వివాదంలో ఇరుక్కున్న నటి.. నా ఉద్దేశం అది కాదంటూ.. క్షమాపణలు.. | Richa Chadha Controversial Tweet Over Soldiers Galwan Valley | Sakshi
Sakshi News home page

వివాదంలో ఇరుక్కున్న నటి.. నా ఉద్దేశం అది కాదంటూ.. క్షమాపణలు..

Published Fri, Nov 25 2022 9:25 AM | Last Updated on Fri, Nov 25 2022 9:25 AM

Richa Chadha Controversial Tweet Over Soldiers Galwan Valley - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి రిచా చద్దా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్‌ సైనికుల్ని అవమానించేలా ఉందంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రిచా క్షమాపణలు చెప్పారు. ఆ ట్వీట్‌ను కూడా తొలగించారు. ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రం ఆదేశాల కోసం చూస్తున్నామంటూ ఒక ట్వీట్‌ చేశారు.

రిచా దీనిని ప్రస్తావిస్తూ ‘‘గల్వాన్‌ సేస్‌ హాయ్‌’’ అని పోస్టు పెట్టారు  గల్వాన్‌ ప్రస్తావన తీసుకురావడంతో  నెటిజన్లు  మండిపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుల్ని ఎగతాళి చేయడానికి ఈ ట్వీట్‌ చేశారంటూ విరుచుకుపడ్డారు.   దీంతో రిచా ఆ ట్వీట్‌ను తొలగించారు. సైనికుల్ని అవమానపరచడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కోరారు.
చదవండి: 100 మంది అభ్యర్థులపై హత్య, ‍అత్యాచారం ఆరోపణలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement