Tarun Tejpal
-
లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు ఊరట
-
దానవ మానవుల పాతాళ్ లోక్
ఆకాశ హర్మ్యాలలో ఉంటారు కొందరు. నేల మీద ఉంటారు కొందరు. నేలకు దిగువన పాతాళలోకంలో వసిస్తారు కొందరు. పాతాళం అంటే చీకటి. నలుపు. చెడు. హింస. ప్రాణాలకు తెగించి చేసే బతుకు సమరం. కాని పాతాళంలోని బతుకులు ఇలా ఉండటానికి కారణం ఎవరు? నేల మీద ఉన్నవారు, ఐశ్వర్యపు అంచుల్లో బతికేవారు... వీరు తయారు చేసిన వ్యవస్థేనా దీనికి కారణం. ‘అమెజాన్ ఒరిజినల్స్’లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ చూడ్డానికి పైకి ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. నిజానికి ఇది మూసి ఉంచిన భారతీయ సమాజం. తెలిసీ చీకటిలో ఉంచేసే గుగుర్పాటు సమాజం. ఢిల్లీలో యుమునా నది అందరికీ తెలుసు. కాని ‘యమునా పార్’ (యమునకు ఆవల) ఒక ప్రపంచం ఉంది. అది దిగువ స్థాయి ప్రజల ప్రపంచం. స్లమ్స్ ప్రపంచం. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండే ప్రపంచం. ఆ యమునా పార్లో ‘ఔటర్ యమునా పార్’ పోలీస్ స్టేషనే మన కథాస్థలం. అందులో పని చేసే ఒక సాదాసీదా సర్కిల్ ఇన్స్పెక్టరే మన కథా నాయకుడు. అతని పేరు హాతీరామ్ చౌదరీ. కథ ఏమిటి? ఢిల్లీలో ఉన్న ఒక ప్రఖ్యాత న్యూస్ చానల్ హెడ్ మీద హత్యాయత్నం జరగనుందని పోలీసులకు తెలుస్తుంది. హత్య చేయడానికి పక్క ఊర్ల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు యమునా పార్ లాడ్జ్‌లో దిగి ఉన్నారు. ఆ లాడ్జ్ నుంచి బయట పడి హత్యకు బయలుదేరుతుండగా ఒక్క ఉదుటున వెంబడించి అరెస్ట్ చేస్తారు. జరిగిన హత్యాయత్నం ప్రఖ్యాత జర్నలిస్ట్ మీద. అతనికి ఏదైనా అయి ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు. అసలు ఈ చానల్హెడ్ను చంపడానికి ప్లాన్ చేసిందెవరు? అందుకు సిద్ధమైన ఈ నలుగురు ఎవరు? కేసు హాతీరామ్ చౌదరికి అప్పచెప్పబడుతుంది. అతనికి తోడుగా ఒక కుర్ర ఎస్.ఐని ఇస్తారు. వీరిద్దరూ అంత పెద్ద కేసును సాల్వ్ చేయాలి. చేయగలరా? చేయకూడదనే కొందరి ప్లాన్. అందుకే హాతీరామ్కు అప్పజెప్పారు. ఇప్పుడు హాతీరామ్ ఏం చేయాలి? ఒక్క అవకాశం హాతీరామ్ ఒక సగటు మధ్యతరగతి వాడు. జీవితంలో ఏమీ సాధించలేదు. ఇంట్లో భార్య అతడి ఎదుగుదలను కోరుకుంటూ ఉంటుంది. హైస్కూలుకు వచ్చిన కొడుకు తన తండ్రి ఒక హీరోలా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. కాని ఒక పోలీస్ వ్యాన్ వేసుకొని, చిరుబొజ్జ పెంచుకుని చిల్లర తగాదాలు, మొగుడూ పెళ్లాల పంచాయితీలు తీరుస్తూ వచ్చిన హాతీరామ్కు ఇది తన జీవితంలో దొరికిన అత్యంత ముఖ్యమైన అవకాశం అనుకుంటాడు. దీనిని ఎలాగైనా సాల్వ్ చేయాలి. ఎలా? నలుగురు నిందితులు దొరికారు కాబట్టి వీరి నుంచే ఆధారాలు దొరకాలి. వారిని ఇంటరాగేట్ చేయడం మొదలుపెడతాడు. వారిలో ఒకడిది మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్. ఇంకొకడిది పంజాబ్. ఒకడిది మీరట్. ఒకరిది ఢిల్లీ. ఈ నలుగురినీ కలిపింది ఎవరు? హాతీరామ్ తీగలాగుతూ వెళతాడు. మెల్లగా డొంక కదులుతుంది. కథ చివరకు తాను కేసు సాల్వ్ చేసి తీరుతాడు. అంతా మంచే ఉండదు.. ప్రతిదీ చెడే కాదు ఒక హత్యాయత్నం, దాన్ని ప్లాన్ చేసినవారిని పట్టుకోవడం ఇదే కథైతే ఈ సిరీస్ ఇంతమందిని ఆకట్టుకునేది కాదు. కాని ఇది జీవితాలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సమాజ భ్రష్టత్వాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మేడిపండులా కనిపించే వ్యవస్థ కడుపులో ఎంత కుళ్లు ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కులం, మతం, ఆర్థిక అంతరాలు, స్వార్థం... ఇవన్నీ మనిషిని ఎలా మారుస్తాయి ఈ సిరీస్ చెబుతుంది. నేరస్తులు ఎలా తయారవుతారు, ఎందుకు తయారవుతారు, అవడానికి మూలం ఏమిటి ఇది చెబుతుంది. కొందరి పట్ల ఈ దేశంలో ఉన్న వివక్షను, ఛీత్కారాన్ని, అవమానాన్ని చాలా శక్తిమంతంగా చూపిస్తుంది. పోలీసుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మేడల్లో ఉండేవారిలో కూడా మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మంచి చెడు అనేది మనుషుల్లో ఉంటూ మారుతూ ఉండే లక్షణంగా ఈ సిరీస్‌లో కనిపించి ప్రేక్షకుడు తనను తాను చూసుకుంటాడు. కథ గడిచే కొద్దీ ప్రతి పాత్ర మీద ప్రేక్షకుడి అంచనా మారిపోతూ ఉంటుంది. ప్రతి పాత్రను నలుపు తెలుపుల్లో విడగొట్టలేమని తెలుస్తుంది. తరుణ్ తేజ్‌పాల్ పుస్తకంతో ‘తహెల్కాడాట్కామ్’తో తరుణ్ తేజ్‌పాల్ సంచలనం సృష్టించడం అందరికీ తెలుసు. జర్నలిస్టుగా అతను రాసిన ‘ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్’ పుస్తకం ఈ సిరీస్ తీయడానికి ఇన్స్పిరేషన్. పాతాళ్లోక్లో చానెల్ హెడ్ చాలా పేరున్నవాడు. పాలకుల మీద చాలా స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి ఉంటాడు. ఒక సంభాషణలో అతను లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాడని చెబుతారు. కాని అతను కూడా తన ఉనికి కోసం పతనమవడం ఈ సిరీస్ లో మనం చూస్తాం. మీడియా ఎలాంటి తప్పుడు పనులకు తెగబడుతుందో, తన టి.ఆర్.పిల కోసం ఎవరినైనా ఎలా బలి చేయడానికి సిద్ధపడుతుందో ఇందులో చూపిస్తారు. ఈ ప్రొఫెషన్లో ఉండే వ్యక్తుల భార్యలు ఎలాంటి వొత్తిడికి గురవుతారో, ఎంత యాంగ్జయిటీ ఫీలవుతుంటారో ఇందులో చానెల్ హెడ్ భార్య పాత్ర ద్వారా చూపిస్తారు. ఇందులో డి.సి.పి చెప్పే డైలాగ్ ఒకటి ఉంది– ‘చూడటానికి ఈ వ్యవస్థ ఒక చెత్త కుప్పలా కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్లి చూస్తే ఒక మిషన్ అని అర్థమవుతుంది. ఈ మిషన్‌లో ప్రతి నట్టూ బోల్టు తాము ఏం చేయాలో తెలుసుకొని పని చేస్తుంటాయి. అలా తెలుసుకోని వాటి స్థానంలో కొత్త నట్లూ బోల్టులు వస్తుంటాయి. వ్యవస్థ మాత్రం అలానే నడుస్తుంటుంది’ అని అంటాడతడు. రాజకీయ నాయకులు, పోలీసులు, పెద్ద మనుషులు వీరు ఆడే ఆటలకు పాతాళలోకంలోని సగటు మనుషులు శలభాల్లా నాశనం కావడమే ‘పాతాళ్‌లోక్’ మూల కథాంశం. ఉత్కంఠ రేపే కథనం దాదాపు 40 నిమిషాలు ఉండే ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథ నడిచే కొద్దీ తర్వాత ఏం జరుగుతుందా అని కుతూహలం పెరుగుతుంది. కథనం ముందు వెనుకలుగా, పారలల్‌గా నడుస్తూ ఉంటుంది. ఒరిజినల్ లొకేషన్స్‌లో వాస్తవిక ప్రవర్తనతో తీయడం వల్ల ప్రేక్షకుడు తాను ఆ సన్నివేశంలో ఉన్నట్టుగా భావిస్తాడు. ఇందులో ముఖ్యపాత్ర ధారి, హాతీరామ్గా వేసిన నటుడు జైదీప్ అహ్లావత్ ఇంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్లో నటించాడు. ఈ సిరీస్ అతనికి చాలా పేరు తెచ్చింది. సిరీస్‌లో చేసిన వారందరూ పాత్రలు కారేమో అసలు మనుషులే నటిస్తున్నారేమో అనిపించేలా చేశారు. గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘సేక్రెడ్ గేమ్స్’ క్రైమ్ థ్రిల్లర్‌గా చాలా పెద్ద హిట్ అయ్యింది. అమేజాన్‌లో ‘పాతాళ్ లోక్’ అంతకన్నా ఎక్కువ ప్రశంసలు పొందుతోంది. రచయిత సుదీప్ శర్మ రెండేళ్లు కష్టపడి రాసిన ఈ సిరీస్‌ను హిందీ అర్థమయ్యేవారు తప్పక చూడొచ్చు. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఫాలో అవుతూ చూడాలనుకునేవారూ చూడొచ్చు. పాతాళ్ లోక్ (అమెజాన్ ఒరిజినల్స్ వెబ్ సిరీస్) ఎపిసోడ్ల సంఖ్య: 9 మొత్తం నిడివి: 6 గం.30 నిమిషాలు రచన: సుదీప్ శర్మ దర్శకత్వం: అవినాష్– ప్రొసిత్ రాయ్ నిర్మాత: అనుష్కా శర్మ – సాక్షి ఫ్యామిలీ -
‘తేజ్‌పాల్’ విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
న్యూఢిల్లీ: తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తనపై మోపిన అభియోగాలను తొలగించాలంటూ తేజ్‌పాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును స్వీకరించిన జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ బాబ్డేల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను ముందుగానే గుర్తించి ఉండాల్సిందని తేజ్‌పాల్ తరపున కపిల్ సిబల్ వాదించారు. ఇంతలోనే విచారణ నుంచి జడ్జి తప్పుకున్నారు. -
జర్నలిస్ట్‌పై రేప్.. తరుణ్ తేజ్‌పాల్‌కు కోర్టు షాక్!
సాక్షి, గోవా: తెహల్కా మ్యాగజిన్ మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు గోవా కోర్టు షాక్ ఇచ్చింది. తోటి మహిళా జర్నలిస్ట్‌పై అత్యాచారం జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న తేజ్పాల్పై గోవా కోర్టు అభియోగాలను ఖరారు చేసింది. ఈ కేసులో బుధవారం కోర్టుకు హాజరైన తేజ్‌పాల్ .. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని, విచారణపై స్టే విధించాలని తేజ్‌పాల్ కోరారు. అయితే, ఆయనపై ప్రాసిక్యూషన్ నమోదుచేసిన అభియోగాలను ఖరారు చేసిన కోర్టు.. విచారణను కొనసాగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బగా మారాయి. గతంలో తేజ్‌పాల్ ఈ కేసు విచారణపై స్టే విధించాలని బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కానీ కోర్టు నిరాకరించింది. 2013 నవంబర్‌లో గోవాలో జరిపిన పార్టీలో తేజ్‌పాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తెహల్కా ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ తేజ్‌పాల్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేశారు. బీజేపీ ప్రభుత్వం తనపై కావాలనే కక్షపూరిత చర్యలకు పాల్పడుతొందన్నారు. -
రాయని డైరీ
‘ది ఆల్కెమీ ఆఫ్ డిజైర్’.. షెల్ఫ్ లోంచి ఎప్పుడు నా చేతిలోకి వచ్చిందో తెలీదు. అది నా పుస్తకమే. పదేళ్ల క్రిందట రాసింది! ఊరికే చూస్తూ కూర్చున్నాను, పేజీలు తిప్పకుండా. అట్ట మీద ఆరోగ్యవంతమైన స్త్రీ నగ్నదేహం. లోపల స్త్రీ గురించి ఏం ఉండదు. అంతా మగాళ్ల ఏడుపు. ఆ ఏడుపుకి ఘనీభవ రూపమే.. అట్ట మీద ఉన్న స్త్రీ దేహం. లోపల ఏం రాశానో నాకు తెలుసు కాబట్టి, లోపల ఏం రాసి ఉందో తెలుసుకునే ఉత్సాహం నాకు లేదు. పైన స్త్రీ దేహంలోనే.. ఏళ్లుగా చూస్తూ ఉన్నా, తెలియంది ఇంకా ఏదో ఉన్నట్లనిపిస్తుంటుంది. ఆ ఉందనుకున్నది స్త్రీలో లేనిది కావచ్చు. ‘ఉందీ’ అని పురుషుడు అనుకోవడంలో ఉన్నదీ కావచ్చు. ఏది నిజం? ఏది అబద్ధం? స్త్రీ దేహంలో ఈ రెండూ ఒకటేనా? ‘‘తరుణ్.. మొత్తం తొమ్మిది చార్జిషీట్లు మన మీద వేయబోతున్నారు’’ అన్నాడు ప్రమోద్ కుమార్ దూబే.. ఆయాసపడుతూ వచ్చి. నా లాయర్ అతడు. ముఖం చిన్నబోయి ఉంది. ‘ఇట్స్ ఓకే’ అన్నాను. సో.. తొమ్మిది చార్జిషీట్లు, తొమ్మిది విచారణలు, తొమ్మిది శిక్షలు! ‘‘పదేళ్లకు తగ్గకుండా మనకు శిక్ష పడే అవకాశం ఉంది తరుణ్’’ అన్నాడు దూబే. నవ్వాను. ‘‘మిస్టర్ దూబే, మీరలా మాటిమాటికీ ‘మన మీద’, ‘మనకు’.. అంటూ మిమ్మల్ని నాతో కలుపుకోకండి. నేను నిందితుడిని. మీరు నా లాయర్’’ అన్నాను. ‘‘కానీ తరుణ్.. అన్యాయం అనిపిస్తోంది. ఒక మగవాడి మీద ఇన్ని కేసులు! రాంగ్‌ఫుల్ కన్స్ట్రెయింట్, రాంగ్‌ఫుల్ కన్ఫైన్మెంట్, క్రిమినల్ ఫోర్స్, సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్, హెరాస్మెంట్, అస్సాల్ట్ అండ్ రేప్.. లిఫ్ట్‌లో ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి ఉన్న పద్నాలుగు సెకన్లలోనే ఇవన్నీ ఎలా జరిగిపోతాయో నాకైతే అర్థం కావడం లేదు. మగవాడికి వ్యతిరేకంగా ఇండియన్ పీనల్ కోడ్‌లో ఇన్ని సెక్షన్లు ఉన్నాయా అనిపిస్తోంది’’ అన్నాడు దూబే. ‘‘మగవాడికి వ్యతిరేకంగా కాదు మిస్టర్ దూబే.. స్త్రీ దేహానికి అనుకూలంగా.. ’’ అని పెద్దగా నవ్వాను. భయంగా చూశాడు దూబే. ఒక మగవాడిలో కనిపించే భయం అది! ‘‘పెద్దగా నవ్వితే నవ్వారు. చిన్నగా మాట్లాడండి తరుణ్’’ అని చెప్పి, వెళ్లిపోయాడు. ‘ది ఆల్కెమీ ఆఫ్ డిజైర్’ ఇంకా నా చేతుల్లోనే ఉంది. అట్టమీది బొమ్మను చూస్తుంటే నా మీద కేసు పెట్టిన నా జూనియర్ మోస్ట్ గుర్తుకొచ్చింది. ఐ లవ్ హర్! తన దేహానికి ఏదో అయిందని, అవబోయిందనీ తను కేసు పెట్టలేదు. ఒక ఎంప్లాయర్‌గా నాపై తను ఉంచిన నమ్మకానికి దెబ్బ తగిలిందని కేసు పెట్టింది. గ్రేట్ గర్ల్. మాధవ్ శింగరాజు -
తెహల్కా ఎడిటర్ తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బ
గోవా : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలపై తరుణ్ తేజ్‌పాల్ న్యాయవాది మాట్లాడుతూ.. ఈ కేసు ఫైనల్ ఛార్జ్షీటులో 376 సెక్షన్ లేదని అన్నారు. కాగా తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్‌ను తేజ్‌పాల్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు అప్పట్లో దుమారం రేపాయి. హోటల్లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
తేజ్‌పాల్‌కు బెయిల్ మంజూరు
-
ఎట్టకేలకు తరుణ్ తేజ్‌పాల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడు నెలలుగా తరుణ్ తేజ్‌పాల్ గోవా జైల్లో ఉన్నారు. అంతకు ముందు తరుణ్ తేజ్ పాల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందటంతో సుప్రీంకోర్టు ఆయనకు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్‌పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడుతుంది. -
తేజ్ పాల్ మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. వచ్చే నెల 1వ తేదీ వరకూ తేజ్ పాల్ కు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తేజ్‌పాల్ తల్లి శకుంతల తేజ్‌పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ నెల 27 వరకు తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్ ను పొడిగించింది. అతనికి ఇచ్చిన బెయిల్ గడువు నేటితో ముగియనుండటంతో తేజ్ పాల్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం బెయిల్ ను మరో నాలుగు రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబర్‌లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం
లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ నెల 27 వరకు తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తేజ్‌పాల్ తల్లి శకుంతల తేజ్‌పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసింది. గతేడాది నవంబర్‌లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
తరుణ్ తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిలు
పనాజి: అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన తల్లి శకుంతల తేజ్ పాల్(87) నేడు కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు, కార్మకాండలు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. గతేడాది నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్‌పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకుపైగా జైలు శిక్ష పడుతుంది. -
తరుణ్ తేజ్ పాల్ తల్లి కన్నుమూత
పానాజీ: లైంగిక వేధింపుల కేసులో గోవా జైల్లో రిమాండ్ లో ఉన్న హల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ తల్లి శకుంతల తేజ్ పాల్ కన్నుముశారు. 87 ఏళ్ల శకుంతల గత కొద్దికాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని.. గోవాలోని తేజ్ పాల్ నివాసంలో కన్నుమూశారని ఆయన తరపు న్యాయవాది సందీప్ కపూర్ మీడియాకు తెలిపారు. అంత్యక్రియలకు తేజ్ పాల్ హాజరయ్యేందుకు అనుమతించాలని పానాజీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు తేజ్ పాల్ కు రెండుసార్లు కోర్టు అనుమతించింది. శకుంతల అంత్యక్రియలు గోవా లేదా ఢిల్లీలో నిర్వహించాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సందీప్ అన్నారు. సహచర ఉద్యోగిపై అత్యాచారం జరిపారనే ఆరోపణలపై గత సంవత్సరం నవంబర్ 30 తేది నుంచి రిమాండ్ లో ఉన్నారు. -
తేజ్‌పాల్ కేసులో బదులిచ్చిన డినీరో
పణజీ: తెహల్కా పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్పై నమోదైన అత్యాచారం కేసులో గోవా పోలీసులు తనకు పంపిన ప్రశ్నావళికి ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో సమాధానాలు అందజేశారు. ఆయన న్యూయార్క్‌లోని తన న్యాయవాదుల ద్వారా ఇటీవల వీటిని గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పంపించారు. తేజ్‌పాల్, ఆయనపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు గత ఏడాది నవంబర్‌లో థింక్‌ఫెస్ట్ సదస్సు కోసం గోవా హోటల్లో ఉన్నట్లు డినీరో న్యాయవాదులు ధ్రువీకరించారని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు. అయితే ఆయన డినీరో సమాధానాలను పూర్తిగా వెల్లడించలేదు. హోటల్లో బసచేసిన డినీరోను, ఆయన కూతురిని వారి గదిలోకి తీసుకెళ్లే క్రమంలో తేజ్‌పాల్ లిఫ్టులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించడం తెలిసిందే. -
తల్లిని చూసేందుకు తేజ్‌పాల్‌కు అనుమతి
పనాజీ: సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జైలుపాలైన తెహల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ తాత్కాలిక ఊరట లభించింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి శంకుతలను చూసేందుకు ఆయనకు గోవా కోర్టు అనుమతినిచ్చింది. మాపుసా పట్టణంలోని ఆస్పత్రిలో ఉన్న తన తల్లిని రేపు ఉదయం ఆయన కలుసుకోనున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శకుంతల ఐసీయూలో ఉన్నారు. కాగా, తేజ్‌పాల్ పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ తిరస్కరించింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గతేడాది నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
జైలు నుంచే తేజ్‌పాల్ మహిళతో ఫోన్ మంతనాలు
పనాజీ: లైంగిక ఆరోపణల కేసులో జైలు పాలైన తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్.. జైలు నుంచే ప్రతి రోజూ ఓ మహిళా వ్యాపర భాగస్వామితో ఫోన్లో సంభాషించేవారని విచారణలో తేలింది. జైలు అధికారులు ఈ నివేదికన మర్గావో జిల్లా, సెషన్స్ కోర్టుకు బుధవారం సమర్పించారు. తేజ్‌పాల్ జైలు గది నుంచి సిమ్‌ను సీజ్ చేసినట్టు అధికారులు చెప్పారు. ఈ సిమ్ పనాజీకి చెందిన ఓ మహిళ పేరుతో తీసుకున్నారు. తేజ్‌పాల్ ఢిల్లీకి చెందిన షీలా లుంకడ్ అనే మహిళతో మాట్లాడినట్టు జైలు అధికారులు తెలిపారు. షీలాతో పాటు ఢిల్లీకే చెందిన మంజరితో సంభాషించేవారని, ఆయన సిమ్‌లో ఇతర ఫోన్ నెంబర్లు ఉన్నట్టు చెప్పారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తేజ్‌పాల్, ఆయన భార్య గీతన బత్రా, షీలా, రాజీవ్ లుకండ్ భాగస్వాములు. జైల్లోకి ఫోన్‌ను ఎలా అనుమతించారే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
తేజ్ పాల్ బెయిల్ పై నేడు బాంబే కోర్టులో విచారణ
పనాజి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ బెయిల్ పిటీషన్ పై మంగళవారం బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటీషన్ పై ఫిబ్రవరి 18 వ తేదీన వాదనలు విన్న కోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని అందించాలని కోర్టు క్రైంబ్రాంచ్ ను కోరింది. బెయిల్ పిటీషన్ పై తేజ్ పాల్ ను నేడు కోర్టులో హాజరు పరుచనునున్నారు. అంతకుముందు తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలులుగా తేజ్ పాల్ జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు.అతనిపై లైంగిక వేధింపుల చట్టం క్రింద 354, 354-ఏ సెక్షన్లు, దురద్దేశంతో కూడిన వ్యాఖ్యలు చేసినందకు 341 ,342 సెక్షన్లు, అత్యాచార అభియోగాల క్రింద 376,376(2)(ఎఫ్), 376(2)(కె) సెక్షన్ల ను గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు నమోదు చేశారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్‌ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్‌పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తేజ్ పాల్ జుడిషియల్ రిమాండ్ 14 రోజలు పొడిగింపు
పానాజీ: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ జుడీషియల్ రిమాండ్ ని 14 రోజుల పాటు పొడిగిస్తూ స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం నవంబర్ లో గోవాలోని రిసార్డులో జరిగిన కాన్పరెన్స్ సందర్భంగా సహ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై తేజ్ పాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత రెండు నెలలుగా ఆయన పోలీసు, జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం బాంబే హైకోర్టును తేజ్ పాల్ ఆశ్రయించారు. ప్రస్తుతం వాస్కో కు 35 కిలో మీటర్ల దూరంలోని సదా సబ్ జైలులో ఉన్నారు. -
ఫిబ్రవరి 5న తరుణ్ తేజ్పాల్పై ఛార్జ్‌షీట్
పనాజి : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై వచ్చేవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు గోవా పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి అయ్యిందని... ఫిబ్రవరి 5న ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్‌ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తరుణ్ తేజ్‌పాల్ ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్‌పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. మరోవైపు కటకటాల్లో ఉన్న తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌ను గోవా కోర్టు విచారించింది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. -
తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పనాజీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించింది. కటకటాల్లో ఉన్న తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్ ను బుధవారం నాడు గోవా కోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తేజ్ పాల్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్‌ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్‌పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
లైంగిక వేధింపుల ఆరోపణలతో కటకటాల్లో ఉన్న తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం నాడు గోవా కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్‌ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్‌పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
‘స్టింగ్ కింగ్’ తేజ్‌పాల్ పతనం
క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, రక్షణ కొనుగోళ్లలో ముడుపులు వంటి అక్రమాలను స్టింగ్ ఆపరేషన్లతో బట్టబయలు చేసిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ప్రతిష్ట మట్టిగొట్టుకుపోయింది ఈ ఏడాదే. తన కుమార్తె స్నేహితురాలు, తన పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్ లిఫ్టులో ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళా జర్నలిస్టు ఆరోపించడంతో తేజ్పాల్ను అరెస్టు చేశారు. -
లైంగిక వేధింపుల వార్త షాకిచ్చింది: అమీర్ ఖాన్
మహిళా జర్నలిస్ట్ పై తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్త షాక్ కు గురి చేసింది అని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. ఓ మహిళ జర్నలిస్ట్ తో తేజ్ పాల్ అలా ప్రవర్థించడం నమ్మలేకపోయాను అని అన్నారు. ఈ కేసులో తరుణ్ తేజ్ పాల్ ప్రవర్తన తనను నిరుత్సాహపరిచిందని అన్నాడు. ఈ ఘటన అత్యంత విషాదకరమైంది అని అమీర్ అన్నారు. ఈ ఘటనలో మహిళా జర్నలిస్టుకు మనమంతా బాసటగా నిలువాలని అమీర్ సూచించారు. ఇలాంటి పరిస్తితిని ఎదుర్కొనడం ఏ మహిళకైనా చాలా కష్టమైన పనియే అని అన్నారు. భౌతిక, లైంగిక వేధింపులు, అత్యాచార సంఘటనలు మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఊహించలేనివని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరు తమ మైండ్ సెట్ ను మార్చుకోవాలి. పోలీసులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన అధికారులు తమ విధులను పకడ్భందీగా నిర్వహించాలని అమీర్ సూచించారు. అత్యాచారం అనేది ఓ హింసాత్మక సంఘటన అని అమీర్ వ్యాఖ్యానించారు. సత్యమేవ జయతే రెండవ భాగంలో కొన్ని కీలక సమస్యలను, సీరియస్ సమస్యలను ప్రస్తావించాలనుకుంటున్నానని అమీర్ తెలిపారు. -
తేజ్‌పాల్ పోలీస్ కస్టడీ పొడగింపు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడగించారు. మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారనే ఆరోపణలపై తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తేజ్‌పాల్‌కు తొలుత ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించిన న్యాయస్థానం తాజాగా ఈ నెల 10 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తేజ్పాల్ను శనివారం స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో భాగంగా పోలీసులు ఆయనకు ఇటీవల లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. పలువురు సాక్షులను విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు. -
పెద్దల పాడు పనులు!
సమాజంలో బాధ్యయుత స్థానాల్లో ఉన్నవారు హుందాగా మెలగాలి. మరీ ముఖ్యంగా గౌరవ ప్రదమైన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మరింత హుందాగా నడుకోవాల్సివుంటుంది. తమ కింద పనిచేసే వారి పట్ల మర్యాదగా వ్యహరించాల్సిన పెద్దలు దారి తప్పుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. ఉన్నత స్థానాల్లో వ్యక్తులు స్త్రీల పట్ల చులకగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు అధికమడం సాధారణంగా మారింది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన తరుణ్ తేజ్‌పాల్, జస్టిస్ ఏకే గంగూలీ వివాదాలే ఇందుకు ఉదాహరణ. సంచలనాత్మక ‘స్టింగ్’ ఆపరేషన్లతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తెహల్కా పత్రిక ఇప్పుడు కష్టాల్లో పడింది. దానికి కారణం ఆ ప్రతిక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్. అవినీతిపరులైన బడా నేతలతో తలపడే ధీరుడిగా పేరు గాంచిన తేజ్‌పాల్ తన కూతురి స్నేహితురాలిపై వికృతచేష్టలతో జైలుపాలయ్యారు. ‘స్టింగ్’ జర్నలిజానికి చిరునామాగా మారిన తేజ్‌పాల్ దారి తప్పి ఊచలు లెక్కిస్తున్నారు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరోను కలుద్దామని ఆశ పెట్టి గోవా స్టార్ హోటల్లో బాధితురాలిని లిఫ్టులోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారన్న ఆరోపణలతో తేజ్‌పాల్ ఆట కట్టించారు. పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా పనిచేసి రిటైరైన గంగూలీపై న్యాయవిద్యార్థిని ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. నిర్భయ ఉదంతంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో తన పట్ల జడ్జిగారు అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు వెల్లడించడంలో కలకలం రేగింది. న్యూఢిల్లీలోని లె మెరిడియన్ హోటల్లోని గదిలో జస్టిస్ గంగూలీ గత ఏడాది డిసెంబర్ 24న రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల మధ్య తనను వేధించారని తెలిపింది. మద్యం తాగాలని కోరారని, కామపేక్షతో కనబరచారని బాధితురాలు వాపోయింది. అయితే తాను వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గారని చెప్పింది. తాను బయటకు వెళ్లిన తర్వాత తన వెనకకే వచ్చి లోపల జరిగిన దానికి సారీ కూడా చెప్పారని ఆమె వెల్లడించింది. ఈ ఉదంతంపై ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ కూడా దీన్ని నిర్ధారించింది. అయితే ఘటన జరిగిన నాటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గంగూలీ రిటైరైనందున ఆయనపై తదుపరి చర్యలు తీసుకోబోమని తెలిపింది. మహిళా భద్రత ప్రశ్నార్థకమైన తరుణంలో ఉన్నత స్థానాల్లో వ్యక్తులు దిగజారి ప్రవర్తిస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తమను ఏమీ చేయరన్న దీమాతో లేదా బాధితులు ఎవరికీ చెప్పుకోలేరన్న ధైర్యంతో 'పెద్దోళ్లు' పాడు పనులకు దిగుతున్నారు. వయసుపైబడిన వారు తమ కూతురి వయసున్న యువతులపై అకృత్యాలకు తెగబడుతుండడం ప్రమాదకర పరిణామం. తరుణ్ తేజ్‌పాల్(50), ఏకే గంగూలీ(66) ఇద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నవారే కాదు వయసులోనే పెద్దవారే కావడం గమనార్హం. వికృత చేష్టలతో తమ పెద్దరికానికే కాదు, తమ పదవులకు కళంకం తెచ్చారు. చేసిన పనులకు సిగ్గుపడడం పోయి సమర్థించుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. మహిళ భద్రతకు ఢోకా లేని సమాజంగా అవతరించాలంటే తక్షణ సామాజిక విలువల సంస్కరణ జరగాలి. -
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు తేజ్‌పాల్ కేసు
న్యూఢిల్లీ/పణజీ: సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించే అవకాశాలున్నాయని గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి తాము సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తామని, మహిళా జడ్జిని నియమిస్తామని చెప్పారు. బాధిత యువతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.