తరుణ్ తేజ్పాల్కు బెయిల్ నిరాకరణ | sexual harassment case: Tarun Tejpal rejected bail by court | Sakshi
Sakshi News home page

తరుణ్ తేజ్పాల్కు బెయిల్ నిరాకరణ

Published Sat, Nov 30 2013 8:18 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

తరుణ్ తేజ్పాల్కు బెయిల్ నిరాకరణ - Sakshi

తరుణ్ తేజ్పాల్కు బెయిల్ నిరాకరణ

మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గోవా కోర్టు నిరాకరించింది.  దీంతో ఆయన్ను ఆరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇస్తారని, ముంబై కూడా వెళ్లబోరని ఆయన తరఫు న్యాయవాది తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది.

ముందుగా శనివారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే తాత్కాలికంగా బెయిల్ ఇచ్చిన కోర్టు, శనివారం నాడు ఆయన దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపింది. విచారణ ముగిసిన అనంతరం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో తరుణ్ తేజ్పాల్ను విచారించేందుకు గోవా పోలీసులకు మార్గం సుగమమైంది. అంతకుముందు చాలా రోజుల నుంచి ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement