
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సికందర్'. ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ సరసన పుష్ప భామ రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ గతేడాది సింగం ఎగైన్, బేబీ జాన్ చిత్రాల్లోనూ కనిపించారు. అయితే అంతకుముందు 2023లో టైగర్-3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు సల్మాన్ ఖాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ విఫలం కావడంతో సికందర్‌పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఈద్ కానుకగా మార్చి 28న థియేటర్లలోకి రానుంది.
Jo dilon par karta hai raj woh aaj kehlata hai Sikandar
https://t.co/Bn5NdtKN2z #SajidNadiadwala’s #Sikandar
Directed by @ARMurugadoss
@iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna #AyanKhan @DOP_Tirru…— Salman Khan (@BeingSalmanKhan) February 27, 2025
Comments
Please login to add a commentAdd a comment