మోదీపై ట్వీట్‌.. తీవ్ర దుమారం | AAP MLA Alka Lamba tweet on Modi over Triple Talaq | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 30 2017 1:52 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

AAP MLA Alka Lamba tweet on Modi over Triple Talaq - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్ వ్యవహారం.. ముస్లిం వివాహ చట్ట సవరణ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. ఆప్‌ ఎమ్మెల్యే ఒకరు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్‌ తీవ్ర దుమారం రేపుతోంది.

చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే అల్క లంబ.. మోదీ వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘అసలు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పటం ఎందుకు? జైలుకు వెళ్లటం ఎందుకు? హాయిగా భార్యను వదిలేసి వెళ్తే ఏకంగా దేశానికే ప్రధాని అయిపోవచ్చు కదా!’’ అంటూ ఆమె శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు. 

అయితే ఆ ట్వీట్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రధాని స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement