేశారామె.
రేఖా గుప్తా ముఖ్యమంత్రి అని తెలియగానే 30 ఏండ్లు వెనక్కి వెళ్లా. విద్యార్థి సంఘాల నేతలుగా మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాకు ఇంకా గుర్తు. సిద్ధాంతపరంగా మాకు ఎప్పుడూ పడేది కాదు. కానీ, ఏడాది పాటు మేం కలిసి పని చేసిన రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి అని అన్నారామె.
ఇక యమునా నది(Yamuna River) ప్రక్షాళన ప్రధాన హామీగా బీజేపీ ఢిల్లీ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై దృష్టిసారించాలని ఆల్కా లాంబా సీఎం రేఖా గుప్తాకు సూచించారు. ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తాకు అభినందనలు. యమునా మాత శుభ్రమవుతుందని, యమునా పుత్రులంతా ఇక సురక్షితంగా ఉంటారని మేం ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారామె.
1995 की यह यादगार तस्वीर - जब मैंने और रेखा गुप्ता ने एक साथ शपथ ग्रहण की थी-
मैंने @nsui से दिल्ली विश्वविद्यालय छात्र संघ (DUSU) #अध्यक्ष पद पर जीत हासिल की थी और रेखा ने #ABVP से #महासचिव पद पर जीत हासिल की थी- रेखा गुप्ता को बधाई और शुभकामनाएँ.
दिल्ली को चौथी महिला… pic.twitter.com/csM1Rmwu9y— Alka Lamba 🇮🇳 (@LambaAlka) February 19, 2025