సుప్రీంలో సోమ్నాథ్ భారతికి నిరాశ
న్యూఢిల్లీ: గృహ హింస, హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతికి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. సోమ్నాథ్ భారతికి బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
సోమ్నాథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించవలసిందిగా ఆయనకు సూచించింది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరిగిన సోమ్నాథ్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసింది.