bail rejected
-
ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరో ఎదురుదెబ్బ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు.. A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తమను అరెస్ట్ చేసి వంద రోజులు దాటిందని, పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో మాండేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను నాలుగుసార్లు వెనక్కి పంపింది కోర్టు. దీంతో మూడున్నర నెలలు గడుస్తున్న పోలీసులు సక్రమంగా ఛార్జిషీటు వేయలేకపోయారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందని పోలీసులు వాదించారు. దీంతో.. పోలీసు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది. -
పుంగనూరు విధ్వంసం కేసుల్లో చల్లా బాబుకు లభించని ఊరట
సాక్షి, అమరావతి/మదనపల్లె: చిత్తూరు జిల్లా పుంగనూరులో సాగించిన విధ్వంసంపై పోలీసులు నమోదు చేసిన వివిధ కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు)కు హైకోర్టులో పూర్తిస్థాయి ఊరట లభించలేదు. అన్నీ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏడు కేసులకు గాను మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ మూడింటిలో చల్లా బాబు పాత్రపై నిర్దిష్ట ఆరోపణలున్న నేపథ్యంలో అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయట్లేదని స్పష్టం చేసింది. మిగిలిన నాలుగు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 4 కేసుల్లో చల్లా బాబు పాత్రపై ఎలాంటి నిందారోపణలు లేవని, అందువల్ల అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. 10 రోజుల్లోపు పుంగనూరు పట్టణ పోలీసుల ముందు లొంగిపోవాలని ఆయన్ను ఆదేశించింది. రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. కాగా, బెయిల్‌పై విడుదలైన తరువాత నాలుగు వారాలపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని చల్లా బాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. పుంగనూరు విధ్వంసంపై పోలీసులు తనపై నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చల్లా బాబు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. వీటిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ సురే‹Ùరెడ్డి ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. వీటిపై సోమవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరించారు. అంగళ్లు కేసులో.. చంద్రబాబు యుద్ధభేరి పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆ పార్టీ నేత దేవినేని ఉమా, పీలేరు టీడీపీ ఇన్చార్జ్ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నానిలకు హైకోర్టు ఊరటనిచ్చింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 10 రోజుల్లోపు ముదివేడు పోలీసుల ముందు లొంగిపోవాలని ఉమా తదితరులను హైకోర్టు ఆదేశించింది. రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలంది. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాక 4 వారాలపాటు అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టకూడదని ఆదేశించింది. అలాగే నాలుగు వారాలపాటు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని తేలి్చచెప్పింది. దర్యాప్తులో జోక్యం చేసుకోవడం గానీ, సాక్ష్యాలను తారుమారు చేయడం గానీ చేయరాదంది. ఈ మేరకు జస్టిస్ సురే‹Ùరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులకు బెయిల్ నిరాకరణ పుంగనూరు, అంగళ్లులో 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్లు, పోలీసులపై దాడి కేసులో నిందితుల తరఫున బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీకి షాక్ తగిలింది. విధ్వంసకాండలో పాల్గొన్న 120 మంది నిందితుల తరఫున దాఖలు చేసిన అన్ని రెగ్యులర్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లను మదనపల్లె రెండో ఏడీజే కోర్టు తిరస్కరించింది. టీడీపీ నాయకులకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా టీడీపీ నేతల తరఫున పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై ఈ నెల 24న మదనపల్లె రెండో ఏడీజే కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. టీడీపీ నాయకులు దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు ఇచ్చింది. -
లిక్కర్ స్కాంలో సిసోడియాకు గట్టి దెబ్బ, ఆ వెంటనే..
ఢిల్లీ: ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు గట్టి దెబ్బే తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వెంటనే ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ పాలసీ స్కాంలో సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీష్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి, కాబ్టటి బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు బెంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అనవసర ప్రయోజనాల కోసం కుట్ర పూరితంగా ఆ ఎక్సైజ్ పాలసీని రూపొందించారంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది న్యాయస్థానం. 👉ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆషామాషీ వ్యక్తి కాదు. అరెస్ట్ సమయానికి మంత్రిగా ఉన్నారు. పైగా 18 శాఖల నిర్వహణను చూసుకున్నారు. అలాంటి వ్యక్తి బయటకు వస్తే సాక్ష్యులను ప్రలోభ పెట్టి.. ఆధారాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు అంటూ హైకోర్టు సిసోడియా బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఈ కుంభకోణంలో నిందితుడిగా సిసోడియా పేరును ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చిన సీబీఐ.. సప్లిమెంటరీ ఛార్జిషీట్లో రెండు ఫోన్లను నాశనం చేశారని ఆయన ఒప్పుకున్నట్లు ప్రస్తావించింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం ఆయనపై మనీల్యాండరింగ్ అభియోగాలు నమోదు చేసి ప్రశ్నించింది కూడా. అంతకు ముందు స్థానిక కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది. Former Delhi's Deputy Chief Minister Manish Sisodia to move to Supreme Court against Delhi High Court's decision on bail Delhi HC rejected his bail plea in the CBI case alleging corruption in the implementation of previous liquor policy in national capital. https://t.co/GsYNTJfxzQ — ANI (@ANI) May 30, 2023 ఇదీ చదవండి: ఆ నిజాన్ని మనమందరం అంగీకరించాలి! -
Satyendar Jain: బెయిల్ తిరస్కరణ
ఢిల్లీ: ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఊరట దక్కలేదు. మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న జైన్‌కు గురువారం బెయిల్ తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. జైన్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. జైన్ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బయటకు వస్తే ఆధారాలను ప్రభావితం చేయొచ్చని సింగిల్ బెంచ్ ధర్మాసనం అభిప్రాయపడింది. జైన్‌తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీలకు సంబంధించిన అక్రమ లావాదేవీలకుగానూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కిందటి ఏడాది మే నెలలో ఆయన్ని అరెస్ట్ చేసింది. కిందటి ఏడాది నవంబర్‌లో ట్రయల్ కోర్టు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 21వ తేదీనే ఇరువవర్గాల వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇవాళ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు తీర్పు వెల్లడించింది. హవాల రూపంలో నగదు బదిలీ.. లెక్కల్లోలేని సొమ్ముతో చరాస్తుల కొనుగోలు ఆరోపణల మేరకు సీబీఐ సత్యేందర్ జైన్‌పై కేసు నమోదు చేయగా.. ఆపై ఈడీ మనీల్యాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు జైల్లో ఆయనకు అందిన వీఐపీ ట్రీట్మెంట్ వీడియోలు బయటకు రావడంతో.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు
-
Aryan Khan Drug Case: ఆర్యన్‌కు దొరకని బెయిల్
-
చోక్సికి డొమినికా హైకోర్టు బెయిల్ నిరాకరణ
డొమినికా: పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్థిక కుంభకోణంలో నిందితుడు మెహుల్ చోక్సికి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఇవ్వడానికి ఆ దేశ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ మంజూరు చేస్తే చోక్సి దేశం విడిచిపెట్టే అవకాశాలున్నాయన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. డొమినికాతో చోక్సికి సంబంధ బాంధవ్యాలు లేవని, అతనిపై కోర్టు కూడా ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించలేదని న్యాయమూర్తి ఆడిరిన్ రాబర్ట్స్ వ్యాఖ్యానించారు. వెనక్కి రప్పించడానికి భారత్ ప్రయత్నాలు చోక్సిని భారత్‌కు వెనక్కి రప్పించడానికి విదేశాంగ శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. డొమినికా న్యాయస్థానంలో విదేశాంగ శాఖ, సీబీఐ రెండు వేర్వేరు ఇంప్లీడ్ పిటిషన్లను దాఖలు చేశాయి. చోక్సి పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు అన్న అంశాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి సీబీఐ పకడ్బందీగా అన్ని అంశాలను తన పిటిషన్లో జతపరిచింది. మరోవైపు విదేశాంగ శాఖ చోక్సి భారతీయుడన్న విషయాన్ని కోర్టులో రుజువు చేసే సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. చోక్సి మాత్రం తాను భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నానని, ప్రస్తుతం తాను ఆంటిగ్వా పౌరుడునని వాదిస్తున్నారు. -
నూతన్ నాయుడుకు చుక్కెదురు
విశాఖ లీగల్: పెందుర్తి దళిత యువకుడు శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ కుమార్ నాయుడుతో పాటు ఆయన భార్య ప్రియ మాధురితో సహా మరికొందరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. నగరంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట నాగేశ్వరరావు మంగళవారం తీర్పు నిచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసు ప్రాథమిక స్థాయిలో ఉన్నందున బెయిలు మంజూరు సాధ్యం కాదన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాసు తమ వాదనలు వినిపించారు. కాగా, పసిపిల్లలను విక్రయించిన కేసులో సృష్టి ఆస్పత్రి వైద్యులకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. (12 కోట్లు వసూలు చేసిన నూతన్ నాయుడు) చదవండి: కడుపులో నొప్పి అంటూ నూతన్ డ్రామాలు! -
భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం నాలుగోసారి అతడు పెట్టుకున్న పిటిషన్‌ను లండన్ కోర్టు తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ని రూ.14వేల కోట్ల మేర మోసం చేసిన ఆరోపణలపై అతడిని అప్పగించాలంటూ భారత్ కోరుతున్న విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నందున నీరవ్‌కు బెయిల్ ఇవ్వాలని లాయర్లు వాదించారు. బాండ్ మొత్తాన్ని రూ.18 కోట్ల నుంచి రూ.36 కోట్ల(4 మిలియన్ పౌండ్లు)కు పెంచేందుకు అంగీకరించినా వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. విచారణ ముగిసిన తర్వాత అతడిని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్ జైలుకు తరలించారు. డిసెంబర్ 4న వీడియో లింక్ ద్వారా అతడిని కోర్టు విచారించనుంది. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను భారత్ తరపున వాదిస్తున్న న్యాయవాది సవాల్ చేశారు. తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోదీ బెదిరిస్తున్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జైలులో తన క్లైంట్‌పై దాడి జరిగిందని నీరవ్‌మోదీ తరపు లాయర్ వెల్లడించారు. అతడిపై భారత్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, దీనికి అక్కడి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు. -
నీరవ్ మోదీకి మళ్లీ షాక్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి మరోసారి చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నీరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు బుధవారం మూడోసారి తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో నీరవ్‌కు బెయిల్ మంజూరుచేస్తే ఆయన తిరిగి విచారణకు హాజరుకాకపోవచ్చని చీఫ్ మెజిస్ట్రే్టట్ ఎమ్మా అర్బత్నాట్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నీరవ్ న్యాయవాది క్లేర్ మాంట్గొమెరి వాదిస్తూ..‘లండన్ శివార్లలో ఉన్న వాండ్స్‌వర్త్ జైలులో పరిస్థితులు మనుషులు జీవించేలా లేవు. కోర్టు బెయిల్ కోసం ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తాం. అలాగే పూచికత్తుగా 20 లక్షల పౌండ్లు సమర్పిస్తాం. నీరవ్ 24 గంటలు నిఘానీడలో ఇంటిలోనే ఉండేలా కోర్టు ఆదేశించినా మాకు అంగీకారమే’ అని చెప్పారు. ఇది సాధారణ కేసు కాదనీ, నీరవ్ గతంలోనే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరించేందుకు ప్రయత్నించారని భారత న్యాయవాది నిక్ హెర్న్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు మే 30కి వాయిదా వేసింది. -
మిషెల్ బెయిల్‌కు కోర్టు నో
న్యూఢిల్లీ: ఈస్టర్ పండగ జరుపుకునేందుకు వారం పాటు బెయిల్ ఇవ్వాలం టూ అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభ కోణంలో నిందితుడు క్రిస్టియన్ మిషెల్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో అతడు తప్పించుకు పోయేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభియోగాల తీవ్రత దృష్ట్యా మిషెల్‌కు బెయిల్ మంజూరు చేయలేమని ప్రత్యేక జడ్జి అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. అగస్టా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసినందున సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం లేదని, అధికారుల విచారణకు మిషెల్ సహకరిస్తున్నాడని అతని లాయర్ తెలిపారు. ‘ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు క్రైస్తవులకు పవిత్ర వారం, 21న ఈస్టర్ పండగ. కుటుంబసభ్యులతో కలిసి పండగ జరుపుకోవడంతోపాటు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా మిషెల్‌కు వారం పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి’ అని కోరారు. దీనిపై ఈడీ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉండి కూడా మిషెల్ పండగ జరుపుకోవచ్చని అన్నారు. -
కుక్క ఉంది.. బెయిల్ ఇవ్వండి!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు బెయిల్ నిరాకరించినపుడు చిత్రమైన ఘటన జరిగింది.∙ఈ సందర్భంగా నీరవ్ బెయిల్ పొందేందుకు వీలుగా ఆయన లాయర్ల బృందం కొత్తతరహా వాదనను కోర్టుముందుకు తీసుకొచ్చింది. నీరవ్ పెంపుడు కుక్కను కారణంగా చూపుతూ బెయిల్ ఇవ్వాలని కోరింది. నీరవ్ తరఫున క్లేర్ మాంట్గోమెరీ వాదనలు వినిపిస్తూ..‘నీరవ్ మోదీ కుమారుడు ఇక్కడే చార్టర్‌హౌస్ ప్రాంతంలో పాఠశాల చదువు పూర్తిచేశారు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు. దీంతో ఒంటరితనంతో ఉన్న నీరవ్ ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నారు దేశాన్ని వదిలిపోయే వ్యక్తులెవరైనా ఈ పని చేస్తారా? బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులకు పేరుగాంచింది’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌కు వచ్చాక మరో దేశపు పౌరసత్వం కోసం నీరవ్ దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఒకవేళ బెయిల్ మంజూరుచేస్తే నీరవ్ పాస్‌పోర్టును స్వాధీనం చేయడంతో పాటు హాంకాంగ్, సింగపూర్, యూఏఈలో ఉన్న నివాస అనుమతి పత్రాలను సరెండర్ చేస్తారని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం నీరవ్ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. -
నీరవ్ మోదీకి బెయిల్ నో
లండన్ / న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మరోసారి షాకిచ్చింది. బెయిల్ కోసం నీరవ్ మోదీ రెండోసారి దాఖలుచేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎమ్మా అర్బత్నాట్ శుక్రవారం తిరస్కరించారు. నీరవ్‌కు ఒకవేళ బెయిల్ మంజూరుచేస్తే ఆయన బ్రిటన్ విడిచి పారిపోతారని చెప్పడానికి గట్టి సాక్ష్యాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఈ కేసు విచారణ సాగుతుండగానే నీరవ్ 2017లో వనౌతు అనే పసిఫిక్ ద్వీప దేశపు పౌరసత్వం పొందేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేసిన ఎమ్మా.. ఈసారి వాండ్స్‌వర్త్‌లోని హర్ మేజిస్టీ జైలు నుంచి వీడియో లింక్ ద్వారా నీరవ్‌ను విచారిస్తామని స్పష్టం చేశారు. రేడియో ట్యాగ్‌కు ఒకే.. భారత న్యాయవాదుల వాదనల్ని నీరవ్ న్యాయవాది ఖండించారు. నీరవ్ తరఫున బారిస్టర్ క్లేర్ మాంట్గోమెరీ వాదనలు వినిపిస్తూ..‘నీరవ్ బ్రిటన్ను స్వర్గంగా భావిస్తున్నారు. బ్రిటన్‌లోనే తనకు న్యాయం జరుగుతుందని ఆయన నమ్ముతున్నారు. మా క్లయింట్‌కు బ్రిటన్ను విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశం లేదు. బెయిల్ మంజూరు చేస్తే నీరవ్ కదలకల్ని గుర్తించేందుకు వీలుగా ఆయనకు రేడియో ట్యాగ్ అమర్చేందుకు మేం సుముఖంగా ఉన్నాం’ అని వెల్లడించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి ఎమ్మా అర్బత్నాట్.. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే నీరవ్ మోదీ పారిపోతారని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. మరోవైపు ఈ విచారణకు హాజరైన సీబీఐ–ఈడీ అధికారుల బృందం కొత్త సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. అంతకుముందు ఒకవేళ నీరవ్‌ను అప్పగిస్తే ఏ జైలుకు తరలిస్తారని న్యాయమూర్తి భారత న్యాయవాదిని ప్రశ్నించారు. దీంతో లిక్కర్‌కింగ్ విజయ్‌మాల్యాను ఉంచాలని భావిస్తున్న ఆర్థర్ రోడ్ జైలుకే నీరవ్‌ను తరలిస్తామని ఆయన జవాబిచ్చారు. ఆర్థర్రోడ్ జైలు వీడియోను తాను చూశాననీ, అక్కడ గదిలో ఇద్దరికీ సరిపడా స్థలం ఉందని జడ్జి ఎమ్మా వ్యాఖ్యానించారు. అధికారిపై వేటు.. ఉపసంహరణ నీరవ్ మోదీ కేసులో ఈడీ విచారణాధికారి(ఐఓ) అయిన జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత్ కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి శుక్రవారం తప్పించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. కుమార్ లండన్ పర్యటనలో ఉండగానే ఈడీ పశ్చిమజోన్ ప్రత్యేక డైరెక్టర్ వినీత్ అగర్వాల్ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఈ వార్త మీడియాలో వైరల్ కావడంతో ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా ఈ ఉత్తర్వుల్ని నిమిషాల్లోనే రద్దుచేశారు.ఈడీ నిబంధనల మేరకు ఓ అధికారి ఐదేళ్లకు మించి ఒకే పోస్టులో కొనసాగరాదనీ, అదే సమయంలో కుమార్ పదవీకాలాన్ని పొడిగించాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మిశ్రా తెలిపారు. సాక్షుల్ని చంపేస్తామని బెదిరించారు లండన్‌లోని కోర్టుకు నీరవ్ మోదీ మడతలు పడ్డ తెలుపురంగు చొక్కాతో శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) న్యాయవాది టోబీ కాడ్మన్ వాదిస్తూ..‘నీరవ్‌కు మోదీకి బెయిల్ మంజూరుచేస్తే ఆయన న్యాయప్రక్రియకు విఘాతం కల్గించడంతో పాటు దేశం విడిచి పారిపోయే ప్రమాదముంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను నీరవ్ ఇప్పటికే ఫోన్లో బెదిరించారు. స్మార్ట్ఫోన్లతో పాటు సర్వర్లలో ఉన్న కీలక సాక్ష్యాలను ధ్వంసం చేయించారు. పీఎన్బీని రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆశిష్ లాడ్‌ను చంపేస్తామని నీరవ్ ఫోన్లో బెదిరించారు. ఒకవేళ తన వాంగ్మూలం మార్చుకుంటే రూ.20 లక్షలు లంచం ఇస్తానని ఆశచూపారు. ఇదే కేసులో సాక్షులుగా ఉన్న నీలేశ్ మిస్త్రీ, మరో ముగ్గురిని ఇదే తరహాలో భయపెట్టారు’ అని కోర్టుకు తెలిపారు. -
సంజయ్‌కు ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్
సాక్షి, నిజామాబాద్ : నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో నిజామాబాద్ మాజీ మేయర్ డి సంజయ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. నర్సింగ్ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్‌ను ఈ నెల 12న అరెస్టు చేసి, జిల్లా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేశ్.. ఈ నెల 14న ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. సంజయ్ విచారణ ఇంకా పూర్తి కాలేదని కోర్టుకు తెలిపారు. అతని విచారణకు మరింత సమయం పడుతుందన్నారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సంజయ్‌కు 13 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. -
విక్రమ్ కొఠారికి బెయిల్ నిరాకరణ
లక్నో : ఉద్దేశపూరిత రుణ ఎగవేత కేసులో రొటోమాక్ గ్లోబల్ ప్రమోటర్, డైరెక్టర్ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్ కొఠారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను సీబీఐ కోర్టు గురువారం తోసిపుచ్చింది. రూ 3695 కోట్ల రుణ ఎగవేత కేసులో విక్రమ్ కొఠారి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌నూ మార్చి 7న కోర్టు తిరస్కరించింది. నిందితులిద్దరినీ ఫిబ్రవరి 23న ఢిల్లీలో సీబీఐ అరెస్ట్ చేసినప్పటి నుంచీ వారు జైలు జీవితం గడుపుతున్నారు. ఇంటరాగేషన్ కోసం వారిని ఫిబ్రవరి 24 నుంచి సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. మార్చి 7తో సీబీఐ రిమాండ్ ముగియడంతో న్యాయమూర్తి ఎంపీ చౌధురి వారిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా, నిందితులపై తీవ్ర నేరాభియోగాలున్నందున వారికి బెయిల్ ఇవ్వడం తగదని సీబీఐ కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. బ్యాంకుల కన్సార్టియం నుంచి సేకరించిన రుణాలను కంపెనీ డైరెక్టర్లు కొందరు బ్యాంకు అధికారులతో కలిసి కుట్రపూరితంగా దారిమళ్లించి బ్యాంకులను మోసగించారని సీబీఐ సమర్పించిన చార్జిషీట్లో ఆరోపించింది. -
వ్యాపం స్కామ్... ఉచ్చు బిగుస్తోందా?
భోపాల్ : సంచలనం సృష్టించిన వ్యాపం నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. నిందితుల బెయిల్ పిటిషన్లను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు గురువారం మధ్యాహ్నాం 3గం. నుంచి శుక్రవారం వేకువ ఝామున (2గం.41ని.) దాకా కొనసాగాయి. మధ్యప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి ఇలా జరగటం విశేషం. ఈ సందర్భంగా దాఖలైన 30 ఇంటీరియమ్ బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. చిరయూ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ అజయ్ గోయెంకతోపాటు డీకే సప్తపతి, డాక్టర్ రవి సక్సేనా, ఎస్ ఎన్ సక్సేనా, డాక్టర్ వినాయక్ భవసర్, డాక్టర్ అశోక్ జైన్ తదితరుల అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. వీరితోపాటు పీపుల్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ విజయ్వార్గియా, డైరెక్టర్ అశోక్ నంగ్నాథ్, వైస్ ఛాన్స్లర్ విజయ్ కుమార్ల పిటిషన్లను కూడా తిరస్కరించింది. అంతకు ముందు వాదనలకు హాజరుకానీవారికి న్యాయస్థానం అరెస్ట్ వారెంట్లు జారీ చేయగా, ఒక లక్ష రూపాయల పూచీకత్తు మీద 15 మంది నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. మొత్తం 592 మందిలో నలుగురు వ్యాపమ్ అధికారులు, ముగ్గురు దళారులు, 22 మధ్యవర్తిత్వం వహించనవారు, 334 విద్యార్థులు, 155 మంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయని సీబీఐ తరపు న్యాయవాది సతీశ్ దినకర్ తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(ఎమ్పీపీఈబీ) నిర్వహించే పరీక్షలో అక్రమాలకు పాల్పడటంతో వ్యాపం స్కామ్ వెలుగులోకి వచ్చింది. 1995 నుంచి ప్రవేశ పరీక్షల్లో అక్రమాల ద్వారా దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయలు అధికారులకు చేరాయి. చిరయూ, పీపుల్స్, ఎల్ ఎన్ మెడికల్ కాలేజీలతోపాటు మరో మెడికల్ కాలేజీ యాజమాన్యాల పాత్రలపై ప్రధాన ఆరోపణలు వినిపించగా.. ఆయా కాలేజీ ఛైర్మన్లకు అరెస్ట్ కూడా చేశారు. గడిచిన పదేళ్లుగా ఈ కేసులో ఏదో ఒక కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. ఇందులో కీలక నేతల పేర్లు తెర మీదకు రావటం.. కేసులో నిందితులు ఆత్మహత్య చేసుకోవడమో లేదా విద్యార్థులకు సాయం చేసిన వ్యక్తులు హత్యకు గురికావడం వంటివి ఇప్పటికీ వ్యాపం స్కామ్ ఓ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. -
ఏఎస్ఐ మోహన్ రెడ్డికి బెయిల్ తిరస్కరణ
కరీంనగర్ : ఏఎస్ఐ మోహన్ రెడ్డికి కరీంనగర్ జిల్లా కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కావాలంటూ ఏఎస్సై దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారణ చేసిన అనంతరం కరీంనగర్ జిల్లా కోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేస్తే మోహన్ రెడ్డి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సీఐడీ అధికారులు కోర్టుకు వివరించారు. వడ్డీ వ్యాపారిగా మారి సామాన్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఏఎస్సై ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. ఏఎస్సై మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులు పరశురాం గౌడ్, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వర్ల కోసం సీఐడీ బృందాలు గాలిస్తున్నాయి. సీఐడీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. -
సుప్రీంలో సోమ్‌నాథ్ భారతికి నిరాశ
న్యూఢిల్లీ: గృహ హింస, హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. సోమ్‌నాథ్ భారతికి బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సోమ్‌నాథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించవలసిందిగా ఆయనకు సూచించింది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరిగిన సోమ్‌నాథ్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసింది. -
మరి కొన్నాళ్లు జైల్లోనే!
లష్కరే తాయిబా ఉగ్రవాది జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ మరికొన్నాళ్లు జైల్లోనే ఉండబోతున్నాడు. కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో తాజాగా పాకిస్తాన్ కోర్టు లఖ్వీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. 2008 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఉగ్రవాదిపై ఇప్పటికే పలు కేసులు ఉండగా, వాటిలో ఓ కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. తనపై తప్పుడుకేసు నమోదు చేశారంటూ, దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదిస్తూ, ఆరున్నర ఏళ్ల క్రితం నమోదైన కేసు ఇంకా నడుస్తోందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నబీ తాబిష్ వాదించారు. విచారణ పూర్తికాకుండా ఎఫ్ఐఆర్ను రద్దుచేయడం సాధ్యం కాదన్నారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నవీద్ ఖాన్ లఖ్వీ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు. ఈ కరడుగట్టిన ఉగ్రవాదికి బెయిల్ లభించే అవకాశాలు ఇప్పట్లో లేనట్టే. -
అమ్మకు బెయిల్ ఎందుకు రాలేదు?
ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు ఆమెకు షరతులతో కూడిన బెయిలిచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. బెయిల్ ఇస్తే తన క్లయింటు దేశం విడిచి వెళ్లిపోరని, సాక్షులను ప్రభావితం చేయరని దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన రాం జెఠ్మలానీ బల్లగుద్ది మరీ వాదించారు. అయినా.. అమ్మకు బెయిల్ రాలేదు. అసలు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కారణాలే ఏమీ లేవని ఈ కేసు విచారించిన జస్టిస్ ఎ.వి. చంద్రశేఖర స్పష్టం చేశారు. అవినీతి అనేది మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని, దానివల్ల ఆర్థిక సమతౌల్యం దెబ్బతింటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే, గతంలో గడ్డిస్కాంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రాం జెఠ్మలానీ గుర్తు చేశారు. కానీ జడ్జి మాత్రం.. అలా బెయిల్ రావడానికి ముందు పది నెలల పాటు లాలూ జైల్లోనే ఉన్నారు కదా అని న్యాయమూర్తి ఆయనకు దీటుగా సమాధానమిచ్చారు. అవినీతి కేసులు త్వరితగతిన విచారించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని కూడా జస్టిస్ చంద్రశేఖర అన్నారు. అవినీతి అనేది సమాజానికి వ్యతిరేకమని కూడా సుప్రీంకోర్టు 2012లో వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
అసలు బెయిల్ ఎందుకివ్వాలి?
రాం జెఠ్మలానీ లాంటి విశ్వవిఖ్యాత న్యాయవాది బండెడు పుస్తకాలు శోధించి వాదించినా.. చివరకు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తే తమకు అభ్యంతరం లేదంటూ సీబీఐ తరఫు న్యాయవాదులు చెప్పినా కూడా జయలలితకు బెయిల్ రాలేదు. అసలు జయలలితకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ కనిపించడంలేదని ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి. చంద్రశేఖర స్పష్టం చేశారు. దాంతో ఇటు బోనులో ఉన్న జయలలితకు, అటు బయట ఉన్న అభిమానులకు కూడా తీవ్ర ఆశాభంగం తప్పలేదు. అంతకుముందు సీబీఐ తరఫు న్యాయవాదులు తమకు అభ్యంతరం లేదని చెప్పగానే జయలలితకు బెయిల్ వచ్చేసిందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరకు విచారణ ముగిసే సమయానికి న్యాయమూర్తి మాత్రం ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ తనకు కనపడటం లేదని స్పష్టం చేయడంతో.. అన్నాడీఎంకే అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. -
పూజలు ఫలించలేదు.. బెయిల్ రాలేదు
అమ్మకు బెయిల్ రావాలి.. ఆమె బయటకు వచ్చి మాకు దర్శనం ఇవ్వాలి అంటూ తమిళనాట వేలాది మంది మొక్కుకున్నారు. అమ్మకు బెయిల్ రావాలంటూ వందలాది మంది సామూహికంగా ముందుగానే గుళ్లు గీయించుకున్నారు. ఉపవాసాలు ఉన్నారు. ఆ మొక్కులు ఫలించలేదు.. జయలలితకు బెయిల్ రాలేదు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడి సెప్టెంబర్ 27వ తేదీన జయలలిత జైల్లోకి వెళ్లినప్పటి నుంచి తమిళనాడు, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో తమిళులు.. ముఖ్యంగా అన్నాడీఎంకే అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిరాహార దీక్షలు, మౌన దీక్షలు, ప్రదర్శనలు.. ఇలా అన్ని రకాలుగా ఆమెకు సంఘీభావం తెలియజేస్తూ వచ్చారు. తమిళ సినీ పరిశ్రమ మొత్తం కొన్ని రోజులు స్తంభించింది. పాఠశాలలు, కళాశాలలు.. ఇలా అన్నిరకాల విద్యాసంస్థలు పనిచేయడం మానేశాయి. చివరకు అభిమానుల నుంచి కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి. జయలలితకు బెయిల్ రాకపోయిందో.. తమిళనాడులో ఉన్న కన్నడిగులందరినీ బందీలుగా చేస్తామంటూ పోస్టర్లు కూడా వేశారు. ఎంత చేసినా కర్ణాటక హైకోర్టు జడ్జి మాత్రం ఆమెకు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదనే తేల్చి చెప్పేశారు. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఆమెకు ఇవ్వడానికి తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తరఫున వాదించిన న్యాయవాదులు చెప్పినా కూడా న్యాయమూర్తి మాత్రం ఆ వాదనలతో ఏకీభవించలేదు. -
తరుణ్ తేజ్‌పాల్‌కు బెయిల్ నిరాకరణ
మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గోవా కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన్ను ఆరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇస్తారని, ముంబై కూడా వెళ్లబోరని ఆయన తరఫు న్యాయవాది తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ముందుగా శనివారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే తాత్కాలికంగా బెయిల్ ఇచ్చిన కోర్టు, శనివారం నాడు ఆయన దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. విచారణ ముగిసిన అనంతరం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో తరుణ్ తేజ్పాల్ను విచారించేందుకు గోవా పోలీసులకు మార్గం సుగమమైంది. అంతకుముందు చాలా రోజుల నుంచి ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.