సల్మాన్కు శిక్ష : ట్విట్టర్లో దుమారం! | controversy tweets After Salman verdict | Sakshi
Sakshi News home page

సల్మాన్కు శిక్ష : ట్విట్టర్లో దుమారం!

Published Wed, May 6 2015 10:55 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

శిక్ష పడిన తరువాత సల్మాన్ ఖాన్

శిక్ష పడిన తరువాత సల్మాన్ ఖాన్

ముంబై:  హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు అయిదేళ్ల  జైలు శిక్ష ఖరారైన తరువాత ట్విట్టర్లో పలువురు పలు రకాల వ్యాఖ్యలు చేశారు.  కొందరు సెలబ్రిటీలు వివాదాస్పద వ్యాఖ్యలు ట్విట్ చేశారు. కొంతమంది సల్మాన్ మంచివాడు - శిక్ష పడకుండా ఉండవలసింది - తక్కువ శిక్ష పడితే బాగుండు - బాధగా ఉంది - పైకోర్టుకు వెళితే మంచిది - మా మద్దతు సల్మాన్కు ఉంటుంది- సల్మాన్ కోసం, అతని కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తున్నాం - సల్మాన్ కుటుంబానికి సానుభూతి -  చాలా బాధగా ఉంది - కోర్టు తీర్పు బాధాకరం. దురదష్టకరం. అయితే చట్టం చట్టమే - సల్మాన్ ఎంతోమందికి సాయం చేశారు. ఆయనది మంచి మనసు -  ..ఇలా ట్విట్ చేశారు.

మరి కొందరు రొడ్లు, ఫుట్పాత్లు ఉన్నది మనుషులు నిద్రపోయేందుకు కాదు -ఇది డ్రైవర్ తప్పు కాదు, ఆల్కాహాల్ తప్పుకాదు -  రోడ్డుపై మనుషులు నిద్రపోకుండా ఉంటే సల్మాన్ కారు వారిమీదగా పోయేదికాదు - ప్రజలకు ఇళ్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వానిది - ఆత్మహత్య చేసుకోవడం నేరం, ఫుట్పాత్పై నిద్రించడం కూడా నేరమే -....అని ట్విట్ చేశారు.

ఈ ట్విట్స్ చదివిన ఓ సామాన్యుడుకు ఆగ్రహం వెలిబుచ్చాడు.  ''డంబో(మూర్ఖ) సెలబ్రిటీలూ! వారు నిద్రపోయింది రోడ్డుపైన కాదు. ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపైకి కారు దూసుకుపోయింది'' అని ట్విట్ చేశాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement