controversy tweets
-
వివాదంలో ఇరుక్కున్న నటి.. నా ఉద్దేశం అది కాదంటూ.. క్షమాపణలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్ సైనికుల్ని అవమానించేలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రిచా క్షమాపణలు చెప్పారు. ఆ ట్వీట్‌ను కూడా తొలగించారు. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రం ఆదేశాల కోసం చూస్తున్నామంటూ ఒక ట్వీట్ చేశారు. రిచా దీనిని ప్రస్తావిస్తూ ‘‘గల్వాన్ సేస్ హాయ్’’ అని పోస్టు పెట్టారు గల్వాన్ ప్రస్తావన తీసుకురావడంతో నెటిజన్లు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుల్ని ఎగతాళి చేయడానికి ఈ ట్వీట్ చేశారంటూ విరుచుకుపడ్డారు. దీంతో రిచా ఆ ట్వీట్‌ను తొలగించారు. సైనికుల్ని అవమానపరచడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కోరారు. చదవండి: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
‘ఒవైసీ హనుమాన్ చాలీసా చదువుతారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు ఇది చేశాం, ఇకముందు అది చేస్తాం అని చెప్పాల్సిన నాయకులు ఇతర పార్టీల నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల కమిషన్ చేత మొట్టికాయలు తిన్న బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మెజారిటీ సీట్లు సాధించడానికి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఆమ్ఆద్మీపార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఓ ఇంటర్వ్యూలో హనుమాన్ భక్తుడినని, ఇప్పటికీ హనుమాన్ చాలీసా పఠిస్తానని వెల్లడించగా, దీన్ని ఉటంకిస్తూ కపిల్ మిశ్రా మంగళవారం ట్వీట్ చేశారు. (చదవండి: వివాదాస్పద ట్వీట్ చేసిన మిశ్రాకు నోటీసు..) ‘కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పఠించడం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పుడిక ఒవైసీ వంతు. ఆయన కూడా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెడతారు. ఐక్యతకు బలమైన శక్తి ఉంది. మన ఐక్యత 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నవాళ్లు చేసే మురికి రాజకీయాలను సమాధి చేస్తుంది. దీనికోసం అందరం కలిసి పోరాడుదాం’ అని పిలుపునిచ్చారు. కపిల్ మిశ్రా వ్యాఖ్యలపై ఎంఐఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గతంలోనూ ఆయన పలుసార్లు అగ్గిరాజేసే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు భారత్‌కు పాక్‌కు మధ్య యుద్ధమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రెండు రోజుల పాటు ఢిల్లీ ఎన్నికల ప్రచార నిషేధానికి గురయ్యారు. (బీజేపీ ఇంత దిగజారిపోయిందా?) చదవండి: ‘మీ పార్టీ పేరును ముస్లిం లీగ్‌గా మార్చుకోండి’ -
వివాదాస్పద ట్వీట్ చేసిన మిశ్రాకు నోటీసు..
-
భారత్-పాక్ వ్యాఖ్యలు.. ఈసీ నోటీసు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. ఫిబ్రవరి 8న భారత్-పాకిస్తాన్ పోరు ఉంటుందని ఆప్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆప్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కపిల్ మిశ్రాకు నోటీసులు జారీచేశారు. ఎన్నికల నియమావళి క్లాజ్ 1(1) ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకే షోకాజ్ నోటీస్ జారీ చేశామని ఈసీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 8న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను తలపించనున్నాయని బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ట్వీట్‌పై రాజధాని రాజకీయ వాతావరణం వేడెక్కింది. షాహిన్ బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నిరసనలు చేయిస్తుందని విమర్శించారు. పాకిస్తాన్ షాహిన్‌బాగ్‌లో ప్రవేశించి మినీ పాకిస్తాన్‌గా మార్చిందని మండిపడ్డారు. ఢిల్లీలోని చంద్‌బాగ్, ఇందర్‌లోక్ ప్రాంతాలలో చట్టాలు అమలు కావడం లేదని అన్నారు. ఢిల్లీని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు మినీ పాకిస్తాన్‌లు చేశాయని విమర్శించారు. ఎన్నికల్లో వారికి సరైన జవాబు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మోడల్ టౌన్ నుంచి పోటీ చేస్తున్న కపిల్ మిశ్రా నామినేషన్ పత్రాలను తప్పుగా జతపరచారని..మిశ్రా అభ్కర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
యాంకర్‌కు ఆస్కారం లేదు
‘అండ్ ది అవార్డ్ ఫర్ ది బెస్ట్ మూవీ గోస్ టూ..’ అంటూ ప్రతీ అవార్డ్ ఫంక్షన్‌ను రక్తి కట్టించేది యాంకరే. అయితే అన్ని అవార్డ్స్‌లో కల్ల ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్‌కు ఈ ఏడాది యాంకర్ (హోస్ట్) ఉండకపోవడం విశేషం. ఈ విషయం అధికారికంగా ఆస్కార్ బృందం నుంచే వచ్చింది. ఇలా యాంకర్ లేకుండా అవార్డ్స్ ఫంక్షన్ జరగడం గడిచిన 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. అవార్డ్స్‌ను ప్రదానం చేయడానికి స్టేజ్ మీదకు వచ్చే సెలబ్రిటీలు తదుపరి అవార్డులను ప్రకటిస్తారు. నిజానికి ఈ ఏడాది హోస్ట్‌గా కెవిన్ హార్ట్ షోను నిర్వహించాలి. కానీ గతంలో కెవిన్ చేసిన ట్వీట్స్ వివాదం కావడంతో స్వయంగా ఈ పోస్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. -
మోదీపై ట్వీట్.. తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ వ్యవహారం.. ముస్లిం వివాహ చట్ట సవరణ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. ఆప్ ఎమ్మెల్యే ఒకరు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్క లంబ.. మోదీ వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘అసలు ట్రిపుల్ తలాక్ చెప్పటం ఎందుకు? జైలుకు వెళ్లటం ఎందుకు? హాయిగా భార్యను వదిలేసి వెళ్తే ఏకంగా దేశానికే ప్రధాని అయిపోవచ్చు కదా!’’ అంటూ ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రధాని స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. Why say "Talaq Talaq Talaq" and go to jail , when you can just leave her without saying anything and become the Prime Minister of India.#TripleTalaq — Alka Lamba (@LambaAlka) December 29, 2017 -
సల్మాన్‌కు శిక్ష : ట్విట్టర్లో దుమారం!
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు అయిదేళ్ల జైలు శిక్ష ఖరారైన తరువాత ట్విట్టర్లో పలువురు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. కొందరు సెలబ్రిటీలు వివాదాస్పద వ్యాఖ్యలు ట్విట్ చేశారు. కొంతమంది సల్మాన్ మంచివాడు - శిక్ష పడకుండా ఉండవలసింది - తక్కువ శిక్ష పడితే బాగుండు - బాధగా ఉంది - పైకోర్టుకు వెళితే మంచిది - మా మద్దతు సల్మాన్‌కు ఉంటుంది- సల్మాన్ కోసం, అతని కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తున్నాం - సల్మాన్ కుటుంబానికి సానుభూతి - చాలా బాధగా ఉంది - కోర్టు తీర్పు బాధాకరం. దురదష్టకరం. అయితే చట్టం చట్టమే - సల్మాన్ ఎంతోమందికి సాయం చేశారు. ఆయనది మంచి మనసు - ..ఇలా ట్విట్ చేశారు. మరి కొందరు రొడ్లు, ఫుట్‌పాత్‌లు ఉన్నది మనుషులు నిద్రపోయేందుకు కాదు -ఇది డ్రైవర్ తప్పు కాదు, ఆల్కాహాల్ తప్పుకాదు - రోడ్డుపై మనుషులు నిద్రపోకుండా ఉంటే సల్మాన్ కారు వారిమీదగా పోయేదికాదు - ప్రజలకు ఇళ్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వానిది - ఆత్మహత్య చేసుకోవడం నేరం, ఫుట్‌పాత్‌పై నిద్రించడం కూడా నేరమే -....అని ట్విట్ చేశారు. ఈ ట్విట్స్ చదివిన ఓ సామాన్యుడుకు ఆగ్రహం వెలిబుచ్చాడు. ''డంబో(మూర్ఖ) సెలబ్రిటీలూ! వారు నిద్రపోయింది రోడ్డుపైన కాదు. ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపైకి కారు దూసుకుపోయింది'' అని ట్విట్ చేశాడు.