alka lamba
-
సోనియా రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు!..
కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రసంగించిన సంగతి తెలిసింది. ఆ ప్రసంగంలో ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందనడంతో.. ఒక్కసారిగా ఆమె రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.అంతేగాదు ఆమె క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారంటూ వివిధ ఊహగానాలు హల్చల్ చేశాయి. ఐతే ఆమె రాజకీయాల నుంచి తప్పుకోలేదని మార్గదర్శక శక్తిగా కొనసాగుతుందని పార్టీ నాయకుడు ఆల్కా లాంబా ఆదివారం చత్తీస్‌గఢ్‌లో మూడో రోజు జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందన్నారే తప్ప రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదన్నారు. కాగా, సోనియా ప్లీనరీలో..1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి నా ఇన్నింగ్స్ భారత్‌జోడో యాత్రతో ముగించడం సంతోషంగా ఉంది. ఈ యాత్ర ఒక గొప్ప మలుపు. మా పార్టీ ప్రజలతో సంప్రదింపులు, సంభాషణల ద్వారా గొప్ప వారసత్వాన్ని పునరుద్ధరించింది. కాంగ్రెస్ ప్రజలతో నిలబడి పోరాడటానికి సిద్దంగా ఉందనేది తెలియజేసింది. ఈ యాత్ర కోసం పోరాడిన కార్యకర్తలందరికీ అభినందనలు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఐతే ఆమె పార్లమెంటు సీటు కోసం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి బరిలీకి దిగుతారా లేదా తదుపరి లోక్ సభ ఎన్నికలకై కూతుర ప్రియాంక కోసం సీటు వదులుకుంటారా అనే ఊహగానాలు హల్చల్ చేస్తున్నాయి. (చదవండి: అందుకు కేవలం ఒక్క ఏడాదే ఉంది!..) -
‘పోలీసులు నా మెడ విరిచేందుకు ప్రయత్నించారు’
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబా ఢిల్లీలో మంగళవారం నిరసన చేపట్టారు. అయితే తాను శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసుల తన మెడ విరిచే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో అల్కా లంబా రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి లేపేందుకు పోలీసులు ప్రయత్నించగా అల్కా రోడ్డుపై పడుకొని ‘భారత్ మాతా కీ జై, జై జవాన్, జై కిసాన్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇంతలో పోలీసులు అంబాను ఎత్తుకుని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించగా.. ఆమె మెడ విరగ్గొట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ నాయకురాలు ఆరోపించారు. చదవండి: అగ్నిపథ్ స్కీమ్‌పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు Meanwhile in Delhi. pic.twitter.com/DxwJScpI3I — Shiv Aroor (@ShivAroor) June 21, 2022 ‘నా మెడను ఎందుకు పట్టుకున్నారు. నన్ను ఒంటరిగా వదిలేయమని చెప్పండి. నా దగ్గర ఏం లేదు. నా దగ్గర AK-47 ఉందా? బాంబు ఉందా? నా వద్ద ఏ ఆయుధాలు లేవు’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిరసన ఆపాలని పోలీసులు ఎంత కోరినప్పటికీ . కాంగ్రెస్ నాయకురాలు ససేమిరా అన్నారు. తాను ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదన్నారు. ఇదిలా ఉండగా నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తన నిరసనను కొనసాగిస్తోంది. మంగళవారం నాడు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ఐదోసారి ప్రశ్నించారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ కేసుకు సంబంధించి జూన్ 23న ఏజెన్సీ ముందు హాజరు కావాలని కోరారు. -
మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు
లక్నో: ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కారణంగా కాంగ్రెస్ నాయకురాలు అల్క లంబాపై కేసు నమోదైంది. ట్విటర్ వేదికగా ఓ వీడియోలో ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించట్లేదని ఆరోపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ముస్లిం, దళిత కార్డులను ఉపయోగించి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. (లాక్డౌన్ ఎఫెక్ట్: స్వచ్ఛంగా మారుతున్న యమునా నది) 'బేటీ బచావో' అని నినదించిన మోదీ.. తన సొంత పార్టీలోని వ్యక్తులే ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు చేశారన్న సంగతి మర్చిపోరాదన్నారు. ఉన్నావ్ అత్యాచార ఘటనలో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ని దోషిగా పేర్కొంటూ.. మోదీ మొదలుపెట్టిన బేటీ బచావో కార్యక్రమాన్ని ఫ్లాప్ షోగా అభివర్ణించారు. భారతదేశ ఆడపిల్లలను రక్షించుకోవడంలో, బాధితులకు న్యాయం చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అల్క లంబా చేసిన వ్యాఖ్యలపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని 504, 505 (1) (బి) మరియు 505 (2) సెక్షన్ల కింద లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సోషల్ మీడియాలో అల్క లంబాకు వ్యతిరేకంగా బీజేపీ నేతల పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే తనపై కేసు నమోదు కావడం పట్ల అల్క లంబా స్పందిస్తూ.. నిజానికి నేను మాట్లాడిన ఆ వీడియో ఏడాది క్రితం నాటిది. బీజేపీ భక్తులకు నాకు వ్యతిరేకంగా ఏమీ దొరకలేదేమో, అందుకే సంవత్సరం క్రితం నాటి వీడియోను తవ్వారు అంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్ ) -
అయ్యో.. అల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పార్టీలు మారి ఎన్నికల బరిలో నిలిచిన 17 మందిలో 9 మంది విజయం సాధించారు. గెలుపొందిన వారిలో అత్యధికంగా 8 మంది ఆప్‌కు చెందిన వారు కాగా బీజేపీ నుంచి ఒక్కరున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఆప్ 9 మందిని, బీజేపీ నలుగురిని, కాంగ్రెస్ ముగ్గురిని బరిలోకి దించాయి. ఆప్ తరఫున పోటీ చేసిన మొత్తం 9 మందిలో అయిదుగురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పాయ్(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈయన ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరిపై 6 వేల పైచిలుకు ఓట్లతో మళ్లీ విజయం సాధించారు. మోడల్ టౌన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈసారి ఈయన్ను ఆప్‌నకు చెందిన అఖిలేశ్ త్రిపాఠీ 10వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. కాంగ్రెస్‌కు చెందిన సంజయ్ సింగ్(వికాస్పురి), సురేంద్రపాల్ సింగ్(తిమర్పూర్) ఈసారి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. వీరిద్దరినీ వరుసగా ఆప్‌కు చెందిన మహీందర్ యాదవ్(31 వేల ఓట్లు), దిలీప్ పాండే(21వేల ఓట్లు) ఓడించారు. ఎన్నికల ప్రచారంలో అల్కా లాంబా (ఫైల్) ఇతర ముఖ్యనేతల్లో ఆప్‌ను వీడి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన చాందినీచౌక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్కా లాంబా.. కాంగ్రెస్ తరఫున గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆప్ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ చేతిలో ఓడిపోయారు. అల్కాకు కేవలం 3,881 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సుమన్ కుమార్ గుప్తా 29,584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రహ్లాద్ సింగ్‌కు 50,891 ఓట్లు వచ్చాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్టు అల్కా లాంబా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయన్న దానిపై మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంటే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: ‘ఆప్’రేషన్ సప్తపది) -
మళ్లీ సొంత గూటికి చేరిన ఆల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ ఎమ్మెల్యే ఆల్కా లాంబా ఎట్టకేలకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ఇన్చార్జ్ పీసీ చాకో సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. 2014లో కాంగ్రెస్‌ను వీడిన లాంబా ఆప్‌లో చేరి.. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆమెపై ఢిల్లీ స్పీకర్ ఇటీవల అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. గత నెలలోనే ఆమె ఆప్‌కు రాజీనామా చేశారు. ఆప్‌లో రెబల్ ఎమ్మెల్యేగా ఆల్కా లాంబా పేరొందారు. అనేక సందర్భాల్లో పార్టీ నాయకత్వంపై, ఆప్ ప్రభుత్వంపై ఆమె బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఇందిరాగాంధీ హత్యానంతర సిక్కులు సామూహిక హత్యలను మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సమర్థించారని, ఆయనకు కేంద్రం ఇచ్చిన భారత రత్న అవార్డును వెనక్కు తీసుకోవాలంటూ ఢిల్లీ సర్కారు ఇటీవల అసెంబ్లీలో తీర్మానం తీసుకురాగా.. దానిని ఆల్కా లాంబా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్మానంపై విమర్శలు రావడంతో సర్కారు కూడా విరమించుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆప్ తరఫున ఆల్కా లాంబా ఢిల్లీలో ప్రచారం చేయలేదు. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్‌లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయెల్ ఆమెపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
పార్టీకి రాజీనామా.. ఎమ్మెల్యేపై అనర్హత వేటు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెబెల్ ఎమ్మెల్యే ఆల్కా లంబాపై అనర్హత వేటు పడింది. ఆప్‌కు రాజీనామా చేసిన ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్పీకర్ ఆమెపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన ఆల్కా లంబా ఆప్‌కు రాజీనామా చేస్తున్నట్టు ట్విటర్లో ప్రకటించారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అహంకారపూరితంగా వ్యవహరిస్తూ.. తనను రాజీనామాచేయాలని ట్విటర్లో అడిగారని, అందుకే తాను రాజీనామా చేస్తున్న విషయాన్ని ట్విటర్లోనే చెప్తున్నానని ఆమె పేర్కొన్నారు. పార్టీని వీడే సమయం ఆసన్నమైనందున ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చాందినీ చౌక్ ఎమ్మెల్యే అయిన అల్కా లంబా గతంలో ప్రకటించారు. గత ఆరేళ్ల ప్రయాణంలో పార్టీలో కొనసాగినందున గొప్ప గుణపాఠాలు నేర్చుకున్నానని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ పరాజయానికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను అల్కా బాహాటంగా కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. అదేవిధంగా కేజ్రీవాల్ ట్విటర్లో తనను అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో పొమ్మనలేక పొగపెడుతున్నారంటూ అల్కా గత కొంతకాలంగా ఆప్ తీరును విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలో కొనసాగలేనని ఆమె పేర్కొన్నారు. -
‘ప్లీజ్.. నా రాజీనామాను ఆమోదించండి’
న్యూఢిల్లీ : పార్టీని వీడే సమయం ఆసన్నమైనందున ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్త నేత, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా ప్రకటన చేశారు. గత ఆరేళ్ల ప్రయాణంలో పార్టీలో కొనసాగినందున గొప్ప గుణపాఠాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ పరాజయానికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను అల్కా బాహాటంగా కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. అదే విధంగా కేజ్రీవాల్ ట్విటర్లో తనను అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో పొమ్మనలేక పొగపెడుతున్నారంటూ అల్కా గత కొంతకాలంగా ఆప్ తీరును విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలో కొనసాగలేనని... రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతునానని ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో అల్కా వ్యాఖ్యలపై స్పందించిన ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా ప్రవరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదని... ఒకవేళ పార్టీని వీడాలనుకుంటే రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపించాల్సింది అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై శుక్రవారం స్పందించిన అల్కా...‘ అరవింద్ కేజ్రీవాల్ జీ... ట్విటర్‌లోనైనా సరే నా రాజీనామాను ఆమోదించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని మీ అధికార ప్రతినిధి అహంకారపూరితంగా మాట్లాడారు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీగా మొదలై.. నేడు ఖాస్ ఆద్మీ పార్టీగా మారిన మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. దయచేసి నా రాజీనామాను అంగీకరించండి అంటూ ట్వీట్ చేశారు. కాగా అల్కా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అల్కా లంబా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ గతంలో తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆల్కా లంబా పేర్కొన్నారు. @ArvindKejriwal Ji, your spokespersons asked me as per your desire, with the full arrogance that the Party will accept My resgination even on the Twitter. So pls Kindly accept My resgination from the primary membership of the "Aam Aadmi Party", which is now a "Khas Aadmi Party". — Alka Lamba - अलका लाम्बा (@LambaAlka) September 6, 2019 -
కాంగ్రెస్ గూటికి ఆప్ ఎమ్మెల్యే..
సాక్షి, న్యూఢిల్లీ : ఆప్ రెబల్ ఎమ్మెల్యే అల్కా లాంబా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్దినెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న అల్కా లాంబా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో మంగళవారం భేటీ అయ్యారు. సోనియాను ఆమె నివాసంలో కలిసిన అల్కా కాంగ్రెస్ అధినేత్రితో సంప్రదింపులు జరిపారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడంతో అల్కా లాంబా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని భావిస్తున్నారు. కాగా చాందినిచౌక్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అల్కా తాను పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని, రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతానని ఆమె ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె రాజీనామాను ఆమోదించేందుకు సంసిద్ధమని ఆప్ కూడా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ పరాజయానికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆమె బాహాటంగా కోరడంతో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి అల్కాను తొలగించారు. -
అవమానిస్తూనే ఉన్నారు; పబ్లిసిటీ కోసమే!
న్యూఢిల్లీ : తాను పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్త నేత, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆగష్టు 4న అధికారిక ప్రకటన చేస్తానని వెల్లడించారు. పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో తన నెంబరు తొలగించడం, ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్లో తనను అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో పొమ్మనలేక పొగపెడుతున్నారంటూ అల్కా లంబా గత కొంతకాలంగా ఆప్ తీరును విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్కా లంబా మీడియాతో మాట్లాడుతూ...‘ పార్టీ సమావేశాలకు నన్ను పిలవడం లేదు. గతంలో ఎన్నోసార్లు నన్ను అవమానించారు. ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నారు. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. అక్కడ కుటుంబ రాజకీయాల వల్ల ఎంతో వేదనకు గురికావాల్సి వచ్చింది. ఇక ఆప్‌లో కనీసం గౌరవం కూడా ఉండదు. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నా. నా నియోజకవర్గ అభివృద్ధికై ప్రభుత్వం కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చయిన మరుసటి రోజు పార్టీని వీడతాను’ అని స్పష్టం చేశారు. కాగా అల్కా లంబా వ్యాఖ్యలపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా ప్రవరిస్తున్నారంటూ విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదని... ఒకవేళ పార్టీని వీడాలనుకుంటే రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపించాల్సింది అని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నోసార్లు అల్కా లంబా ఇలాగే మాట్లాడారని, మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ గతంలో తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆల్కా లంబా పేర్కొన్నారు. దీంతో ఆమె పార్టీని వీడనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారమవుతున్నాయి. -
‘ఆమె కారణాలు వెతుకుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : తనను కావాలనే దూరం పెడుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లంబా చేసిన వ్యాఖ్యలపై ఆప్ మండిపడింది. ఈ విషయంపై స్పందించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘పార్టీని వీడడానికి ఆమె కారణాలు వెతుక్కుంటున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారెవరైనా సస్పెండ్ చేసే అధికారం పార్టీ అధిష్టానానికి ఉంటుంది. కానీ అల్కాను పార్టీ నుంచి తొలగించాలనే ఉద్దేశం లేదు. మా పార్టీని వీడిన కొన్నాళ్లకు మారిపోయామన్న నేతలను కూడా తిరిగి పార్టీలో చేర్చుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇక సీఎం అరవింద్ కేజ్రీవాల్ అల్కాను ట్విటర్లో అన్‌ఫాలో చేయడాన్ని ప్రస్తావిస్తూ.. అది ఆయన సొంత విషయమని పేర్కొన్నారు.(ఆప్ తీరుపై అల్కా లంబా విమర్శలు) కాగా సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చాందినీ చౌక్ ఎమ్మెల్యే ఆల్కా లంబా పేర్కొన్నారు. దీంతో ఆమె పార్టీని వీడనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారమవుతున్నాయి. -
‘ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలో కొనసాగలేను’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆమ్ ఆద్మీ పార్టీకి నా సేవలు అవసరం లేనట్లుగా అనిపిస్తోంది’ అని చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తనను పక్కన పెట్టాలని చూస్తోంది అని ఆరోపించారు. ‘పార్టీ వాట్సాప్ గ్రూపుల నుంచి నా నెంబర్ తొలగించడం. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్లో నన్ను అన్‌ఫాలో అవడం. పార్టీ మీటింగ్‌లకు ఆహ్వానించకపోవడం చూస్తుంటే పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా ఉంది. మిగతా ఎమ్మెల్యేలలాగా నాకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి కదా. అలా జరగని పక్షంలో నేను ఈ పార్టీలో కొనసాగలేను. నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేను’ అని అల్కా లంబా పార్టీ తీరును విమర్శించారు. కాగా సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆల్కా లంబా పేర్కొన్నారు. దీంతో ఆమె పార్టీని వీడనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారమవుతున్నాయి. -
ఆప్‌లో ముసలం తెచ్చిన రాజీవ్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానం ఆమ్ఆద్మీ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆప్ శాసనసభ్యురాలు ఆల్కా లాంబా శనివారం తెలిపారు. కాగా సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలిన ఢిల్లీ అసెంబ్లీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఆల్కా లాంబాంతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. సభలో చర్చ సందర్భంలోనే తాను వ్యతిరేకించి సభ నుంచి బయటకు వచ్చినట్లు చాందినీ చౌక్ ఎమ్మెల్యే ఆల్కా లాంబా తెలిపారు. ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేసిన పార్టీ నాయకత్వం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ ఆదేశిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. కాగా రాజీవ్‌కిచ్చిన భారతరత్న అవార్డును ఉపసంహరించుకోవాలని ఆప్ ఎమ్మెల్యే జర్నాలి సింగ్ చేసిన ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ స్పందించింది. ఆప్‌ను తామెప్పుడూ బీజేపీ పక్షంగానే భావిస్తామని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ విమర్శించారు. దేశ ప్రధానిగా రాజీవ్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ఆయన ప్రాణాన్ని సైతం దేశం కోసం త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు. -
ఆ 20మందిలో ఏ ఒక్కరూ మళ్లీ గెలవరు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటించిన 20 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు కూడా తిరిగి గెలవబోరని ఆప్ ఎమ్మెల్యే(రెబల్) కపిల్ మిశ్రా చెబుతున్నాడు. ఉప ఎన్నికలకు వెళ్తే.. వారంతా చిత్తుగా ఓడిపోవటం ఖాయమని అంటున్నాడు. అంతర్గత సర్వేలో ఈ విషయం తేటలెల్లమైందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన నివేదికను శనివారం మీడియాకు విడుదల చేశాడు. ‘‘అంతర్గత సర్వే నిర్వహించి నివేదికను తయారు చేశాం. ఆ 20 మందిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ‘ఎమ్మెల్యేల పనితీరు.. ప్రజల్లో వారిపై ఏ మేర వ్యతిరేకత’ ఉంది అన్న విషయాలను నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాం. వారు తిరిగి గెలిచే అవకాశాలే లేవు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో ఆప్ అభ్యర్థుల ఓటమి ఖాయం. 9 స్థానాల్లో ఒకవేళ అభ్యర్థులను మార్చినా లాభం లేకపోవచ్చు’’ అని కపిల్ పేర్కొన్నారు. కపిల్ సూచించిన స్థానాల మార్పుల్లో అల్కా లాంబ, ఆదర్శ్ శాస్త్రి, సరితా సింగ్, ప్రవీణ్ దేశ్‌ముఖ్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయని తెలుస్తోంది. కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటన వెలువడగానే అంతర్గత సర్వేను ప్రారంభించేశాడు. సోషల్ మీడియా ద్వారా ఆయా నియోజక వర్గాల్లో ప్రజల అభిప్రాయలను సేకరించిన కపిల్.. ఆ నివేదికను రాత్రికి రాత్రే ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అందజేశాడు. మీడియాతో కపిల్ మిశ్రా (పాత చిత్రం) -
భయపడం...
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీకి తాము భయపడటం లేదని, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కేజ్రీవాల్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అల్కా లాంబా అన్నారు. తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని వ్యాఖ్యానించారు. అన్యాయానికి వ్యతిరేకంగా తమ గళం విన్పిస్తామని ప్రకటించారు. అనర్హత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు వీరే.. ఆదర్శ శాస్త్రి-ద్వారక, అల్కా లాంబా- చాందినిచౌక్, అనిల్ వాజపేయి- గాంధీనగర్, అవతార్ సింగ్- కాల్కాజీ, జర్నైల్ సింగ్- రాజౌరి గార్డెన్, కైలాశ్ గెహిలట్- నజాఫ్‌గార్గ్, మందన్‌లాల్- కసుర్బానగర్, మనోజ్‌కుమార్- కోండ్లి, నరేశ్ యాదవ్-మెహరౌలి, నితిన్ త్యాగి-లక్ష్మీనగర్, జర్నైల్ సింగ్- తిలక్‌నగర్, ప్రవీణ్ కుమార్-జాంగ్‌పురా, రాజేశ్‌గుప్తా- వజీర్పూర్, రాజేశ్ రిషి- జానక్‌పురి, సంజీవ్ ఝా- బురారీ, సరితా సింగ్- రోహతాస్‌నగర్, సోమ్‌దత్- సదర్‌బజార్, శరద్‌కుమార్- నెర్లా, శివచరణ్ గోయల్- మోతినగర్, సుఖ్బీర్ సింగ్- మందకా, విజేందర్ గార్గ్- రాజిందర్‌నగర్. -
మోదీపై ట్వీట్.. తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ వ్యవహారం.. ముస్లిం వివాహ చట్ట సవరణ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. ఆప్ ఎమ్మెల్యే ఒకరు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్క లంబ.. మోదీ వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘అసలు ట్రిపుల్ తలాక్ చెప్పటం ఎందుకు? జైలుకు వెళ్లటం ఎందుకు? హాయిగా భార్యను వదిలేసి వెళ్తే ఏకంగా దేశానికే ప్రధాని అయిపోవచ్చు కదా!’’ అంటూ ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రధాని స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. Why say "Talaq Talaq Talaq" and go to jail , when you can just leave her without saying anything and become the Prime Minister of India.#TripleTalaq — Alka Lamba (@LambaAlka) December 29, 2017 -
డమ్మీ ఈవీఎంతో ఎమ్మెల్యే హడావుడి
-
అక్కడ ఎక్కడినుంచో ఎందుకు తెచ్చారు?
ఓ భారీ కుట్రను వెల్లడించడానికి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి సస్పెండయిన ఆప్ నేత కపిల్ మిశ్రా కూడా హాజరయ్యారు. కేజ్రీవాల్ బంధువుల పేరు మీద జరిగిన భూ కుంభకోణాలు, మంత్రుల విదేశీ పర్యటనలు తదితర అంశాలపై సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా అటు నుంచి అటే అసెంబ్లీ సమావేశానికి ఆయన వచ్చేశారు. ఇక ఈ సమావేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా ప్రస్తావించారు. ఆప్ నాయకులతో కలిసి తాను ఈవీఎంల గురించి పలు ప్రశ్నలతో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లానని, అయితే తమకు అక్కడినుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని ఆమె చెప్పారు. అయినా ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలకు ఎక్కడో రాజస్థాన్ నుంచి ఈవీఎంలు తేవాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. విచారణ కోసం ఈవీఎంలను స్వాధీనం చేసుకోవాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించిందని, అలాగే ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా ఏకంగా 2446 ఈవీఎంలను సీజ్ చేసిందని చెప్పారు. ఎన్నికలలో ఓడిపోయినందుకో లేదా ప్రచారం కోసమో ఈవీఎంల అంశాన్ని లేవనెత్తడం లేదని ఆమె చెప్పారు. పదేళ్ల పాటు ఎంసీడీలో దుష్ట పరిపాలన చేసిన తర్వాత బీజేపీ మళ్లీ ఈ స్థాయిలో మెజారిటీ సాధిస్తుందని ఎవరూ అనుకోలేదని, అందువల్ల ఇందులో వాస్తవం ఏంటో బయటకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చో అన్న అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ అసెంబ్లీలో చేసి చూపించారు. -
‘ఢిల్లీలో రాష్ట్రపతిపాలన’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే తనకు లోక్‌సభ టికెట్ ఇస్తానని బీజేపీ బేరం పెట్టిందని ఆమె వెల్లడించారు. బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మితో సమానంగా పార్టీలో హోదా కల్పిస్తామని ఆశ పెట్టినట్టు తెలిపారు. ‘ఆప్ పనైపోయిందని మా పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు ఫోన్లు చేస్తున్నారు. ఎంపీ టికెట్ లేదా ప్రభుత్వంలో కీలకమైన పదవి ఇస్తామని నాకు ఆశచూపారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మాదిరిగా ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ నాయకులు నాతో చెప్పార’ని అల్కా లంబా తెలిపారు. బీజేపీ నాయకులు తనతో మాట్లాడిన వివరాలను ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు తెలిపినట్టు చెప్పారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. ఎంసీడీ ఎన్నికల్లో కమలం వికసించింది. ఈవీఎంల మోసం వల్లే బీజేపీ గెలిచిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
'ఏ తప్పూ చేయలేదు.. సీసీటీవీ చూసుకోండి'
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో మరోసారి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వివాదం చోటుచేసుకుంది. తమ పార్టీ నేత ఆల్కా లాంబ విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని, అనకూడని మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత ఓపీ శర్మ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓపీ శర్మ మీడియాతో మాట్లాడుతూ తన తప్పు ఉంటే ఆప్ ఎలాంటి ఫిర్యాదునైనా పోలీసులకు చేసుకోవచ్చని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో తనను ఆల్కా లాంబ అవమానించిందని, తిట్టిందని, అవన్నీ కూడా సీసీటీవీలో రికార్డయి ఉందని, వాటని పరిశీలిస్తే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఆప్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. తాను ఒక్క మాట కూడా ఆల్కాను అనలేదని చెప్పారు. -
'ఆ ఎమ్మెల్యే.. ఓ డ్రగ్ ఎడిక్ట్'
తనపై దాడి జరిగిందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబా.. నిజానికి ఓ డ్రగ్ ఎడిక్ట్ అని బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ ఆరోపించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్లే ఆమెపై దాడి జరిగి ఉంటుందని ఆయన అన్నారు. అయితే.. ఈ ఘటన తర్వాత చాందినీ చౌక్ ఎమ్మెల్యే అయిన లాంబాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ అనుచరులైన కొందరు గూండాలు చాందినీ చౌక్ ప్రాంతంలో దుకాణాలను తగలబెట్టారని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే లాఠీలు పట్టుకునే బీజేపీ కార్యకర్తలు గట్టిగా ఎదుర్కొంటారని హెచ్చరించారు. తెల్లవారుజామున, రాత్రి ప్రాంతాల్లో అల్కా లాంబా ఇక్కడ కనిపించినట్లు స్థానికులు చెప్పారని, డ్రగ్స్‌ను అరికట్టాలని పోరాడేవాళ్లు అర్ధరాత్రి 1 నుంచి 4 గంటల సమయంలో అక్కడకు రారని శర్మ అన్నారు. దీన్ని బట్టి చూస్తే, ఆమే డ్రగ్స్‌కు బానిస అన్న విషయం తెలుస్తోందన్నారు. తనకు మహిళలంటే చాలా గౌరవమని, అయితే.. ఫూలన్ దేవి లాంటి వాళ్లను మహిళా శక్తికి నిదర్శనంగా చూపాలనుకుంటే మాత్రం కుదరదని చెప్పారు. డ్రగ్స్ మత్తులోనే ఆమె హింసాత్మకంగా ప్రవర్తించారని శర్మ విలేకరులతో వ్యాఖ్యానించారు. -
ఆప్ మహిళా ఎమ్మెల్యేపై దాడి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నాయకురాలు, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. మాదక ద్రవ్యాల్ని నిరోధించాలని పిలుపునిస్తూ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే చేపట్టిన ప్రత్యేక ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీ.. ఉత్తర ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతానికి చేరుకోగానే గుర్తుతెలియని దుండగులు ఎమ్మెల్యే అల్కా సహా ఆమె అనుచరులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో అల్కా తలకు బలమైన గాయం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా స్పందించిన కార్యకర్తలు అల్కాను హుటాహుటిన అరుణా అసఫ్ అలీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కొద్దిసేపటికి ఆమె డిశ్చార్జి అయ్యారు. 'మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాపై దాడి చేశారు. నా తల పగలగొట్టారు. రక్తం కళ్లజూశారు. అయినాసరే వెనకడుగు వేసేదిలేదు. మత్తులో జోగుతున్నవారిని జాగృతం చేసేవరకు పోరాడుతూనే ఉంటా' అని దాడి అనంతరం అల్కా ట్వీట్ చేశారు. -
కాంగ్రెస్‌ను వీడిన అల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ బ్రిగేడ్‌లో సభ్యురాలని భావించే అల్కాలాంబా కాంగ్రెస్‌ను వీడారు. 20 సంవత్సరాలుగా సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికానని, ఆమ్ఆద్మీ పార్టీలో చేరాలనుకుంటున్నానని ఆమె వెల్లడించారు. ఆప్‌లో చేరే విషయమై ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్‌ను కూడా కలిశారు. ఆప్ మాత్రం ఆమె పార్టీలో చేరుతున్న విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. అల్కాలాంబా 1995లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డూసూ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాల తరువాత ఆమె ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. మహిళా కాంగ్రెస్, ఢిల్లీ కాంగ్రెస్, ఏఐసీసీలో ఆమె కీలక పదవులు నిర్వహించారు. అయితే లాంబా ఇప్పుడు సొంత పార్టీపై అనాసక్తిని, ఆప్ పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో కొందరు వ్యక్తులు మూసిన తలుపుల వెనుక నిర్ణయం తీసుకుంటారని ఆరోపించారు. ఆప్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రజలను సంప్రదిస్తుందని ప్రశంసించారు. తాను యోగేంద్ర యాదవ్‌ను కలిశానని, ఆప్‌కు మద్దతు ఇస్తానని చెప్పానని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. ‘20 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్‌లో ఉన్నాను. కానీ అట్టడుగు వర్గాలతో సంబంధం కొరవడినట్లుగా నాకు మొదటి నుంచి అనిపిస్తూనే ఉంది. ఈ విషయాన్ని సోనియా, రాహుల్ గాంధీకి కూడా చెప్పాను. కాంగ్రెస్ దుస్థితిని గురించి, మున్ముందు దానికి పట్టబోయే గతి గురించి లేఖలు రాశాను. అయినా ఏ ఒక్కరూ పిలిచి నాతో మాట్లాడలే దు’ అంటూ ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమికి కూడా కార్యకర్తలనే బాధ్యులను చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కొందరు నేతల పార్టీగా మారిపోయిందని అల్కాలాంబా ఆరోపించారు.