Aaam Admi Party
-
కాగ్ రిపోర్టు మంట... ఆప్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్ రిపోర్టు జాప్యం చేస్తున్నందుకు ఆప్ సర్కార్‌పై మండిపడింది. ఈ క్రమంలో ఆప్ నిజాయితీపై ప్రశ్నించింది. మద్యం కుంభకోణంపై ఇప్పటికే కాగ్ నివేదికను స్పీకర్‌కు పంపించి ఉంటే సభలో చర్చను ప్రారంభించి ఉండాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఈ విషయంపై సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్తి విచారణ జరుపనుంది.ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సర్కార్‌కు కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను కాగ్ తెరపైకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, పాలసీ అమలులో పారదర్శకత లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది. అయితే, కాగ్ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, ఆ నివేదికలోని కొన్ని అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.ఈ నేపథ్యంలో కాగ్ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆప్ సర్కార్‌ను ఆదేశించింది. కానీ, హైకోర్టు ఆదేశాలను ఆప్ సర్కార్ బేఖాతరు చేసింది. ఇప్పటికీ కాగ్ నివేదికను బయటకు ఇవ్వలేదు. దీంతో, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాగ్ నివేదిక లీక్ కావడంతో అధికార ఆప్ పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతున్నారు.Delhi High Court criticised the Delhi Government for its delay in addressing the CAG reports, stating, "The way you have dragged your feet raises doubts about your bona fides." The court further emphasized, "You should have promptly forwarded the reports to the Speaker and… pic.twitter.com/CSSALuCV0G— ANI (@ANI) January 13, 2025 కాగ్ నివేదికలో ఏముంది? లీక్ అయిన కాగ్ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయం లైసెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది.జోనల్ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ.144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది అని ఉండటం గమనార్హం. -
‘కేజ్రీ.. మా వెయ్యి మాకివ్వు’
ఎన్నికల సమయంలో నేతలు చేసే హామీలు ఒక్కోసారి వారి తలకు చుట్టుకుంటాయి. ఇటువంటి సందర్భాల్లో సదరు నేత ఏం చేయాలో తెలియక సతమతం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అలాంటి సమస్యే ఎదురయ్యింది.వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని గురు హరికిషన్ పబ్లిక్ స్కూల్ ముందు వందలాది మంది మహిళలు గుమిగూడి, ఢిల్లీ సర్కారు తమకు ఇస్తామన్న వెయ్యి రూపాయలు తక్షణం ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. వీరిలోని కొందరు మహిళలు తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని 'కేజ్రీవాల్.. మాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తమకు వెయ్యి రూపాయలు ఇస్తామంటూ ఫారాలు నింపారని ఆ మహిళలు తెలిపారు. అసెంబ్లీలో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఈ పథకానికి ‘మహిళా సమ్మాన్ రాశి యోజన’ అని పేరు పెట్టింది. ఈ పధకానికి అర్హులైవారి జాబితాను ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, వివరాలు తెలుసుకుని రూపొందించారు. -
Lok Sabha Election 2024: పంజాబ్‌లో చతుర్ముఖం
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా రాణించని రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. 13 లోక్‌సభ స్థానాల్లో ఎనిమిది కాంగ్రెస్ హస్తగతం కాగా బీజేపీ రెండింటికే పరిమితమైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అద్భుత విజయంతో గద్దెనెక్కింది. దాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ఆశ పడుతోంది. దాంతో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో దిగింది. అకాలీదళ్ దూరమవడంతో బీజేపీ కూడా సొంతంగానే పోటీ చేస్తోంది. దాంతో రాష్ట్రంలో చతుర్ముఖ పోరు నెలకొంది. ఆప్, బీజేపీ పోటీని తట్టుకుని సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు సవాలే... జలంధర్కాంగ్రెస్కే గాక ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ సీఎం చరణ్‌సింగ్ చన్నీకి సైతం ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. 2009, 2014, 2019ల్లో ఇక్కడ కాంగ్రెస్ వరుసగా గెలిచింది. 2023 ఉప ఎన్నికలో ఆప్ నేత సుశీల్‌కుమార్ రింకు నెగ్గారు. ఇప్పుడాయన బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగడం విశేషం! ఆప్ నుంచి పవన్‌కుమార్ టిను, అకాలీదళ్ నుంచి మోహింద్ సింగ్ బరిలో ఉన్నారు. బీఎస్పీ, సీపీఎం, అకాలీదళ్ (అమృత్సర్) కూడా పోటీ చేస్తున్నాయి. జలంధర్‌లో కాంగ్రెస్ ఏకంగా 13సార్లు ఇక్కడ గెలవడం విశేషం!గురుదాస్పూర్ఇక్కడా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే! సిట్టింగ్ ఎంపీ, బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ స్థానంలో దినేశ్ సింగ్ బబ్బుకు బీజేపీ టికెటిచ్చింది. అకాలీదళ్ అండ లేకపోవడం పారీ్టకి ప్రతికూలం. మోదీపైనే బీజేపీ భారం వేసింది. కాంగ్రెస్ నుంచి సుఖ్జిందర్ సింగ్ రాండ్వ, ఆప్ నుంచి అమన్õÙర్ సింగ్ కల్సి, అకాలీదళ్ తరఫున దల్జీత్‌సింగ్ చీమ పోటీలో ఉన్నారు. అకాలీదళ్ (అమృత్సర్) సైతం అభ్యరి్థని పోటీకి పెట్టింది. ఆనంద్‌పూర్ సాహిబ్కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మనీశ్ తివారీ బదులు విజయ్ ఇందర్ సింగ్లా బరిలో ఉన్నారు. ఆప్ నుంచి మాలీ్వందర్ సింగ్, అకాలీదళ్ తరఫున ప్రేమ్‌సింగ్ చందూమజ్రా, బీజేపీ తరఫున సుభాష్ శర్మ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, అకాలీదళ్ (అమృత్సర్) సైతం పోటీలో ఉన్నాయి. ఇక్కడ 2014లో గెలిచిన అకాలీదళ్ నేత ప్రేమ్‌సింగ్ 2019లో ఓటమి పాలయ్యారు.పటియాలామాజీ సీఎం అమరిందర్‌సింగ్ భార్య ప్రణీత్ కౌర్ ఇక్కడ పోటీలో ఉన్నారు. 2019 ఇక్కడ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన ప్రణీత్ ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో దిగడం విశేషం. ఆప్ నుంచి దల్బీర్ సింగ్, అకాలీదళ్ తరఫున నరీందర్ కుమార్ శర్మ, కాంగ్రెస్ నుంచి ధరంవీర్ గాంధీ పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ ప్రణీత్, ధరంవీర్ మధ్యే నెలకొంది. సంప్రదాయంగా కాంగ్రెస్‌కే మద్దతిచ్చే ఇక్కడి ఓటర్లకు నచ్చజెప్పి బీజేపీకి ఓటేయించడం ప్రణీత్, అమరీందర్‌లకు సవాలుగా మారింది. ఆమె ఫిరాయింపుదారు అంటూ రైతులు నిరసన తెలుపుతుండటం తలనొప్పిగా మారింది. అయితే గణనీయంగా ఉన్న హిందూ ఓటర్లపై అమరీందర్ దంపతులు ఆశలు పెట్టుకున్నారు.లుధియానాపంజాబ్లో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం. ఒకప్పుడు కాంగ్రెస్–అకాలీదళ్ మధ్యే పోటీ ఉండేది. 2014, 2019ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ సీఎం బియాంత్‌సింగ్ కుమారుడు రవనీత్ సింగ్ భిట్టు ఈసారి బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగారు! 65.96 శాతం మంది హిందువులుండటం బీజేపీకి అనుకూలిస్తుందని భావిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ బరిలో దిగారు. ఆప్ నుంచి అశోక్ పరాశర్ పప్పీ, అకాలీదళ్ తరఫున రంజిత్‌సింగ్ ధిల్లాన్ బరిలో ఉన్నారు. అకాలీదళ్ (అమృత్సర్)తో పాటు పలువురు స్వతంత్రులూ గట్టి పోటీ ఇస్తున్నారు. అమృత్సర్ ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ గుర్జీత్ సింగ్ అజ్లా, బీజేపీ నుంచి తరణ్‌జిత్ సింగ్ సంధు బరిలో ఉన్నారు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి సంధు ఇటీవలే బీజేపీలో చేరారు. రాష్ట్రంలో 22 శాతం మేర ఉన్న జాట్ సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి. ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. కెపె్టన్ అమరిందర్ సింగ్ చేరిక బీజేపీకి సానుకూలాంశం. ఆప్ నుంచి మంత్రి కులదీప్‌సింగ్ దలైవాల్ రంగంలో ఉన్నారు.పోలింగ్ జరగనున్న లోక్‌సభ స్థానాలు... అమృత్సర్, గురుదాస్‌పూర్, ఖదూర్‌సాహిబ్, హోషియార్పూర్, జలంధర్, ఆనందపూర్ సాహిబ్, లుధియానా, ఫతేగఢ్ సాహిబ్, ఫరీద్కోట్, ఫిరోజ్‌పూర్, భటిండా, సంగ్రూర్, పాటియాలా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు అయంది. తనకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు మనీష్ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అవినీతి కేసులో సీబీఐ 26, ఫిబ్రవరి 2023న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరీంగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం మార్చి 9న ఆయన్ను ఆరెస్ట్ చేసింది. చదవండి: Liquor Policy Case: మనీష్ సిసోడియాకు ఊరట -
హస్తినలో ‘ఆప్’ హవా.. ఢిల్లీ మేయర్‌గా మహిళ!
న్యూఢిల్లీ: హస్తినలో మరోసారి ‘ఆప్’సత్తా చాటింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. దశాబద్దన్నరగా ఎంసీడీలో పాగా వేసిన కమలనాథులకు షాక్ ఇచ్చింది. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 104 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. మూడు చోట్ల ఇతరులు పాగా వేశారు. మహిళా మేయర్! ఢిల్లీ మహా నగర మేయర్ పీఠాన్ని ఈసారి మహిళకు కట్టబెట్టనున్నారు. మహిళను మేయర్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ తరపున పలువురు మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి. ‘ఆప్’లో ఆనందం ఎంసీడీ ఎన్నికల్లో విజయంతో ‘ఆప్’ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రతికూల పార్టీని ఓడించడం ద్వారా ఢిల్లీ ప్రజలు నిజాయితీగా పనిచేసే అరవింద్ కేజ్రీవాల్‌ను గెలిపించారు. మాకు ఇది విజయం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత’ని సిసోడియా ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్) బీజేపీకి తగిన గుణపాఠం ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టారన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి హస్తిన ఓటర్లు తగిన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరంగా మారుస్తామని హామీయిచ్చారు. -
జడేజా గొప్ప ఆల్‌రౌండర్.. కచ్చితంగా ఆ పార్టీలోనే చేరతాడు
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్ అని కితాబిచ్చారు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యంగ్యంగా ఈ కమెంట్ చేశారు. అంతేకాదు క్రికెట్ నుంచి తప్పుకున్నాక జడేజా.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని జోస్యం కూడా చెప్పారు. కచ్చితంగా జరిగేది ఇదే.. ‘నిజంగా ప్రపంచంలోనే గొప్ప ఆల్ రౌండర్! భార్య రివాబా బీజేపీ టిక్కెట్‌పై పోటీకి దిగారు. సోదరి నయనాబా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను రిటైర్మెంట్ తర్వాత రవీంద్ర జడేజా ఆప్‌లో చేరతార’ని కునాల్ కమ్రా ట్వీట్ చేశారు. ట్విటర్లో చురుగ్గా ఉండే కునాల్ తరచుగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. (క్లిక్ చేయండి: జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’) పంత్‌కు పంచ్ ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి వరుసగా విఫలమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ట్విటర్లో తనదైన శైలిలో స్పందించారు కునాల్ కమ్రా. ‘రిషబ్ పంత్.. భారత్ జోడో యాత్రలో చేరి భారతదేశానికి సానుకూలంగా సహకరించాలని నేను అభ్యర్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ గురించి ట్వీట్ చేస్తూ.. ‘ఒక వ్యక్తికి అన్ని క్రెడిట్లు దక్కకూడదని, అది జట్టు సమిష్టి కృషి అని 10 ఏళ్లుగా చెబుతూ వచ్చిన గౌతమ్ గంభీర్.. తర్వాత బీజేపీలో చేరాడ’ని పేర్కొన్నారు. ట్విటర్లో బర్త్ డే విషెస్ చెప్పండి! భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా కునాల్ వదిలిపెట్టలేదు. బీసీసీఐ తీరుపై ట్విటర్ సెటైర్ సంధించారు. ‘ఎవరైనా బీజేపీయేతర రాష్ట్రానికి చెందిన వారైతే, వారు ప్రతి కేంద్ర కేబినెట్ మంత్రికి ట్విటర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. తద్వారా మీ ప్రతిభను బీసీసీఐ స్పష్టంగా చూడగలద’ని ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: వీడియోలు, గేమింగ్, సోషల్‌మీడియా) -
బీజేపీతో ఆప్ ఢీ.. అందుకే సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోరు ఉంటుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి సరైన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అని పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేజ్రీవాల్ అంటే భయంతోనే.. ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ స్కామ్ గురించి ఆలోచించడం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అవుతారని బీజేపీ భయపడుతోంద’ని మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకంగా ఎక్సైజ్ పాలసీ ఉందని, ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. సీబీఐ అరెస్ట్ చేయొచ్చు తనను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముందని సిసోడియా వెల్లడించారు. నిర్బంధాలతో తమ పార్టీ మంచి పనులు చేయకుండా అడ్డుకోలేరని చెప్పారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో ప్రచురించడంతోనే తమపై మోదీ సర్కారు కక్ష సాధిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. అసలు సూత్రధారి అరవింద్: ఠాకూర్ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా నిందితుడు మాత్రమేనని, అసలు సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. డబ్బులు వసూలు చేసి మౌనం దాల్చిన మనీశ్ సిసోడియా తన పేరును ‘మనీ-ష్’గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీకి కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి కాదని కొట్టిపారేశారు. 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు ఢిల్లీలోని సిసోడియా ఇంటితో పాటు, ఏడు రాష్ట్రాల్లోని మరో 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 11 పేజీల నేరాభియోగ పత్రంలో అవినీతి, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపారు. (క్లిక్: కేంద్రం, ఆప్ కుస్తీ) -
కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెంచారు. ఇప్పటికే గుజరాత్లో పర్యటించిన కేజ్రీవాల్.. అక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్లో తన అన్ని రాజకీయ సంస్థలను రద్దు చేసింది. ఇందులో అన్ని సంస్థలు, విభాగాలు, మీడియా బృందం ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహకానికి సంబంధించి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా కొత్త సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇక, గుజరాత్లో గెలుపే లక్ష్యంగా.. ఆప్ కొత్త ప్రణాళికలను రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ఆప్ భావిస్తున్నట్టు సమాచారం. గుజరాత్‌లోని 33 జిల్లాల అధ్యక్షులతో సహా దాదాపు 50 స్థానాల్లో కొత్త నియామకాలను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. వీటిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జి తదితర పదవులు ఉండనున్నాయి. ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్ -
ఎలక్ట్రిక్ సైకిళ్లపై రాష్ట్ర సర్కార్ బంపరాఫర్!
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ సైకిళ్లపై బంపరాఫర్ ప్రకటించింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌ను కంట్రోల్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు దారులకు సబ్సీడీ అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వచ్చే వారమే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..గత ఏప్రిల్ నెలలో అరవింద్ కేజ్రివాల్ ఎలక్ట్రిక్ సైకిళ్లపై సబ్సీడీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఢిల్లీలో నివాసం ఉండే కొనుగోలు దారులకు ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.15వేల వరకు సబ్సీడీ ఇవ్వనుంది. తొలి 10వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు రూ.5,500 వరకు ప్రోత్సాహాకాల్ని (ఇన్సెన్టీవ్స్) అందిస్తుంది. తొలి వెయ్యిలోపు వెహికల్స్‌కు రూ.2వేలు, తొలి 5వేల లోపు ఈ కార్గో సైకిల్ కొనుగోలు దారులకు రూ.15వేల లోపు ప్రోత్సాహాకాల్ని అందించనుంది. ఈకార్గో సైకిల్‌తో ఫుడ్ డెలివరీతో పాటు ఇతర కమర్షియల్ వర్క్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ సైకిల్స్ ఎలా ఉంటాయంటే! ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను తొక్కేందుకు పెడల్ సౌకర్య ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతే పెట్టుకునేందుకు బ్యాటరీలు ఉంటాయి. అంతేకాదు ఈ సైకిల్స్‌తో ఎంటర్ టైన్మెంట్తో పాటు కమ్యూనికేటింగ్ సదుపాయం కూడా ఉంది. -
అమృత్సర్ నుంచి అందుకే పోటీ చేస్తున్నా
అమృత్సర్: ఎన్నికల్లో తాను కేవలం అభ్యర్థి మాత్రమేనని, తన కోసం ఎన్నికల్లో పోరాడుతున్నది అమృత్సర్ ప్రజలేనని చెప్పారు మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్సర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 52 ఏళ్ల కున్వర్.. గతేడాది ముందస్తు పదవీ విరమణ చేసి జూన్ 2021లో అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ‘ఆప్’లో చేరారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన ప్రకటించుకున్నారు. ఫిబ్రవరి 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ దత్తి, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ జోషి, ఇతరులతో కున్వర్ పోరుకు సిద్ధమయ్యారు. పంజాబ్‌లోని మజా ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన కీలక నేతగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన దీమాగా చెబుతున్నారు. తమ పార్టీని గెలిపిస్తే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని హామీయిచ్చారు. అవినీతి, మాదకద్రవ్యాల మహమ్మారి నిర్మూలన, మహిళల భద్రత, ఆరోగ్యం, విద్య, శాంతిభద్రతలను మెరుగుపరుస్తామన్నారు. ఉద్యోగ జీవితంలో ఎక్కువ కాలం అమృత్‌సర్‌లో పనిచేయడంతో కున్వర్‌కు కలిసొచ్చే అంశం. 2000 సంవత్సరం ప్రారంభంలో అమృత్సర్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. 2007, 2009 మధ్య కాలంలో ఇక్కడ సీనియర్ ఎస్పీగా పనిచేశారు. (క్లిక్: వామ్మో.. 94 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ.. ఎవరో తెలుసా?) అమృత్సర్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారని అడగ్గా... ‘రాజకీయాల్లోకి రావాలనే నా నిర్ణయాన్ని అమృత్సర్ ప్రజలు మార్గనిర్దేశం చేసారు. నేను ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకున్నారు. వారు నన్ను ఈ మిషన్‌కు సిద్ధం చేశారు. మొత్తం అమృత్సర్ నా కోసం ఎన్నికల్లో పోరాడుతోంది. నిజాయితీపరులు, నిజాయితీ గల వ్యక్తులు ముందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కున్వర్ జవాబిచ్చారు. పంజాబ్ నుంచి 'మాఫియా రాజ్'ను ఆప్ నిర్మూలిస్తుందని.. డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడానికి తమ పార్టీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యత కల్పించామన్నారు. (చదవండి: భగవంత్ మాన్.. ఆప్ బూస్టర్ షాట్) -
కాంగ్రెస్‌కు షాకిచ్చిన సెహ్వాగ్ సోదరి..
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆమె శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో కీలక నేతల సమక్షంలో ఆమె ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో హిందీ టీచర్‌గా పని చేసిన అంజు.. పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం 2012 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దక్షిణ్‌పురి వార్డ్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఆమె.. తాజాగా ఆ పార్టీకి షాకిచ్చి ఆప్‌లో చేరారు. కాగా, 2012 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన సోదరి(అంజూ) తరఫున ప్రచారం చేశారు. Delhi: Anju Sehwag, sister of former cricketer Virender Sehwag, joins Aam Aadmi Party (AAP) pic.twitter.com/pyypeNGrwe — ANI (@ANI) December 31, 2021 చదవండి: మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లకు కరోనా.. -
ఆప్ కా ఢిల్లీ!
-
‘ఆప్’ ఎమ్మెల్యేకు జైలుశిక్ష
న్యూఢిల్లీ : ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా దాడి చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌దత్‌కు ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ. రెండు లక్షల జరిమానా విధించింది. సోమ్‌దత్ ప్రస్తుతం పాత ఢిల్లీలోని సదర్ బజార్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వారంలోనే మరో ఆప్ ఎమ్మెల్యే జైలుకి వెళ్లడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినందుకు కొండ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్‌కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ నెల జూన్ 29న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్.. సోమ్దత్ను దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు. శిక్షను సవాల్ చేయడానికి సోమ్‌దత్‌కు మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు జనవరి 2015 నాటిది. అప్పటికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సోమ్‌దత్ తనపై దాడి చేసినట్లు సంజీవ్ రానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రానా తెలిపిన వివరాల ప్రకారం.. సోమ్‌దత్ తన అనుచరులు 50-60 మందితో కలిసి తన ఫ్లాట్‌కు వచ్చి పదే పదే బెల్ కొట్టారని ఆరోపించారు. ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించినందుకు తనను బయటకి లాగి బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సునీల్ ఎమ్మెల్యే సోమ్‌దత్ బేస్‌బాల్ బ్యాట్‌తో రానాపై దాడి చేయడం నిజమేనని కోర్టుకు తెలిపాడు. వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టికెట్ దక్కకుండా దెబ్బ తీసేందుకే బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతుందని, అందుకు రానాను పావులా వాడుకున్నారని సోమ్‌దత్ కోర్టుకు వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సోమ్‌దత్ ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో ఆయన జైలు శిక్ష విధించినట్టు ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. -
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట!
-
ఆ 20మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పడ్డ అనర్హత వేటును హైకోర్టు పక్కన పెట్టింది. ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను శుక్రవారం పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ఎన్నికల సంఘం తమ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. కోర్టు తీర్పును ఢిల్లీ ప్రజల విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ఎమ్మెల్యేలు తమ వాదనను వినిపించే అవకాశం గతంలో ఇవ్వలేదు. అందుకే కోర్టు నేడు ఆ ఆప్ ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించింది. ఎన్నికల కమిషన్ ఆప్ ఎమ్మెల్యేల అంశాన్ని మరోసారి పరిశీలించనుందని ఆప్ నేత సౌరబ్ భరద్వాజ్ అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలపై వేటుకు కారణమిదే.. 2015 జవనరిలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా.. బీజేపీని ఢీకొడుతూ కేజ్రీవాల్ పార్టీ ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నిబంధనల ప్రకారం ఏడుగురికి మాత్రమే మంత్రి పదవులిచ్చిన కేజ్రీవాల్, మరో 20 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. 20 ఎమ్మెల్యేలు లాభదాయక పదవులు పొందారాని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ 2017 సెప్టెంబర్ 28న మొదటి సారి, నవంబర్ 2న రెండోసారి కేంద్ర ఎన్నికల సంఘకం ఆప్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈసీ నోటీసులకు బదులివ్వకుండా, ఏకంగా కేసు విచారణనే నిలిపేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. సరిగ్గా ఈ సాంకేతిక అంశమే ఈసీ కఠిన నిర్ణయానికి దోహదపడింది. నోటీసులకు ఓసారి సమాధానం ఇచ్చినా అందుకు ఈసీ సంతృప్తి చెందలేదు. ఆప్ నేతలు ఏకంగా ఈసీని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు రెండు సార్లూ అవకాశాలను వదులుకున్నారు. ముందు మాకు చెప్పాల్సింది చెప్పి, వారు కోరేది అడగొచ్చు. కానీ అలా జరగలేదు. అసలు విచారణే వద్దని వాదించడం సమంజసం కాదు కదా! అంటూ ఈసీ గత జనవరిలో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. ఆ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ ఏకే చావ్లా బెంచ్ ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించిన అనంతరం వారికి ఊరట కల్పిస్తూ తీర్పిచ్చింది. ఆప్ ఎమ్మెల్యేలపై వేటు నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కోర్టు ఆదేశించింది. -
ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
-
కేజ్రీవాల్ బలహీనం అవుతున్నారు: ఆప్‌నేత
చండీగఢ్ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అకాలీదళ్ నేతకు క్షమాపణలు చెప్పడంపై పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ ఖండించింది. ఈ చర్యతో కేజ్రీవాల్ బలహీనుడయ్యాడని ఆ రాష్ట్ర ఆప్ అధికారి ప్రతినిధి సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అకాలీదళ్ నేత బిక్రం సింగ్ మజితియాను కేజ్రీవాల్ క్షమాపణలు కోరాడాన్ని పంజాబ్ ఆప్ శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్ర నేతలను సంప్రదించకుండా కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో ఆయన మరింత బలహీనమయ్యారు. అంతే కాకుండా ఆకాలీదల్ నేతలకు ప్రశ్నలతో ఎదురు దాడి చేసే అవకాశమిచ్చారు. మాకు పంజాబ్ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని’ ఖైరా పేర్కొన్నారు. బిక్రం సింగ్ మజితియాపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వ స్పెషల్ టాస్క్ ఫోర్స్ హైకోర్టుకు పక్కా ఆధారలను సమర్పించిదని, అయినా కేజ్రీవాల్ క్షమాపణలు తెలపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పంజాబ్ ఆప్ పార్టీ చీఫ్, ఎంపీ భగవంత్ మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక డ్రగ్స్ మాఫియాలో అకాళీ దళ్ నేత బిక్రం సింగ్ మజితియా హస్తం ఉందంటూ ఆరోపణలు చేసిన కేజ్రీవాల్, పరువు నష్టం దావా వేయడంతో ఆయనకు క్షమాపణలు తెలుపుతూ లేఖ రాసాడు. దీనిపై పంజాబ్ ఆప్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై ఆప్ ఎమ్మెల్యేల దాడి కేసులో ఆధారాలను సేకరించేందుకు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సీఎం ఇంట్లో సీఎస్‌పై దాడి జరిగినట్లుగా చెబుతున్న గదిలో సీసీటీవీ కెమెరా లేదు. సోదాలకు వస్తున్నట్లు సీఎం ఇంట్లోని సంబంధిత వ్యక్తికి ముందుగానే సమాచారమిచ్చామన్నారు. కేజ్రీవాల్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ కూడా సంకేతాలిచ్చారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించారు.. ఢిల్లీ పోలీసులు కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారారనీ, సీఎం నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి రౌడీల్లా వ్యవహరించారని ఆప్ ఆరోపించింది. సీఎంను అవమానించడానికే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారంది. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదేశం లేకుంటే పోలీసులు అలాంటి దాదాగిరి చేసి ఉండేవారు కాదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేస్తూ ‘పెద్ద పోలీసు బలగాన్ని మా ఇంటికి పంపారు. మరి న్యాయమూర్తి లోయా మృతి కేసులో అమిత్ షాను ఎప్పుడు ప్రశ్నిస్తారు?’ అని అన్నారు. ఆప్ ప్రభుత్వంతో కలసి పనిచేసేలా ఉద్యోగులను ఆదేశించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కేజ్రీవాల్ కోరారు. కాగా, అరెస్టైన ఎమ్మెల్యేల బెయిల్ అభ్యర్థనలను స్థానిక కోర్టు కొట్టివేసింది. కాగా, ప్రజోపయోగ పనులకు అడ్డొచ్చే అధికారులను కొట్టాల్సిందేనని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేశ్ బాల్యన్ వ్యాఖ్యానించారు. -
అలాంటి అధికారులను కొట్టాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై ఆప్ ఎమ్మెల్యేల దాడి వివాదం సమసిపోకముందే ఆప్ ఎంఎల్ఏ నరేష్ బల్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్షు ప్రకాష్ వంటి అధికారులను కొట్టాల్సిందేనని అన్నారు. ఉత్తమ్ నగర్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే బల్యాన్ మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని..అయితే ఇలాంటి అధికారులను కొట్టాల్సిందేనని తానంటానని..సాధారణ పౌరుల పనులను నిలిపివేసే అధికారులకు ఇలా బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. మరోవైపు ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై దాడికి పాల్పడి అరెస్ట్ అయిన ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమనుతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాల్‌లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఎమ్మెల్యేలను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించిన విషయం విదితమే. -
ఆప్ ఎమ్మెల్యేల అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి కేసుకు సంబంధించి ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌ను గతరాత్రి బాగా పొద్దుపోయాక, మరో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను బుధవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేల అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. అరెస్టైన ఎమ్మెల్యేల్లో ఒకరు దళితుడు, మరొకరు ముస్లిం కాబట్టే వారినే బీజేపీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ఆప్ ఎమ్మెల్యేలు సీఎం సమక్షంలోనే తనను కొట్టారని అన్షు ప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తమ పార్టీ ప్రతిష్టను మసకబార్చేందుకే బీజేపీ సీఎస్‌ను అడ్డం పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ పౌర సరఫరాల మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, ఆయన సహాయకుడిపై సచివాలయంలో ఉద్యోగులు దాడిచేయగా ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం విదితమే. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఆధారం ఉన్నా పోలీసులు ఇంకా ఏ చర్యలూ తీసుకోలేదనీ, కానీ సీఎస్ ఆరోపణలకు ఆధారాల్లేకుండానే తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. మరోవైపు సీఎస్ తలపై స్పల్ప గాయాలున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. -
పోలీసుల ముందు లోంగిపొయిన ఆప్ ఎమ్మెల్యేలు
-
‘ఆప్ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన కార్యదర్శిపై దాడికి పాల్పడిన ఆప్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌లు కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం వారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ‘నిధుల ఖర్చుల విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుంది. దానిని సీఎస్ ప్రశ్నించినందుకే ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు’ అని వారు వివరించారు. ఆప్ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని.. రాష్ట్రంలో అధికారులకు రక్షణే లేకుండా పోయిందంటూ వారు ఎల్జీ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యే చెయ్యి చేసుకోవటం విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సీఓం కేజ్రీవాల్ నివాసంలో ఇంటింటికి సేవలు పథకంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎస్ అన్షు ప్రకాశ్, కొందరు ఉన్నతాధికారులు, ఆప్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశం కొనసాగుతుండగా ఒక్కసారిగా వాగ్వాదం మొదలైంది. ఇంతలో ఎమ్మెల్యే అమనాతుల్లా ఆగ్రహంతో ఊగిపోతూ అన్షు చెంప చెల్లుమనిపించారు. ఆపై దుర్భాషలాడుతుండగా.. అధికారులు ఎమ్మెల్యేని అదుపు చేశారు. దాడిలో మరో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇదంతా కేజ్రీవాల్ సమక్షంలోనే చోటు చేసుకోవటం విశేషం. కాగా, అమనాతుల్లా కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. మరోవైపు ఎల్జీని కలిసిన అనంరతం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అసోషియేషన్ ఈ మధ్యాహ్నం భేటీ కానుంది. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే విషయం.. తదుపరి చర్యలపై వారు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే తెలుస్తుంది కాగా, సీఎస్‌పై దాడి జరిగిందన్న వార్తలపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఆయనపై ఎమ్మెల్యేలెవరూ దాడి చేయలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. సమావేశంలో అన్షునే ఎమ్మెల్యేలను దుర్భాషలాడారని.. తాను కేవలం లెఫ్టినెంట్ గవర్నర్‌కు మాత్రమే జవాబుదారీనంటూ సీఎస్ సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయినట్లు ఆ ప్రకటన పేర్కొంది. ఇక బీజేపీ విమర్శలకు ఆప్ స్పందించింది. సీఎస్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిపోయాడని.. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని ఆప్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అన్షు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వల్, సంగమ్ విహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
డివిజన్ బెంచ్‌కు ఆప్ పిటిషన్
న్యూఢిల్లీ: తమపై అనర్హత వేటును రద్దు చేయాలని ఆప్ మాజీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌కు ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఆ మేరకు జస్టిస్ విభు బఖ్రుతో కూడిన ఏకసభ్య ధర్మాసనం పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ముందుంచింది. కేసును విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలా? లేక ఇప్పటికే ఉన్న డివిజన్ బెంచ్‌కు బదిలీ చేయాలా? అన్నది మంగళవారం ప్రధాన న్యాయమూర్తి తేల్చనున్నారు. 20 మంది ఎమ్మెల్యేల అనర్హతతో ఖాళీ అయిన నియోజకవర్గాల్లో ఎన్నికల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు జారీచేయవద్దని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దు..
సాక్షి, న్యూఢిల్లీ: అనర్హతకు గురైన ఆప్ ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఇక ఇక ఆప్ ఎమ్మెల్యేల అనర్హత కేసును హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కాగా పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఢిల్లీ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడంతో ఈ సీట్లకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు ఎన్నికల సంఘం(ఈసీ) సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించగా, ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆప్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలు ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట కలిగించాయనే చెప్పవచ్చు. ఇక మొత్తం 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ బలం 66 నుంచి 44కు పడిపోయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని సర్కారుకు ఢోకా లేదు. -
9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్లమెంటు సెక్రటరీలుగా పనిచేసిన ఆరుగురు ఎమ్మెల్యే లతోపాటు లాభదాయక పదవుల్లో పనిచేస్తున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు గతంలో పార్లమెంటు కార్యదర్శులుగా కొన సాగితే, వారిపై అనర్హత వేటు వేయడాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ఈసీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ‘ఎమ్మె ల్యేలు వినయ్‌భాస్కర్, జలగం వెంక ట్రావు, వి. శ్రీనివాస్‌గౌడ్, వి. సతీశ్ కుమార్, గ్యాదరి కిశోర్ కుమార్, కోవా లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2014 డిసెంబర్ 29న జీఓ ఎంఎస్ 173 జారీ చేసింది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యను హైకోర్టులో సవాల్ చేయగా 2015 మే 1న హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. ప్రభుత్వం నియమించినప్పటి నుంచి కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగా రు’అని రేవంత్‌రెడ్డి ఫిర్యాదులో వివరిం చారు. తెలంగాణ ప్రభుత్వం విధానంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా ఇచ్చి కొత్త పదవుల్లో నియమించిందన్నారు. -
ఎమ్మెల్యేలపై వేటు; నూతన సీఈసీ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : రాజకీయంగా పెనుదుమారం రేపిన ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హత’ వ్యవహారంపై నూతన ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కనీసం మేం చెప్పేది ఆలకించకుండా వేటు వేశార’న్న ఆప్ వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఇచ్చిన రెండు అవకాశాలను వారు(ఆప్) వినియోగించుకోలేదు’’ అని కుండబద్దలుకొట్టారు. మంగళవారం పదవీబాధ్యతలు చేపట్టనున్న రావత్.. సోమవారం పలు జాతీయ వార్తా సంస్థలతో మాట్లాడారు. రెండు ప్లస్ రెండు నాలుగే : సీఈసీ రావత్ చెప్పినట్లు.. అనర్హత అంశంపై వివరణ కోరుతూ ఈసీ.. 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది. 2017 సెప్టెంబర్ 28న మొదటి, నవంబర్2న రెండోసారి నోటీసులు జారీ అయ్యాయి. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసీ నోటీసులకు బదులివ్వకుండా, ఏకంగా కేసు విచారణనే నిలిపేయాలని కోరింది. సరిగ్గా ఈ సాంకేతిక అంశమే ఈసీ కఠిననిర్ణయానికి దోహదపడింది. ‘‘నోటీసులకు సమాధానం చెప్పకుండా వాళ్లు(ఆప్).. మమ్మల్ని(ఈసీని) నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు రెండు సార్లూ అవకాశాలను వదులుకున్నారు. ముందు మాకు చెప్పాల్సింది చెప్పి, వారు కోరేది అడగొచ్చు. కానీ అలా జరగలేదు. రెండుకు రెండు తోడైతే నాలుగే అవుతుంది కదా! అసలు విచారణే వద్దని వాదించడం సమంజసం కాదు కదా!’ అని సీఈసీ రావత్ వ్యాఖ్యానించారు. అసలేం జరిగింది? బ్రీఫ్‌గా.. : 2015 జనవరిలో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆప్.. నిబంధనల ప్రకారం ఏడుగురికి మాత్రమే మంత్రి పదవులిచ్చి, మరో 20 మంది ఎమ్మెల్యేలను మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. అయితే, ఆ నియామకాలు చెల్లబాటుకావంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో.. ఆరు నెలలు తిరగముందే ఆ 20 మంది అదనపు పదవులు ఊడిపోయాయి. ‘పార్లమెంటరీ కార్యదర్శులను తొలగించరాదం’టూ ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సైతం రాష్ట్రపతి కొట్టివేశారు. కాగా, కొంతకాలమే అయినా వారు లాభదాయక పదవులు నిర్వహించారు కాబట్టి ఆ 20 మందిని అనర్హులుగా ప్రకటించాలని యువన్యాయవాది ప్రశాంత్ పటేల్.. నాటి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం రాష్ట్రపతి ఆ ఫిర్యాదును ఈసీకి పంపారు. నాటి సీఈసీ నదీం జైదీ నేతృత్వంలో పూర్తి ప్యానెల్(జైదీతోపాటు ఈసీలు ఏకే జోతి, ప్రకాశ్ రావత్) ఆప్ ఎమ్మెల్యేల కేసును విచారించింది. అయితే, ప్రకాశ్ రావత్ బీజేపీ మనిషని, ఆయన పక్షపాతంతోనే వ్యవహరిస్తారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. విమర్శల నేపథ్యంలో రావత్.. విచారణ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. జైదీ పదవీ విరమణ తర్వాత జోతి సీఈసీ కావడంతో రెండో స్థానంలో ఉన్న రావత్ మళ్లీ తప్పనిసరిగా కేసు విచారణలో పాల్గొనాల్సివచ్చింది. చివరికి జోతి పదవీవిరమణకు రెండు రోజుల ముందు.. ఈసీ విచారణను ముగించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ రాష్ట్రపతికి సూచించింది. అలా అనర్హులైన 20 మంది.. సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నారు. జోతి వారసుడిగా రావత్ సీఈసీ పదవిని చేపడతారు. ఆనయ నేతృత్వంలోనే ఖాళీ అయిన ఆ 20 స్థానాలకు 6నెలల్లోపు ఉప ఎన్నికలు జరుగుతాయి. -
ఆప్ సరే.. ఆ బీజేపీ ఎమ్మెల్యేల సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ : లాభదాయక పదవులతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఛత్తీస్‌గఢ్‌లోని 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల వ్యవహారం తెరపైకి వచ్చింది. వారి పై కూడా వేటు వేయాల్సిందేనన్న డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోంది. ‘‘ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలు సబబు అయినప్పుడు ఇక్కడ(ఛత్తీస్గడ్) బీజేపీ ఎమ్మెల్యేలపై కూడా వేటు పడాల్సిందే. కానీ, రెండేళ్లుగా ఈ వ్యవహారంపై ఎటూ తేల్చకుండా నానుస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్ కూడా భాగస్వామి కావటం దారుణం’’అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మహ్మద్ అక్బర్ సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. గతంలో రమణ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై వేటు వేయాలని కాంగ్రెస్ నేత అక్బర్ 2016లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సమాధానమిచ్చిన ఈసీ.. ఒకవేళ గవర్నర్ సిఫార్సు చేస్తే ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. దీంతో ఆయన గవర్నర్ బలరామ్‌జీ దాస్ టండన్‌కు కూడా ఓ లేఖ రాశారు. గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో గతేడాది ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో అక్బర్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. తక్షణమే పార్లమెంటరీ కార్యదర్శుల అధికారాలను ఉపసంహరించుకోవాలని రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగా ఆ ఆదేశాలను అమలు చెయ్యటంతో ప్రస్తుతం వారంతా మంత్రుల మాదిరిగానే లాభాలను(కారు, బంగ్లా, తదితరాలు) అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యేలపై వేటు పడటంతో.. బీజేపీ ఎమ్మెల్యేల సంగతిని కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది. ప్రభుత్వం కూలిపోతుందనే... ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 49 మంది, కాంగ్రెస్ పార్టీకి 39 మంది, బీఎస్పీ ఒకరు, స్వతంత్ర్య అభ్యర్థి ఒకరు ఉన్నారు. ఒకవేళ ఆ 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఆ భయంతోనే బీజేపీ గవర్నర్‌తో కలిసి రాజకీయాలు నడుపుతోందని అక్బర్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గవర్నర్ జోక్యం చేసుకోవాలని.. అలాకానీ పక్షంలో రాష్ట్రపతిని కలిసి జోక్యం చేసుకోవాలని కోరతామని అక్బర్ చెబుతున్నారు. -
సమరానికి సమయం!
పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఢిల్లీ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడంతో ఈ సీట్లకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు ఎన్నికల సంఘం(ఈసీ) సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించారు. మొత్తం 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ బలం 66 నుంచి 44కు పడిపోయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని సర్కారుకు ఢోకా లేదు. అయితే మధ్యంతరంగా వస్తున్న ఈ ఎన్నికల్లో అన్ని పక్షాలూ తమకు ఉన్న ప్రజాదరణను పరీక్షించుకునేందుకు అవకాశం లభిస్తోంది. ఎన్నికల్లోపార్లమెంటరీ సెక్రెటరీల నియామకం ఎప్పటి నుంచి మొదలైంది? ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం1953 నుంచి జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ పదవుల్లో శాసనసభ్యులు కొనసాగుతున్నారు. అయితే, 2014 నుంచి తెలంగాణ, పశ్చిమబెంగాల్, పంజాబ్, హరియాణాలో జరిగిన ఈ నియామకాలు హైకోర్టుల తీర్పుల ఫలితంగా రద్దయ్యాయి. 2004లో ఇలాంటి నియామకాలను అనుమతించే అస్సాం చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిజోరం, మేఘాలయ, మణిపూర్‌లో పదవుల్లో ఉన్న పార్లమెంటరీ సెక్రెటరీలు రాజీనామా చేశారు. 2014లో తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు సర్కారు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించిన ఆరుగురు శాసనసభ్యుల నియమకాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే, ఏ సందర్భంలోనూ ఈ పదవులు చేపట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు ప్రయత్నాలు జరగలేదు. అనర్హత వేటుకు ఆస్కారమిచ్చే లాభదాయక పదవి అంటే? సభ్యత్వం పోవడానికి దారితీసే లాభదాయక పదవి(ఆఫీస్ ఆప్ ప్రాఫిట్) అంటే రాజ్యాంగంలోగాని, ప్రజాప్రాతినిధ్యచట్టం(1951)లోగాని నిర్వచించలేదు. ఉన్నత న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా లాభదాయకపదవులను నిర్ధారిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనం ఉంటే దాన్ని ఇలాంటి పదవిగా పరిగణిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సవరించిన 164 (1ఏ) అధికరణ కారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో సభ్యులు ఆయా దిగువసభల సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదు. కేంద్రపాలితప్రాంతమైన ఢిల్లీలో మంత్రులు పదిశాతం దాటకూడదు. అదీగాక చీఫ్, పార్లమెంటరీ కార్యదర్శులు ఒక వేళ ప్రభుత్వం అందించే జీతాలు, సౌకర్యాలు పొందకపోయినాగాని ఇప్పుడు వారిని సహాయ మంత్రులుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఆప్ ఎమ్మెల్యేలు ఈ పదవుల్లో ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అయితే, వారిని ఎన్నికల కమిషన్ మంత్రులుగా పరిగణించి వారిపై అనర్హత వేటు ప్రక్రియ ప్రారంభించి ఆదివారం పూర్తిచేసింది. ఢిల్లీ మంత్రులు అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో పది శాతం లోపే ఉన్నప్పటికీ అదనంగా నియమించిన 20 మంది పార్లమెంటరీ కార్యదర్శులను సహాయ మంత్రులుగా లెక్కించారు. ఫలితంగా వారు ఈసీ చర్యతో సభ్యత్వం కోల్పోయారు. ఈ పరిణామాలు రెండు ప్రధాన రాజకీయపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు పాలకపక్షం ఆప్‌కు రాజధానిలో ప్రజల మద్దతు ఎంతుందో ఉప ఎన్నికలు తేలుస్తాయనడంలో సందేహం లేదు. హరియాణాలోనూ నలుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు పిటిషన్! గతంలో చీఫ్ పార్లమెంటరీ సెక్రెటరీలుగా హరియాణా ప్రభుత్వం నియమించిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకాలను కిందటేడాది హైకోర్టు రద్దచేసింది. రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి అనుమతించే ప్రత్యేక చట్టం ఉన్నందున ఎమ్మెల్యేలపై చర్యకు ఆస్కారం లేదని, దిల్లీ, హరియాణా పరిస్థితులకు పొంతన లేదని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అభిప్రాయపడ్డారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆ ఆప్ ఎమ్మెల్యేలు అనర్హులే
న్యూఢిల్లీ: లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు ఢిల్లీ అసెంబ్లీలోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఆదివారం కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్లో రాష్ట్రపతి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో కొనసాగారంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ.. 20 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు. రాష్ట్రపతి నిర్ణయంపై ఆప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగవిరుద్ధమని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి నిర్ణయం బాధ కలిగించిందని.. తుది నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రపతి తమను సంప్రదించి ఉండాల్సిందని వేటుపడిన ఎమ్మెల్యే అల్కాలాంబా తెలిపారు. అందుకే దేవుడు 67 సీట్లిచ్చాడు ‘మూడేళ్ల తర్వాత 20 మంది అనర్హులవుతారని దేవుడికి ముందే తెలుసు అందుకే 67 సీట్ల భారీ మెజారిటీ కట్టబెట్టాడు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేంద్రం కుట్ర పన్నిందని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. -
మరో సంక్షోభంలో ఆప్
వివాదాలూ, ఘర్షణలు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త కాదు. కానీ ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం రూపంలో వచ్చిన సంక్షోభం వాటన్నిటినీ మించిపోయింది. ఆయన ప్రభుత్వం పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సు తోనే షాక్ తిన్న ఆయన ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభిం చకపోవడం మరో షాక్. 70మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో 65మంది బలం ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఈ చర్యవల్ల వెనువెంటనే ఏర్పడగల ముప్పేమీ లేకపోవచ్చు. కానీ ఎన్నికల సంఘం సిఫార్సును రాష్ట్రపతి ఆమోదిస్తే, దాన్ని న్యాయస్థానాలు సబ బేనని తేల్చి చెబితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఆ ఇరవైచోట్లా మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహిస్తే, అందులో మెజారిటీ సీట్లు తిరిగి సాధించలేకపోతే ఏమైనా జర గొచ్చు. ఆ సంగతలా ఉంచి ఎన్నికల సంఘం సిఫార్సులోని సహేతుకతపై కూడా విమర్శలు రాక తప్పదు. ఆప్ ప్రభుత్వం 2015 మార్చి 13న చేసిన ఈ నియామకా లను ఆ మరుసటి సంవత్సరం సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు చెల్లుబాటు కావంటూ కొట్టేసింది. కోర్టు కొట్టేశాక ఇక ఫిర్యాదు స్వీకరించడమేమిటని ఆప్ అభ్యంతరపె ట్టినా ఎన్నికల సంఘం ఖాతరు చేయలేదు. ఆ కొన్నాళ్లపాటూ ‘లాభదాయక పద వుల్లో’ ఉన్నారు గనుక విచారణ జరుపుతామని చెప్పింది. వాస్తవానికి ‘లాభదాయక పదవులు’ అనే మాటను ఏ చట్టమూ నిర్వచించడం లేదు. అయితే చట్టసభల సభ్యుల అనర్హతను నిరోధించే చట్టం ఉంది. అందులో అన ర్హత పరిధిలోనికి రాని ప్రభుత్వ పదవులేమిటన్న వివరాలు మాత్రమే ఉన్నాయి. రాజ్యాంగంలోని 102వ అధికరణ పార్లమెంటు సభ్యుల అనర్హత గురించీ, 191వ అధికరణ అసెంబ్లీ సభ్యుల అనర్హత గురించీ మాట్లాడుతున్నాయి. 103(2) అధికరణ ప్రకారం చట్టసభల సభ్యులపై అనర్హత వేటు విషయంలో తుది నిర్ణయం రాష్ట్రపతిదే. అయితే ఆయన ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని దాని ఆధా రంగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆ అధికరణ నిర్దేశిస్తోంది. 1982లో అన్నా డీఎంకే ఎంపీ ఆర్. మోహనరంగంను అప్పటి ఎంజీఆర్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించినప్పుడు ఆయన రాజ్యసభ సభ్యత్వం పోయింది. ప్రముఖ నటి జయాబచ్చన్ రాజ్యసభ సభ్యురాలిగా ఉంటూ ఉత్తరప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్‌పర్సన్‌గా వ్యవహరించడం చెల్లదని 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆ నిర్ణయం సబబేనని 2006లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2006లో సోనియాగాంధీ జాతీయ సలహా మండలి చైర్‌పర్సన్‌గా వ్యవహరించడంపై అభ్యంతరాలొచ్చినప్పుడు ఆమె అటు మండలి పద వికి, ఇటు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. నిర్దిష్టమైన చట్టం లేదు గనుక... ఏది లాభదాయక పదవి, ఏది కాదు అని నిర్వ చించడానికి సర్వోన్నత న్యాయస్థానం వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులే ఆధారం. ప్రభుత్వం నుంచి జీతం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు పొందితేనే ‘లాభదాయక పదవి’గా పరిగణించాలన్నది ఆ తీర్పుల సారాంశం. మొత్తానికి న్యాయస్థానాల నుంచి సమస్యలెదురవుతున్నా, ఎదురవుతాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేస్తూనే ఉన్నాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులు ఆశించేవారు ఎక్కువ కావడం, రాజ్యాంగం అందుకు పరిమితి విధించడంతో ఎటూ పాలుబోని ప్రభు త్వాలు పార్లమెంటరీ సెక్రటరీ పదవులివ్వడాన్ని పరిష్కారంగా భావిస్తున్నాయి. వాటిపై విమర్శలు వెల్లువెత్తి, ఫిర్యాదులు వెళ్లి ఎన్నికల సంఘం కదలడానికి... న్యాయస్థానాల్లో ఎవరైనా సవాలు చేసినా దానిపై తీర్పు వెలువడటానికి సమయం పడుతుంది గనుక ఈ పదవుల పందేరాన్ని ఆపనవసరం లేదని ప్రభుత్వాలు భావి స్తున్నాయి. రాజ్యాంగంలోని 164(1ఏ) అధికరణ ప్రకారం మొత్తం అసెంబ్లీ సంఖ్యా బలంలో 15 శాతానికి మించి మంత్రి పదవులు ఇవ్వడానికి వీల్లేదు. ఢిల్లీ అసెంబ్లీ విషయానికొచ్చేసరికి ఇది 10 శాతం మాత్రమే. 2015లో తెలంగాణకు, పశ్చిమ బెంగాల్‌కు పార్లమెంటరీ సెక్రటరీ పదవుల నియామకాల విషయంలో న్యాయ స్థానాల్లో చుక్కెదురైంది. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యేల విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు పాలించే రాష్ట్రాల్లో కూడా అక్కడి ప్రభుత్వాలు సైతం ఇలాంటి నియామకాలు చేశాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్లతోసహా 11 రాష్ట్రాల్లో పార్లమెంటరీ సెక్ర టరీలున్నారు. ఈ విషయంలో వివిధ న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అస్సాం తీసుకొచ్చిన చట్టాన్ని నిరుడు అక్టోబర్‌లో సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పటికి ఆ రాష్ట్రంతోపాటు ఈశాన్యంలోని మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో మొత్తం 93మంది పార్లమెంటరీ సెక్రటరీలున్నారు. ఆ తీర్పుతో వారందరి పదవులూ ఊడాయి. ఢిల్లీకి సంబంధించినంతవరకూ 1997నాటి ఎమ్మెల్యేల అనర్హత నిరోధక చట్టంలో మినహాయింపు పొందిన పదవుల జాబితాలో పార్లమెంటరీ సెక్రటరీ పదవి లేదు. అలా లేనంతమాత్రాన ఆ పదవి ‘అనర్హత’కు దారితీయదని ఆప్ వాదిస్తోంది. తాము పార్లమెంటరీ సెక్రటరీకి ఎలాంటి జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు కల్పించ లేదంటున్నది. పనిలో పనిగా నిరుడు ఎందుకైనా మంచిదని 1997నాటి అనర్హత నిరోధక చట్టానికి సవరణలు తెస్తూ బిల్లు తీసుకొచ్చింది. అయితే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ దాన్ని తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆప్ ఎన్నికల సంఘానికి ఉద్దేశాలు ఆపాదిస్తోంది. అది పెనువేగంతో ఈ కేసును తేల్చిన తీరును ప్రశ్నిస్తోంది. వేరే పార్టీల ప్రభుత్వాలున్నచోట ఇలాగే వ్యవహరించారా అంటున్నది. ఇవన్నీ అడ గాల్సిన ప్రశ్నలే. కానీ విలువలతో కూడిన పాలన అందిస్తానని, ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని చెప్పిన ఆప్ కూడా సగటు రాజకీయ పక్షాల దారిలో అసంతృప్త ఎమ్మె ల్యేలను బుజ్జగించడానికి దొడ్డిదోవన పదవుల పందేరానికి ఎందుకు దిగినట్టు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
కేజ్రివాల్ పరువుతీసిన వ్యవహారం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పాలకపక్షానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్ శుక్రవారం రాష్ట్రపతికి సిఫార్సు చేయడం వల్ల ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏమైనా ఉందా? ఎన్నికల కమిషన్ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించే అవకాశం పూర్తిగా ఉన్నందున ఆ 20 మంది శాసనసభ్యులు శాసన సభలో తమ సభ్యత్వాన్ని కోల్పోవడం దాదాపు ఖాయం. అదే జరిగితే 70 సీట్లు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ బలం ప్రస్తుతమున్న 67 నుంచి 47 సభ్యులకు పడిపోతుంది. ప్రభుత్వం మనుగడకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36 కనుక, కేజ్రివాల్ ప్రభుత్వానికి వచ్చే ముప్పు ప్రస్తుతానికి ఏమీ లేదు. మరో పదిమంది ఆప్ ఎమ్మెల్యేలు పలు అవినీతి, ఇతర కేసులను ఎదుర్కొంటున్నందున వారి శాసన సభ్యత్వం కూడా రద్దవుతుందని, పర్వవసానంగా కేజ్రివాల్ ప్రభుత్వం పడిపోతుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకప్పుడు ఆశించింది. అయితే కేసులను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సభ్యత్వం ఇంతవరకు రద్దు కాలేదు. సమీప భవిష్యత్తులో అయ్యే అవకాశమూ లేదు. ఒకవేళ అవుతుందనుకున్నట్లయితే పార్టీ బలం 37కు పడిపోతుంది. అప్పటికీ ఆప్‌కు మెజారిటీ ఉంటుంది. ఈలోగా, 20 మంది శాసన సభ్యుల సభ్యత్వం రద్దయితే ఆ స్థానాలకు మళ్లీ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో ఆప్ మొత్తం కాకపోయినా కనీసం సగం సీట్లనైనా గెలుచుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కేజ్రివాల్ పరువు పోయిందని చెప్పవచ్చు. రాష్ట్ర అసెంబ్లీలో 70 సీట్లు మాత్రమే ఉండడం వల్ల అందులో పది శాతానికి మించి, అంటే ఏడుగురికి మించి మంత్రి పదవులు ఇవ్వరాదు. ముందుగా ఏడుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. పదవుల కోసం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలవడంతో 21 మంది శాసన సభ్యులను పార్లమెంటరీ కార్యదర్శులుగా మే నెలలో నియమించారు. వారికి జీత భత్యాలు పెంచక పోయినా ప్రభుత్వ భవనాలు, వాహనాలు కేటాయించారు. 1997లో కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఒకరు ఆర్థిక ప్రయోజనాలు కలిగిన ‘జోడు పదవుల్లో’ కొనసాగరాదు. ఈ కారణంగానే అప్పట్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆప్ పార్టీపై ధ్వజమెత్తాయి. జీత భత్యాలు పెంచనందున పార్లమెంటరీ కార్యదర్శులుగా ఎమ్మెల్యేలను నియమించడం జోడు పదవుల కిందకు రాదని అరవింద్ కేజ్రివాల్ వాదించారు. ప్రభుత్వ బంగళాలు, వాహనాల సౌకర్యాలను కల్పించడం కూడా ఆర్థిక లబ్ధి కిందకే వస్తాయని ప్రతిపక్షాలు వాదించాయి. దాంతో ఎందుకైనా మంచిదని కేజ్రివాల్ ‘డిల్లీ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్) చట్టం–1997 నుంచి ఈ కార్యదర్శి పదవులకు మనహాయింపు కలిగిస్తూ 2015, జూన్ నెలలో ఓ సవరణ బిల్లును తీసుకొచ్చారు. దాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపించగా, రాష్ట్రపతి ఆ బిల్లును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో 21 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రశాంత్ పటేల్ అనే న్యాయవాది రాష్ట్రపతి ముందు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఆధారంగానే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. వారిలో జర్నేల్ సింగ్ అనే ఎమ్మెల్యే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రం నుంచి పోటీ చేసేందుకు తన ఢిల్లీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 20 మంది ఎమ్మెల్యేలపైనే ఎన్నికల కమిషన్ ముందు విచారణ జరిగింది. ప్రభుత్వం అదనంగా కల్పించిన సౌకర్యాలను వదులుకున్నామని, తమపై అనర్హత వేటు వేయవద్దని 20 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషన్ ముందు వాదించారు. అక్కడ లాభం లేదనుకున్న వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా వారికి ఆశాభంగమే కలిగింది. -
మోదీపై ట్వీట్.. తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ వ్యవహారం.. ముస్లిం వివాహ చట్ట సవరణ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. ఆప్ ఎమ్మెల్యే ఒకరు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్క లంబ.. మోదీ వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘అసలు ట్రిపుల్ తలాక్ చెప్పటం ఎందుకు? జైలుకు వెళ్లటం ఎందుకు? హాయిగా భార్యను వదిలేసి వెళ్తే ఏకంగా దేశానికే ప్రధాని అయిపోవచ్చు కదా!’’ అంటూ ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రధాని స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. Why say "Talaq Talaq Talaq" and go to jail , when you can just leave her without saying anything and become the Prime Minister of India.#TripleTalaq — Alka Lamba (@LambaAlka) December 29, 2017 -
సౌదీలో మరో మహిళకు నరకం..
సౌదీ అరేబియాలో భారతీయ మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. పొట్టకూటి కోసం వెళ్లిన వారిని నరకయాతన చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే గుర్బక్ష్ కౌర్‌ను సౌదీ అరాచకుల చేతుల్లోంచి కాపాడి, భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత మరో పంజాబి మహిళ కూడా ఇవే కష్టాలు పడుతున్నానంటూ తన గోడును వెల్లుబుచ్చుకుంది. వాట్సాప్ ద్వారా తన బాధలను భారత్‌కు చేరవేసింది. సౌదీలో నరకం చూస్తున్నానంటూ... కేంద్ర ప్రభుత్వం తనను రక్షించాలంటూ అభ్యర్థించింది. శుక్రవారం ఈమె మూడు వాట్సాప్ వీడియోలను పంపింది. కేంద్రం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్ తనను రక్షించాలంటూ వేడుకుంది. తాను చాలా దుర్భర జీవితం అనుభవిస్తున్నానని, తన యజమాని గత నాలుగు నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్టు ఆరోపించింది. మూడు వీడియోల్లో తాను అనుభవిస్తున్న నరకాన్ని చెబుతూ కన్నీరుమున్నీరైంది. ''నా జీవితం నరకంలో ఉన్నట్టు ఉంది. అర్థరాత్రి రెండు గంటలకు ముందు వరకు నేను పడుకోవడానికి వీలులేదు. గొడ్డు చాకిరి చేయాల్సి వస్తోంది. భగవత్ మాన్జీ నన్ను కాపాడండి ప్లీజ్. లేదా నేను ఇక్కడ చచ్చిపోవాల్సి వస్తుంది. నన్ను నా యజమాని హింసిస్తున్నాడు'' అని పేర్కొంది. ఉచిత నివాసం, నెల నెల వేతనం ఇస్తామంటూ నాలుగు నెలల క్రితం తన భార్యను న్యూఢిల్లీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ సౌదీ పంపించాడంటూ బాధితురాలి భర్త చెప్పాడు. గత మూడు నెలలుగా తన భార్య ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. తన భార్యను ట్రాప్ చేశారని గోడును వెల్లబుచ్చుకున్నాడు. -
సౌదీలో నరకం అనుభవిస్తున్నా.. కాపాడండి!
సాక్షి, న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. తన యజమాని తనను శారీరకంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నారని, తనను చంపేసే అవకాశముందని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని దవాద్మీ పట్టణంలో తాను పనిచేస్తున్నానని, నిరుపేద కుటుంబానికి చెందిన తాను ఉపాధి కోసం ఏడాది కిందట సౌదీకి వచ్చానని ఆమె వీడియోలో తెలిపారు. ఈ నరకకూపం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 'భగవంత్ మాన్ సాబ్ దయచేసి నాకు సాయం చేయండి. నేను ఇక్కడ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా. ఎంతో వేదనలో ఉన్నా. గత ఏడాదిగా నన్ను హింసిస్తున్నారు. మీరు హోషియార్పూర్ యువతిని కాపాడారు. నన్ను కూడా కాపాడండి. నేను మీ కూతురు లాంటి దానిని. నన్ను కాపాడండి. నేను ఇక్కడ బంధీ అయ్యాను. నాకు ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ కన్నీళ్లు రాలుస్తూ దీనంగా ఆమె వీడియోలో విజ్ఞప్తి చేసింది. సౌదీ పోలీసులు కూడా తనకు సాయం చేయడం లేదని పేర్కొంది. తన యజమాని తనను ఓ గదిలో బంధించి శారీరకంగా హింసిస్తున్నాడని, కొన్నిరోజులుగా తనకు ఆహారం కూడా ఇవ్వడం లేదని ఆమె తన దీనగాథను వివరించింది. సాయం కోసం పోలీసుల వద్దకు వెళితే.. వాళ్లు తనను తన్ని.. మళ్లీ ఆ ఇంట్లోకి తరిమేశారని తెలిపింది. 20-22 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఆమె తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని, తన తల్లి బాగా లేదని, ఆమెను వెంటనే చూసేందుకు తాను స్వదేశం వచ్చేలా సాయం చేయాలని వేడుకుంది. పంజాబీలు ఎవరూ సౌదీ అరేబియాకు రావొద్దని, ఇక్కడి వారు పెద్ద మూర్ఖులని ఆమె పేర్కొంది. ఆమె దీన వీడియోపై ఎంపీ భగవంత్ మాన్ ఇంకా స్పందించలేదు. -
ఈసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : లాభదాయక పదవులు కలిగిఉన్నారంటూ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగిస్తున్న ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆప్ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై బదులివ్వాలని జస్టిస్ ఇందర్మీత్ కౌర్ ఈసీని కోరారు. తమ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని, అవి చెల్లుబాటు కావని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున ఈ అంశంపై ఈసీ విచారణ కొనసాగించడం అవసరం లేదని ఆప్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈసీ ఉత్తర్వులు అన్యాయమని, పక్షపాతపూరితమని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే లాభదాయక పదవులపై ఈసీ తదుపరి విచారణ తేదీని ప్రకటించకపోవడంతో ఈ దశలో ఈసీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు స్టే కోరలేరని హైకోర్టు తెలిపింది. విచారణ తేదీని ఈసీ ప్రకటించిన పక్షంలో అప్పుడు దాన్ని నిలుపుదల చేసేందుకు పిటిషనర్లు అప్పీల్ చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. గతంలో జూన్ 23న ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఈనెల 4న ఢిల్లీ హైకోర్టు ఇవే ఉత్తర్వులు ఇచ్చింది. -
‘కేజ్రీవాల్ రూ.27లక్షల అద్దెకట్టి వెంటనే ఖాళీ చేయ్’
న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టమొచ్చిపడింది. ప్రభుత్వ భవనాన్ని అక్రమంగా అక్రమించుకొని అందులో పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే రూ.27లక్షలు అద్దె చెల్లించాలంటూ స్థానిక ప్రభుత్వ సంస్థ నోటీసులు పంపించింది. ఈ అద్దె అసలు లైసెన్స్ ఫీజుకంటే 65 రెట్లు అదనం అని కూడా తెలిపింది. ఈ అద్దె చెల్లించడం ఆలస్యం అయితే ప్రతి నెలా మరింత ఎక్కువవుతుందని కూడా స్పష్టం చేసింది. ఉత్తర ఢిల్లీలోని రోజ్ అవెన్యూలో ఆమ్ ఆద్మీ పార్టీ తన పార్టీ కార్యాలయం నడుతోంది. అయితే, ఈ భవనం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ది. ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందించకుండానే చట్ట విరుద్ధంగా ఆ భవనాన్ని ఆక్రమించుకోవడంతోపాటు అద్దె కూడా చెల్లించడం లేదని పీడబ్ల్యూడీ అధికారులు రూ.27,73,802 అద్దె చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. గత ఏప్రిల్‌లోనే ప్రభుత్వ సంస్థ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు పంపించింది. పార్టీ కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని అందులో ఆదేశించింది. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ భవనాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. -
ఆ ఎమ్మెల్యే.. భార్యను కొట్టి వేధించేవారు!
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ ప్రభుత్వ మాజీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి తరచు తన భార్యను వేధిస్తూ, కొట్టేవాడని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. గృహహింస కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆయన భార్య లిపికా మిత్రా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ ఐఎస్ మెహతాకు పోలీసులు పైవిధంగా చెప్పారు. ఎమ్మెల్యే అయిన తన భర్తకు బెయిల్ ఇచ్చేముందు దిగువ కోర్టు తగిన విధంగా వ్యవహరించలేదని లిపికా మిత్రా కోర్టుకు విన్నవించారు. కోర్టు సూచనల మేరకు పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. లిపికా మిత్రా శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కుక్క కాట్లు, కాలిన గాయాల వల్లేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే సోమ్‌నాథ్ భారతి తన భార్యను వేధించి, కొట్టి, తిట్టేవాడని, ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా ఏమాత్రం ఊరుకోలేదని.. అలాగే కొనసాగించారని తెలిపారు. గర్భవతిగా ఉన్న సమయంలో లిపికా మిత్రా మధుమేహం, హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు స్పష్టం చేశాయన్నారు. అయితే తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలను సోమ్‌నాథ్ భారతి ఖండించారు. -
పాపం కేజ్రీవాల్.. ముప్పేట దాడి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తిరుగుబాబు, అసంతృప్త నేతలు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ముప్పేట దాడికి దిగారు. కేజ్రీవాల్ లంచాలు తీసుకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికే మాజీ మంత్రి కపిల్ మిశ్రా.. కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేయగా తాజాగా ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే ఆసిమ్ అహ్మద్ ఖాన్ కూడా ఆయన బాటలో చేరారు. కేజ్రీవాల్, ఆయన అనుచరులు తనను రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని వెల్లడించారు. పార్టీని ప్రైవేటు కంపెనీలా మార్చేశారని ధ్వజమెత్తారు. పార్టీ అవినీతికి కపిల్ మిశ్రాను బలిపశువు చేశారని వాపోయారు. కేజ్రీవాల్‌ను వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేబుల్ నెట్‌వర్క్‌ను కొనేందుకు రూ. 25 కోట్లు సమీకరించాలనుకున్నారు. రూ. 5 కోట్లు ఇమ్మని నన్ను అడిగారు. మరో నలుగురు ఎమ్మెల్యేలను రూ. 5 కోట్లు చొప్పున ఇవ్వాలని కోరారు. ఈ డబ్బులు వసూలు చేసేలా మాపై ఒత్తిడి చేసేందుకు కేజ్రీవాల్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. డబ్బుల కోసం మాపై బెదిరింపులకు దిగారు. నన్ను పార్టీ నుంచి గెంటేసినా డబ్బు ఇవ్వనని వారికి చెప్పాను. దీంతో నాపై అసత్య ఆరోపణలు చేసి పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ఇప్పుడు కేజ్రీవాల్, సత్యేంద్రజైన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఎందుకు వారిపై చర్య తీసుకోలేద’ని ఆసిమ్ ఖాన్ ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఆప్ పంజాబ్ కన్వీనర్ గురుప్రీత్ గుగ్గీ కోరారు. కేజ్రీవాల్‌పై తనకు విశ్వాసముందన్నారు. -
వివాదంలో మరో ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చారనే కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమ్ దత్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది. ఈ కేసులో అక్టోబరు 13వ తేదీలోపు కోర్టు ఎదుట హాజరుకావాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్రా.. సోమ్ దత్‌ను ఆదేశించారు. 2015లో సాదర్ బజార్ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున సోమ్ దత్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దత్ తల్లిదండ్రులు ఆయనపై ఆధారపడి జీవిస్తున్నారని, అఫిడవిట్లో ఈ విషయాన్ని దాచారని, అలాగే ఆస్తుల వివరాలను పూర్తిగా ప్రకటించలేదని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీలో అధికార ఆప్ ఎమ్మెల్యేలు 12 మందిపై పలు కేసులు నమోదయ్యాయి. నకిలీ డిగ్రీ పొందారనే ఆరోపణలపై న్యాయ శాఖ మాజీ మంత్రి జితేందర్ తోమర్ అరెస్ట్ కాగా, మరో మాజీ మంత్రి సోమనాథ్ భారతి గృహహింస కేసును ఎదుర్కొంటున్నారు. ఇక ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై హత్య, అత్యాచారం కేసు నమోదైంది. -
నన్ను టార్గెట్ చేశారు: బీజేపీ మహిళా నేత
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు చేశారని బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మి ఆరోపించారు. ఇటీవల సైబర్ సెల్ అధికారులను కలసి ఫిర్యాదు చేసిన షాజియా.. ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. త్వరలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ మద్దతుదారులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 'నాపై అభ్యంతకర పోస్టింగ్‌లు ఎవరు చేశారన్నది తెలుసుకోవాలనుంది. నాకు సానుభూతి అవసరం లేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలి' అని షాజియా చెప్పారు. -
‘ఆప్‌ను అంతం చేయాలనే ప్రయత్నం’
-
‘ఆప్‌ను అంతం చేయాలని చూస్తోంది’
న్యూఢిల్లీ: ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నా తమ పార్టీ కార్యాలయం కేటాయింపును రద్దు చేశారన్నారు. కాంగ్రెస్‌కు ఐదు ఆఫీసులు, ఒక ప్లాటు ఉన్నాయని, అలాగే బీజేపీకి ఏడు కార్యాలయాలు, ఒక ప్లాటు ఉందని కేజ్రీవాల్ అన్నారు. అదే ఆప్‌కు ఇచ్చిన ఒకే ఒక్క ఆఫీసును రద్దు చేశారని మండిపడ్డారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, కార్యాలయం కోసం అడుక్కోమని, ఢిల్లీ వీధుల్లో కూర్చుని అయినా పని చేస్తామని ఆయన అన్నారు. కాగా ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని సాధ్యమైనంత త్వరగా ఖాళీచేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్ కేజ్రీవాల్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. తమ ఆఫీస్ ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం అన్యాయమన్న కేజ్రీవాల్, ఆప్‌కు కార్యాలయం కలిగి ఉండటానికి హక్కు ఉందన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేదని, అలాంటి ఆ పార్టీకి ఇక్కడ అయిదు కార్యాలయాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అయితే 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో 67 స్థానాలు గెలుచుకున్న పార్టీకి కార్యాలయం లేకపోవడం దారుణమన్నారు. ఆప్ చేసిన దారుణమేంటని, తమ పాలనకు ప్రతిరోజు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ తలాతోకలేని చర్యలే అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈనెల 24న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటారని ఆయన హెచ్చరించారు. -
గెలవకపోతే నేతలను కొనడమే బెటర్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలవని చోట గెలిచిన వాళ్లను కొనుక్కోవడమే ఉత్తమమైన మార్గంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భావిస్తున్నట్లుంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఈ సూత్రం అక్షరాల ఫలించడంతో ఇప్పుడు ఢిల్లీలోని ఆప్ పార్టీపై కన్నేసింది. అందులో భాగంగానే వారం రోజుల క్రితం ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్‌ను పార్టీలో చేర్చుకొంది. మరి కొంత మంది ఆప్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే బేరసారాలు నడుస్తున్నాయని ఇరు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఓ పద్ధతిగా పావులు కదుపుతోందని, ఈ విషయంలో తొందరపడితే ఆప్కే లాభం జరిగే ప్రమాదం కూడా ఉంటుందికనుక ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బీజేపీ నాయకుడొకరు తెలిపారు. ఆప్‌ను బలహీనం చేయడం ద్వారా ప్రస్తుతం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడంతోపాటు వచ్చే జనవరి నెలలో ఢిల్లీ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లలో ఒక్కటైన దక్కించుకోవాలన్నది అమిత్ షా వ్యూహంగా తెలుస్తోంది. పార్లమెంటరీ సెక్రటరీగా నియమితులైన 21 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని కూడా బీజేపీ ఆశిస్తోంది. జోడు పదవుల ద్వారా లబ్ధి పొందుతున్నారన్న కారణంగా ఈ అంశంపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపింది. ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్న విశ్వాసం కూడా బీజేపీలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి చెందిన జనార్దన్ ద్వివేది, కరణ్ సింగ్, పర్వేజ్ హాష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే జనవరి నెలల్లో వీరి సీట్లు ఖాళీ అవుతాయి. ప్రస్తుతం ఆప్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల మూడు సీట్లు ఆప్కే దక్కాల్సి ఉంది. ఈ లోగా ఆప్‌ను అన్ని విధాల బలహీనపరిచి అన్ని విధాల లబ్ధి పొందాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. -
కేజ్రీవాల్ ఫోనుకు.. నో రిప్లై!
మరికొద్ది వారాల్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఇంతకుముందు రెండేళ్ల క్రితం.. అంటే 2015 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 67 స్థానాలు గెలుచుకుని రికార్డు సృష్టించింది. అప్పటినుంచి ప్రధానమంత్రి మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒంటికాలిపై లేస్తున్నారు. తన తర్వాతి టార్గెట్ ఢిల్లీ కార్పొరేషనే అని చెప్పేశారు కూడా. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేజ్రీవాల్‌కు అనుకోని విధంగా గట్టి షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీలోంచి ఒక ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్ కొట్టారు. ఆ.. ఏముంది, ఉన్న 67 మందిలో ఒక్కరు పోతే ఏమవుతుందని ధీమాగా కూర్చోడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. వేద్ప్రకాష్ అనే ఎమ్మెల్యే పార్టీ మారొచ్చన్న విషయం ముందుగానే కేజ్రీవాల్‌కు ఉప్పు అందింది. దాంతో ఆయన కంగారు పడి వెంటనే అతగాడికి ఫోన్ చేశారు. కానీ ఎన్నిసార్లయినా ఫోన్ రింగవుతుంది గానీ, అవతలి నుంచి 'మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం స్పందించుట లేదు' అనే రికార్డెడ్ మెసేజ్ తప్ప ఆన్సర్ చేసిన పాపాన పోలేదు. కాసేపటి తర్వాత.. ఆ ఎమ్మెల్యే బీజేపీలో చేరినట్లుగా ట్విట్టర్లో వార్తలు వచ్చేశాయి. కేజ్రీవాల్ తల పట్టుకున్నారు. ఇది ఒక్క ఎమ్మెల్యేతోనే ఆగుతుందా.. ఈ వరద ఇంకా కొనసాగుతుందా అన్న భయమే అందుకు కారణమని తెలుస్తోంది. 272 మంది కార్పొరేటర్లను ఎన్నుకోడానికి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్ బీజేపీ చేతిలో ఉంది. పంజాబ్‌లో అధికారం చేపడతామని ఊహించి, దాన్ని కాంగ్రెస్ పార్టీకి సమర్పించుకున్న ఆప్.. ఎన్నికలలో ఏక్ దిన్ కా సుల్తాన్ అనిపించుకోకుండా ఉండాలంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి. కానీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆప్ నిలబెట్టుకోలేదని, పార్టీ నాయకత్వంతో సుమారు 35 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని చెబుతూ... ఎమ్మెల్యే వేద్ప్రకాష్ చిన్న ఝలక్ ఇచ్చారు. మొత్తం 36 మంది ఆప్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారంటే, ఇక కేజ్రీవాల్‌కు మిగిలేది 31 మంది మాత్రమే అవుతారు. అప్పుడు ప్రభుత్వం కూడా మైనారిటీలో పడిపోతుంది. కావాలనుకుంటే అనర్హత వేటు పడకుండా ఉండేందుకు మొత్తం 36 మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు కూడా బీజేపీ సిద్ధపడే అవకాశం లేకపోలేదు. వేద్ప్రకాష్ ఇచ్చిన షాక్‌తో అంతకుముందు తాము నిర్వహించాలనుకున్న ప్రెస్‌మీట్‌ను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రద్దు చేసుకుంది. ఇక కార్పొరేషన్ ఎన్నికలు జరిగేలోపు పరిణామాలు ఎలా మారిపోతాయో చూడాల్సి ఉంది. -
ఆప్‌కు గట్టి ఝలక్.. బీజేపీలోకి జంప్!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు అనూహ్యంగా బీజేపీలోకి జంప్ అయి షాక్ ఇచ్చారు. భావన నియోజకవర్గం ఎమ్మెల్యే వేదప్రకాశ్ సతీశ్ సోమవారం ఆప్‌కు రాజీనామా చేసి.. కమలం గూటికి చేరారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ విఫలమైందని, ఆ పార్టీలో కొనసాగడం తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు కటించారు. ఎమ్మెల్యే పదవికి, ఇతర ప్రభుత్వ పదవులకు కూడా రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. కీలకమైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేను తనవైపు తిప్పుకోవడం బీజేపీ రాజకీయంగా పైచేయి సాధించినట్టు అయింది. సోమవారం ఢిల్లీ బీజేపీ చీప్ మనోజ్ తీవారి సమక్షంలో వేదప్రకాశ్ కమలం కండువా కప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఝలక్ ఇవ్వాలని బీజేపీ ఇప్పటినుంచి పావులు కదుపుతోంది. -
ఆ సీఎంకు మరో ఎదురుదెబ్బ
-
సీఎంను, మమ్మల్ని చంపేస్తానన్నాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వివేశ్ శర్మ అనే న్యాయవాది హెచ్చరించాడని ఆప్ ప్రతినిధి రాఘవ్ చద్దా ఆరోపించారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్‌ను, తనను, మరో నలుగురు ఆప్ నేతలను హతమారుస్తానని వివేక్ బెదిరించాడంటూ చద్దా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై విచారణ చేయాలని శనివారం పటియాల కోర్టు ఆదేశించింది. వివేక్ ఇదే కోర్టులో ప్రాక్టీస్ లాయర్‌గా పనిచేస్తున్నారు. -
ఆ సీఎంకు మరో ఎదురుదెబ్బ
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. గతంలో డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్రం ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ పరిధిలోని పాటియాలా హౌస్ కోర్టు సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వ్యవహారంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీపై తీవ్ర ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ సహా ఐదుగురు ఆప్ నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేజ్రీవాల్ సహా కుమార్ విశ్వాస్, ఆశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దీపక్ బాజ్‌పేయి నేతలపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. శనివారం ఈ కేసును విచారించిన పాటియాలా హౌస్ కోర్టు తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ను, నలుగురు ఆప్ నేతలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. డీడీసీఏ కుంభకోణం వ్యవహారంపై అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం గతంలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ సహా మరికొందరు ఆప్ నేతలు బహిరంగ క్షమాపణ కోరాలని బీజేపీ సూచించినా వారు పట్టించుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ నివేదికలోనూ అరుణ్ జైట్లీ పేరులేకపోవడంతో కేసు మరింట జఠిలమైంది. కేజ్రీవాల్ కష్టాలు రెట్టింపయ్యాయి. జైట్లీపై కేసులను వెనక్కి తీసుకుని, విచారణను ఆపేయాలని.. క్షమాపణ చెప్పాలన్న జైట్లీ, బీజేపీ డిమాండ్లపై కేజ్రీవాల్ వెనక్కి తగ్గలేదు. అరుణ్ జైట్లీ డీడీసీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడు చాలా అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానం ఆధునీకరణ పనులలో భాగంగా నిధుల దుర్వినియోగం జరిగిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేయడంతో పాటు త్రిసభ్య కమిషన్‌తో విచారణ చేయించి కేంద్రం చేతిలో భంగపాటుకు గురయ్యారు. -
మంత్రిగారి ఆస్తులు ఎటాచ్!
ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస్తులను ఆదాయపన్ను శాఖ అధికారులు ఎటాచ్ చేశారు. దేశ రాజధానిలో ఆయనకు ఉన్న దాదాపు 40 ఎకరాల బూమితో పాటు పలు కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య వార్ మరింత ముదిరింది. భూమి రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ. 17 కోట్లు, షేర్ల విలువ రూ. 16 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువేనంటున్నారు. ఇండో మెటల్ఇంపెక్స్, అకించన్ డెవలపర్స్, ప్రయాస్ ఇన్ఫోసొల్యూషన్స్, మంగల్యతన్ ప్రాజెక్ట్స్ కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. ఈ కంపెనీలకు సత్యేంద్ర జైన్ నగదు రూపంలో చెల్లింపులు చేసి, షేర్ల కొనుగోలుకు అక్రమంగా బుక్ ఎంట్రీలు చేయించుకుంటున్నారని పన్ను అధికారులు ఆరోపించారు. ఇండోమెటల్ఇంపెక్స్కు చెందిన మరికొంత భూమిని కూడా ఎటాచ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతులైన మంత్రులలో సత్యేంద్ర జైన్ ఒకరు. ఆయనకు ఆరోగ్యం, రవాణా, పీడబ్ల్యుడీ లాంటి కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ చర్యలపై సత్యేంద్ర జైన్‌ను మీడియా ప్రశ్నించగా, ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రాథమికంగా 90 రోజుల పాటు ఈ ఎటాచ్మెంట్ ఉంటుంది. బినామీ లావాదేవీలతో సంపాదించిన సొమ్ముతోనే ఈ ఆస్తులన్నింటినీ సేకరించారని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఆదాయాన్ని దాచిపెట్టినందుకు మంత్రిపై ప్రత్యేకంగా దర్యాప్తు జరుగుతోంది. కోల్‌కతాకు చెందిన బడా ఆపరేటర్లు జీవేంద్ర మిశ్రా, అభిషేక్ చొఖానీ, రాజేంద్ర బన్సల్ తదితరులతో సత్యేంద్ర జైన్‌కు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. వీళ్లు నగదు తీసుకుని కేవలం కాగితాల మీదే ఉన్న కంపెనీల షేర్లను ఎక్కువ ధరలకు ఇస్తారు. ఆ షేర్ల రూపంలో వాళ్ల డబ్బంతా తెల్లధనం అయిపోతుంది. -
రాజ్యాంగ ధర్మాసనానికి ‘అధికారాల వివాదం’
సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రం, ఆప్ సర్కార్ వాదనలు అక్కడే వినిపించాలన్న జడ్జీలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదు కనుక లెప్టినెంట్ గవర్నర్ చేతిలోనే పాలనాధికారం ఉంటుందని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ అధికార అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ కేసుల్లో చట్టం, రాజ్యాంగానికి సంబంధించిన అనేక కీలకాంశాలుండటంతో దీన్ని రాజ్యాంగ ధర్మాసనమే పరిష్కరించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె. సిక్రీ, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్, ఐదుగురు న్యాయమూర్తులతో ఈ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తమ వాదనలను ఈ ధర్మాసనం ఎదుట వినిపించాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేసు సత్వర పరిష్కారం కోసం ధర్మాసనాన్ని త్వరగా ఏర్పాటు చేయవలసిందిగా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తిని కోరవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. అయితే రాజ్యాంగ ధర్మాసనం ఏయే అంశాలపై విచారణ జరపాలన్నది న్యాయమూర్తులు నిర్ధారించలేదు. ఢిల్లీ ప్రభుత్వ విభాగాలపై అధికారం ఎవరి చేతిలో ఉండాలన్న విషయమై ఆప్ సర్కారు, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ల మధ్య గట్టి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. -
మేమొస్తే ఆస్తి పన్ను రద్దు.. పెన్షన్ రూ.2,500
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో బరిలోకి దిగిన మరో పార్టీ ఆప్ (ఆమ్ఆద్మీపార్టీ) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. శిరోమణి అకాళీదల్ మాదిరిగా కాకుండా కాస్తంత అమలయ్యే హామీలనే దాదాపు ఇచ్చాంది. అన్నిరంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ దీనిని శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో పలు ఆకర్షణీయ అంశాలు ప్రకటించింది. వాటిని ఒకసారి పరిశీలిస్తే... యువత కోసం.. 25లక్షల ఉద్యోగాల కల్పన ఫారిన్ ఎంప్లాయిమెంట్ యూత్ బోర్డు ద్వారా విదేశాల్లో జాబులు ఆశీంచేవారికి ప్రత్యేక శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాల సృష్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఫైనాన్స్, ఇండస్ట్రీ మెంటర్స్, మార్కెట్ సెక్టార్ లో అవకాశాలు కల్పించేలా పది నగరాల్లో పంజాబ్ లాంచ్ ప్యాడ్స్ ఆరోగ్యం ప్రభుత్వేతర ఆస్పత్రుల్లో రూపాయి చెల్లించకుండా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం డ్రగ్ బాధితులకు ఆరు నెలల్లో పునరావాసం ప్రతి గ్రామంలో, చిన్న టౌన్స్ లో ఉచిత రోగ నిర్థారణ పరీక్షలు, ఉచిత మందులు ప్రొబేషన్ సమయంలో డాక్టర్లందరికీ, నర్సులకు, పారామెడికల్ స్టాఫ్‌కు పూర్తి స్థాయి వేతనాలు శాంతిభద్రతలు డ్రగ్ వ్యాపారంలో భాగస్వాములై ఉన్న రాజకీయ నాయకులను జైలుకు పంపడం.. ఆస్తులు జప్తు రాష్ట్రాన్ని అవినీతి రహితం చేసేందుకు యాంటీ కరప్షన్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌కు స్వతంత్ర ప్రతిపత్తితోకూడిన అధికారాలు మతపరంపేరిట జరిగిన వివక్ష, దాడులకు సంబంధించి ప్రభుత్వం విచారణ చేసి నేరస్తులకు శిక్ష పౌర సేవలు ఆస్తి పన్ను రద్దు గృహాలకోసం వినియోగించే విద్యుత్ 400 యూనిట్లకు పొడిగించడం అన్ని జిల్లాలు, సబ్ డివిజన్లలో ఆమ్ ఆద్మీ క్యాంటీన్లలో రూ.5కే భోజనం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువుల పెన్షన్ రూ.500 నుంచి రూ.2500 విద్య కొత్తగా మూడు మెడికల్ కాలేజీల స్థాపన. ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు ప్రస్తుతం ఉన్న కాలేజీలను అప్ గ్రేడ్ చేయడంతోపాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణ 147 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నైపుణ్య సెంటర్ల ఏర్పాటు రైతులకోసం 2018 డిసెంబర్ నాటికి రైతులకు అప్పుల నుంచి విముక్తి ఇతరాలు.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెలకే పంజాబ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎర్రబుగ్గ కార్లను ఉపయోగించరాదు -
ఆప్ ర్యాలీలో అంబులెన్స్ చిక్కుకుని...
ప్రజాపోరాటం నుంచి పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకేమైతే మాకేంటి అన్నతీరుగా వ్యవహరిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం గిల్ రోడ్డులో ఆప్-ఎల్ఐపీ నిర్వహించిన ర్యాలీ వల్ల ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని అంబులెన్స్‌లో ఓ మహిళ మృతిచెందింది. కొత్త సిమ్లపురి ప్రాంతానికి చెందిన అవతార్ కౌర్ అనే ఆ మహిళ తక్కువ బ్లడ్ షుగర్, నీళ్ల విరేచనాలతో బాధపడుతోంది. ఆమెను గిల్ రోడ్డులోని గ్రేవాల్ ఆసుపత్రిలో చేర్పించగా.. మహిళ పరిస్థితి క్షీణించడంతో అక్కడి డాక్టర్లు మోడల్ టౌన్లో క్రిష్ణా ఆసుపత్రిని సంప్రదించాలని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిని మహిళను ఆ ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లో బయలుదేరారు. కానీ గిల్ రోడ్డులో ఆప్ నిర్వహిస్తున్న ర్యాలీ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్‌లో వారి అంబులెన్స్ చిక్కుకుపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ భేటీలో పాల్గొన్నారు. 20-25 నిమిషాల పాటు ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌లో తమ అంబులెన్స్ చిక్కుకుని పోయిందని ఆమె కొడుకు దేవేందర్ సింగ్ ఆరోపించారు. అంబులెన్స్‌ను ముందుకు కదిలేలా సహకరించాలని పలుమార్లు ప్రాధేయపడినట్టు, ఎవరూ సహకరించలేకపోయారని కన్నీరుమున్నీరయ్యారు. అంబులెన్స్‌లో తన తల్లి మరణించినట్టు చెప్పారు. రాజకీయ పార్టీ వల్ల తన తల్లి మరణించిందని ఆరోపించారు. ఆమె చనిపోయిన తర్వాత ఆగ్రహానికి లోనైన కుటుంబసభ్యులు వెంటనే రోడ్డుపై నిరసనకు దిగినట్టు ఏడీసీపీ ధృవ దాహియా చెప్పారు. అయితే వారు ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదును దాఖలు చేయలేదన్నారు. కొద్దిసేపు నిరసన చేసిన అనంతరం వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్‌లో అంబులెన్స్‌లో ఇరక్కపోవడం వల్లనే మహిళ మరణించినట్టు గ్రేవాల్ ఆసుపత్రి కూడా ధృవీకరించింది. -
ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ చిక్కులు
ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ చిక్కుల్లో పడింది. దేశ రాజధానిలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలోగల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఆప్ ఎమ్మెల్యే నరేష్ బల్యన్ కొట్టారంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో కార్యకర్తగా పనిచేసిన హెన్రీ జార్జి మోహన్ గార్డెన్ ప్రాంతంలో ఉంటారు. బల్యన్, అతడి అనుచరులు బలవంతంగా తన కార్యాలయంలోకి ప్రవేశించి తనపై దాడి చేయడమే కాక.. ప్రాణం తీస్తామంటూ బెదిరించారని కూడా జార్జి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఉత్తమ్‌నగర్ ఎమ్మెల్యే అయిన నరేష్ బల్యన్ మీద ఎఫ్ఐఆర్ దాఖలుచేసి, కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే జార్జి మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు ఒక కేసు పెట్టారు. అతడు తన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బల్యన్ మీద, తమమీద దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో దానిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఇప్పటివరకు ఈ రెండు కేసుల్లోనూ ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు మాత్రం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆప్ ఆరోగ్య మంత్రికి ఐటీ చిక్కులు
న్యూఢిల్లీ : ఇప్పటికే పలు కుంభకోణాల్లో ఇరుక్కొని ఆప్ మంత్రులు ఆపసోపాలు పడుతుండగా.. తాజాగా మరో ఆప్ మంత్రికి సస్పెన్షన్ చిక్కు ఎదురుకాబోతుంది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న సత్యేంద్ర జైన్‌కు ఐటీ శాఖ సమన్లు జారీచేసింది. కోల్‌కత్తాకు చెదిన సంస్థల పన్ను ఎగవేత కేసుల్లో సత్యేంద్ర జైన్‌కు సంబంధం ఉందనే ఆరోపణలపై ఆయనను అక్టోబర్ 4న తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా ఐటీ శాఖ ఆదేశించింది. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, గత నాలుగేళ్ల కాలంలో జరిపిన ఆదాయపు పన్ను రిటర్న్స్ వివరాలతో తమ ముందు హజరుకావాలని పేర్కొంది. పన్ను ఎగవేత, అక్రమ ఆర్థిక ఉపశమనాల కేసు ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే కోల్‌కత్తాలోని ఓ మూడు సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడి జరిపింది. ఆ రైడ్స్‌లో జైన్‌కు సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీల రికార్డులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఆ కంపెనీలతో జైన్‌కు సంబంధం ఉన్నట్టు తెలుస్తుండటంతో, నిజంగా వాటితో జైన్‌కు సంబంధం ఉందా లేదా అనేది తేల్చడంపై ఐటీ శాఖ రంగంలోకి దిగింది. ఈ విచారణ నిమిత్తం ఐటీ శాఖ జైన్‌కు సమన్లు జారీచేసింది. అయితే దీనిపై స్పందించిన జైన్, తనను కేవలం సాక్షిగా మాత్రమే రావాలని ఐటీ శాఖ సమన్లను జారీచేసిందని, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అక్టోబర్ 4న ఐటీ శాఖ ముందు హాజరుకాబోతున్నట్టు తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టానని, కానీ 2013 నుంచి ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సత్యేంద్ర జైన్‌ను వెనక్కేసుకొచ్చారు. సత్యేంద్ర ఎలాంటి తప్పులెరుగరని చెప్పారు. ఒకవేళ సత్యేంద్ర తప్పుచేసినట్టు తేలితే, మంత్రి పదవినుంచి బయటికి పంపించడానికి కూడా వెనక్కాడని మరోవైపు హెచ్చరికలు కూడా చేశారు. -
సోమ్ నాథ్ భారతికి బెయిల్..!
న్యూఢిల్లీః ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతికి బెయిల్ మంజూరయ్యింది. ఎయిమ్స్ ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారని, భద్రతా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో అరెస్టయిన కొద్ది గంటల్లోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఢిల్లీలోని ఎయిమ్స్ వద్ద భద్రతా సిబ్బందితో గొడవపడ్డారంటూ సోమ్ నాథ్ పై హౌజ్ ఖాన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సోమనాథ్ ఇంటికి వెళ్ళి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల మొదట్లో సోమ్ నాథ్ సహా ఆయన అనుచరులు ఎయిమ్స్ వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆందోళన సమయంలో ఆస్పత్రిలోని పలు వస్తువులు, ఫర్చిచర్ ధ్వసం కూడా చేశారు. అయితే గురువారం ఉదయం సెక్యూరిటీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారంటూ సోమ్ నాథ్ కు వ్యతిరేకంగా నమోదు చేసిన సెక్షన్ 353ని కోర్టు తోసి పుచ్చింది. పబ్లిక్ సర్వెంట్లపై దురుసుగా ప్రవర్తించారన్న నేపథ్యంలో నమోదైన కేసులో.. ఎయిమ్స్ సెక్యూరిటీ గార్డులు పబ్లిక్ సర్వెంట్ లు కాదని తేల్చి చెప్పింది. -
ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు గురువారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనతో సంబంధం పెట్టుకోవాలని ఎమ్మెల్యే ఒత్తిడికి గురి చేస్తున్నాడంటూ ఆయన బావమరిది భార్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో ఖాన్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఎమ్మెల్యేకు ఒక్కరోజు పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఎమ్మెల్యే తరఫు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కాగా తనపై ఆరోపణలతో ఎమ్మెల్యే అమానతుల్లా ఆదివారం జమియా నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఆయనను తమ దర్యాప్తు ప్రకారమే అరెస్టు చేస్తామని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. -
లైంగిక వేధింపులు.. మరో ఎమ్మెల్యే అరెస్టు!
న్యూఢిల్లీ: ఢిల్లీని పరిపాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఒఖ్లా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఖాన్ పై ఆయన మరదలు జామియా నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, శారరీక సంబంధం పెట్టుకోమని ఆయన తనను బలవంత పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. సాకేత్ కోర్టులో ఆమె వాంగ్మూలం కూడా ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అమానతుల్లా ఖాన్ ను అరెస్టు చేశారు. ఈ కేసు నేపథ్యంలో అమానతుల్లా ఖాన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ఇప్పటికే ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ మహిళలతో రాసలీలలు జరుపుతున్న అశ్లీల వీడియో సీడీ వెలుగుచూడటంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
నన్ను అరెస్టు చేయండి.. అబ్బే ఇప్పుడే కాదు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్టు చేయమంటే.. పోలీసులు మాత్రం ఇప్పుడే కాదంటూ ఆయన్ను తిప్పి పంపేశారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారని, చివరకు లిఫ్టులో కూడా వదల్లేదని ఆయన బావమరిది భార్యే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనను తాము ఇప్పుడే అరెస్టు చేయబోమని, ముందుగా తమ దర్యాప్తు పూర్తి కావాల్సి ఉందని.. ఆ తర్వాతే ఎలాంటి చర్యలైనా ఉంటాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తనను అరెస్టు చేయాలంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉందని, అయితే.. అరెస్టు చేయొద్దంటూ ప్రజల నుంచి కూడా ఒత్తిడి రావడం వల్లే ఇప్పుడు వాళ్లు అరెస్టు చేయలేదని ఎమ్మెల్యే ఖాన్ చెప్పారు. ఆయన ఆరోపణలను సీనియర్ పోలీసు అధికారులు ఖండించారు. భారీ ఎత్తున మద్దతుదారులను తీసుకుని జామియా నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే.. తనను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. అయితే తనపై పెట్టినది తప్పుడు కేసు కావడం వల్లే ప్రజల ఒత్తిడి ఎక్కువగా ఉందని.. అందుకే అరెస్టుచేయలేదని ఆయన అన్నారు. -
‘ఆప్’ నేతలపై గంభీర్ గరం గరం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులపై టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకోకుండా ఆప్ నాయకులు విదేశీ పర్యటనలకు వెళ్లడంపై మండిపడ్డాడు. డెంగీ, చికెన్ గున్యా బారిన పడి బాధితులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి పాలవుతుంటే నాయకులు విదేశీ యాత్రలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. దేశరాజధానిలో ఒక్కోసారి నీట సమస్య తలెత్తుతుందని, ఇప్పుడు దోమలు కారణంగా చికెన్ గన్యా వ్యాపించిందని ట్వీట్ చేశాడు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పాలకులు విదేశాలకు వెళ్లారని చురక అంటించాడు. జ్వరాలతో ప్రజలు చనిపోతూవుంటే విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు స్టడీ టూర్ కు రాజకీయ నేతలు విదేశాలకు వెళ్లారని వాపోయాడు. ‘పాఠశాలలు వేచివుంటాయి. మరణం వేచివుండదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. రాజకీయాలు కట్టిపెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని గంభీర్ హితవు పలికాడు. డెంగీ, చికెన్ గున్యా కారణంగా ఢిల్లీలో 10 మంది మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. Sometimes my Delhi doesn't get enuf water. Wen it does it breeds mosquitoes dat bring Chikun Gunia! Sadly not enuf 2 get r leaders bak home. — Gautam Gambhir (@GautamGambhir) 17 September 2016 Hospitals bursting at seams, ppl dying but politicians r on a study tour to improve delhi's education system. Schools can wait, death won't. — Gautam Gambhir (@GautamGambhir) 17 September 2016 How about stoping d political footbal & returning 2 d basics of governanc which I guess is 2 serve people. Hope d politicians remember dat! — Gautam Gambhir (@GautamGambhir) 17 September 2016 -
'నన్ను కోర్టు అరెస్టు చేస్తారు'
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ తనను ఆదివారం కోర్టు అరెస్టు చేయనున్నట్లు చెప్పారు. మహిళను వేధించిన కేసులో అమనతుల్లా విచారణలో భాగంగా కోర్టుకు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఓఖ్లా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అమనతుల్లా తనను అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. తప్పుడు కేసులో తనను అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో జరుతున్న పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో తనను అరెస్టు చేయొద్దని పోలీసులను కోరినట్లు చెప్పారు. అందుకు సమాధానంగా తమపై ఒత్తిడి ఉందని అరెస్టు చేయక తప్పదని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. ఆదివారం జమీయా నగర్ పోలీసు స్టేషన్లో తనను కోర్టు అరెస్టు చేస్తారని అమనతుల్లా ఖాన్ పేర్కొన్నారు. ఢిల్లీ సీనియర్ పోలీసులు అధికారులు అమనతుల్లా వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఆయనపై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని చెప్పారు. -
ఆ ఎమ్మెల్యే.. లిఫ్టులోనూ వదల్లేదు!
ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎంత వెనకేసుకుని వస్తున్నా.. ఆయన మీద కేసు పీటముడి మాత్రం రోజురోజుకూ మరింత బిగుసుకుంటోంది. గడిచిన ఏడాదిన్నరలో తనమీద కనీసం ఐదుసార్లు ఆయన లైంగిక దాడి చేశాడని ఎమ్మెల్యే బావమరిది భార్య కోర్టులో వెల్లడించారు. చివరకు ఒకసారి లిఫ్టులో కూడా తనపై అఘాయిత్యం చేశాడని ఆమె తెలిపారు. తన భర్త సమక్షంలో కూడా పలుమార్లు తనవద్దకు వచ్చాడని, దీనిపై తన భర్తకు ఫిర్యాదుచేస్తే.. ఎమ్మెల్యే తనకు వ్యాపారంలో సాయం చేస్తున్నారు కాబట్టి ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవాలన్నాడని కోర్టుకు ఒక ప్రకటన ద్వారా చెప్పారు. తనకు, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు మధ్య జరిగిన సంభాషణల రికార్డింగుతో కూడిన ఒక సీడీ, పెన్‌డ్రైవ్‌ను కూడా ఆమె పోలీసులకు ఇచ్చారు. తాను గడిచిన నాలుగు నెలలుగా భర్తతో గొడవల వల్ల ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నట్లు చెప్పారు. తాను ఇప్పటికే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశానని, కూతురిని చదివించుకోడానికి ఒక బొటిక్ నడిపించుకుంటున్నానని అన్నారు. గత శుక్రవారం రాత్రి నుంచి ఎమ్మెల్యే మనుషులు తనను బెదిరిస్తున్నారని, అందువల్ల పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో పాటు ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌పై 354ఎ (లైంగిక వేధింపు), 506 (నేరపూరితంగా బెదిరించడం), 509 (మహిళ మర్యాదను కించపరిచే చేష్టలు, మాటలు), 120బి (నేరపూరిత కుట్ర), 498ఎ (భర్త లేదా అతడి బంధువులు మహిళపట్ల క్రూరంగా వ్యవహరించడం) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు మాత్రం తమ ఎమ్మెల్యే చాలా మంచివాడని, నిర్దోషి అని అంటున్నారు. అతడు పార్టీ పదవులకు చేసిన రాజీనామాలను తిరస్కరించడమే కాక.. అతడికి అండగా నిలుస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పుడు కోర్టులో ఆమె వాంగ్మూలం తర్వాత ఏమంటారో చూడాలి. -
ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై మరో కేసు
ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై ఆదివారం మరో కేసు నమోదయింది. ఈ నెల 9న ఢిల్లీ ఆల్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) భద్రతా సిబ్బందితో సోమనాథ్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎయిమ్స్ ప్రధాన భద్రతా అధికారి(సీఎస్ఓ) ఈ మేరకు సోమనాథ్, ఆయన అనుచరులు భద్రతా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినట్లు హజ్ ఖాస్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని మాల్వియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సోమనాథ్ గతంలో గృహ హింస కేసులో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆయనపై మరో కేసు నమోదయింది. -
ఆమెతో మా ఎమ్మెల్యేకు సంబంధం లేదు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్ బోర్డు చీఫ్ అమనతుల్లా ఖాన్ అన్ని పదవులకు చేసిన రాజీనామాను ఆ పార్టీ తిరస్కరించింది. ప్రజలకు సేవ చేస్తుంటే తనను, తన కుటుంబాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా అమనతుల్లా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆయన బావమరిది భార్య జామియా నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందిస్తూ.. 'అమనతుల్లాపై వచ్చిన ఫిర్యాదులోని వాస్తవాలను పరిశీలించాం. ఆయన బావమరిది మాజీ భార్య ఫిర్యాదు చేసింది. అమనతుల్లా బావమరిది నాలుగేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమెతో అమనతుల్లాకు ఎలాంటి సంబంధం లేదు. కుటుంబంలోని వివాదాల వల్లే అమనతుల్లా పేరును కేసులోకి లాగారు. మా పార్టీలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం. అయితే దురుద్దేశపూర్వకంగా వారిపై కేసులు పెడితే అండగా ఉంటాం. ఈ వివరాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు, పార్టీ సీనియర్ నేతలకు చెప్పాను. అమనతుల్లా రాజీనామాలను తిరస్కరించాలని నిర్ణయించాం' అని చెప్పారు. -
ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ రాజీనామా
-
ఆప్ ఎమ్మెల్యేపై లైంగికదాడి కేసు
-
ఆప్ ఎమ్మెల్యేపై లైంగికదాడి కేసు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను కష్టాలు వీడటం లేదు. పార్టీ పరంగా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఇలా ప్రకటించారో లేదో.. ఆయనపై జామియా నగర్ పోలీసు స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఆ ఫిర్యాదు ఇచ్చింది కూడా ఎవరో కాదు.. సాక్షాత్తు ఖాన్ బావమరిది భార్యే!! గత నాలుగేళ్లుగా అమానతుల్లా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో అమానతుల్లాతో పాటు ఆయన బావమరిదిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఆమానతుల్లా ఒత్తిడి చేసేవారని, తన అత్తమామలు వరకట్నం కోసం తరచు చిత్రహింసలు పెట్టేవారని కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త సైతం.. అమానతుల్లాతో వివాహేతర సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి చేసేవాడని తెలిపారు. ఆమె చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుతో ఆమ్ ఆద్మీ పార్టీ మీద మరో పెద్ద మచ్చ పడినట్లయింది. పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ అమానతుల్లా ఖాన్ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు లేఖ ఇచ్చిన కొద్ది సేపటి తర్వాతే ఈ ఫిర్యాదు విషయం వెలుగులోకి వచ్చింది. తనపై వస్తున్న వివిధ ఆరోపణలకు వివరణలు ఇచ్చుకోలేక తాను అలసిపోయానని ఖాన్ అన్నారు. తాను ఎన్నికైన రోజు నుంచి ఢిల్లీ ప్రజలకు సంపూర్ణ నిబద్ధతతో సేవలు చేశానని తెలిపారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా నియమితుడినైన వెంటనే పాత ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి విషయాలను వెలుగులోకి తెచ్చానని, కానీ తన నిజాయితీ కొందరికి నచ్చలేదని అన్నారు. అందుకే తనపైన, తన కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. -
ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ రాజీనామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ అన్ని పదవుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం రాజీనామా లేఖను పంపారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నానని, అయితే పార్టీలో కొందరికి తన అంకితభావం, సహృదయత నచ్చలేదని అమనతుల్లా ఖాన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఓ మహిళను బెదిరించిన కేసులో ఢిల్లీ పోలీసులు ఇటీవల అమనతుల్లా ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నట్టు ఇటీవల ఓ సీడీ బయటకురావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు ఆప్ నుంచి బహిష్కరించారు. సీడీలో ఉన్న మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సందీప్‌పై రేప్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. -
‘సిద్ధూ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఈస్టిండియా కంపెనీలా వ్యవహరిస్తోందని ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆప్ బహిష్కృత ఎంపీ ధర్మవీర గాంధీ సమర్థించారు. కేజ్రీవాల్, ఆయన బృందం పనితీరును ఈస్టిండియా కంపెనీతో పోల్చడంలో ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. ఢిల్లీ నుంచి పంజాబ్ రాజకీయాలను శాసించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యహరిస్తున్నారని, స్థానిక నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. కేజ్రీవాల్ గురించి సిద్ధూ చెప్పినదాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని ధర్మవీర అన్నారు. పంజాబ్ రాష్టాన్ని పంజాబ్ కు చెందిన వారే పాలించాలని, బయటి వ్యక్తులను పాలకులుగా అంగీకరించబోమన్నారు. ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీలో చేరతారా అని ప్రశ్నించగా ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. -
విజయ్ చౌహాన్‌పై ఆరోపణలు
-
ఆప్ టికెట్ల కోసం మహిళలపై వేధింపులు!
ఆమ్ ఆద్మీ పార్టీలో మరో సంక్షోభం ఏర్పడింది. ఢిల్లీ ఎమ్మెల్యే దేవీందర్ సెహ్రావత్‌పై ఆప్ పంజాబ్ మహిళా విభాగం అధ్యక్షురాలు బల్జీందర్ కౌర్ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన రాష్ట్రంలో మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసం పంజాబ్‌లో టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని సెహ్రావత్ ఇటీవలే పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీంతో ఈసారి ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కౌర్ నేతృత్వంలోని బృందం పంజాబ్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు పరమ్‌జిత్ కౌర్ లంద్రాను కలిసి సెహ్రావత్‌పై ఫిర్యాదు చేశారు. సెహ్రావత్ లేఖ చూసి తాము చాలా బాధపడ్డామని, పంజాబీ మహిళల పరువు గంగలో కలిపేందుకే ఆయనిలా అంటున్నారని చెప్పారు. ఆధారాలు ఏమీ లేకుండానే సెహ్రావత్ ఇలా అభాండాలు వేయడం తగదని అన్నారు. కల్నల్ సెహ్రావత్‌కు ఏదో ఒక వంకతో ఆప్ నేతలను విమర్శించే అలవాటు ఉందని బల్జీందర్ కౌర్ అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్ అనే ఇద్దరు మహిళలకు టికెట్లు ఇప్పిస్తామని చెప్పి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కల్నల్ సెహ్రావత్ తన లేఖలో పేర్కొన్నారని పరమ్‌జిత్ కౌర్ అన్నారు. ఆయన చేసిన ఆరోపణల ఆధారంగా.. పంజాబ్ డీజీపీకి కూడా లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. -
నాకు తెలియకుండానే ఆ వీడియో తీశాడు!
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, బహిష్కృత ఆప్ నేత సందీప్‌కుమార్ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి, తన జీవితాన్ని నాశనం చేశారని, ఆయనను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ పోలీసులను కోరింది. వివాదాస్పద సీడీలో సందీప్‌కుమార్‌తో కలిసి సన్నిహితంగా కనిపించిన ఆమె తాజాగా పోలీసులకు వీడియో స్టేట్మెంట్ ఇచ్చింది. ఇద్దరు మహిళలతో సందీప్‌కుమార్ రాసలీలలు నెరుపుతున్న వీడియో సీడీలు వెలుగుచూడటంతో ఆయనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పోలీసులు సందీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని లైంగికదాడి అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. '11 నెలల కిందట నేను సందీప్‌కుమార్‌ను మార్కెట్లో కలిశాను. నాకు రేషన్ కార్డు ఇప్పించేందుకు సహాయం చేయమని కోరాను. నాకు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పత్రాలు తీసుకొని ఒంటరిగా తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఆ తర్వాత నన్ను తన ఇంటికి పిలిచారు. ఇంటికి వెళ్వాక ఓ గదిలో వేచి ఉండమని చెప్పారు. ఆ తర్వాత నాకు మత్తుపదార్థాలు కలిపిని పానీయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు' అని బాధితురాలు తెలిపింది. అనంతరం తనపై సందీప్‌కుమార్ అత్యాచారం జరిపారని, మర్నాడు ఉదయం తనను ఇంటినుంచి పంపించాడని ఆమె పోలీసులకు చెప్పింది. 'తనను సందీప్ వీడియో తీస్తున్నాడనే విషయం ఆమెకు తెలియదు. మత్తులో ఉన్న ఆమెకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఆమెను ట్రాప్ చేసి అతను వాడుకున్నాడు' అని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా ఎందుకు చేశావని ఆమె మర్నాడు ఉదయం సందీప్‌ను నిలదీసిందని, ఇలా చేయడం వల్ల తన పెళ్లిపై ప్రభావం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేసిందని వారు చెప్పారు. 'రేషన్ కార్డు కావాలంటే నువ్వు లొంగిపోక తప్పదు అని సందీప్ చెప్పాడు. నీ పెళ్లి దెబ్బతీనకుండా ఉండాలంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అని ఆమెను బెదిరించాడు' అని పోలీసులు వివరించారు. తనను మోసం చేసిన సందీప్ చివరకు రేషన్ కార్డు కూడా ఇప్పించలేదని, అవమానభారంతో తాము మరో ఇంటికి మారామని బాధితురాలు తెలిపింది. 'నేను పేద మహిళను. వివాహితను. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి వ్యతిరేకంగా పోరాడే వనరులు నా వద్ద లేవు. బహిరంగంగా వీడియో లీక్ చేసి అతను నా పరువుకు భంగం కలిగించాడు. ఇందంతా తెలిశాక నన్ను సమాజం ఒప్పుకోద్దు. ఇందుకు బాధ్యుడైన అతన్ని కఠినంగా శిక్షించాలి' అని బాధితురాలు కోరింది. -
మరో వివాదంలో ఆప్ ఎంపీ
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్‌లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ సింగ్ ఏరికోరి మరీ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ సారి మద్యం సేవించి పార్లమెంట్‌కు రావడం... మరోసారి పార్లమెంట్ భద్రతను పణంగా పెట్టి వీడియో తీయడం.. తాజాగా జర్నలిస్టులను కించపరచడం. ఈ వివాదాలతో భగవత్ మన్ సింగ్‌కు ఎక్కడి లేని చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా జర్నలిస్టులను కించపరిచినందుకు ఎంపీకు వ్యతిరేకంగా పంజాబ్ బాసనీ పథానా పోలీసుల స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. హిందీ న్యూస్పేపర్లో పనిచేసే ఓ వర్కింగ్ జర్నలిస్టుపై దురుసుగా వ్యవహరించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆ హిందీ జర్నలిస్టు భగవత్ మన్పై ఎఫ్ఐఆర్ను నమోదుచేశారు. బాసీ పథానాలోని ఫతేగఢ్ సాహిబ్‌లో నిర్వహించిన ర్యాలీ వెన్యూకు ఆయన ఆలస్యంగా రావడంపై జర్నలిస్టు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కోపోద్రుహులైన భగవత్ మన్, జర్నలిస్టుపై మీడియా ముందే దురుసుగా ప్రవర్తించారు. మీడియాను కించపరిచినట్టు మాట్లాడిన ఆప్ ఎంపీ, మీడియాను వెంటనే ర్యాలీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ప్రతి జర్నలిస్టుకు ఓ రేటు ఉంటుందని, మీడియా కవరేజ్ అవసరం లేని పార్టీ ఆప్నేనని కితాబు ఇచ్చుకున్నారు. వార్తలు రాయడానికి ప్రతి జర్నలిస్టు డబ్బులు తీసుకుంటారని ఆరోపించారు. -
గాంధీ, నెహ్రూ, వాజేపేయి చేయలేదా?
న్యూఢిల్లీ: ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మాజీ మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సందీప్ కుమార్ కు చెందిన ఓ అభ్యంతరకర వీడియో బయటకు రావడంపై శుక్రవారం ఆయన స్పందించారు. సందీప్ చేసింది తప్పేమీ కాదని వెనకేసుకొచ్చారు. శృంగారం మానవ లక్షణం అని సందీప్ ను సమర్ధించే ప్రయత్నం చేశారు. సందీప్ వివాదంపై అశుతోష్ తన బ్లాగ్ లో వివరణ ఇచ్చారు. దేశంలో పెద్ద పెద్ద నాయకులు కూడా సామాజిక బాధ్యతలను మరిచి ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయని వివాదాస్పదంగా మాట్లాడారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, వాజ్ పేయిలు కూడా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నారనే వార్తలు వచ్చాయని చెప్పారు. అయితే వారు రాజకీయంగా ఏ విధంగానూ నష్టపోలేదని అన్నారు. నెహ్రూ తనతో పాటు పనిచేసే మహిళలతో వివాహేతర సంబధాలు కలిగి ఉన్నారనే పుకార్లు షికార్లు చేశాయని చెప్పారు. ఎడ్వినా మౌంట్ బాటెన్ తో నెహ్రూకు ఉన్న అనుబంధం గురించి అప్పట్లో విపరీతమైన చర్చ జరిగేదని బ్లాగ్ లో రాశారు. 1910లో గాంధీజీ సర్లా చౌదరితో అనుబంధాన్ని పెంచుకున్నారని.. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ కు దూరపు బంధువని చెప్పారు. సర్లా తన ఆత్మకు భార్య అని గాంధీజీనే స్వయంగా చెప్పారని తెలిపారు. దీంతో సీ రాజగోపాలాచారి మిగిలిన పార్టీ సీనియర్ నేతలు ఈ విషయంలో జోక్యం చేసుకుని గాంధీజీ ఆమెను వదలివేసేలా చేశారని అన్నారు. ఆ తర్వాతి రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకునేందుకు యువతులతో కలిసి గాంధీజీ నిద్రించారని చెప్పారు. నెహ్రూ ఈ విషయంపై గాంధీతో మాట్లాడినా ఆయన వినలేదని తెలిపారు. అటల్ బీహారీ వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ సంప్రదాయాలను పాటిస్తూ వివాహం చేసుకోలేదని చెప్పారు. పార్లమెంటులో తాను బ్యాచిలర్ నే కానీ బ్రహ్మచారిని మాత్రం కాదని ఆయనే ప్రకటించారని గుర్తుచేశారు. వాజ్ పేయి బహిరంగంగానే కళాశాల స్నేహితురాలితో కలిసి తిరిగారని.. అప్పుడు ఎవరూ ఆయనకు అడ్డుచెప్పలేదని అన్నారు. సోషలిస్టు లీడర్ రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెస్, చైనీస్ లీడర్ మావో జె డాంగ్ ల జీవితాలను కూడా అశుతోష్ ఉదాహరణగా పేర్కొన్నారు. -
ఆ వీడియో సీడీతో పీకల్లోతు కష్టాలు!
-
ఆ వీడియో సీడీతో పీకల్లోతు కష్టాలు!
ఆప్ నేత, మాజీ మంత్రి సందీప్ కుమార్ ఓ మహిళతో గడుపుతున్న సీడీ వెలుగుచూడటం ఢిల్లీలో పెద్ద దుమారమే రేపింది. ఈ వీడియో సీడీని చూసిన వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నైతిక విలువల ఆధారంగా సందీప్ కుమార్‌ను మంత్రిపదవి నుంచి తొలగించారు. ఇది నైతిక విలువల అంశమే కాకుండా చట్టబద్ధంగానూ నేరపూరిత అంశం కావడంతో సందీప్ కుమార్‌కు మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశముందని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఢిల్లీ కేబినెట్ దళిత ముఖమైన సందీప్ కుమార్ ఇన్నాళ్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. సెక్స్ టేప్ స్కాండల్ లో ఆయన దొరికిపోవడంతో మంత్రి పదవికి ఎసరు వచ్చింది. అయితే, మహిళతో రాసలీలలు జరుపుతూ ఈ వీడియోను సందీప్ కుమారే స్వయంగా తీసినట్టు చెప్తున్నారు. ఇదే నిజమైతే ఆయన చుట్టూ చట్టం ఉచ్చుబిగించే అవకాశముంది. ఐటీ చట్టం సెక్షన్ 67 ప్రకారం ఒకరితో సన్నిహితంగా గడుపుతూ ఆ సంఘటనను చిత్రీకరించడం నేరం. ఇందుకుగాను పోలీసులు కేసు నమోదు చేయవచ్చు. ఈ అశ్లీల వీడియోలో ఉన్న మహిళ స్వయంగా ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయకున్నా.. సెక్షన్ 67 ప్రకారం పోలీసులు సమోటోగా కేసు నమోదు చేసే అవకాశముంది. అయితే, ఈ అసభ్యకర సీడీ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు వెల్లడించాల్సిన అవసరముంటుంది. దీనిని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేస్తే.. ఆ వెబ్సైట్ లింక్‌ను సమర్పించాలి. అంతేకాకుండా సీడీపై ఫోరెన్సిక్ పరీక్షలు జరిపి నిర్ధారణ చేయడం తప్పనిసరి. శిక్ష ఎంత? ఒకవేళ ఇలాంటి వీడియో అశ్లీలంగా, అసభ్యంగా ఉండి, అందులో లైంగిక చర్య లేకపోతే, నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ. ఐదు లక్షల జరిమానా విధించే అవకాశముంది. ఈ వీడియోలో లైంగిక చర్య కూడా ఉంటే ఐదేళ్ల జైలుశిక్ష, రూ. ఐదులక్షల జరిమానా కోర్టు విధిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తే అందుకుగాను మరో మూడేళ్ల జైలుశిక్ష, ఐదు లక్షల జరిమానా విధించే అవకాశముంటుంది. -
పార్టీ టికెట్లు అమ్ముకుంటూ.. స్టింగ్‌కు దొరికేశాడు
పంజాబ్‌లో ఎన్నికలకు వెళ్లడానికి తమ దగ్గర డబ్బులు లేవంటూ సాక్షాత్తు పార్టీ ముఖ్య నాయకుడే చెప్పారు కదా అనుకున్నారో ఏమో గానీ.. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ ఓ కార్యకర్తకు టికెట్ ఇప్పిస్తానంటూ అతడి దగ్గర డబ్బులు తీసుకుంటూ దొరికిపోయారు. దాంతో పార్టీ రాష్ట్రశాఖ కన్వీనర్ సుచా సింగ్ ఛోటేపూర్‌పై బహిష్కరణ వేటు వేయాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఛోటేపూర్‌పై చర్య తీసుకోవాలంటూ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దాదాపు 25 మంది పంజాబ్ అగ్రనేతలు లేఖ రాశారు. అయితే, ఇదంతా తన సొంత పార్టీ వాళ్లు చేసిన కుట్రేనని, ఆరోపణలు నిరాధారమని ఛోటేపూర్ అంటున్నారు. అన్ని విషయాలూ త్వరలోనే వెల్లడిస్తానన్నారు. కానీ ఛోటేపూర్ డబ్బులు తీసుకుంటుండగా స్టింగ్ ఆపరేషన్ చేశామని, ఆ వీడియో ఇప్పటికే అధిష్ఠానం వద్దకు వెళ్లిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో అవినీతికి చోటు లేదని, సాక్ష్యాధారాలు అగ్రనేతలకు చేరితే ఛోటేపూర్‌పై తప్పకుండా కఠినచర్యలు ఉంటాయని పార్టీ అధికార ప్రతినిధి హిమ్మత్‌సింగ్ షేర్గిల్ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్థుడైన ఛోటేపూర్ గత ఎన్నికల్లో గురుదాస్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీపై ఛోటేపూర్ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు, కేజ్రీవాల్‌కు చెడిందని చెబుతున్నారు. ఇప్పటికి రెండు జాబితాలను పార్టీ విడుదల చేసినా, రెండుసార్లూ ప్రెస్మీట్లలో ఛోటేపూర్ లేరు. -
సీఎం గారూ.. మావాళ్ల విషయంలో జోక్యం వద్దు
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అసీం అహ్మద్ ఖాన్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనను చంపించేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నారని ఇటీవల అసీం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ పోరాటం తనపైనే కానీ, తన కుటుంబ సభ్యులపై కాదని, తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. కేజ్రీవాల్, ఆయన అనచరులు తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు చూస్తున్నారని చెప్పారు. తన తండ్రి హజి మున్నె అలీపై తప్పుడు కేసు పెట్టవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయంలో తనకు కావాల్సినవారు గత నెల 31న హెచ్చరించారని వెల్లడించారు. ఈ నెల 2న పాత ఢిల్లీ మీనా బజార్‌లోని తన తండ్రి షాప్ వద్దనకు ఇద్దరు మహిళలు వచ్చి కావాలనే ఆయనతో గొడవపెట్టుకున్నారని, అనుచితంగా ప్రవర్తించి తిట్టారని అసీం చెప్పారు. ఇది కుట్ర అయివుంటుందని సందేహం వ్యక్తం చేశారు. -
అలాంటివాళ్లను బహిరంగంగా చంపాలి
న్యూఢిల్లీ: ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులు ఉగ్రవాదులని, వాళ్లను బహిరంగంగా చంపాలని అన్నారు. అత్యాచార కేసుల్లో దోషులను ఉగ్రవాదులుగా పరిగణించి, బహిరంగంగా చంపేలా పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలని మిశ్రా డిమాండ్ చేశారు. అలాగే మహిళలకు ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఢిల్లీ- కాన్పూర్ హైవేపై కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, తల్లీకూతుళ్లపై దుండగులు గ్యాంగ్ రేప్ చేసిన అనంతరం మంత్రి తన బ్లాగ్‌లో ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. గతేడాది ఢిల్లీలో 450 మంది మైనర్ బాలికలు లైంగికదాడికి గురయ్యారని వెల్లడించారు. ఏ సమయంలోనైనా, ఎవరికైనా ఇలాంటి దుస్థితి రావచ్చని, రేప్ కేసుల దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఉరిశిక్షకు తాను చాలాకాలం వ్యతిరేకమని, అయితే రేపిస్టులు ఉగ్రవాదులని, వారికి మరణశిక్ష విధించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. -
నకిలీ డిగ్రీతో టీచర్, ఆ తర్వాత ఎమ్మెల్యే
చండీగఢ్: ఆప్ ఎమ్మెల్యే సురీందర్ సింగ్ గతంలో నకిలీ డిగ్రీతో టీచర్ ఉద్యోగం పొందినట్టుగా హరియాణా పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సురీందర్ అంతకుముందు హరియాణాలోని ఝజ్జర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. సురీందర్ ఇంటర్ వరకూ మాత్రమే చదువుకున్నారని, నకిలీ డిగ్రీ పట్టాతో ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం పొందారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ తన్వార్ ఝజ్జుర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం సురీందర్ విద్యార్హతలు గురించి కోరగా ఆయన ఇంటర్ వరకు మాత్రమే చదివినట్టు వెల్లడైందని, కానీ డిగ్రీ విద్యార్హతలతో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేశారని కరణ్ చెప్పారు. సురీందర్పై కేసు నమోదు చేశామని, ఆయన డిగ్రీ పత్రాలను పరిశీలిస్తామని ఝజ్జర్ ఎస్పీ జషన్‌దీప్ సింగ్ చెప్పారు. కాగా ఇది బీజేపీ కుట్ర అని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవే ఆరోపణలపైనే గతంలో ఢిల్లీ పోలీసులు విచారణ చేసి సురీందర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారని, ఇప్పుడు హరియాణాలో ఇదే కేసు నమోదు చేశారని చెప్పారు. -
ఆప్ ఎమ్మెల్యే చౌహాన్‌కు బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే శరద్ చౌహాన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ఎమ్మెల్యేని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా ఆప్ మహిళా కార్యకర్త సోని ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యేని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోని ఆత్మహత్యకు కారణమైన పార్టీ కార్యకర్త రమేశ్ భరద్వాజ్‌కు ఎమ్మెల్యే అండగా నిలిచినట్టు ఆరోపణలున్నాయి. తన ఆత్మహత్యకు భరద్వాజ్ కారణమని మృతురాలు సోనీ సూసైడ్ వీడియోలో తెలిపింది. కాగా వివిధ కేసుల్లో ఇప్పటివరకు అరెస్టైన 'ఆప్' ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది. -
స్కాంపై సీబీఐ విచారణ జరపాలి
-
'మహిళగా రాజీపడు.. లేకుంటే పార్టీలో ఎదగవ్'
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ మహిళా కార్యకర్త ఆత్మహత్య ఘటనకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఆమెను శారీరకంగా మానసికంగా వేధించేందుకు ప్రయత్నాలు జరిగింది వాస్తవమే అని తెలిసింది. ఆమెను అన్ని రకాలుగా లొంగదీసుకోవాలనే ప్రయత్నం అవతలి వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో తనతోపాటు పనిచేసే కార్యకర్త రమేశ్ వాద్వా వేధింపులు భరించలేక ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్య కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన న్యూఢిల్లీలోని నెరెల ప్రాంతంలో చోటుచేసుకుంది. వేధింపులకు గురిచేసిన అతడు జైలుకు వెళ్లి అనంతరం బెయిల్ పై విడుదల కావడంతోపాటు స్వేచ్ఛగా బయటకు వచ్చాక కూడా అలాంటి చేష్టలే చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారిస్తున్న జాతీయ మహిళా కమిషన్ కు కుటుంబ సభ్యులు పలు విస్తుపోయే అంశాలు చెప్పారు. వేధింపులకు దిగిన ఆ వ్యక్తి ఆ మహిళా కార్యకర్తను 'నీ శరీరాన్ని ప్రేమించుకోవడం ఆపేయ్. రాజీపడు. అలా చేయకుంటే నువ్వు పార్టీలో ఎదగడం జరగదు' అని బెదిరించాడట. అలాగే, ఆమె ఇద్దరు కూతుర్లను కూడా కిడ్నాప్ చేస్తానని బెదిరించాడట. అంతేకాదు, ఆమె ఇద్దరు పిల్లల అడ్మిషన్లను కూడా ఆప్ ప్రభుత్వం రద్దు చేయడంతో వారు స్కూల్ కు వెళ్లడం మానేశారట. ఈ పర్యవసనాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ మహిళా కమిషన్ ఆరోపించింది. -
మోదీపై ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు
-
ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రెండున్నర ఏళ్లుగా కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతోన్న పరోక్ష యుద్ధం తారాస్థాయికి చేరింది. నిన్నటివరకు కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. బుధవారం ఏకంగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో నరేంద్ర మోదీ నన్ను హత్య చేయిస్తారేమోనంటూ సంచలనాత్మక ఆరోపణలు చేశారు. వీడియోలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలను ఉద్దేశించి దాదాపు 10 నిమిషాలు మాట్లాడిన కేజ్రీవాల్.. జైలుకు వెళ్లేందుకు, హత్యలకు గురయ్యేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిపై పై ఈ స్థాయిలో విమర్శలకు దిగడం దేశరాజకీయాల్లో అరుదు. ఢిల్లీలో మ్మెల్యేలు వరుసగా అరెస్టుకావడం, చిన్నాచితకా లేదా బలమైన సాక్ష్యాధారాలు లేని కేసుల్లో సైతం జైళ్లకు వెళ్లాల్సి రావడంతో ఆప్ అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్న సంగతి తెలిసిందే. వీటన్నింటిపై ఇప్పటివరకు ఒకస్థాయిలో స్పందించిన ఆప్ అధినేత.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో, ప్రధాని మోదీతో అమీతుమీకి సిద్ధమయినట్లు వీడియో సందేశాన్ని బట్టి తెలుస్తోంది. -
ఆప్ ఎంపీ వీడియోపై కమిటీ
9 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన స్పీకర్ - నిర్ణయం తీసుకునేవరకు సభకు హాజరుకావద్దని మన్కు ఆదేశాలు న్యూఢిల్లీ : పార్లమెంటు ప్రాంగణాన్ని చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యవహారంపై ఆప్ ఎంపీ భగవంత్ మన్ క్షమాపణలను పరిగణనలోకి తీసుకోని లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్.. ఆ అంశంపై విచారణ జరిపేందుకు సోమవారం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ సభ్యడు కిరిట్ సోమయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ 9 మంది సభ్యుల కమిటీని ఆగస్ట్ 3లోగా నివేదిక సమర్పించాలని మహాజన్ ఆదేశించారు. నివేదిక అందిన తరువాత, పార్లమెంటు భద్రతా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నిర్ణయం తీసుకునేవరకు సభాకార్యక్రమాలకు హాజరు కావద్దని మన్ను ఆదేశించారు. కమిటీ ముందు తన వాదన ఈనెల 28లోగా వినిపించాలనిఅవకాశమిచ్చారు. మన్ వీడియోతో పార్లమెంటు ప్రాంగణంలో తలెత్తనున్న భద్రతాపరమైన సమస్యలు, తదనంతర పరిణామాలను కమిటీ విచారిస్తుంది. విచారణ కమిటీలో మీనాక్షి లేఖి(బీజేపీ), సత్యపాల్ సింగ్(బీజేపీ), ఆనంద్‌రావు అద్సుల్(శివసేన), బీ మెహతాబ్(బీజేడీ), రత్నాడే(టీఎంసీ), కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్), పీ వేణుగోపాల్(అన్నాడీఎంకే), తోట నరసింహం(టీడీపీ)లకు చోటు కల్పించారు. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తనివ్వకుండా చేసేందుకు తనపై బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్‌లు కలసికట్టుగా కుట్రపన్నాయని మన్ ఆరోపించారు. పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన్.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కమిటీ ముందు వివరణ ఇచ్చి, సభకు హాజరయ్యేందుకు అనుమతిస్తే బావుండేదన్నారు. సభకు హాజరుకావడం ఎంపీగా తన హక్కని వ్యాఖ్యానించారు. జైరాం, రేణుకలపై హక్కుల తీర్మానం కాంగ్రెస్ సభ్యులు జైరామ్ రమేశ్, రేణుకా చౌదరిలు తమ పార్టీ లోక్‌సభ ఎంపీ, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్‌తో సభలో అనుచితంగా ప్రవర్తించారంటూ శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ) రాజ్యసభలో సభా హక్కుల తీర్మానం తీసుకొచ్చింది. వారిద్దరు సభ బయటా కౌర్‌తో అలాగే ప్రవర్తించారని ఆరోపించింది. దీనికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీర్మానాన్ని ఎదుర్కోవాలని డిమాండ్ చేసింది. గత శుక్రవారం రాజ్యసభ వాయిదా పడ్డాక రమేశ్, రేణుకలకు కౌర్‌కు మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఎస్ఏడీ సభ్యుడు సుఖ్‌దేవ్‌సింగ్ ధిండ్సా లేవనెత్తారు. మంత్రికి ఏ సభలోనైనా మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. అకాలీ ఆరోపణలను రమేశ్, రేణుక తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమలు కోరుతూ వచ్చిన బిల్లును అధికాపక్షం అడ్డుకోవడానికి గొడవ చేసిందని ఆరోపించారు. ఐఐటీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం న్యూఢిల్లీ: తిరుపతి సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోన్న ఆరు కొత్త ఐఐటీలకు సంబంధించిన బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. సాంకేతిక విద్యాసంస్థల(సవరణ) బిల్లు-2016 కింద తిరుపతి, జమ్మూ, పాలక్కడ్, గోవా, ధార్వాడ్, భిలాయ్‌ల్లో కొత్త ఐఐటీలను ఏర్పాటు చేస్తున్నారు. ధన్బాద్లో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్నూఈ బిల్లులో చేర్చారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ లోక్‌సభలో మాట్లాడుతూ ‘అందరికీ విద్య, మంచి విద్య’ తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నెట్‌కు అర్హత మార్కులు 50 శాతమే! అధ్యాపక ఉద్యోగార్థులకు జరిపే జాతీయ అర్హత పరీక్ష(నెట్) రాయాలనుకునే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు పీజీలో కనీసం 50% మార్కులు ఉండాలని మానవ వనరుల అభివృద్ధి సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే లోక్‌సభకు చెప్పారు. యూజీసీ నిబంధనల ప్రకారం నెట్ రాయడానికి పీజీలో కనీసం 55 % మార్కులు రావాల్సి ఉండగా, 2016లో సవరించిన నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 5 % సడలింపునిచ్చారన్నారు. -
'అప్పటివరకూ సభకు హాజరు కావొద్దు'
-
'అప్పటివరకూ సభకు హాజరు కావొద్దు'
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ సింగ్ మన్ లోక్‌సభకు హాజరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్లో దృశ్యాలను లైవ స్ట్రీమింగ్ చేసిన భగవంత్ వ్యవహారంపై స్పీకర్ సోమవారం 9మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆగస్టు 3లోగా నివేదిక ఇవ్వాలని స్పీకర్... ఆ కమిటీకి సూచించారు. కాగా, విచారణ కమిటీ నివేదిక వచ్చేంతవరకూ సభకు హాజరు కావద్దని స్పీకర్ ఈ సందర్భంగా భగవంత్ మన్ను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని క్షమాపణతో సరిపెట్టడం కుదరదని స్పష్టం చేశారు. కాగా భగవంత్ మన్ పార్లమెంటు భద్రత వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయటంపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్రగందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. పార్లమెంటు భద్రతపై తీసిన వీడియో వివాదాన్ని సీరియస్‌గా తీసుకుని మన్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని పార్టీలన్నీ డిమాండ్ చేశాయి. మరోవైపు తను తీసిన వీడియో దుమారం రేపుతుండటంత మన్ బేషరతు క్షమాపణ కోరారు. అసలు వీడియోలో ఏముంది? 12 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో.. భగవంత్ మన్ పార్లమెంటు ఆవరణలోకి అడుగుపెడుతున్నప్పటి నుంచి వివిధ అంచెల భద్రతను దాటుతూ ఎలా లోపలిదాకా వెళ్లాలో ఆ వీడియోలో చూపించారు. ‘మీరు గతంలో ఎప్పుడూ చూడనిది ఇవాళ చూడబోతున్నారు’ అని స్వయంగా అన్నారు. పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయం ఎలా ఉంటుందో రికార్డు చేశారు. దీన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీనిపై వివాదం రేగటంతో.. ఫేస్బుక్ వాల్నుంచీ ఆ వీడియోను తొలగించినట్లు మన్ తెలిపారు. -
నడిరోడ్డుపై చొక్కాపట్టి నిలదీసింది
-
నడిరోడ్డుపై చొక్కాపట్టి నిలదీసింది
న్యూఢిల్లీ: సామాన్య ప్రజలు మీకు వెదవల్లా కనిపిస్తున్నారా అని ఓ యువతి ఢిల్లీ నడిరోడ్డుపై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను నిలదీసింది. ఆస్పత్రికి అత్యవసర పరిస్థితితో వెళుతున్న ఆమె కారు నడిరోడ్డుపై ఆగిపోయేందుకు ఆప్ కార్యకర్తలే కారణం కావడంతో వారిపై శివమెత్తింది. రోజూ నాటకాలు వేస్తున్నారా అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ యువతిని చంపేస్తాను.. లైంగిక దాడి చేస్తాను అని బెదిరించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆప్ కార్యకర్తలంతా రోడ్డపైకి వచ్చి పలు వీధులు బ్లాక్ చేశారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అందులో ఆస్పత్రికి వెళుతున్న ఓ యువతి కారు దిగి వేగంగా బయటకు వచ్చి'అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంచేస్తున్నారు? రోజుకో వేషాలు వేస్తున్నారా? ట్రాఫిక్ క్లియర్ చేయండి? మేం ఆస్పత్రికి వెళ్లాలి' అని చెప్పింది. అంతలో ఓ ఆప్ కార్యకర్త మేం వెళ్లనివ్వం ఏం చేసుకుంటావో చేస్కో అన్నాడు. దాంతో మరింత ఆగ్రహానికి లోనైన ఆ యువతి అతడి చొక్కా పట్టుకొని 'సామాన్యులు మీకు వెదవల్లా కనిపిస్తున్నారా.. ఇలాగేనా నిరసనలు చేసేది? మాకు ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు? మీ ఒక్క ఎమ్మెల్యే కోసం మేం వేలమంది బాధపడాలా? కార్లో పేషెంట్ ఉందంటే అర్థం కాదా' అని అసహనం వ్యక్తం చేసింది. దానికి ఆప్ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేను విడిచిపెట్టమని పోలీసులకు చెప్పాలని, వేరే రూట్ లో నుంచి ఆస్పత్రికి వెళ్లండంటూ బదులిచ్చారు. దీంతో అదే సమయానికి అక్కడికి పోలీసులు వచ్చారు. -
మహిళను బెదిరించిన కేసులో ఎమ్మెల్యే అరెస్టు
న్యూఢిల్లీ: మహిళను బెదిరించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే ఓక్లా అమనతుల్లా ఖాన్ ను నగరపోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అమనతుల్లా ఖాన్ అరెస్టుపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మోదీజీ మరో ఆప్ ఎమ్మెల్యేను అరెస్టు చేశారని ట్వీట్ చేశారు. ఈ నెల 10 తేదీన తరచూ పవర్ కట్ లు ఉంటుండటంతో అమనతుల్లా ఖాన్ కు వినతిపత్రం ఇవ్వడానికి మహిళ బాట్లాలోని ఆయన నివాసానికి వెళ్లారు. మంత్రి ఆమెను కలిసేందుకు నిరాకరించడంతో వెనుదిరిగారు. ఇంతలో మంత్రి నివాసం నుంచి బయటకు వచ్చిన ఓ యువకుడు విషయాన్ని రాజకీయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించాడు. దీనిపై స్పందించిన అమనతుల్లా ఆమె తన నివాసానికి వచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు. దీంతో ఆమె దక్షిణ ఢిల్లీలోని జమీయా నగర్ పోలీసు స్టేషన్ లో మంత్రి బెదిరిస్తున్నారంటూ కేసు పెట్టారు. -
ఎంపీ మాన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి..
-
ఆప్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మరో ఆప్ ఎంపీ వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ కు సంబంధించిన సున్నితమైన అంశాలను సోషల్ మీడియాలో వీడియో తో షేర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్.. తనపై వచ్చిన విమర్శలకు స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ పార్లమెంట్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని మాత్రమే తాను ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తాను ఉంచిన వీడియో పార్లమెంటు భద్రతకు విరుద్ధంగా ఉందనే ప్రశ్నకు సమాధానంగా... నిజంగా పార్లమెంటు భద్రతకు విరుద్ధంగా తాను ప్రవర్తించానా? అని ఎదురుప్రశ్న వేశారు. కాగా పార్లమెంట్‌లోని భద్రతా ఏర్పాట్లను రహస్య కెమెరాతో రికార్డు చేసిన ఆప్ ఎంపీ వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పెడతానని భగవంత్ మాన్ అన్నారు. అంతేకాకుండా తనకు నోటీసులు ఇవ్వండంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆప్‌పై బీజేపీ విరుచుకుపడింది. దేశ భద్రతను ఆప్ తాకట్టు పెడుతోందని ధ్వజమెత్తింది. -
సిద్ధూ.. మాకు వద్దేవద్దు!
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గూగ్లీతో బీజేపీని చిత్తుచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంకల్పించింది. కానీ, క్షేత్రస్థాయిలోని ఆప్ శ్రేణులు మాత్రం సిద్ధూ రాక పార్టీకి బౌన్సర్లా తగిలే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్, మంచి వక్త అయిన సిద్ధూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన త్వరలోనే బీజేపీకి రాజీనామా చేసి ఆప్‌లో చేరుతారని, ఆయనను ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ కథనాలను ఆప్ శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదట. పార్టీలోకి సిద్ధూ రాకపై క్షేత్రస్థాయిలో ఆప్ సర్వే నిర్వహించినట్టు తెలిసింది. మొత్తం పంజాబ్‌లోని 26 చోట్ల ఈ అంతర్గత సర్వేను పార్టీ చేపట్టింది. ఆప్‌లోకి సిద్ధూ రాకపై ఈ సర్వేలో మెజారిటీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సిద్ధూ వస్తే తాము పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని కూడా కొందరు పేర్కొన్నట్టు సమాచారం. ఈ సర్వే ఫలితాలను ఆప్ పంజాబ్ నాయకులు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు. ఈ సర్వే ఫలితాల నేపథ్యంలో సిద్ధూ చేరికపై కేజ్రీవాల్ ఆచితూచి నిర్ణయం తీసుకొనే అవకాశముందని తెలుస్తోంది. ప్రధానంగా హిందూత్వవాదిగా పేరొందిన సిద్ధూను లౌకిక పార్టీ అయిన ఆప్‌లోకి ఎలా తీసుకుంటారని ఆ పార్టీ నేతలు, శ్రేణులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. సిద్ధూ చేరిక కథనాలపై పంజాబ్ ఆప్ చీఫ్ కన్వర్ సంధూ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సిద్ధూ ఆప్‌లో చేరినపక్షంలో ఆయన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని సంధూ పేర్కొన్నారు. రాజ్యసభకు సిద్ధూ రాజీనామాను ఆప్ అధినేత కేజ్రీవాల్ తదితరులు ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే, ఆప్‌లో చేరేవిషయంలో సిద్ధూ మౌనంగా ఉండటంతో దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఎంపీ ఫుల్లుగా తాగి పార్లమెంటులోకి..!
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. మద్యానికి ఆయన బానిస అని గతంలో పలు ఆరోపణలు రాగా.. తిరిగి అదే మద్యం విషయంపై మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఫుల్లుగా మందుకొట్టి పార్లమెంటులోకి అడుగుపెట్టారని కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత అమరిందర్ సింగ్ ఆరోపించారు. ‘భగవంత్ లాంటి వారు పంజాబ్ ఇమేజ్ కు మకిలి పట్టిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు. కాగా, భగవంత్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారేం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్ కూడా ఆయన గతంలో తీవ్రంగా విమర్శించారు. లోక్ సభ సమావేశాలకు మద్యం బానిస అయిన భగవంత్ మద్యం తాగే వెళ్లే వాడని చెప్పారు. ’నేను 2014 జూలైలో ఈ విషయం తెలుసుకున్నాను. ఆ సమయంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆ సమయంలో భగవంత్ నా పక్కనే కూర్చున్నాడు. గప్పున మద్యం వాసన వచ్చింది. అతడి గురించి నాకు అప్పుడే తెలిసింది’ అని యోగేంద్ర అన్నారు. -
మహిళతో అసభ్య ప్రవర్తన, ఎమ్మెల్యేపై కేసు నమోదు
న్యూఢిల్లీ : మరో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్పై గ్రేటర్ కైలాష్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఆయనపై ఐపీసీ 354, 506, 509 & 34 సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆప్ సీనియర్ నేత అయిన ప్రకాశ్ జార్వాల్ దేవ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా గతంలోనూ దురుసుగా ప్రవర్తించినందుకు ప్రకాశ్ జార్వాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా 2014లో తన మాట వినలేదనే కోపంతో ఢిల్లీ జలబోర్డు అధికారిపై చేయిచేసుకున్నందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలు పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవలే ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాను అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా ప్రకాశ్ జార్వాల్ కూడా ఓ మహిళపై పట్ల అసభ్యంగా ప్రవర్తించి కేసులో చిక్కుకున్నారు. -
ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహానియాకు బెయిల్ లభించింది. ఆయనకు సాకేత్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా గతంలో దినేశ్ మోహానియాకు న్యాయస్థానం బెయిల్ తిరస్కరించిన విషయం తెలిసిందే. నీటి సరఫరా సక్రమంగా చేయాలని కోరుతూ తన దగ్గరకు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను హింసించిన ఘటనలో దినేష్ మోహనియాపై ఐపీసీ 306, 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దినేశ్ మోహానియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఎమ్మెల్యే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కాగా ఆప్ నేతలు ఇలా కేసుల్లో ఇరుక్కోవడం ఇదే తొలిసారి కాదు. ఎమ్మెల్యేలు ధర్మేంద్ర సింగ్, సోమ్‌నాథ్ భారతి, మరో నేతపై కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో ఇప్పటివరకూ ఢిల్లీ పోలీసులు ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. -
ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ తిరస్కరణ
న్యూఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాకు సాకేత్ కోర్టు సోమవారం బెయిల్ తిరస్కరించింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆయనని పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో దినేశ్ మోహనియా ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ తోసిపుచ్చింది. మరోవైపు దినేశ్ మోహనియా జ్యుడిషియల్ కస్టడీని జూలై 11 వరకూ న్యాయస్థానం పొడిగించింది. కాగా నీళ్ల కోసం వెళ్తే తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యే దినేశ్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నీళ్ల గురించి మరోసారి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి, తోసేశారంటూ దినేష్ మోహనియాపై ఫిర్యాదు చేశారు. -
ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేయించండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మరోసారి విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్ట్ చేయించండి అంటూ సవాల్ చేశారు. కేంద్రంలోని రాజకీయ పెద్దలు.. ఆప్ ఎమ్మెల్యేలను ఎలాగైనా, ఏదో ఒక కారణంతో జైల్లో పెట్టించాలని చూస్తున్నారని సిసోడియా ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను ఆరెస్ట్ చేయించాలని భావిస్తే.. అందరినీ కలసికట్టుగా ఎందుకు అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. కేంద్రం ఢిల్లీ పోలీసులు బలగాలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే దినేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, సిసోడియా తమను దూషించారంటూ వ్యాపారవేత్తలు ఆయనపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం సిసోడియా, ఆప్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూ రేసుకోర్సు రోడ్డులోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు. -
ఆప్ నేతలకు పనీపాట లేదు: కిరణ్ రిజుజు
హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు నిప్పులు చెరిగారు. సదరు పార్టీ నేతలకు పనీపాట లేదని ఆయన ఎద్దేవా చేశారు. నాటకాలాడటం వాళ్లు అలవాటైందంటూ ఆప్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం కాదని ప్రజలకు మంచి చేసే పనులు చేయాలని ఆప్ నేతలకు కిరణ్ రిజుజు సూచించారు. ఆదివారం హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ రిజుజు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ రిజాజు మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్డీఏ రెండేళ్ల పాలన సాగిందన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో కేంద్ర నిధులు ప్రజలకు చేరువ కావడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం అందిస్తున్న నిధులతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి వరకూ అందలన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపి... ఎమర్జెన్సీని విధించిన రోజును ఎవరూ మరవరన్నారు. ఎమర్జెన్సీలోని వాస్తవాలు ఈ తరం వారికి తెలియాల్సిన అవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అప్పటి ఎమర్జెన్సీలో పాల్గొన్న వారిని కిరణ్ రిజుజు సత్కరించారు. -
లైంగిక వేధింపుల కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ: ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం దినేశ్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఎంఎం ఖాన్ హత్యకేసును పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దినేశ్ ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీసుల గూండాగిరిని మీరు స్వయంగా చూస్తున్నారు.. వాళ్లు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు’ అని విలేకరులనుద్దేశించి అన్నారు. నీళ్ల కోసం వెళ్తే తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ దినేశ్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నీళ్ల గురించి మరోసారి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి, తోసేశారని ఆమె చెప్పారు. దినేష్ మోహనియాపై కేసు పెట్టి.. అతడిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
ఆ ఎమ్మెల్యేలు బడికే వెళ్లలేదట!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల మాటల వెనుక అసలు నిజాలు వేరే ఉంటాయంటారు. అసలు కార్యం పూర్తయితే తప్ప ఆ విషయం బయటకు రాదు.. రానివ్వరు అని చెబుతుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఇది కాస్త రుజువైంది. తమ పార్టీ నేతలంతా బాగా చదువర్లు, ఉన్నత చదువులు చదివిన వాళ్లు.. ఎంబీఏ, ఇంజినీరింగ్ అని పేర్కొంటూ వివిధ రంగాల్లో కూడా ఆరితేరిన వారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మాటలన్ని కల్లలే అని తెలిసిపోయింది. ఎందుకంటే.. ఆయన ఎమ్మెల్యేల్లో మొత్తం 23 మంది కేవలం స్కూల్ స్థాయి చదువులే చదివారంట. అది కాకుండా ఏనాడు వీరు కనీసం ఆ క్లాసులకు కూడా పూర్తిగా వెళ్లలేదని తెలిసింది. ఎన్నికల కమిషన్‌కు నామినేషన్ సమయాల్లో సమర్పించిన అఫిడ్ విట్ లో ఈ విషయాలు పేర్కొన్నారు. దీని ప్రకారం 20మంది ఎమ్మెల్యేలు ప్రాథమిక, మాధ్యమిక విద్యను మాత్రమే పూర్తి చేశారు. ఇక ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతోపాటు మరో ఇద్దరు డిప్లోమా వరకు చదివారంట. 26మంది ఆప్ ఎమ్మెల్యేలో నరేశ్ బాల్యన్, హజారీ లాల్ చౌహాన్, రాజు దింగాన్, అవతార్ సింగ్ అనే నలుగురు నేతలు కేవలం 8వ తరగతి పూర్తి చేయగా మరికొందరు ఐదు, ఇంకొందరు పదో తరగతి పూర్తి చేశారని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీళ్లలో ఏ ఒక్కరు కూడా రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్లేవారు కాదంట. ఈ వివరాలు బయటకు రావడంతో విలువలు, నీతి అంటూ పార్టీ పెట్టి అందరు అవాక్కయ్యేలా ప్రసంగాలు ఇచ్చిన కేజ్రీవాల్ కూడా అబద్ధాలు చెబుతారా అని సామాన్యులు ఇప్పుడు విస్తుపోతున్నారు. -
మహిళా ఎమ్మెల్యేకు అరుదైన బర్త్ డే గిఫ్ట్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే రాఖీ బిర్లాకు శుక్రవారం పుట్టినరోజు సందర్భంగా అపురూపమైన కానుక లభించింది. ఆమె తన పుట్టినరోజు నాడు ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.. డిప్యూటీ స్పీకర్ పదవికి రాఖీ పేరును ప్రతిపాదించగా, సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. గతవారం రాజీనామా చేసిన బందన కుమారి స్థానంలో రాఖీ ఈ పదవికి ఎన్నికయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు తిరుగులేని మెజారిటీ ఉన్న ఉంది. -
'ప్లీజ్.. అంటే సోనియా వింటుందా?'
న్యూఢిల్లీ: 'ప్లీజ్ సోనియా గాంధీ గారు.. హెలికాప్టర్ల స్కామ్ లో ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండి ప్లీజ్..! అని అడిగితే ఆవిడ నిజం చెబుతుందా? కచ్చితంగా చెప్పదు. అందుకే సోనియా గాంధీని అరెస్ట్ చెయ్యాలి. లాకప్ లో ఉంచి రెండంటే రెండు రోజులు విచారిస్తే నిజానిజాలు వాటంతట అవే తన్నుకొస్తాయి. కానీ సోనియాను జైల్లో పెట్టాల్సింది ఎవరు? అంత దమ్ము 56 ఇంచుల ఛాతీ ఉందని చెప్పుకునే నరేంద్ర మోదీకి ఉందా?' అంటూ ఒకేసారి అటు అధికార , ఇటు విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల స్కాంలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జంతర్ మంతర్ వద్ద ఆప్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. 'అగస్టా కుంభకోణంపై ఇటలీ కోర్టు ఇచ్చిన నివేదికలో సోనియా గాంధీతోపాటు ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పేర్లు స్పష్టంగా ఉన్నాయి. ఇవి వెలుగులోకి వచ్చి నాలుగేళ్లు దాటింది. భారత్ ను అవినీతి రహిత దేశంగా మార్చుతామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి నరేంద్ర మోదీ రెండేళ్ల కిందట ఎన్నికల్లో గెలిచారు. మరి అగస్టా విషయంలో ఆయన ఇంతకాలం ఎందుకు సైలెట్ గా ఉన్నారు? ఆధారాలున్నా చర్యలు తీసుకోలేదెందుకు? అలాంటప్పడు సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు ఉండి లాభం ఏమిటి? వాటిని వెంటనే మూసేయండి' అని కేజ్రీవాల్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. భార్యాభర్తలు కీచులాడుకోరా? 'చిన్నచిన్న కేసులకే ఆమ్ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యేలను జైళ్లలో పెట్టించిన మోదీ.. ఇంత పెద్ద స్కాం విషయంలో మౌనంగా ఉండటం ఆయన చేతగాని తనానికి నిదర్శనం. ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి, భార్యతో తగువులాడాడని ఐదురోజులు కటకటాల్లోకి నెట్టారు. ఏం.. భార్యా భర్తలు కీచులాడుకోరా? రేప్ ఘటనపై ఆందోళన చేసిన మరో ఎమ్మెల్యేని నాలుగు రోజులు బొక్కలో వేశారు. లంచంపై పోరాడిన ఓ ఆర్మీ ఆఫీసర్ ను రెండు రోజులు స్టేషన్ లో ఉంచారు. అయ్యా మోదీ గారు.. మీ ప్రతాపం చిన్నవాళ్లపైనేనా? పెద్దవాళ్ల జోలికి వెళ్లరా? లేక కాంగ్రెస్ వాళ్లతో పెట్టుకుంటే మీ కూసాలు కూడా కదలిపోతాయని భయమా?' అంటూ అగస్టా స్కాంలో సోనియాపై చర్యలకు వెనకాడుతున్న ప్రభుత్వం తీరును కేజ్రీవాల్ ఎండగట్టారు. హరియాణా, రాజస్థాన్ లలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపణలున్నాయని, ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీనే అధికారంలో ఉందని, అలాంటప్పుడు వాద్రాపై ఎంక్వైరీ ఎందుకు వేయడంలేదని అరవింద్ ప్రశ్నించారు. -
ఈ పథకాలకు ఏమైంది?
► అభయహస్తం, ఆమ్ఆద్మీ అమలులో అంతులేని నిర్లక్ష్యం ► రెండింటిలోనూ జిల్లా లాస్ట్ ► అవగాహన లోపంతోనే సమస్య ప్రచార లేమి.. అవగాహన లోపం.. ఆపై అధికారుల బాధ్యతారాహిత్యం.. వెరసి అభయహస్తం, ఆమ్ఆద్మీ పథకాలు అటకెక్కాయి. ఫలితంగా కొందరు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా చివరిస్థానంలో ఉంది. కోవూరు: జిల్లాలో అభయహస్తం పథకంలో 1,36,194 మంది ఉన్నారు. వారిలో 62,353 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. ఈ పథకం సభ్యులు సాధారణంగా మృతి చెందితే రూ.30 వేలు, పూర్తి అంగవైకల్యం అయితే రూ.37,500, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.70 వేలు అందుతోంది. సభ్యులకు 60 సంవత్సరాలు పైబడితే నెలకు రూ.500 నుంచి రూ.2,200 వరకు పింఛను పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఆమ్ఆద్మీ విషయానికి వస్తే మొత్తం 1,13,349 మంది సభ్యులున్నారు. వీరిలో 61,835 మంది మాత్రమే రెన్యువల్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందులో 8406 మంది ఆమ్ఆద్మీకి అర్హులు కాదంటూ నిర్ధరించి వాటిని అధికారులు తొలగించారు. ఈ పథకంలో వివి ధ రకాల పనులు చేసే కూలీలతో పాటు బయట వ్యక్తులకు కేవలం రూ.15 చెల్లిస్తే ఈ పథకంలో రెన్యూవల్ చేసుకున్నారు. ప్రభుత్వం వీరి తరఫున మరో రూ.320 జమ చేస్తుంది. సగంమంది మాత్రమే: డీఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యంతోనే రెండు పథకాల అమలు నత్తనడకన సాగుతోంది. పథకాలపై అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. రెన్యువల్ చేయడంలోను సిబ్బంది శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా చివరిస్థానంలో ఉంది. రెన్యువల్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు: అభయహస్తం,ఆమ్ఆద్మీ పథకాల రెన్యువల్ చేయించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేవలం అధికారుల లెక్కల కోసమే చెబుతున్నారు. మే ము కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి.- రమణమ్మ, చెర్లోపాళెం సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉంది: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమ్ఆద్మీ, అభయహస్తం పథకాలను రెన్యువల్ చేయడంలో నెల్లూరు జిల్లా చివరిస్థానంలో ఉండటం వాస్తవమే. ఇందుకు సిబ్బంది నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది సిబ్బందికి మెమోలు జారీ చేసాం. కొందరు సకాలంలో పనిచేసిన మరికొందరు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. అభయహస్తం, ఆమ్ఆద్మీలకు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పడం వాస్తవమే. -మురళీ, ఇన్సూరెన్స్ డీపీఎం -
వివాదంలో మరో ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో ఇరుకున్నారు. గత నెల రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంతో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్.. ప్రధాని నరేంద్ర మోదీని అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక్ గార్గ్ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 504 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా ఈ ఎఫ్ఐఆర్లో ఆప్ ఎమ్మెల్యే పేరును సాంకేతికంగా చేర్చలేదు. రెడ్ ఫోర్ట్ వద్ద అమానతుల్లా ఖాన్ చేసిన ప్రసంగం వీడియోను పోలీసులు పరిశీలించారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ్ పార్టీ నాయకులతో కలసి ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్‌ను కలసి.. అమానతుల్లా ఖాన్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అమానతుల్లా ఖాన్ ప్రసంగం వీడియోను కమిషనర్‌కు అందజేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా అమానతుల్లా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. -
'కేజ్రీవాల్ వచ్చినా అవినీతి అంతే ఉంది'
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఢిల్లీ వాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఓ సర్వే తేల్చింది. ఇప్పటికీ అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏమాత్రం తగ్గలేదని దాదాపు 77శాతం ఢిల్లీ ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పినట్లు సర్వే వెల్లడించింది. స్వరాజ్ అభియాన్ అనే సంస్థ ఫిబ్రవరి 10 నుంచి 14వరకు తన కార్యకర్తలతో దాదాపు పది నియోజకవర్గాల్లో 10 వేల ఢిల్లీ కుటుంబాలని ఆప్ సర్కార్ పనితీరుపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం విద్యుత్ ఛార్జీలు ఏమాత్రం తగ్గలేదని 62శాతంమంది చెప్తుండగా.. ప్రతి నెల 20 వేల లీటర్ల తాగు నీరు ఇస్తామన్న హామీ కూడా అమలు కావడం లేదని వారు చెప్పినట్లు సర్వే పేర్కొంది. రామ్ లీలా మైదాన్ లో ఎలాంటి జన్ లోక్ పాల్ తీసుకొస్తానని కేజ్రీవాల్ చెప్పారో అది తీసుకురాలేదని 86శాతంమంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించింది. ఇక రేషన్ షాపుల్లో కూడా అవినీతి దందా ఆగడం లేదని పేర్కొంది. స్వరాజ్ అభియాన్ సంస్థను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి బహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
పన్ను మినహాయింపు పరిమితి రూ.4 లక్షలకు పెంచండి
కేంద్రానికి అసోచామ్ సూచన న్యూఢి ల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రానున్న బడ్జెట్లో రూ.4 లక్షలకు పెంచాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ కేంద్రాన్ని కోరింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. సేవింగ్స్‌కు సంబంధించి మరిన్ని ప్రోత్సాహకాలను అందించాలని పేర్కొంది. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ నిధుల కేటాయింపు పెరగాల్సి ఉందని తెలిపింది. అసోచామ్ ఇటీవల ‘ఆమ్ ఆద్మీ’ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న 87% మంది పన్ను మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. నిత్యావసర జీవన ప్రమాణ ధరల పెరుగుదల నేపథ్యంలో పరిమితి పెంపు ఆవశ్యకమని అసోచామ్ పేర్కొంది. ప్రస్తుతం సెక్షన్ 80డీ ప్రకారం ఉన్న వార్షిక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు పరిమితిని రూ.15,000 నుంచి రూ.50,000 వరకు పెంచాలని సర్వేలో పాల్గొన్న 88 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లల చదువు ఖర్చుల పరిమితిని కూడా నెలకు రూ.100 నుంచి రూ.1,000 వరకు పెంచాలని అసోచామ్ పేర్కొంది. అలాగే ప్రసు ్తతం ఇద్దరి పిల్లలకు ఇస్తున్న హాస్టల్ ఖర్చుల పరి మితిని నెలకు రూ.300 నుంచి రూ.3,000 వరకు పెంచాలని తెలిపింది. ఇంటి రుణాల వడ్డీరేట్లు పెరుగుతుండటం, ప్రాపర్టీ ధరలు ఎగయడం వంటి అంశాల నేపథ్యంలో వ్యక్తిగత ప్రాపర్టీ వడ్డీరేట్ల మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని పేర్కొంది. -
లైంగిక వేధింపుల కేసులో ఆప్ ఎమ్మెల్యే సోదరుడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోదరుడుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆప్ ఎమ్మెల్యే భావనగౌర్ సోదరుడు క్షితిజ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో వారు కేసు నమోదుచేశారు. 2015లో క్షితిజ్ సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఫిర్యాదు చేసిన మహిళ అంతకుముందు క్షితిజ్ తో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. గూర్గావ్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదుచేసుకొని విచారణ ప్రారంభించారు. -
'ఆప్' ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే మహేంద్ర యాదవ్ ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆయనను తిస్ హజరీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయనను రిమాండ్ ఇవ్వాలని పోలీసులు కోరనున్నారు. వికాస్ పురి అసెంబ్లీ నియోజకవర్గానికి మహేంద్ర యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు వేర్వేరు కేసుల్లో ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం గమనార్హం. -
ఆప్ ఎంపీని ఆదుకున్న మోదీ
- ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చి అలసిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మన్ - మంచినీళ్లు అందించి దాహార్తి తీర్చిన ప్రధానమంత్రి న్యూఢిల్లీ: శత్రువైనాసరే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోమని చెప్పే కర్మభూమి మనది. అందుకేనేమో నరేంద్ర మోదీ.. పదవీమర్యాదలు పక్కనపెట్టిమరీ దాహంతో అల్లాడుతున్న విపక్ష ఎంపీకి మంచినీళ్లు అందించి సభ చేత శెభాష్ అనిపించుకున్నారు. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన అరగంటకు చోటుచేసుకున్న ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. సభలో అసలేం జరిగిందంటే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆఫీసుపై సీబీఐ దాడులపై చర్చించాల్సిందిగా ఆప్ ఎంపీ భగవత్ మన్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ తీరును నిరసిస్తూ భగవత్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద పెట్టున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆయనకు బాసటగా నిలిచారు. దీంతో వెల్ మొత్తం విపక్ష ఎంపీలతో నిడిపోయింది. సరిగ్గా ప్రధాని కూర్చున్న స్థానానికి ముందే నిలబడి నిరసన తెలుపుతున్న భగవత్.. అలసటతో మంచినీటి కోసం అటూ ఇటూ వెదికారు. ఆయన దాహార్తిని అర్థం చేసుకున్న మోదీ.. తన టేబుల్ మీదున్న గ్లాసును భగవత్ కు అందించారు. ఆప్ ఎంపీ ఒక్క గుక్కలో గ్లాసును ఖాళీచేసి తిరిగి టేబుల్ మీద ఉంచగా, మోదీ ఆ గ్లాసుపై మూత పెట్టేశారు. అంతే, ప్రధాన మంత్రి చర్యను ప్రశంసిస్తూ బీజేపీ సభ్యులు బల్లలు చరిచారు. దాహం తీరిన భగవత్ ఆందోళన కొనసాగించారు. నిరసన తెలుపుతున్న ఎంపీలు అడ్డుండటంతో ప్రధాని టేబుల్ వద్ద చోటుచేసుకున్న ఈ సంఘటనను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చూడలేకపోయారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. -
'బెదిరింపులకు మేం భయపడం'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు భగ్గుమన్నారు. సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆప్నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై ఎవరేమన్నారంటే.. కేంద్రం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ బెదిరింపులకు మేం భయపడం. - ఆప్ నేత సంజయ్ సింగ్ మోదీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోంది. - ఆప్ నేత కుమార్ విశ్వాస్ సీఎం కార్యాలయంలో సోదాలు చేయలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ ఆఫీసులోనే దాడులు చేసాం. - సీబీఐ నా కార్యాలయంలోనే సోదాలు చేశారు. మోదీ డైరక్షన్లో దాడులు చేశారు. - కేజ్రీవాల్ పీఎంను విమర్శించడం కేజ్రీవాల్‌కు ఫ్యాషన్ అయిపోయింది. - వెంకయ్య నాయుడు -
హజారేతో 'ఆప్' నేతల భేటీ
రాలెగావ్ సిద్ధి(మహారాష్ట్ర): ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్ మంగళవారం అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారేను కలిశారు. ఢిల్లీ అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనలోక్ పాల్ బిల్లు గురించి హజారేకు వివరించారు. ఈ బిల్లులోని ముఖ్యాంశాలను ఆయన తెలిపారు. దీని ద్వారా అవినీతిని సమర్థవంతంగా అరికడతామని పేర్కొన్నారు. హజారేను ఆప్ నాయకులు కలిసిన విషయాన్ని ఆయన అనుచరుడు దత్త అవారి ధ్రువీకరించారు. జనలోక్ పాల్ బిల్లును కేజ్రీవాల్ సర్కారు సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును తెచ్చింది. 2011లో తయారు చేసిన జనలోక్ పాల్ బిల్లుకు ఇది సమానంగా ఉంటుందని 'ఆప్' వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. -
వివాదంలో ఆప్ ఎమ్మెల్యే సరితా సింగ్
-
వివాదంలో ఆప్ ఎమ్మెల్యే సరితా సింగ్
న్యూఢిల్లీ : మరో ఆప్ ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సంఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే సరితా సింగ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే కారు డ్రైవర్ ... పోలీసులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వివాదం నెలకొంది. అయితే ఈ ప్రమాదం నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఓం పాల్ గాయాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులకు, డ్రైవర్ కు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సరితా సింగ్..పోలీసులను బెదిరించటమే కాకుండా అసభ్యంగా దుర్భాషలాడారు. ఈ సంఘటన ఢిల్లీలోని రోహ్తాస్ నగర్ ఏరియాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇదంతా ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో చిత్రీకరించటంతో, అదికాస్త మీడియాలో వైరల్ అయింది. కాగా పోలీస్ అధికారి ఓం పాల్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సరితా సింగ్ పై కేసు నమోదు అయింది. సెక్షన్ 186, 279ల కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ వీను బన్సాల్ తెలిపారు. కాగా జరిగిన సంఘటనపై తాను కూడా బజన్పూరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే సరితా సింగ్ తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులను కలిసి జరిగిన సంఘటనను వివరిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే ఆప్ పార్టీ ఎమ్మెల్యే అయినందువల్లే పోలీసులు తమపై ఆరోపణలు చేసి, వేధింపులకు గురి చేస్తున్నారని సరితా సింగ్ ఆరోపించారు. -
ఎమ్మెల్యేల కుటుంబాలతో సీఎం భేటీ
బలం.. కావాల్సిన దానికంటే ఎక్కువే. ఇంకా చెప్పాలంటే చట్టసభలో ప్రత్యర్థులే లేరు. కానీ.. పార్టీలో ఏదో అలజడి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ. గెలిచిన కొద్ది రోజులకే ఒకరిద్దరు ఎమ్మెల్యేల తిరుగుబావుటా, వరుసగా ఉద్వాసనకు గురవుతున్న మంత్రులు, వారిలో కొందరి అరెస్టులు.. ఇలా మలుపులతో సాగిపోతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ నౌక.. ఈ సాయంత్రం కాస్తంత సేద తీరింది. పార్టీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలతో సీఎం, సీఎంతో ఎమ్మెల్యేలు మనసువిప్పి మాట్లాడటంతో సర్వత్రా ఊరట లభించింది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో, మరి కొదరిని ఎందుకు పట్టించుకోలేదో తదితర అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలకు వివరించినట్లు తెలిసింది. అనూహ్యపరిణామాలపట్ల ఆయా కుటుంబాల్లో ఆందోళన చెలరేగడం సహజమేనని, అయితే, రాజకీయాల్లో ఇలాంటివి సహజంగానే భావించాలని ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు సీఎం కేజ్రీవాల్ సూచించారని సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాదిన్నర తర్వాతైనా కుటుంబాలతోసహా తమతో కేజ్రీవాల్ మనసువిప్పి మాట్లాడటం ఆనందం కలిగించిందని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇటీవలే అవినీతి కేసులో ఇరుక్కున్న ఆరోగ్య, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఆసిమ్ అహ్మద్ ఖాన్ పదవీచ్యుతుడయ్యారు. ఈయనతో కలిపి గడిచిన ఎనిమిది నెలల్లో కేజ్రీవాల్ మంత్రివర్గం నుంచి ఆరుగురు సభ్యులు బయటకు వచ్చారు. భార్యపై హత్యాయత్నం కేసులో సోమనాథ్ భారతి జైలుపాలయ్యారు. జూన్ నెలలో నకిలీ డిగ్రీల కేసులో జితేందర్ సింగ్ తోమర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఇది సామాన్యుడి జీతమా !?
న్యూఢిల్లీ: ‘మంచి రోజులు వస్తున్నాయి’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారంలో ఎంత వాస్తవముందో తెలియదుగానీ ఢిల్లీ ఎమ్మెల్యేలకు మాత్రం మంచి రోజులు వస్తున్నాయంటూ సామాజిక వెబ్సైట్ ‘ట్విట్టర్’లో విమర్శల వర్షం కురుస్తోంది. ఢిల్లీ ఎమ్మెల్యేకు ప్రస్తుతమున్న వేతనాలు 88 వేల రూపాయలను (కరువు, ఇతర భత్యాలను కలుపుకొని) 2.10లక్షల రూపాయలకు పెంచాలంటూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్య్ర పానెల్ సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఏకంగా 400 శాతం పెంపును సిఫార్సు చేయడం ఏమిటని ట్విట్టర్ యూజర్లు ‘ట్వీట్లు తొక్కారు’. వారి ట్వీట్లు ఇలా ఉన్నాయి.....‘మంచి రోజులు ఆప్ ఎమ్మెల్యేలకే ఉన్నాయి... ఆమ్ ఆద్మీ కాస్త ఖాస్ ఆద్మీగా మారిపోయింది....ఆమ్ ఆద్మీ బికమ్ ఏ అంబానీ ఆద్మీ! ఫుల్ యాష్ కర్లో భాయ్! ఫిర్ కబీ ఎమ్మెల్యే బనే కా మౌకా మిలే న మిలే.....మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలూ ఎలాగు లేవు. ఈ ఐదేళ్లలో ఎంత దోచుకుంటే అంత దోచుకోండి ఖజానాను....ఢిల్లీ ఎమ్మెల్యేలకు నాలుగు రెట్లు జీతం పెరుగుతోంది. ఢిల్లీలో నాలుగు రెట్లు డెంగ్యూ మృతులూ పెరిగారు...సిగరెట్లు, విదేశీ మద్యం విపరీతంగా పెరిగింది, ఎమ్మెల్యే జీతాలు పెరిగాయి....400 శాతం జీతం పెంపు, ఇది ఆమ్ ఆద్మీ జీతమా?...ఆమ్ ఆద్మీ పార్టీ పేరును వీవీఐపీగా మార్చుకోండి’ ఇలా విమర్శల వర్షం కురవగా, ‘వంద శాతమో, రెండు వందల శాతమో పెంచుకొని, మిగతా సొమ్మును త్యాగం చేశామని చెప్పండి....కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు జీతభత్యాలతోపాటు, బెదిరింపులతో దండుకునే సొమ్ము, కమీషనల్ల ద్వారా వచ్చే సొమ్ము అదనం కాగా, ఆమ్ ఆద్మీకి కేవలం జీతభత్యాలే వస్తాయి’ అంటూ కొన్ని సానుకూల స్పందనలు కూడా వచ్చాయి. ఇంకా తాము స్వతంత్య్ర కమిటీ చేసిన వేతన సిఫార్సులను ఆమోదించలేదని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన ప్రకటనను ట్విట్టర్ యూజర్లు పట్టించకున్నట్టు లేదు. అంతేకాదు, ఇప్పటి వరకు ఢిల్లీ ఎమ్మెల్యేలకు ఉచితంగా ఇస్తున్న వసతి, విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలకు చార్జీలు వసూలు చేయాలంటూ స్వతంత్య్ర కమిటీ చేసిన మరో ముఖ్యమైన సిఫార్పును కూడా పరిగణలోకి తీసుకున్నట్టు లేదు. ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 మంది శాసన సభ్యులు ఉండగా, బీజేపీకి కేవలం ముగ్గురు సభ్యులు ఉన్న విషయం తెల్సిందే. -
సుప్రీంలో సోమ్‌నాథ్ భారతికి నిరాశ
న్యూఢిల్లీ: గృహ హింస, హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. సోమ్‌నాథ్ భారతికి బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సోమ్‌నాథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించవలసిందిగా ఆయనకు సూచించింది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరిగిన సోమ్‌నాథ్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసింది. -
సోమ్‌నాథ్‌కు రెండు రోజుల పోలీస్ కస్టడీ
న్యూఢిల్లీ: గృహహింస, హత్యాయత్నం కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. మంగళవారం ఢిల్లీ కోర్టు ఈ మేరకు ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం సోమ్‌నాథ్ భారతి ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన్ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ నిమిత్తం సోమ్‌నాథ్‌ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోరగా.. సోమ్‌నాథ్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం సోమ్‌నాథ్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. -
అజ్ఞాతంలోకి సోమ్నాథ్భారతీ
-
మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందే
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి పోలీసులకు లొంగిపోవాల్సిందేనని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన ఎందుకు పారిపోతున్నారని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. జైలుకు వెళ్లడానికి ఆయన ఎందుకంత భయపడిపోతున్నారని అడిగారు. ఇప్పుడు సోమనాథ్ భారతి ఇటు పార్టీతో పాటు అటు ఆయన కుటుంబానికి కూడా తలనొప్పిగా మారారంటూ చిరాకు పడ్డారు. పోలీసులతో ఆయన సహకరించాలని కేజ్రీవాల్ తెలిపారు. నకిలీ న్యాయపట్టాతో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన జితేందర్ సింగ్ తోమర్ వ్యవహారంతోనే సగం తలనొప్పి వచ్చిన కేజ్రీవాల్‌కు.. తాజాగా సోమనాథ్ భారతి విషయం మరింత చిరాగ్గా మారింది. ఆయన తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ సోమనాథ్ భార్య లిపికా మిత్రా ఆరోపించడం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. Somnath shud surrender.Why is he running away?Why is he so scared of gng to jail? Now he is becoming embarasment for party n his family(1/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) September 23, 2015 He shud cooperate wid police(2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) September 23, 2015 -
అజ్ఞాతంలోకి సోమ్నాథ్భారతీ
ముందస్తు బెయిలు నిరాకరణ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీకి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిలును మంగళవారం నిరాకరించింది. సోమ్‌నాథ్ భార్య లిపికా మిత్రా నమోదు చేసిన గృహహింస కేసులో పూర్తి ధృవప్రతాల రుజువులతో ఆరోపణలు చేశారని న్యాయమూర్తి జస్టిస్ సురేశ్కైత్ వ్యాఖ్యానించారు. ఇంతకాలంగా ఆమె తన భర్త వేధింపులను భరిస్తూ వచ్చారని ఆయన అన్నారు. లిపికా గర్భవతిగా ఉన్నప్పుడు కుక్కను ఉసిగొల్పి అమానుషంగా ప్రవర్తించినట్లు మెడికల్ రిపోర్టు స్పష్టం చేస్తోందన్నారు. హైకోర్టు సోమ్‌నాథ్ భారతీ ముందస్తు బెయిలు పిటిషన్ తోసిపుచ్చిన వెంటనే ఢిల్లీపోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకురంగంలోకి దిగారు. అయితే తాను అరెస్టు కాకుండా సోమ్‌నాథ్ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంటిదగ్గర కానీ, పార్టీ ఆఫీసులో కానీ ఆయన లేకపోవటంతో భారతీ సోదరుడు, వ్యక్తిగత కార్యదర్శిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు తెచ్చుకోవాలని భారతీ ప్రయత్నిస్తున్నారు. -
'మాజీ మంత్రి అరెస్టు కోసం పోలీసుల హంటింగ్ '
న్యూఢిల్లీ: భార్యను హింసించిన కేసు నుంచి బయటపడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతీ ముప్పుతిప్పలు పడుతున్నారు. ఓ పక్క ఎక్కడ కనిపిస్తే అక్కడే ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించాలని పోలీసులు చూస్తుండగా వారికి మాత్రం ఆయన జాడ ఏ మాత్రం దొరకడం లేదు. తనను అరెస్టు చేయకుండా ఉండేలా పోలీసులను ఆదేశించాలంటూ సోమనాథ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం ఆయన నివాసానికి, మరో బృందం ఆయన కార్యాలయానికి వెళ్లాయి. కానీ ఆ రెండు చోట్ల ఆయన లేకపోవడంతో పోలీసులు ఇప్పుడు ఆయనకోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సౌత్ వెస్ట్ జాయింట్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ మీడియాతో మాట్లాడుతూ సోమనాథ భారతీ అరెస్టు నుంచి తప్పించుకుంటున్నారని చెప్పారు. తమ వద్ద ఆయన భార్య లిపికా మిత్రా చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు లిఖిత పూర్వక ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. పోలీసులు ప్రస్తుతం ఆయనకోసం గాలింపులు మొదలుపెట్టారని వివరించారు. -
ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో ఎమ్మెల్యే అరెస్టు
ప్రభుత్వోద్యోగిపై దాడి చేసి, ఆయన తన విధులను నిర్వర్తించనివ్వకుండా అడ్డుకున్నందుకు, కులం పేరుతో దూషించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కమాండో సురేందర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తును ఢిల్లీ కోర్టు తిరస్కరించడంతో.. అరెస్టు తప్పనిసరి అయ్యింది. అరెస్టు చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యేను వైద్య పరీక్షల కోసం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. గతంలో ఎన్ఎస్జీ మాజీ కమాండోగా పనిచేసిన సురేందర్ సింగ్.. ఈనెల 4వ తేదీన న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ)లోని శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్జే మీనాను తిట్టి, కొట్టారన్న ఆరోపణలున్నాయి. ఆక్రమణలను పరిశీలించేందుకు తన బృందంతో రాగా.. ఆయనతో పాటు బేల్దార్ ముఖేష్ మీద సురేందర్ సింగ్ దాడి చేశారు. ఈ రిక్షా డ్రైవర్‌ను పత్రాలు చూపించమన్నందుకు ఆయన ఈ దాడి చేశారని చెబుతున్నారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు అశుతోష్ మాత్రం.. మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎన్జీ ఫిట్నెస్ స్కాములో అవినీతిపరులను మోదీ ప్రభుత్వం రక్షిస్తుంది గానీ, 26/11 ఉగ్రదాడి సమయంలో బుల్లెట్లను ఎదుర్కొన్న దేశభక్తుడిని అరెస్టు చేస్తుందని ఆయన ఆరోపించారు. -
'ఆ ఎమ్మెల్యే.. ఓ డ్రగ్ ఎడిక్ట్'
తనపై దాడి జరిగిందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబా.. నిజానికి ఓ డ్రగ్ ఎడిక్ట్ అని బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ ఆరోపించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్లే ఆమెపై దాడి జరిగి ఉంటుందని ఆయన అన్నారు. అయితే.. ఈ ఘటన తర్వాత చాందినీ చౌక్ ఎమ్మెల్యే అయిన లాంబాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ అనుచరులైన కొందరు గూండాలు చాందినీ చౌక్ ప్రాంతంలో దుకాణాలను తగలబెట్టారని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే లాఠీలు పట్టుకునే బీజేపీ కార్యకర్తలు గట్టిగా ఎదుర్కొంటారని హెచ్చరించారు. తెల్లవారుజామున, రాత్రి ప్రాంతాల్లో అల్కా లాంబా ఇక్కడ కనిపించినట్లు స్థానికులు చెప్పారని, డ్రగ్స్‌ను అరికట్టాలని పోరాడేవాళ్లు అర్ధరాత్రి 1 నుంచి 4 గంటల సమయంలో అక్కడకు రారని శర్మ అన్నారు. దీన్ని బట్టి చూస్తే, ఆమే డ్రగ్స్‌కు బానిస అన్న విషయం తెలుస్తోందన్నారు. తనకు మహిళలంటే చాలా గౌరవమని, అయితే.. ఫూలన్ దేవి లాంటి వాళ్లను మహిళా శక్తికి నిదర్శనంగా చూపాలనుకుంటే మాత్రం కుదరదని చెప్పారు. డ్రగ్స్ మత్తులోనే ఆమె హింసాత్మకంగా ప్రవర్తించారని శర్మ విలేకరులతో వ్యాఖ్యానించారు. -
ఆప్ మహిళా ఎమ్మెల్యేపై దాడి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నాయకురాలు, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. మాదక ద్రవ్యాల్ని నిరోధించాలని పిలుపునిస్తూ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే చేపట్టిన ప్రత్యేక ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీ.. ఉత్తర ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతానికి చేరుకోగానే గుర్తుతెలియని దుండగులు ఎమ్మెల్యే అల్కా సహా ఆమె అనుచరులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో అల్కా తలకు బలమైన గాయం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా స్పందించిన కార్యకర్తలు అల్కాను హుటాహుటిన అరుణా అసఫ్ అలీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కొద్దిసేపటికి ఆమె డిశ్చార్జి అయ్యారు. 'మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాపై దాడి చేశారు. నా తల పగలగొట్టారు. రక్తం కళ్లజూశారు. అయినాసరే వెనకడుగు వేసేదిలేదు. మత్తులో జోగుతున్నవారిని జాగృతం చేసేవరకు పోరాడుతూనే ఉంటా' అని దాడి అనంతరం అల్కా ట్వీట్ చేశారు. -
ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేపై కాల్పులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈశ్వర్ కాలనీలోని తన కార్యాలయం వెలుపలే వేద ప్రకాశ్ పై దుండగులు కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. బవానా నియోజకవర్గానికి వేద ప్రకాశ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
ఆప్ మరో ఎమ్మెల్యే అరెస్ట్
భూకబ్జా, మోసం కేసులో అదుపులోకి.. న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒక భూకబ్జా కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్‌ను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం ఇది రెండోసారి. తూర్పు ఢిల్లీలోని కొండ్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మనోజ్కుమార్పై భూకబ్జా ఆరోపణలున్నాయి. దీంతోపాటు ఆయన మోసానికి పాల్పడ్డారని ఏడాది కిందట కేసు కూడా నమోదైంది. ఈ కేసులో పోలీసులు మనోజ్‌కుమార్‌ను గురువారం విచారణకు పిలిపించారు. కొంతసేపు ప్రశ్నించిన అనంతరం.. అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 468 (మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీ), 471(నకిలీ పత్రాలను అసలైనవిగా చూపడం), 420 (మోసం), 120బీ (నేరపూరిత కుట్ర) సెక్షన్లను నమోదు చేసినట్లు ఢిల్లీ ఉత్తర రేంజ్ జాయింట్ కమిషనర్ సంజయ్ బెనివాల్ చెప్పారు. మనోజ్‌కుమార్‌ను ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 2 రోజుల పోలీసు కస్టడీకి జడ్జి అప్పగించారు. కాగా బీజేపీ ఢిల్లీ పోలీసులను ఆప్‌పై రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని ఆప్ మండిపడింది. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల మధ్య విభేదాల వల్లే, తాను ఆప్ ఎమ్మెల్యే కావడం వల్లే అరెస్టు చేశారని మనోజ్ పేర్కొన్నారు. ఏడాది కిందే కేసు నమోదైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదని.. ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అరెస్టు చేయడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. కాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్‌పై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే జర్నైల్‌సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం కల్పించింది. ఆయనను పోలీసులు అరెస్టు చేయకుండా సెప్టెంబర్ 7 వరకు గడువిచ్చింది. -
నకిలీ డిగ్రీ కేసులో మరో ఎమ్మెల్యే
ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ తర్వాత.. ఇప్పుడు మరో ఆప్ ఎమ్మెల్యే కూడా నకిలీ డిగ్రీల కేసులో చిక్కుకున్నారు. భావనా గౌర్ అనే మహిళా ఎమ్మెల్యే విద్యార్హతలు తప్పుడువంటూ దాఖలైన పిటిషన్ విచారణార్హమైనదేనని ఢిల్లీ కోర్టు భావించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల అధికారులకు అందజేసిన అఫిడవిట్లో ఆమె తప్పుడు వివరాలు పేర్కొన్నారంటూ ఈ పిటిషన్ దాఖలైంది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పంకజ్ శర్మ ఈ కేసును విచారణకు స్వీకరించారు. 2013 డిసెంబర్ ఎన్నికల్లో ఒకలా, 2015 ఫిబ్రవరి ఎన్నికల్లో మరోలా ఆమె తన విద్యార్హతలను పేర్కొన్నారన్నది ప్రధాన ఆరోపణ. నకిలీ డిగ్రీల కారణంగానే జితేందర్ సింగ్ తోమర్ తన న్యాయశాఖ మంత్రి పదవిని కోల్పోయిన నెల రోజుల లోపలే మరో ఆప్ ఎమ్మెల్యే ఇదే తరహా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ఎ కింద సమరేంద్రనాథ్ వర్మ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడతాయి. ఈ కేసును ఈనెల 25వ తేదీన విచారించాలని కోర్టు నిర్ణయించింది. 2013 ఎన్నికల్లో తాను 12వ తరగతి మాత్రమే చదివినట్లు పేర్కొన్న గౌర్ .. 2015లో మాత్రం తాను బీఏ, బీఈడీ చేసినట్లు చెప్పారు. కేవలం 14 నెలల కాలంలోనే బీఏ, బీఈడీ డిగ్రీలను ఆమె ఎలా పూర్తిచేశారని.. దాన్నిబట్టే ఆమె తప్పుడు విద్యార్హతలు చూపించినట్లు అర్థమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు అఫిడవిట్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా తప్పు అయి ఉండాలన్నారు. -
'మా ఆయనపై చర్యలు తీసుకోండి'
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మిత్ర కోరారు. సోమ్‌నాథ్ తనను హింసించినట్టు వీడియో ఆధారాలున్నాయని మిత్ర వెల్లడించారు. సోమనాథ్ భారతిపై ఆయన భార్య గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మహిళా కమిషన్‌ను మిత్ర ఆశ్రయించడంతో, సోమనాథ్ భారతికి సమన్లు జారీ చేశారు. సోమవారం మిత్ర మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి తన భర్తపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా, ఐదేళ్లుగా తన భార్యకు దూరంగా నివసిస్తున్నానని సోమనాథ్ భారతి చెప్పారు. కాగా సోమనాథ్ రాత్రి పూట మాత్రమే తన ఇంటికి వచ్చేవారని, ఈ విషయం ఇరుగుపొరుగు వారికి తెలుసని మిత్ర వెల్లడించారు. -
'రాష్ట్రాలతో ఎలాంటి తగువులు లేవు'
న్యూఢిల్లీ: రాష్ట్రాలతో కేంద్రానికి ఎలాంటి తగువులు లేవని.. ఢిల్లీ సర్కార్ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. 'మేము రాష్ట్రాలతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాము. కానీ, ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతోంది. అందుకే ప్రతి విషయాన్ని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పక్కదారి పట్టిస్తున్నారని' వెంకయ్యనాయుడు మండిపడ్డారు. రాజ్యాంగ బద్ధమైన అంశాల్లో కేంద్రం స్పష్టత మాత్రమే ఇస్తుందని పునరుద్ఘాటించారు. -
'వదంతుల వల్ల నా భర్త నన్ను వదిలివేశారు'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్‌పై ఆప్ మహిళా కార్యకర్త ఆరోపణలు చేశారు. తనకు ఆయనతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వదంతులను విశ్వాస్ ఖండించటం లేదని, దీనివల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని ఆమె ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యు)కు ఫిర్యాదు చేశారు. దీంతో తమ ముందు హాజరు కావలసిందిగా డీసీడబ్ల్యు కుమార్ విశ్వాస్‌కు, ఆయన భార్యకు నోటీసులు పంపించింది. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు వేర్వేరుగా లేఖలు రాసినప్పటికీ, స్పందన లేదని అందువల్లే మహిళా కమిషన్‌ను ఆశ్రయించానని ఆమె తెలిపారు. 2014 ఎన్నికల్లో కుమార్ విశ్వాస్ తరపున అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. రకరకాల పుకార్లు పుట్టించటం ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారాలనీ, ఆప్‌ను అప్రతిష్టపాల్జేయటం కోసం ప్రత్యర్థి పార్టీలు పుట్టిస్తున్న కథనాలని విశ్వాస్ సోమవారం ఖండించారు. 'కొన్నాళ్ల క్రితం సదరు మహిళ, బీజేపీ ప్రతినిధి సహా కొందరు వ్యక్తులు తనపై అబద్ధాలు పుట్టిస్తున్నారని, తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో బీజేపీ ప్రతినిధి పేరు కూడా ప్రస్తావించారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. అప్పుడు నాకు ఆమె కుమార్ భయ్యా ఏం చేయాలో చెప్పండంటూ మెయిల్ పంపించారు. అప్పుడు ఆప్ న్యాయ విభాగం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆమెకు సూచించింది' అని అన్నారు. డీసీడబ్ల్యు నోటీసులు అందిన తరువాత తగిన విధంగా స్పందిస్తానని ఆయన అన్నారు. తనపై వస్తున్న పుకార్లను ఖండించకపోవటంపై మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 'కేవలం ఈ వదంతుల వల్ల నా భర్త నన్ను వదిలేశాడు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. కుమార్ విశ్వాస్ ఆప్‌లో అందరికీ తెలిసిన నాయకుడు కాబట్టి ఇద్దరి మధ్య ఏదైనా ఉండవచ్చని భావించవచ్చు. అందుకే ఆయన వివరణ ఇవ్వాలని కోరుతున్నా. కానీ, ఆయన మాత్రం మాట్లాడటం లేదు'అని ఆందోళన చెందారు. డీసీడబ్ల్యు చైర్పర్సన్ బర్ఖాసింగ్ మాట్లాడుతూ 'ఆప్‌కు చెందిన ఈ పార్టీ కార్యకర్త కొద్ది రోజులుగా మా దగ్గరకు వస్తున్నారు. తమ సొంత పార్టీ కార్యకర్త వచ్చి ఆరోపిస్తున్నప్పుడు ఆయనకు(విశ్వాస్) వచ్చి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ వందంతుల ఆరోపణల వల్ల ఆమె వివాహ బంధం దెబ్బతినే అవకాశాలున్నాయి'అని అన్నారు. ఇదిలా ఉండగా, మహిళా కార్యకర్త ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ రాసినట్లు ఉత్తర ఢిల్లీలోని నందగిరి పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఐపీసీ 509 సెక్షన్, ఐటీ యాక్ట్ సెక్షన్ 67ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ న్యాయశాఖ మంత్రి తోమర్ నకిలీ న్యాయవాద డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారన్న ఆరోపణల వివాదం నుంచే ఆప్ బయటపడలేదు. అంతకు ముందు ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య, అంతలోనే కుమార్ విశ్వాస్ ఉదంతం.. ఇలా వరుస వివాదాలు ఆప్‌ను సతమతం చేస్తున్నాయి. -
ఇంతకీ ఈ కేసు ఎవరు దర్యాప్తు చేయాలి?
న్యూఢిల్లీ: దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు 'మీరంటే మీరు కారణం' అంటూ ఓ పక్క రాజకీయ పార్టీలు కొట్టుకు చస్తుంటే మరోపక్క కేసును ఎవరు దర్యాప్తు చేయాలి ? ఎవరిదా అధికారం ? అన్న అంశంలో జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ పోలీసు అధికారులు సంఘర్షణ పడుతున్నారు. ఒకవేళ జిల్లా మేజిస్ట్రేటే దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తే అది పోలీసు అధికారుల దర్యాప్తులో వెలువడిన అంశాలకు భిన్నంగా ఉంటే అనవసర గందరగోళానికి దారితీస్తుందని, పైగా కోర్టు ముందు అభాసుపాలు కావాల్సి వస్తుందని సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ పోలీసు కమిషనర్లు వాదిస్తున్నారు. ఇప్పటికే కేసుపై జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. ఈ కేసు మీ పరిధిలోకి రాదంటూ ఢిల్లీ పోలీసు అధికారులు జిల్లా మేజిస్ట్రేట్‌కు తెలియజేయడంతో వివాదం మొదలైంది. కేసు దర్యాప్తును ఇప్పటికే చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు, సమాచారం ఏదైనా ఉంటే తనకు సమర్పించాల్సిందిగా ప్రజలను కోరారు. అలాగే టీవీ ఫుటేజ్‌లు సమర్పించాల్సిందిగా టీవీ చానళ్లను ఆదేశించారు. అంతేకాకుండా శుక్రవారంలోగా ప్రాథమిక దర్యాప్తు వివరాలను సమర్పించాల్సిందిగా ఢిల్లీ పోలీసు అధికారులను కూడా ఆదేశించారు. తన ఆదేశాలను ధిక్కరిస్తే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటానని వారిని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు తమ పరిధిలోకి వస్తుందని వాదిస్తున్న ఢిల్లీ పోలీసు అధికారులు మేజిస్ట్రేట్ ఆదేశాలను ఖాతరు చేయలేదు. వారికిచ్చిన గడువుకు కూడా తీరిపోవడంతో న్యాయపరంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఓపక్క కేసును మేజిస్ట్రేట్ దర్యాప్తు చేస్తుంటే అది తమ దర్యాప్తుకేమీ అడ్డంకాదని, అయితే పరస్పర భిన్నంగా దర్యాప్తు నివేదిలుంటేనే గందరగోళం అవుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ క్రైమ్‌బ్రాంచి అధికారి మీడియాకు తెలిపారు. 2014లో ఢిల్లీ నగరంలో 7,545 అసహజ మరణాలు సంభవించాయని, ఇందులో వేటిలోనూ జిల్లా మేజిస్ట్రేట్ స్వయంగా దర్యాప్తునకు ఆదేశించలేదని ఆయన తెలిపారు. అలాంటిది ఈ కేసులో మాత్రం ఎందుకు అంతగట్టిగా పంతం పడుతున్నరన్నది అర్థం కావడం లేదన్నది ఆయన ఆవేదన.పెళ్లైన ఏడేళ్లలోపు మహిళలెవరైనా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తేనే జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు అవసరమవుతుందని సీనియర్ పోలీసు అధికారులు వాదిస్తున్నారు. ఇలాంటి కే సుల విచారణలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, గోప్యత అవసరమని, చట్టాల ప్రకారమే అన్ని విభాగాలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ప్రాథమిక పోస్టుమార్టమ్ నివేదిక ప్రకారం ఉరివేసుకోవడం వల్లనే గజేంద్ర సింగ్ చనిపోయినట్టు తెలుస్తోందని ఆయన చెప్పారు. భారతీయ శిక్షాస్మృతిలోని 174(1), 176(1) సెక్షన్ల ప్రకారం ఏ కేసులోనైనా జిల్లా మేజిస్ట్రేట్ జోక్యం చేసుకోవచ్చని, ఏ అధికారినైనా పిలిపించి దర్యాప్తునకు ఆదేశించవచ్చని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల వాదన ఎలా ఉన్నా, ప్రస్తుత కేసులో సంఘర్శణకు కారణం ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలో పని చేస్తుండడం, జిల్లా మేజిస్ట్రేట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తుండడం తెల్సిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, రాష్ట్రంలో ఆప్ అధికారులో ఉండడం వల్ల అటు రాజకీయంగా మొదలైన రగడ ఇటు ప్రభుత్వ విభాగాల మధ్య సంఘర్షణకు కూడా దారితీసింది. -
తప్పు చేశాను క్షమించండి..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారు. ఆప్ ర్యాలీలో గజేంద్ర సింగ్ ఆత్మహత్య సందర్శంగా వెల్లువెత్తిన విమర్శలతో ఇరకాటంలో పడిన కేజ్రీవాల్ తప్పు దిద్దుకునే పనిలో పడ్డారు. ఘటన జరిగిన రెండు రోజులు తర్వాత ఆయన స్పందించారు..నేను తప్పుచేశాను క్షమించండి.,,, ఆ దుర్ఘటన తర్వాత నేను ప్రసంగించకుండా ఉండాల్సింది. ఎవర్నయినా బాధపెట్టి వుండే నా మన్నించండన్నారు. కాగా భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం ఆప్ తలపెట్టిన ర్యాలీ రాజస్థాన్ చెందిన 41 సంవత్సరాల గజేంద్రసింగ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతణ్ని ఆసుపత్రి తరలించిన తరువాత దాదాపు పదినిమిషాలపాటు ప్రసంగించిన కేజ్రీవాల్ గజేంద్రను కాపాడ్డంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షాలు, ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. గజేంద్రను రక్షించడంలో ఆప్ నేతలు, కార్యకర్తలు నిర్లక్ష్యాన్నిప్రదర్శించారని, వైదికపై ఉండి చోద్యం చూశారని మండిపడ్డారు. దీనిపై గురువారం పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం క్షమాపణలు తెలిపినట్టు సమాచారం. , -
ఆ పాపం ఆప్‌దే: రాజ్‌నాథ్
ఉరి సమయంలో కార్యకర్తలు, నేతలు రెచ్చగొట్టారు న్యూఢిల్లీ: రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య పాపం ఆమ్ ఆద్మీ పార్టీదేనంటూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శలు గుప్పించారు. రైతు చెట్టెక్కి, ఉరి బిగించుకుంటున్న సమయంలో ఆప్ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతూ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. నినాదాలు చేయొద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా వాళ్లు వినలేదన్నారు. గురువారం లోక్‌సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో రాజ్‌నాథ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘సాధారణంగా ఆత్మహత్యకు యత్నిస్తున్నవారి మనసు మార్చేందుకు వారితో తెలివిగా మాట్లాడతారు. ఆ వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమించుకునేలా చూస్తారు. కానీ ఇక్కడ జరిగింది వేరు. కానీ అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు. రెచ్చగొట్టారు..’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పోలీసులు చోద్యం చూశారన్న సభ్యుల విమర్శలను కూడా మంత్రి తోసిపుచ్చారు. రైతును కాపాడేందుకు పోలీసులు వారి వంతు ప్రయత్నం చేశారన్నారు. ‘‘వారు వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశారు. ఆయనను కిందకు దింపేందుకు ఎత్తై నిచ్చెన తీసుకురావాలంటూ అగ్నిమాపక విభాగాన్ని సంప్రదించారు’’ అని వివరించారు. తాను అక్కడుంటే ర్యాలీని వెంటనే రద్దు చేసేవాడినంటూ ఆప్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసు దర్యాప్తును క్రైం బ్రాంచ్‌కు అప్పగించమని చెప్పారు. -
వాళ్లు రెచ్చగొట్టడం వల్లే..
ఎఫ్ఐఆర్లో ఢిల్లీ పోలీసులు సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ నేతల వల్లే రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రైతును కాపాడేందుకు తాము చేసిన అన్ని ప్రయత్నాలకు ఆప్ నేతలు, కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. వారు రెచ్చగొట్టడం వల్లే రైతు ప్రాణాలు తీసుకున్నాడని తెలిపారు. తమకు సహకరించాలంటూ ఎన్నిసార్లు విన్నవించినా వేదికమీద ఉన్న నాయకులుగానీ, ఆప్ కార్యకర్తలుగానీ వినిపించుకోలేదన్నారు. సహాయం కోసం వచ్చే వాహనాలకు దారి ఇవ్వాల్సిందిగా కోరినా పట్టించుకోలేదని రెండు పేజీల ఎఫ్ఐఆర్లో పోలీసు ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ యాదవ్ పేర్కొన్నారు. గజేంద్రసింగ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో కూడా ఆప్ కార్యకర్తలు అడ్డుతగిలారని, ఆయన తమ కార్యకర్త కాబట్టి పార్టీ వాహనాల్లోనే తీసుకువెళ్తామంటూ పట్టుబట్టారన్నారు. గురువారం ఉదయమే ఢి ల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఆత్మహత్య ఉదంతంపై ఒక నివేదిక సమర్పించారు. కాగా, ఈ ఘటనపై ఓవైపు తాము దర్యాప్తు జరుపుతుండగా.. మరోవైపు జిల్లా మేజిస్ట్రేట్‌తో న్యాయ విచారణకు జరిపించే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని పోలీసు విభాగం స్పష్టంచేసింది. న్యాయ విచారణ జరిపే అధికారం జిల్లా మేజిస్ట్రేట్‌కు లేదని పేర్కొంటూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు బస్సీ చెప్పారు. -
మీదే బాధ్యత.. కాదు మీదే!
పార్టీల నిందాపర్వం; ప్రధాని సంతాపం ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ఘటనపై రాజకీయ పార్టీల నిందాపర్వం మొదలైంది. ఒకవైపు రైతు ఆత్మహత్యకు పాల్పడుతుండగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ నేతలంతా ప్రసంగాలపైనే దృష్టి పెట్టారంటూ బీజేపీ ఆరోపించింది. ‘మీకు ప్రాణాలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా?’ అని ప్రశ్నించింది. దీన్ని హత్యగా భావించి, ర్యాలీ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనకు ఢిల్లీ పోలీసులే బాధ్యులని ఆప్ పేర్కొంది. గజేంద్ర ఆత్మహత్యకు పాల్పడుతుండగా, అక్కడే ఉన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘ఆత్మహత్య బాధాకరం. ఆ రైతు కుటుంబాన్ని ఓదార్చేందుకు మాటలు లేవు. ఆ వ్యక్తిని చెట్టుపై నుంచి కిందకు దింపమని పోలీసులకు చెబ్తూనే ఉన్నాం. పోలీసు శాఖ మా అధీనంలో లేకపోయినా.. కనీసం మానవత్వంతోనైనా స్పందించాల్సింది’ అన్నారు. ‘మరోసారి ఎవరైనా ఇలాగే ఆత్మహత్యకు ప్రయత్నిస్తే.. చెట్టెక్కి ఆ వ్యక్తిని రక్షించమని కేజ్రీవాల్‌కు చెబుతా’ అని మరో నేత అశుతోశ్ వ్యంగ్యంగా అన్నారు. రైతు ఆత్మహత్యకు ప్రధాని మోదీ, కేజ్రీవాల్లే బాధ్యులని, వారిపై ఆత్మహత్యకు పురిగొల్పిన నేరారోపణ కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత సత్యవ్రత్ చతుర్వేది డిమాండ్ చేశారు. ఇలాంటి బాధాసమయంలో ఎలాంటి వ్యాఖ్యలూ చేయాలనుకోవడం లేదని రాహుల్ అన్నారు. ఒంటరివారమని అనుకోకండి.. మోదీ ఢిల్లీలో రైతు ఆత్మహత్యపై తీవ్ర ఆవేదనకు, ఆసంతృప్తికి గురయ్యానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎప్పుడు తాము ఒంటరివారిమన్న భావన తమలో రానీయవద్దని రైతాంగానికి సూచించారు. రైతులకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు తామంతా ఉన్నామన్నారు. రైతు గజేంద్ర కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. దేశంలో నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం లోతును, రైతుల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని ఈ ఘటన వెల్లడిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యకు ప్రధాని మోదీ బాధ్యుడని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ విమర్శించారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో గజేంద్ర కుటుంబసభ్యులను పరామర్శించారు. గజేంద్ర ఆత్మహత్యపై రాజస్తాన్ సీఎం వసుంధర రాజే విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
ఆర్నెళ్ల తర్వాత కొత్త పార్టీ!
ముందుగా ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో గ్రూప్ ఏర్పాటు ఆప్ తిరుగుబాటు నేతల ‘సంవాద్’ సదస్సులో నిర్ణయం న్యూఢిల్లీ: ఆప్ తిరుగుబాటు నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. ముందుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు లక్ష్యంగా ‘స్వరాజ్ అభియాన్’ గ్రూప్ ఏర్పాటు చేసి, ఆరు నెలల తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని స్పష్టంచేశారు. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి అసమ్మతి ద్వయం మంగళవారమిక్కడ నిర్వహించిన ‘స్వరాజ్ సంవాద్’ సదస్సు 8 గంటలు కొనసాగింది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చోపచర్చలు జరిపారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన కార్యాకర్తల అభిప్రాయాలను ఓటింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఆప్‌ను వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను 69 మంది వ్యతిరేకించారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సదస్సుకు హాజరైనవారిలో 25 శాతం మందే మద్దతు పలికారు. ఇక ఆప్‌పై తమకు నమ్మకం ఉందని 1.43 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో తమకు మద్దతు కోరుతూ దేశవ్యాప్తంగా పర్యటిస్తామని, అందరి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్న అనంతరం 6 నెలల తర్వాత పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని యోగేంద్ర యాదవ్ వెల్లడించారు. ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. ఆప్ అధినేత కేజ్రీవాల్ నియంతృత్వ పోకడలు పోతున్నారని విమర్శించారు. పార్టీలో గొంతెత్తే వారిని బహిష్కరించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. యోగేంద్రయాదవ్, భూషణ్‌తోపాటు పార్టీ ఉన్నత పదవుల నుంచి బహిష్కరణకు గురైన ఆనంద్ కుమార్, అజిత్ ఝా సదస్సులో పాల్గొన్నారు. -
పార్టీలకతీతంగా 'స్వరాజ్ అభియాన్'
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆమ్ఆద్మీపార్టీ బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ సొంత కుంపటిని ప్రారంభించారు. అయితే, అది పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని పేర్కొంటూ స్వరాజ్ అభియాన్ అని దానికి నామకరణం చేశారు. తమ సంస్థ దేశంలోని రైతులు, మహిళలు, సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుందని ప్రకటించారు. నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాల ద్వారా ప్రజల పక్షాన తమ పోరాటం ఉండనుందని తెలియజేశారు. అయితే, ఆప్ నుంచి బలవంతంగా బహిష్కరణకు గురైన ఈ నేతలు సొంతంగా పార్టీ పెడతారని భారీ ఊహగానాలు వచ్చిన విషయం తెలిసిందే. స్వరాజ్ అభియాన్ ప్రకటన సందర్భంగా మాట్లాడిన నేతలు భూషణ్, యోగేంద్ర.. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూనే తమకు మద్దతు ఇస్తామని 75శాతం కార్యకర్తలు మాట ఇచ్చారని, 25శాతం మంది మాత్రం సొంతంగా పార్టీ పెట్టేందుకు మద్దతిచ్చారని చెప్పారు. అయితే, స్వరాజ్ అభియాన్ తమ పార్టీకి సంబంధించినది కానందున బుధవారం చర్యలు తీసుకుంటామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. -
ముట్టడి
ఆమ్ ఆద్మీ నేతల అరెస్ట్ వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తు కుమారస్వామి ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సీఎం పన్నీరు సెల్వం ఇంటిని ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించారు. ఆయన ఇంటి పిట్ట గోడను దూకేందుకు కొందరు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి, చెన్నై: తిరునల్వేలి జిల్లా వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తుకుమారస్వామి రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణం వెనుక మిస్టరీ ఉందని, ఆ శాఖ మంత్రి అగ్రి కృష్ణమూర్తి వేధింపులు, ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలు బయలు దేరాయి. దీంతో అగ్రి మంత్రి పదవి ఊడింది. అయితే, ఆయనపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసును సీబీసీఐడీ వర్గాలు మందకొడిగా ముందుకు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హఠాత్తుగా ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు సీఎం ఇంటి వైపుగా చొచ్చుకు వెళ్లి కలకలం సృష్టించారు. ముట్టడి: శనివారం మధ్యాహ్నం గ్రీన్‌వేస్ రోడ్డులో ఆమ్ ఆద్మీ కార్యకర్తలు, నాయకులు గుమికూడారు. హఠాత్తుగా వారందరూ ఆ రోడ్డులోని సీఎం పన్నీరు సెల్వం ఇంటి వైపుగా చొచ్చుకు వెళ్లారు. ఈ హఠాత్పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు విఫలం యత్నం చేశారు. దీంతో సీఎం ఇంటికి సమీపంలో బైఠాయించిన నిరసన కారులు కేసును సీబీఐకు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొందరు సీఎం ఇంటి పిట్ట గోడ వైపుగా చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. అయితే, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, నిరసన కారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు అదనపు బలగాల్ని రప్పించి నిరసన కారుల్ని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ నిరసనలో గ్రీన్ వేస్ రోడ్డులో కాసేపు ఉత్కంఠ నెలకొంది. -
కేజ్రీవాల్ రాజీనామా తిరస్కరణ
న్యూఢిల్లీ: పార్టీ జాతీయ కార్యవర్గానికి అరవింద్ కేజ్రీవాల్ చేసిన రాజీనామాను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ బుధవారం తొసిపుచ్చింది. న్యూఢిల్లీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తాను జాతీయ కార్యవర్గానికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి లేఖ రాశారు. అయితే కేజ్రీవాల్ రాజీనామాను తిరస్కరించింది. ఈ ఆలోచన విరమించుకోవాలని కమిటీ కేజ్రీవాల్‌కు సూచించింది. బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైన ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై దాదాపు ఆరు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. -
ఆప్‌లో చీలికలు ఊహాగానమే..
ఢిల్లీలో భారీ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీలో అసంతృప్తి ముసలం అలుముకుందని వచ్చిన వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ ఖండించారు. చీలికలనేవీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని చెప్పారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతలు అప్పగించినందున వాటిపైనే దృష్టి పెడతాం తప్ప చిన్నచిన్న విషయాల జోలికి వెళ్లబోమని అన్నారు. గతంలో కూడా తన గురించి మరో నేత ప్రశాంత్ భూషణ్ గురించి ఎన్నో అపవాదులు బయటకు వచ్చాయని, వాటిపై కొంత విచారిస్తూనే ఫన్నీగా తీసుకున్నామని చెప్పారు. అలాంటివన్నీ ఆధారం లేని ఆరోపణలని చెప్పారు. దేశం మొత్తం కూడా తామేం చేస్తామని ఎదురుచూస్తోందని, వారిని తాము నిరాశపరచకూడదని అనుకుంటున్నామని సోమవారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆప్‌లో ఒక వ్యక్తి కేంద్రంగా కార్యకలాపాలు నడుస్తున్నాయని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని చెప్పారు. -
క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదు: బీజేపీ
న్యూఢిల్లీ: బురారీ ఘటనకు సంబంధించి ఆప్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ని బీజేపీ నిలదీసింది. ఆప్ ఎమ్మెల్యేల ప్రమేయం అధికారంలోకి వచ్చామనే వారి అహంకారానికి నిదర్శనమని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌శర్మ ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గూండాగిరీకి పాల్పడిన పార్టీ ఎమ్మెల్యేల విషయంలో తన వైఖరేమిటో సీఎం వెల్లడించాలని డిమాండ్ చేశారు. -
పోలీసులు, ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులకు మధ్య శుక్రవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలతో సహా ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని, అవసరమైతే ఎమ్మెల్యేలను అరెస్టు కూడా చేస్తామని పోలీసు కమిషనర్ భీంసేన్ బస్సీ శనివారం మీడియాకు తెలియజేశారు. నగరంలోని బురాడీ పోలీసు స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి తీవ్ర ఘర్షణ జరగడంతో పోలీసులు బురాడీ ఎమ్మెల్యే సందీప్ ఝా, మోడల్ టౌన్ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠిపై హింసను ప్రేరేపించారనే అభియోగాల కింద కేసు నమోదుచేశారు. ఈ ఘర్షణలో ఆరుగురు ఆప్ కార్యకర్తలతోపాటు తొమ్మిదిమంది పోలీసులు గాయపడ్డారు. ప్రధాన్ ఎన్క్లేవ్ కాలనీలో ఓ బాలుడిని ఎత్త్తుకుపోతున్న కిడ్నాపర్లను స్థానికులు పట్టుకున్నారని, నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరామని ఆప్ కార్యకర్తలు చెప్పారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించడంతో ఎమ్మెల్యే సంజీవ్ఝాకు ఫోన్ చేశామన్నారు. కార్యకర్తల నుంచి ఫోన్ రావడంతో ఝా రాత్రి పదకొండు గంటలకు బురాడీ పోలీస్‌స్టేషన్‌కు కారులో చేరుకున్నారు. గేటు వద్ద నిలబడిన సెంట్రీ ఆయన కారును ఆపి దురుసుగా ప్రవర్తించాడని ఆప్ కార్యకర్తలు ఆరోపించారు. చేతిలో ఉన్న రైఫిల్‌ను ఝాపై ఎక్కుపెట్టాడని వారు చెప్పారు. ఆ తరువాత ఆప్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని గొడవకు దిగారు. మోడల్ టౌన్ నియోజకవర్గ శాసనసభ్యుడు అఖిలేష్ త్రిపాఠీ కూడా కొంతమంది కార్యకర్తలతో ఇదే పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఆప్ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వారిపై లాఠీలు ఝళిపించారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే కారుకు స్టిక్కర్ లేదని, అందువల్ల సెంట్రీ ఆపివేశాడని పోలీసులు అంటున్నారు. ప్రజలు తమపై రాళ్లు రువ్వారని, ఈ కారణంగా తాము లాఠీ చార్జీ చేయాల్సివచ్చిందని పోలీసులు చెప్పారు. వారిలో అసాంఘికశక్తులు కూడా ఉన్నారన్నారు. ఈ సమాచారం అందడంతో డీసీపీ మథుర్వర్మతో పాటు పలువురు పోలీసు అధికారులు సదరు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 147, 148, 149,322,353, 186, 337 సెక్షన్ల కింద ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, చట్టవిరుద్ధంగా గుమిగూడడం, విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగిని అడ్డుకోవడం, ఘర్షణను సృష్టించడం ఇత్యాది ఆరోపణలతోపాటు హింసను ప్రేరేపించార నే అభియోగాల కింద పోలీసులు బురాడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు. అరడజను మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై బురాడీ స్టేషన్ పోలీసులు లిఖితపూర్వ నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపారు. -
మద్యం కేసులో ఆప్ ఎమ్మెల్యేపై విచారణ
న్యూఢిల్లీ: మద్యం సీసాల్ల స్వాధీనం కేసులో ఆప్ ఎమ్మెల్యే నరేశ్ బలియాన్‌ను గురువారం పోలీసులు విచారించారు. ఎన్నికల ప్రచారం సమయంలో విహార్ నగర్‌లోని అతని ఇంటిలో 8,000 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. వాటిపై ‘ఫర్ సేల్ ఇన్ హరియాణా’ అని ఉంది. దీంతో విచారణకు హాజరుకావాలని నరేశ్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు జరుగుతున్నందున అవి ముగిశాక విచారణకు హాజరవుతానని నరేశ్ బదులివ్వడంతో గురువారం విచారించారు. చాణక్యపురిలోని క్రైం బ్రాంచ్‌కి న్యాయవాదితో సహా హాజరైన అతన్ని పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించారు. -
పైకెళ్లింది కింద పడాల్సిందే
ఢీల్లీ ఫలితాలపై విదేశీ మీడియా న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విదీశీ మీడియా ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభావాన్ని దష్టిలో పెట్టుకొని ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తితోనే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై ప్రపంచ మీడియా దృష్టి పెట్టింది. అనూహ్యంగా ఆప్ సునామీనే సష్టించి 70 సీట్లలో 67 సీట్లను కైవసం చేసుకోవడంతో మంచి కవరేజీ ఇచ్చింది. ఆప్ ‘రాజకీయ భూకంపం’ సష్టించినట్లు వ్యాఖ్యానించడంతోపాటు ఆప్‌ను ప్రశంసించింది. ‘పైకెళ్లిన వస్తువు కింద పడాల్సిందే’ అంటూ మోదీని ఉద్దేశించి విమర్శలు కూడా చేసింది. ఆప్ సాధించిన ఫలితాలు పరిపాలనా వ్యవహారాల్లో, ఆర్థిక సంస్కరణలపై ప్రధాని మోదీపై తీవ్ర ఒత్తిడి పెంచిందని న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకత్వంలో వ్యాఖ్యానించింది. అయితే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ఈ ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయని వ్యాఖ్యానించింది. అవినీతి ప్రక్షాళన నినాదంతో వచ్చిన ఓ సామాన్యుడి పార్టీ చేతిలో మోదీ పార్టీ దిగ్భ్రాంతికరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. పెకైళ్లిన వస్తువు కింద పడాల్సిందేనంటూ న్యూటన్ భౌతికశాస్త్ర సూత్రాన్ని సీఎన్ఎన్ వ్యాఖ్యానించింది. మోదీకి ఇది మొదటి శరాఘాతం అని బీబీసి వ్యాఖ్యానించింది. మోదీకి ఇది పిడుగుపాటని లండన్ నుంచి వెలువడే ది టెలిగ్రాఫ్ వ్యాఖ్యానించింది. -
'కులమత రాజకీయాలను తిరస్కరించారు'
న్యూ ఢిల్లీ: కులమత రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు కృతజ్క్షతలు తెలిపారు. నిస్వార్ధంగా పని చేసిన ఆప్ కార్యకర్తలను ఆయన అభినందించారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయభేరీ మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. తుది ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్ కోసం 300 కిలోమీటర్ల పాదయాత్ర
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా నలుగురు ఆప్ వాలంటీర్లు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. 300 కిలోమీటర్లు పైగా వీరు పాదయాత్ర చేయనున్నారు. సుఖ్ దేవ్ సింగ్, ఉదయభాను, అబ్దుల్ ఖాన్, ప్రిన్స్ మాసిహ్ పంజాబ్ లోని లుథియానా నుంచి ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. లుథియానా టాప్ కన్వీనర్ అహబాబ్ సింగ్ గ్రెవాల్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. అంతముందు నలుగురు వాలంటీర్లు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులకు నివాళులర్పించారు. -
బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ
-
బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వైఖరికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసిన ఇల్మీ శుక్రవారం బీజేపీలో చేరారు. జర్నలిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన షాజియా ఇల్మీ, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి కీలకపాత్ర పోషించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రచారం కోసం రాష్ట్ర బీజేపీ ప్రకటించిన తొమ్మిది మంది ప్రముఖుల పేర్లలో షాజియా ఇల్మి పేరు కూడా ఉండడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఈ పేర్లను ప్రకటించారు. షాజియా ఇల్మీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్ కే పురం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేసి కేవలం 326 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘజియాబాద్ నుంచి మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ వీకే సింగ్‌పై పోటీచేసి ఓడిపోయారు. అప్పటికే ఆమెకు ఆప్‌తో విభేదాలు మొదలయ్యాయని, అంతేకాకుండా అయిష్టంగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారని కథనలు వచ్చిన సంగతి తెలిసిందే. -
ఆ ఎమ్మెల్యేలలో 97% కోటీశ్వరులే!
దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన పోలింగ్, 10న ఫలితాల వెల్లడి ఉంటుంది. అయితే.. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల చరిత్రలు చూస్తే.. వాళ్లలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యేల్లో 97 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 31 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అందులో 30 మందికి సగటున 12 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. అలాగే, వాళ్లలో మొత్తం 17 మందికి నేర చరిత్ర కూడా ఉంది. ఈ విషయం వాళ్లు ఇచ్చిన అఫిడవిట్లలోనే ఉంది. 49 రోజుల పాటు అధికారంలో కూర్చున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తక్కువేమీ తినలేదు. ఆ పార్టీకి ఉన్న 28 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. వీళ్ల సగటు ఆస్తి కోటి రూపాయలు. ముగ్గురి మీద క్రిమినల్ కేసులున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది. వాళ్లలో ఏడుగురు.. అంటే 88 శాతం మంది కోటీశ్వరులు. వాళ్ల సగటు ఆస్తి 10కోట్ల రూపాయలకు పైనే. వీళ్లలో ఇద్దరి మీద క్రిమినల్ కేసులున్నాయి.