goa police
-
బిడ్డను కడతేర్చిన తల్లి... వెలుగులోకి మరిన్ని వివరాలు!
బళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు బయటపడుత్నాయి. పోలీసులకు హత్య జరిగిన గోవాలోని సర్వీస్ అపార్టుమెంట్ గదిలో ఖాళీగా ఉన్న రెండు సిరప్ సీసాలు లభ్యమయ్యాయి. సిరప్‌ను అధిక డోస్‌తో తన కుమారుడికి తాగించి హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పరిశీలిస్తే సుచనా సేథ్ ముందుగానే తన కుమారుడిని హత్య చేయాలని ప్రణాళిక వేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికల్లో మాత్రం బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మరణించడానికి ఒక వస్త్రం లేదా తలగడను ఆమె ఉపయోగించినట్లు తెలుస్తోందని వెల్లడించారు. సుచనా సేథ్ గోవాలో ఉన్న సర్వీస్ అపార్టుమెంట్లో రెండు సిరప్ బాటిల్స్ (ఒకటి చిన్నది, మరోటి పెద్దది) లభించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మృతి చెందినట్లు తెలుస్తోందని చెప్పారు. అయితే బాలుడు మరణించక ముందు సుచనా అతనికి అధిక డోస్‌తో కూడిన సిరప్‌ను తాగించిందా? అన్న విషయంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సుచనాకు దగ్గు వస్తోందని సిరప్ కొనుగోలు చేయాలని సర్వీస్ అపార్టుమెంట్ సిబ్బందితో చెప్పిందని పోలీసు అధికారి తెలిపారు. దానితోపాటు ఆమె మరో పెద్ద సిరప్ బాటిల్‌ను కూడా కొనుగోలు చేసి తన వెంట తెచ్చుకుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని పరిళీలిస్తే పక్కా ప్రణాళిక ప్రకారం బాలుడిని ఆమె హత్య చేసిందని అన్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం బాలుడిని తాను హత్య చేయలేదని, తాను నిద్ర లేచేవరకు బాలుడు మృతి చెంది ఉన్నాడని సుచనా సేథ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె చెప్పే విషయాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు. త్వరలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని.. బాలుడిని హత్య చేయడానికి ఆమెకు గల ప్రధానమైన కారణాన్ని చేధిస్తామని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో విడాకులు తీసుకొవాలని వేరుగా ఉంటోందని.. అదే విషయంలో బాలుడిని హత్య చేసినట్లు తెలుస్తోందని తెలిపారు. ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ గోవాలో తన కుమారుడిని చంపి, కొడుకు శవాన్ని బ్యాగులో కుక్కి ట్యాక్సీలో కర్ణాటకకు తరలించారు. సోమవారం రాత్రి చిత్రదుర్గలో అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. నిందితురాలు సుచనా సేథ్‌ను విచారణ నిమిత్తం ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గోవా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి -
ఒకటి, రెండు కాదు.. 40 బైకులు సీజ్: కారణం ఏంటంటే?
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. రూల్స్ అతిక్రమించిన వారు ఎంతవారైనా వదిలిపెట్టే సమస్యే లేదని పోలీసులు కరాఖండిగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గోవా నగరంలో ట్రాఫిక్ పోలీసులు 40 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా రహదారులపై నడిచే ఏ వాహనమైన తప్పకుండా మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలకు లోబడి ఉండాలి. అలా కాదని మోడిఫైడ్ చేసుకుని రోడ్లమీద తిరిగితే మాత్రం జరిమానాలు భారీగా చెల్లించాల్సి వస్తుంది. గోవాలో సీజ్ చేసిన వాహనాల ఎగ్జాస్ట్ మోడిఫై చేయబడ్డాయి. వాహనంలో కంపెనీ అందించే భాగాలు కాదని కొంతమంది తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటారు. ఇదే వారిని సమస్యల్లోకి నెట్టేస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. సీజ్ చేసిన బైకులలో ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: Pakistan Crisis: చుక్కలు తాకిన మారుతి ధరలు.. ఏకంగా రూ. 21 లక్షలకు చేరిన ఆల్టో) మోడిఫైడ్ చేసిన ఎగ్జాస్ట్ సాధారణ బైకుల కంటే ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఇది ప్రజా రహదారుల్లో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా అన్ని బైకులను సీజ్ చేసినట్లు మార్గోవ్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకులలో రాయల్ ఎన్ఫీల్డ్, ఇతర స్పోర్ట్స్ బైకులు ఎక్కువ శబ్దం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కొంతమంది బైక్ ప్రేమికులు తమ వాహనాలను మరింత మాడిఫైడ్ చేసుకోవడం వల్ల ఆ శబ్దం మరింత ఎక్కువవుతుంది. 80 డెసిబుల్స్ మించిన శబ్దాన్ని ఉత్పత్తి చేసే వాహనాలు చట్ట విరుద్ధం. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. -
సోనాలి ఫోగట్ దారుణ హత్య.. ఎందుకు చంపారు?
బీజేపీ నేత, హిందీ బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ సోనాలి ఫోగట్(43) హఠాన్మరణం కాస్త హత్యగా నిర్ధారణ కావడం సంచలనం సృష్టిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలకు బలం చేకూరేలా.. ఆమె అనుచరులే ఆమె మరణానికి కారణమన్న కోణంలోనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినా కారణాలేంటన్నది మాత్రం పోలీసులు ఇంకా ప్రకటించకపోవడం విశేషం. తొలుత గుండెపోటు మరణంగా ప్రకటించిన వైద్యులు.. శవపరీక్షలో ఒంటిపై గాయాలున్నాయని నిర్ధారించారు. దీంతో సోనాలి ఫోగట్ మరణాన్ని అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చేశారు గోవా పోలీసులు. ఆపై ఆమె అనుచరులు సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ వాసీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో.. ఈ ఇద్దరూ ఆమెకు ఇచ్చిన డ్రింకులో 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపినట్లు అంగీకరించారు. అంతేకాదు.. తన అనుచరుల సాయంతో తూలుతూ నడుస్తున్న సోనాలి ఫోగట్ వీడియోలు(సీసీటీవీ ఫుటేజీ)సైతం బయటకు రిలీజ్ చేశారు పోలీసులు. అతికష్టం మీద సుధీర్ సాయంతో ఆమె రెస్టారెంట్లో నడుస్తూ కనిపించారు. ఆ ఆధారాలతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ టీం వీళ్లిద్దరినీ పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి.. కేసు దర్యాప్తు కొనసాగిస్తోంది. అలాగే త్వరలో వీళ్లిద్దరినీ కోర్టులో ప్రవేశపెడతామని గోవా పోలీసులు చెప్తున్నారు. ఆ రెండున్నర గంటలు! ఆధారాలు నాశనం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉండడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు గోవా డీజీపీ జస్పాల్ సింగ్ తెలిపారు. కర్లీస్ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆమెను సుధీర్ తన భుజం మీద మోసుకుంటూ టాయిలెట్‌కు తీసుకెళ్లాడు. వెనకాలే సుఖ్విందర్ కూడా ఉన్నారు. రెండున్నర గంటల తర్వాత.. అంజువా ఏరియాలోని సెయింట్ ఆంటోనీ ఆస్పత్రికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఉదయం ఏడు గంటలకు వైద్యులు ఆమె గుండెపోటుతో చనిపోయిందని ప్రకటించారు. అయితే ఆ రెండు గంటల్లో ఏం జరిగిందో మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదు. This is CCTV footage allegedly of Sonali Phogat with Sudhir Sangwan of August 22. She can barely walk. Drunk or God knows what they drugs they gave her 😑 #SonaliDeathMystery#SonaliPhogat pic.twitter.com/gj5JDCW4bL — Rosy (@rose_k01) August 26, 2022 సంచలనం సృష్టించిన సోనాలి ఫోగట్ మృతి కేసు.. మర్డర్‌గా నిర్ధారణ కావడం ఆమె అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఆమె అత్యాచారానికి గురయ్యారని, బ్లాక్‌మెయిలింగ్‌తో సుధీర్, సుఖ్విందర్లపై ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అయితే ఆమెను ఎందుకు చంపారనే కారణాన్ని మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదని గోవా పోలీసులు చెప్తుండడం గమనార్హం. అయితే ఆర్థిక కారణాలే కారణం అయ్యి ఉంటాయని భావిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. సోనాలి ఫోగట్ హత్యకు కారణమైన గోవా కర్లీస్ రెస్టారెంట్ గతంలోనూ ఓ ఫారిన్ అమ్మాయి దారుణ హత్యాచారానికి కారణమైంది కూడా. ఆ సమయంలోనూ ‘డ్రగ్స్’ కోణంలోనే ఈ పబ్‌పై ఆరోపణలు వెల్లువెత్తగా.. కాలక్రమంలో ఆ విషయాన్ని అంతా మరిచిపోయారు. గోవా మెడికల్ కాలేజీలో ఆమె మృతదేహానికి పరీక్షలు పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం బంధువులు, అభిమానుల నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. సోనాలి కూతురు సైతం పాడె మోసి కన్నీటి పర్యంతం అయ్యింది. అంతకు ముందు తన తల్లికి న్యాయం చేయాలంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. #SonaliPhogat's 15yrs old daughter demands justice; She said, "My mother should get justice. Proper investigation should be done. Culprit should get punished."pic.twitter.com/EzCbJVQ9KW — #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) August 26, 2022 ఇదీ చదవండి: తోక ఊపోద్దు, నాలుక కోస్తాం.. -
మరణానికి ముందు సోనాలి ఫోగట్‌కు డ్రగ్స్! .. సంచలన విషయాలు వెల్లడి
బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సోనాలి ఫోగట్ ఆగస్టు 23న గోవాలో హఠాన్మరణ చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో మరణించినట్లు భావించగా.. తరువాత సోనాలిది హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలతో గోవా పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. తాజాగా ఆమె డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్ నెలకొంది. సోనాలికి పార్టీలో డ్రగ్స్ ఇచ్చినట్లు తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గోవా ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ శుక్రవారం మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు. సోనాలి ఫోగట్ మరణానికి ముందు అంజునాలో జరిగిన పార్టీలో ఆమెకు తన ఇద్దరు సహచరులు మత్తుమందు ఇచ్చినట్లు తేలిందన్నారు. అసహ్యకరమైన రసాయన పదార్ధాలను కలిపిన డ్రింక్‌ను ఆమెతో బలవంతంగా తాగించారని పేర్కొన్నారు. చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై గాయాలు.. హత్య కేసు నమోదు డ్రింక్ తాగిన తర్వాత ఆమె తనపై తాను కంట్రోల్ తప్పిందని తెలిపారు. సోనాలి నియంత్రణ కోల్పోవడంతో ఉదయం 4.30 నిమిషాలకు తనను టాయిలెట్లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే తరువాత రెండు గంటలపాటు ఏం చేశారనే దానిపై వివరణ లేదన్నారు. నిందితులిద్దరూ ఆమె హత్యకు సంబంధించిన కేసులో ఇప్పుడు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ ఆగస్టు 22న ఫోగట్‌తో కలిసి గోవాకు వెళ్లారని, అంజునాలోని కర్లీస్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసినట్లు, త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఇక డ్రగ్స్ ప్రభావంతోనే సోనాలి మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు. చదవండి: సోనాల్ ఫోగట్ మృతిలో మరో ట్విస్ట్.. నైట్ క్లబ్ వీడియో వైరల్ -
బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై గాయాలు.. హత్య కేసు నమోదు
టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ మరణంపై గోవా పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు. ఫోగట్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోనాలీ మృతదేహానికి గురువారం గోవా మెడికల్ కాలేజీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోస్టులో ఆమె శరీరంపై అనేక మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సోనాలితో పనిచేసే ఇద్దరు సహచరులపై గోవా పోలీసులు హత్యానేరం అభియోగాలు మోపారు. కాగా హర్యానాలోని హిసార్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (42) ఆగస్టు 23న హఠాన్మరణం చెందింది. ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురైన సోనాలి ఆసుపత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణం వెనుక హత్య కుట్ర దాగి ఉందని సోనాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చదవండి: సోనాల్ ఫోగట్‌పై మూడేళ్లుగా అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్! సోనాలి పీఏ సుధీర్ సంగ్వాన్‌తోపాటు ఆమెతో సన్నిహితంగా ఉండే సుఖ్వింధర్ అనే ఇద్దరు వ్యక్తులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ ఆమె సోదరుడు రింకూ ధాకా బుధవారం అంజునా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. -
Sonal Phoghat: మత్తుమందిచ్చి అత్యాచారం.. ఆమెది ముమ్మాటికీ హత్యే!
ఛండీగఢ్: బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాల నేపథ్యంలో తీవ్ర ప్రకటనలు ఇస్తోంది ఆమె కుటుంబం. తాజాగా సోదరుడు రింకు ధాక, సంచలన ఆరోపణలకు దిగాడు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడతను. సోనాల్ ఫోగట్ పీఏ సుధీర్ సంగ్వాన్, అతని స్నేహితుడు సుఖ్విందర్‌లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని, ఆమెపై హిస్సార్‌లోని ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసేవాళ్లని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారని రింకు చెబుతున్నాడు. సినీ, రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని సోనాలిని వాళ్లిద్దరూ బెదిరించేవారని, డబ్బు.. ఇతర సౌకర్యాలను అనుభవించేవాళ్లని, పరువుపోతుందనే భయంతోనే ఆమె ఇంతకాలం మౌనంగా ఉండిపోయిందని రింకు పోలీసులకు తెలిపాడు. చోరీ వంకతో.. తన భర్త చనిపోయాక.. కుటుంబం కంటే నటన, రాజకీయాల మీదే దృష్టిసారిస్తూ వచ్చింది సోనాలి ఫోగట్. 2019 ఎన్నికల సమయంలో సంగ్వాన్, సుఖ్విందర్‌లు సోనాలికి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రతీ విషయంలోనూ వీళ్లిద్దరి జోక్యం ఎక్కువైంది. ఆ సమయంలోనే ఆమెపై అత్యాచారం జరిగింది. ఇక కొంతకాలం కిందట సోనాలి ఇంట్లో చోరీ జరిగింది(ఇదీ కూడా సంగ్వాన్ ప్లాన్ అనేది రింకు ఆరోపణ). అది సాకుగా చూపి.. ఇంట్లో పని మనుషులను తొలగించారు. అప్పటి నుంచి ఆమె భోజనం బాధ్యతలన్నీ సుధీర్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ భోజనంలో మత్తు మందు కలిపి.. నిత్యం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని రింకు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఈ విషయాన్ని తమ దగ్గరి బంధువైన అమన్‌కు స్వయంగా సోనాలినే వెల్లడించిందని అంటున్నాడు. అంతేకాదు.. షూటింగ్ వంకతో.. గోవాలో షూటింగ్ పేరుతో సోనాలి ఫోగట్‌ను తీసుకెళ్లారని, తీరా అక్కడికెళ్లాక షూటింగ్ లేదని చెప్పారని, ఈ క్రమంలోనే భోజనం చేశాక ఏదోలా ఉందని, అక్కడేదో జరుగుతోందని సోనాలి తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసిందని, ఫోన్ ట్రేస్ చేసే ఛాన్స్ ఉండడంతో వాట్సాప్ కాల్ మాట్లాడాలని ప్రయత్నించిందని రింకూ చెప్తున్నాడు. సోనాలి ఇంటి తాళాల దగ్గరి నుంచి ఫోన్, బ్యాంక్ కార్డులు, ఆర్థిక లావాదేవీలన్నీ సుధీర్ దగ్గరే ఉండేవని, సోనాలి మరణం వార్త తెలిశాక ఆమె ఫోన్లతో పాటు తన ఫోన్లను సుధీర్ స్విచ్ఛాప్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని రింకు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవా డీజీపీ పర్యవేక్షణ ఆస్తి కోసమే కాదు.. ఆమె హత్య వెనుక రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు రింకు. ఈ మేరకు గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన రింకు.. సుధీర్, సుఖ్విందర్లను అరెస్ట్ చేయాలని, తన సోదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గుండెపోటుతో సోనాలి ఫోగట్ హఠాన్మరణం చెందిందని భావిస్తుండగా.. ఆమె మరణంపై కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇదీ చదవండి: ‘శ్రీమతి’ మృతి.. న్యాయం కోసం పాదయాత్ర..! -
అశ్లీల వీడియో షూట్.. పూనమ్ పాండే అరెస్ట్
హాట్ మోడల్, వివాదస్పద నటి పూనమ్ పాండేను గోవా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పూనమ్ ఇటీవల గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆమెపై ఫిర్యాదు చేసింది. దీనికి తోడు పూనమ్ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిపై మరో కేసు నమోదైంది. గోవా సంస్కృతి, చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకే కేసు పెట్టామని గోవా ఫార్వర్డ్ మహిళా విభాగం పేర్కొంది. ఫార్వర్డ్ పార్టీ ఫిర్యాదు మేరకు పూనమ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వీడియో షూట్‌కు అనుమతి ఇచ్చినందుకు ఇద్దరు పోలీసులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. కాగా, గతంలో పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబే పై దక్షిణ గోవాలోని కెనకోనా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే.సామ్ అహ్మద్ తనపై దాడి చేసి, చెంపదెబ్బ కొట్టినట్లు పూనమ్ ఆరోపించింది. ఆ తర్వాత సామ్ బాంబే బెయిల్ పై విడుదలయ్యాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే పూనమ్ మనసు మార్చుకొని భర్తతో కలిసిపోయి అందరినీ ఆశ్చర్య పరిచింది. -
ప్రముఖ హీరో మాజీ భార్యపై ఛీటింగ్ కేసు
గోవా: బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసానే ఖాన్‌పై గోవాలో చీటింగ్ కేసు నమోదైంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆమెపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆర్కిటెక్ట్‌గా పరిచయం చేసుకున్న సుసానే ఖాన్ తమ నుంచి ఓ కాంట్రాక్టు తీసుకుందని, ఈ పనికోసం 2013లో ఆమెకు 1.87 కోట్ల రూపాయలు చెల్లించామని, అయితే ఇప్పటివరకు పని పూర్తిచేయలేదని ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సిందిగా సుసానేను కోరగా, ఆమె తెలియజేయలేదని ఆరోపించింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఆరా తీయగా సుసానే అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలిసిందని ఈ సంస్థ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
సెక్స్ రాకెట్ లో సినిమా తారలు!
పణజి: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును గోవా పోలీసులు రట్టు చేశారు. మోడల్స్, సినిమా తారలతో మహారాష్ట్ర, గోవాలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాలోని కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పణజి శివారులోని టోనీ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ఆనంద్ కుమార్ అలియాస్ ఆండీని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ(క్రైమ్ బ్రాంచ్) కార్తీక్ కశ్యప్ తెలిపారు. అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు వెల్లడించారు. 'ఆనంద్ కుమార్ ఇంట్లో కీలక ఆధారాలు లభించాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు, సినిమా తారలు, మోడల్స్ ఫోన్ నెంబర్లు దొరికాయ'ని ఎస్పీ కశ్యప్ చెప్పారు. క్లైయింట్ల లిస్టులో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే మిగతా వివరాలు చెప్పేందుకు ఎస్పీ నిరాకరించారు. పోలీసులు కస్టమర్ల నటించి ఆనంద్ కుమార్ కింద పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలను కాపాడారు. -
హెల్మెట్ లేదని.. కారు డ్రైవర్ కు జరిమానా!!
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ద్విచక్ర వాహనాల వాళ్లు హెల్మెట్లు పెట్టుకోకపోతే వాళ్లకు జరిమానా విధించడం చూస్తున్నాం. వాళ్ల ప్రాణాలను కాపాడాలన్న సదుద్దేశంతోనే ఈ నిబంధన విధించారు. అయితే.. గోవాలో మాత్రం ట్రాఫిక్ పోలీసులకు ఉన్నట్టుండి ఏం బుద్ధి పుట్టిందో గానీ... హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటూ ఓ కారు డ్రైవర్ కు జరిమానా విధించారు. ఏక్నాథ్ అనంత్ పాల్కర్ అనే వ్యక్తి హెల్మెట్ లేకుండా కోల్వా బీచ్ సమీపంలోని ఓ గ్రామంలో కారు నడుపుతుండగా.. ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ఎల్ హనుషికట్టి అతడిని పట్టుకుని చలానా రాశారు. మోటారు వాహన చట్టంలోని 177 సెక్షన్ కింద అతడిని బుక్ చేశారు. ఆ సెక్షన్ ప్రకారం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా విధించొచ్చు. అయితే... ఆ ఎస్ఐ ఏదో పొరపాటున ఆ సెక్షన్ రాసి ఉంటారని, సదరు కారు డ్రైవర్ ఏదో వేరే పొరపాటు చేసి ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం తగిన లైసెన్సు లేకపోవడం కూడా తప్పు. పొరపాటున ఆ ఎస్ఐ హెల్మెట్ లేదని రాసి ఉంటారని చెప్పారు. కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోనందుకు జరిమానా విధించేంత మూర్ఖులు ఎవరూ పోలీసు శాఖలో ఉండరని కూడా సదరు సీనియర్ అధికారి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
మోదీ,పారికర్ ను చంపేస్తాం
-
మోదీ,పారికర్ ను చంపేస్తాం- ఐఎస్ఐఎస్
పనాజి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌లను చంపేస్తామంటూ ఐఎస్ఐఎస్ పేరుతో వచ్చిన ఓ లేఖ ఉద్రిక్తతను రాజేసింది. గత వారం గోవా రాష్ట్ర సెక్రటేరియట్‌కు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ సంస్థ) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు రాష్ట్ర నిఘా విభాగం చెబుతోంది. దాంతో పోలీస్ బలగాలను, భదతా దళాలను అప్రమత్తం చేసింది. ఐఎస్ఐఎస్ అని సంతకం చేసి పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కార్డు కాపీని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అన్ని పోలీస్ స్టేషన్లకు పంపింది. కాగా నరేంద్ర మోది, పారేకర్లను చంపేస్తామంటూ తమ కు ఒక లేఖ చేరిందని గోవా పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు. పోస్ట్ కార్డ్ పై సంతకం మాత్రమే ఉన్న ఈ లేఖలో గోవధ నిషేధంపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అయితే ఎవరు రాశారనే వివరాలేవీ ఆ లేఖలో లేవని పేర్కొన్నారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
పోలీసులపై దౌర్జన్యం.. మహిళ అరెస్టు
ఓ పోలీసుతో పాటు మహిళా కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసిన కేసులో గోవా పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఫరీదా బీ (35) అనే మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడ గందరగళం సృష్టించిందని ఇన్స్పెక్టర్ సిద్ధాంత్ శిరోద్కర్ తెలిపారు. సరిగా ప్రవర్తించాలని చెప్పినందుకు తనతో పాటు మరో మహిళా కానిస్టేబుల్‌ను కూడా ఆమె తోసిపారేసిందని ఆయన చెప్పారు. పోలీసుస్టేషన్లో ఆమె చేసిన హడావుడి మొత్తం లోపలున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యిందన్నారు. స్థానిక యువకుడిపై ఫిర్యాదు చేయడానికి ఆమె స్టేషన్‌కు వెళ్లింది. తర్వాత ఓ ఎస్ఐని విచారణకు పంపినా ఆమె సంతృప్తి చెందలేదు. మళ్లీ పోలీసు స్టేషన్‌కు వచ్చి.. దర్యాప్తు సక్రమంగా లేదని చెబుతూ పోలీసులపై ఆరోపణలు చేసింది. తర్వాత వాగ్వాదం చోటుచేసుకుని ఇన్స్పెక్టర్, మహిళా కానిస్టేబుళ్లను తోసేసింది. ఆమెపై ఐపీసీ సెక్షన్లు 353, 427, 504 కింద కేసు పెట్టారు. -
గోవాలో అనాథ బాలికపై గ్యాంగ్ రేప్
దక్షిణ గోవాలో దారుణం జరిగింది. అనాథ బాలికను ముగ్గురు వ్యక్తులు ఏప్రిల్ నెల నుంచి పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని గోవా పోలీసులు వెల్లడించారు. క్యుపెమ్ అనే పట్టణంలో ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తనపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి, ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. ఈ కేసులో కొన్ని వాస్తవాలను పరిశీలిస్తున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గవాస్ చెప్పారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావచ్చని, అయితే తాము ఇంకా అతడిని విచారించాల్సి ఉందని అన్నారు. విచారణ తర్వాత మాత్రమే నిందితుల పేర్లు, వయసు వెల్లడించగలమని తెలిపారు. ప్రస్తుతానికి ఆ బాలికను పనజిలో ఉన్న ఓ మిషనరీ ట్రస్టుకు తరలించి, అక్కడ రక్షణ కల్పిస్తున్నారు. -
చెన్నైయిన్ ఫుట్‌బాల్ టీం కెప్టెన్ ఎలానో అరెస్ట్
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ విజేత చెన్నైయిన్ కెప్టెన్ ఎలానో బ్లూమర్ను ఆదివారం అర్ధరాత్రి గోవా పోలీసులు అరెస్టు చేశారు. మ్యాచ్ అనంతరం జరుపుకొనే వేడుకల్లో గోవా ఫ్రాంచైజ్ సహ యజమాని దత్తరాజ్ సల్గవోన్సర్పై ఎలానో భౌతిక దాడికి పాల్పడ్డాడు. సల్గవోన్సర్ ఫిర్యాదు మేరకు ఎలానోను అరెస్టు చేసినట్లు మార్గావ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సీఎల్ పాటిల్ తెలిపారు. -
వ్యభిచార కూపం నుంచి టాలీవుడ్ నటికి విముక్తి
పణజి: తెలుగు, హిందీ భాషల్లో పలు హిట్ సినిమాల్లో తనదైన నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించి.. ప్రస్తుతం వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన ఓ టాలీవుడ్ నటిని గోవా పోలీసులు కాపాడారు. పణజి ఇన్స్పెక్టర్ సిద్దాంత్ శిరోద్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా ఛాన్సులు తగ్గటంతో దాన్ని అవకాశంగా తీసుకుని సదరు నటీమణిని వ్యభిచార కూపంలోకి దింపేందుకు సాక్షాత్తు ఆమె సహాయకురాలు ఆయేషా సయ్యద్ (30) పథకం రచించింది. ఈ క్రమంలోనే నటి, ఆమె సహాయకురాలు మంగళవారం ఉదయం పణజికి చేరుకుని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నారు. రాత్రయిన తర్వాత ఆ గదికి ఓ బడాబాబు చేరుకున్నాడు. అంతలోనే సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ పై పోలీసులు దాడిచేశారు. విటుడు పోలీసుల కన్నుగప్పి పారిపోగా, నటిని, ఆమె సహాయకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తనను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపేందుకు ఆయేషా ప్రయత్నిస్తోందని నటీమణి పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించామని, ఆయేషాపై కేసు నమోదుచేసి, విటుడి కోసం గాలిస్తున్నామని శిరోద్కర్ తెలిపారు. కాగా వ్యభిచారం చేయడానికి వెళ్లిన విటులపై కూడా 370 ఏ కేసు పెట్టవచ్చని హైకోర్టు ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేరం రుజువైతే విటుడికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. -
స్మృతి సీరియస్‌గా తీసుకున్నారా..!
పనాజీ: మెల్లమెల్లగా సర్దుమణిగి పోతుందనుకున్న ఫ్యాబిండియా సీసీటీవీ కెమెరా కేసు వివాదం తాజాగా వేగం పుంజుకొంది. గురువారం తమ ముందుకు వచ్చి వివరణలు ఇవ్వాల్సిందిగా సంస్థ ఎండీ, సీఈవోకు తాజాగా గోవా పోలీసులు సమన్లు అందజేశారు. మరో పదకొండుమంది ఉద్యోగులకు కూడా ప్రశ్నించేందుకు పిలిచారు. కాండోలిమ్లోని ఫ్యాబిండియాలో షాపింగ్‌కు వెళ్లిన స్మృతి ఇరానీ.. ట్రయల్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాను గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో గోవా బీజేపీ నేత మైఖెల్ లోబో ఫిర్యాదు మేరకు ఫ్యాబిండియాపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి నలుగురుని పోలీసులు అరెస్టు చేసినా తిరిగి వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం, బీజేపీ నేతలు స్వయంగా ఈ ఘటనను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. అనంతరం ఈ కేసులో పెద్దగా అభివృద్ధేమి లేదని, ఫ్యాబిండియా స్మృతి ఇరానీకి క్షమాపణలు చెప్పడంతో వివాదం సర్దుమణిగినట్లేనని అందరూ భావించారు. కానీ, తాజాగా ఆ సంస్థ ఎండీ, సీఈవోకు సమన్లు పంపించడం చూస్తుంటే పైకి కనిపించకపోయినా కేంద్రమంత్రి ఈ విషయాన్ని కాస్త తీవ్రంగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. -
కౌన్సిలర్ జానీని తీసుకువచ్చిన గోవా పోలీసులు
కడప: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో అదృశ్యమైన కౌన్సిలర్ మహమ్మద్‌జానీ గోవా పోలీసులు ఈ రోజు కడప కోర్టులో ప్రవేశపెట్టారు. మునిసిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్ సిపికి దక్కకుండా చేసేందుకు టిడిపి కౌన్సిలర్లు, నేతలు జమ్మలమడుగులో నానా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తననెవ్వరూ కిడ్నాప్ చేయలేదని కౌన్సిలర్ జానీ గురువారం సాయంత్రమే ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ రఘునాథ రెడ్డికి స్వయంగా ఫోన్ చేశారు. శుక్రవారం ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం మాట్లాడారు. ఆమేరకు స్పందించిన ఎన్నికల సంఘం 22 మంది సభ్యులకు, 21మంది హాజరైనందున జమ్మలమడుగు చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలను తుంగలో తొక్కారు. కౌన్సిలర్ జానీని ఈరోజు గోవా పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం కోర్టు అతనిని బంధువులకు అప్పజెప్పింది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని జానీ మరోసారి స్పష్టం చేశారు. సమావేశం జరుగుతుందని తెలియక తాను టూరు వెళ్లినట్లు చెప్పారు. -
తేజ్‌పాల్ కేసులో బదులిచ్చిన డినీరో
పణజీ: తెహల్కా పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్పై నమోదైన అత్యాచారం కేసులో గోవా పోలీసులు తనకు పంపిన ప్రశ్నావళికి ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో సమాధానాలు అందజేశారు. ఆయన న్యూయార్క్‌లోని తన న్యాయవాదుల ద్వారా ఇటీవల వీటిని గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పంపించారు. తేజ్‌పాల్, ఆయనపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు గత ఏడాది నవంబర్‌లో థింక్‌ఫెస్ట్ సదస్సు కోసం గోవా హోటల్లో ఉన్నట్లు డినీరో న్యాయవాదులు ధ్రువీకరించారని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు. అయితే ఆయన డినీరో సమాధానాలను పూర్తిగా వెల్లడించలేదు. హోటల్లో బసచేసిన డినీరోను, ఆయన కూతురిని వారి గదిలోకి తీసుకెళ్లే క్రమంలో తేజ్‌పాల్ లిఫ్టులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించడం తెలిసిందే. -
గోవాలో ఇరానీయన్ చిన్నారిపై అత్యాచారం
ముంబైకు చెందిన అశ్లీ క్రస్టా అనే వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి ఇరానీయన్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన గోవా రాజధాని పనాజీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అశ్లీ క్రస్టా గత కొద్ది నెలలుగా ఇరానీయన్ మహిళలో డేటింగ్ చేస్తున్నాడు. ఆ మహిళకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. కాగా ఇరానీయన్ మహిళ ఇంట్లోలేని సమయంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తన తల్లికి ఆ చిన్నారి ఏడుస్తూ అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో తల్లి కుమార్తెను తీసుకుని పనాజీ పోలీసులకు ఆశ్రయించింది. అశ్లీ క్రిస్టాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశ్లీపై పనాజీ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పనాజీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచార ఘటన సోమవారం చోటు చేసుకుంది. -
షోమా చౌదరికి సమన్లు
పణజి: సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసేందుకు గోవా పోలీసులు బుధవారం సమన్లు జారీచేశారు. ఈ విషయాన్ని డీఐజీ ఓపీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే వారి వాంగ్మూలాన్ని ఎప్పుడు రికార్డు చేస్తారనే దానిని మాత్రం వెల్లడించలేదు. కానీ, శుక్రవారం లేదా శనివారం రికార్డు చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఉద్యోగానికి రాజీనామా చేయకముందు గోవా పోలీసు బృందం షోమా వాంగ్మూలాన్ని ఢిల్లీలో రికార్డు చేశారు. లైంగిక దాడి సంఘటన తెలిసిన మొదటి వ్యక్తి షోమా కావడంతో ఆమె వాంగ్మూలం చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, పోలీస్ కస్టడీలో ఉన్న తేజ్‌పాల్‌కు బుధవారం ఉదయం రెండో దశ వైద్య పరీక్షలు చేశారు. ఇదంతా విచారణలో భాగంగానే జరుగుతోందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, మరో నెల, నెలన్నరలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తారని గోవా సీఎం మనోహర్ పారికర్ తెలిపారు. ఫ్యాన్‌కు అనుమతి నిరాకరణ తేజ్‌పాల్ ఉన్న లాకప్ గదికి ఫ్యాన్ సదుపాయం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జుడీషియల్ మెజిస్ట్రేట్ కృష్ణ జోషి తోసిపుచ్చారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఫ్యాన్ ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని తేజ్‌పాల్ తరఫు న్యాయవాది సోమవారం ఆ పిటిషన్ దాఖలు చేశారు. -
తప్పించుకు తిరుగుతున్న తరుణ్ తేజ్‌పాల్
-
తప్పించుకు తిరుగుతున్న తరుణ్ తేజ్‌పాల్
న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ను అరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ఢిల్లీలోని తరుణ్ తేజ్‌పాల్ ఇంటిలో సోదాలు చేశారు. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తేజ్‌పాల్ రాత్రి తన ఇంట్లో కాకుండా మరో చోటు మకాం వేశారు. తేజ్పాల్ను పట్టుకునేందుకు గోవా పోలీసులు తేజ్‌పాల్ బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయితే ఆయన అక్కడ లేకపోవటంతో వారు వెనుదిరిగారు. గోవా క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా సౌత్ ఢిల్లీలోని తరుణ్ తేజ్ పాల్ నివాసంలో సోదాలు జరిపారు. అనంతరం పోలీసులు మాట్లాడుతు తమ విచారణకు తరుణ్ తేజ్ పాల్ కుటుంబీకులు సహకరించటం లేదని, ఆయన ఎక్కడున్నారనే వివరాలు చెప్పేందుకు తరుణ్ తేజ్ పాల్ సతీమణి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా తమ ముందు విచారణకు హాజరుకావాలని గోవా పోలీసులు తేజ్‌పాల్‌కు విధించిన గడువు నిన్నటితో ముగిసింది. అయితే తనకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తరుణ్ తేజ్‌పాల్ పోలీసులకు లేఖ రాశారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసులు అరెస్టు చేయకుండా నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని హైకోర్టులో తరుణ్ తేజ్‌పాల్ పెట్టుకున్న పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. కోర్టు బెయిల్ ఇవ్వడాని కంటే ముందే అరెస్టు చేసి విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో గోవా పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఉద్దేశ్యంతోనే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. గోవా పోలీసుల రాకను పసిగట్టిన తేజ్‌పాల్ వారికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈరోజు బెయిల్ రాకపోతే పోలీసులు ముందు తేజ్ పాల్ లొంగిపోయే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. చేతిలో నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో గోవా పోలీసులు ఢిల్లీలో చక్కర్లు కొడుతుంటే.... ఈరోజు ఎలాగైనా బెయిల్ వస్తుందన్న గంపెడు ఆశతో తేజ్‌పాల్ తప్పించుకు తిరుగుతున్నారు. -
ఏ క్షణమైనా తేజ్‌పాల్ అరెస్టు!
ఉచ్చుబిగిస్తున్న గోవా పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ల కోసం కోర్టులో పిటిషన్ శనివారం పోలీసుల ముందు హాజరవుతానని కోరిన తేజ్‌పాల్ నిరాకరించిన ఖాకీలు.. అరెస్టుకు సన్నాహాలు దీంతో శుక్రవారమే హాజరవుతానని పోలీసులకు మళ్లీ ఫ్యాక్స్ స్టార్ హోటల్లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన తేజ్‌పాల్ చేష్టలు వాటన్నింటినీ సేకరించిన పోలీసు అధికారులు పణజి/న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ చుట్టూ గోవా పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఏ క్షణాన్నైనా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేసేందుకు వీలుగా నాన్-బెయిలబుల్ వారంట్లు జారీ చేయాలని కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు కేసు దర్యాప్తు అధికారి(ఐవో) ముందు హాజరయ్యేందుకు తేజ్‌పాల్ పోలీసుల అనుమతి కోరారు. శనివారం లోపు హాజరవుతానని తన లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారు. దర్యాప్తు అధికారి ముందు గురువారం మధ్యాహ్నం 3 గంటలలోపు హాజరు కావాలని గోవా పోలీసులు తరుణ్ తేజ్‌పాల్‌కు ఇంతకుముందే నోటీసులు జారీ చేశారు. అయితే గడువు ముగియడానికి సరిగ్గా రెండు గంటల ముందు తాను ఇప్పుడు హాజరు కాలేనని, శనివారం లోపు ఐవో ముందుకు వస్తానని తేజ్‌పాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు చకచకా చర్యలు మొదలు పెట్టారు. తేజ్‌పాల్ వినతిని తిరస్కరిస్తూ... వెంటనే కోర్టు తలుపు తట్టారు. దీంతో తేజ్‌పాల్ అంతకుముందు చెప్పినట్టు శనివారం కాకుండా శుక్రవారమే దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని, కేసు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తానని పేర్కొంటూ పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయినా పోలీసులు అరెస్టు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పణజి డీఐజీ ఓపీ మిశ్రా విలేకరులతో మాట్లాడుతూ.. దర్యాప్తు అధికారి చట్టప్రకారం ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు తెచ్చుకున్నారా అని ప్రశ్నించగా.. ‘‘చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తున్నాం.. దర్యాప్తులో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని చెప్పదలుచుకోలేదు’’ అని అన్నారు. నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీపై పణజిలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శుక్రవారం ఉదయం తన నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిసింది. సీసీ టీవీల్లో తేజ్‌పాల్ చేష్టలు! తరుణ్ తేజ్‌పాల్ మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేందుకు గోవా పోలీసులు తిరుగులేని ఆధారాలను సేకరించారు. ఈనెల 7, 8 తేదీల్లో గోవాలో తేజ్‌పాల్ బస చేసిన స్టార్ హోటల్ సీసీటీవీ కెమెరాల నుంచి వీటిని సేకరించినట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను చూస్తుంటే తేజ్‌పాల్ సదరు మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. బాధిత మహిళ, తేజ్‌పాల్ రాత్రి 9 గంటల సమయంలో హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నీరో గదికి వెళ్తున్నట్లు కెమెరాల్లో నమోదైంది. బాధితురాలి భుజంపై చేయి వేసి తేజ్‌పాల్ నడుస్తున్నట్లు అందులో ఉంది. తర్వాత 10.30 గంటల సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆ మహిళ చేయి పట్టుకొని లాగుతున్నట్టు రికార్డయింది. రెండు నిమిషాల తర్వాత రెండో ఫ్లోర్లో లిఫ్ట్ తెరుచుకోగానే అందులోంచి మహిళా జర్నలిస్టు తన దుస్తులను సర్దుకుంటూ వడివడిగా బయటకు వచ్చారు. ఆమె వెనకాలే తేజ్‌పాల్ రావడం కెమెరాల్లో నమోదైంది. బెయిల్ పిటిషన్ వెనక్కి.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తేజ్‌పాల్ గురువారం వెనక్కితీసుకున్నారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో తేజ్‌పాల్ లాయర్ సందీప్ కపూర్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం గమనార్హం. బెయిల్‌పై తగిన కోర్టుకు వెళ్తామని సందీప్ చెప్పారు. -
రెండు రోజుల గడువు కోరిన తరుణ్ తేజ్‌పాల్
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్... గోవా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గోవా పోలీసులకు లేఖ రాశారు తరుణ్ తేజ్‌పాల్ తనకు రెండు రోజుల సమయం కావాలని ఓ లేఖ పంపినట్లు గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇనస్పెక్టర్ సునీతా సావంత్ వెల్లడించారు. ఆయన శనివారం మధ్యాహ్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కాగా తరుణ్ తేజ్‌పాల్ ఈరోజు మధ్యాహ్నం లొంగిపోవాలని గోవా పోలీసులు ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని హైకోర్టును తేజ్‌పాల్ కోరారని ... ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తరుణ్ తేజ్‌పాల్ గోవా పోలీసులకు లేఖ రాశారు. అలాగే పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తాము సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని తరుణ్ తేజ్‌పాల్ తరపు న్యాయవాది సందీప్ కపూర్ తెలిపారు. మరోవైపు హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీ టీవీ పుటేజ్ కీలకంగా మారింది. మహిళతో కలిసి తేజ్‌పాల్ వెళ్లినట్లు సీసీ టీవీలో నమోదు అయినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ భుజాలపై తేజ్‌పాల్ చేతులు వేసి వెళ్తున్నట్లు అందులో ఉందని పోలీసులు తెలిపారు. దుస్తులు సవరించుకుంటూ ఓ మహిళ లిఫ్ట్ నుంచి బయటకొచ్చారని వారు చెబుతున్నారు. మరోవైపు... తేజ్పాల్ను రక్షించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి షోమాచౌదరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
తెహల్కాకు షోమాచౌదరి రాజీనామా
-
తెహల్కాకు షోమాచౌదరి రాజీనామా
న్యూఢిల్లీ: తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి షోమా చౌదరి రాజీనామా చేశారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్పాల్ను షోమా చౌదరి కాపాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తరుణ్ తేజ్‌పాల్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురయింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోర్టును తేజ్‌పాల్ కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. దాంతో విచారణ అనంతరం తేజ్పాల్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోవాలోని ఓ హోటల్లోని లిఫ్ట్‌లో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తేజ్పాల్పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది. -
తేజ్‌పాల్‌కు గోవా పోలీసుల పిలుపు
పనజి/న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బుధవారం గోవా పోలీసుల నుంచి పిలుపొచ్చింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుకు సంబంధించి విచారణాధికారి ముందు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించారు. దాంతో విచారణ అనంతరం తేజ్పాల్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళా జర్నలిస్టు కూడా బుధవారం గోవా రాజధాని పనజికి వచ్చి స్థానిక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు, తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు అంటున్న తేజ్‌పాల్ ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తోసిపుచ్చారు. కాగా, తనను 4 వారాల పాటు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న తేజ్‌పాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. -
తరుణ్ తేజ్‌పాల్‌కు సమన్లు
న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు మరోసారి చుక్కెదురయింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోర్టును తేజ్‌పాల్ కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. తేజ్‌పాల్ అరెస్ట్ తప్పకపోవచ్చని గోవా సీఎం మనోహర్ పారికర్ వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే సమన్లు జారీ కావడం విశేషం. రేపు తేజ్‌పాల్ ను అరెస్ట్ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు. ఈ నెల మొదట్లో గోవాలోని ఓ హోటల్లోని లిఫ్ట్‌లో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తేజ్పాల్పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది. -
తరుణ్ తేజ్పాల్ను తక్షణమే అరెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ : తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను తక్షణం అరెస్ట్ చేయాల్సిందేనంటూ మహిళాసంఘాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా తేజ్పాల్పై నిరసనలు మిన్నంటుతున్నాయి. తేజ్పాల్ను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మంగళవారం మహిళా సంఘాలు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బాధితురాలికి సంపూర్ణ న్యాయం దక్కేలా.. తేజ్పాల్పై దర్యాప్తు సాగాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. రెండురోజుల క్రితం బాధితురాలు తెహల్కాలో ఉద్యోగానికి రాజీనామా చేయగా.. తెహల్కా యాజమాన్యం వైఖరిపై.. కన్సల్టింగ్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, లిటరరీ ఎడిటర్ రాజీనామాలు చేశారంటూ వార్తలు పొక్కుతున్నాయి. మరోవైపు.. గోవా పోలీసుల పనితీరుపై తరుణ్ తేజ్‌పాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లైగింక వేధింపులు ఎదుర్కొన్న మహిళ జర్నలిస్ట్ నుంచి గోవా పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
మహిళ జర్నలిస్ట్ నుంచి స్టేట్మెంట్ రికార్డు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు నుంచి గోవా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. మరోవైపు , కేసు విచారణకు సంబంధించి తెహల్కా యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఉద్యోగుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా అసోసియేట్ ఎడిటర్ రాణా కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇక సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ మజూందార్, అసిస్టెంట్ ఎడిటర్ రేవతి లాల్లు కూడా రాజీనామాలు సమర్పించినట్టు తెలిసింది. తెహల్కా లిటరరీ ఎడిటర్ షౌగత్ దాస్‌గుప్తా కూడా అదే బాటలో ఉన్నట్టు సమాచారం. కాగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తెహల్కా యాజమాన్యం అంతర్గత విచారణ కమిటీని నియమించింది. అయితే పోలీసుల తీరుపై తేజ్‌పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే సిసి ఫుటేజ్‌ను పోలీసులు చూడటం లేదని ఆయన ఆరోపించారు. గోవా పోలీసుల విచారణపై తరుణ్ తేజ్‌పాల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు తేజ్‌పాల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. లైంగికదాడి బాధితురాలు, తెహల్కా మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ఓ వార్తాసంస్థకు తెలిపారు. బాధితురాలు తన రాజీనామాను రెండు రోజుల కిందటే కార్యాలయానికి పంపినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
తేజ్పాల్ను క్షమించవద్దంటున్న మహిళలు