తేజ్‌పాల్ కేసులో బదులిచ్చిన డినీరో | Tarun Tepal rape case: Robert De Niro replies to Goa police | Sakshi
Sakshi News home page

తేజ్‌పాల్ కేసులో బదులిచ్చిన డినీరో

Published Wed, May 7 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

తేజ్‌పాల్ కేసులో బదులిచ్చిన డినీరో

తేజ్‌పాల్ కేసులో బదులిచ్చిన డినీరో

పణజీ: తెహల్కా పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌పై నమోదైన అత్యాచారం కేసులో గోవా పోలీసులు తనకు పంపిన ప్రశ్నావళికి ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో సమాధానాలు అందజేశారు. ఆయన న్యూయార్క్‌లోని తన న్యాయవాదుల ద్వారా ఇటీవల వీటిని గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పంపించారు. తేజ్‌పాల్, ఆయనపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు గత ఏడాది నవంబర్‌లో థింక్‌ఫెస్ట్ సదస్సు కోసం గోవా హోటల్లో ఉన్నట్లు డినీరో న్యాయవాదులు ధ్రువీకరించారని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు. అయితే ఆయన డినీరో సమాధానాలను పూర్తిగా వెల్లడించలేదు. హోటల్లో బసచేసిన డినీరోను, ఆయన కూతురిని వారి గదిలోకి  తీసుకెళ్లే క్రమంలో తేజ్‌పాల్ లిఫ్టులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement