తరుణ్ తేజ్పాల్ను తక్షణమే అరెస్ట్ చేయాలి | Women activists protest against Tehelka founder Tarun Tejpal in Delhi | Sakshi
Sakshi News home page

తరుణ్ తేజ్పాల్ను తక్షణమే అరెస్ట్ చేయాలి

Published Tue, Nov 26 2013 3:21 PM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

తరుణ్ తేజ్పాల్ను తక్షణమే అరెస్ట్ చేయాలి

తరుణ్ తేజ్పాల్ను తక్షణమే అరెస్ట్ చేయాలి

న్యూఢిల్లీ : తెహల్కా  ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ను తక్షణం అరెస్ట్‌ చేయాల్సిందేనంటూ మహిళాసంఘాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా తేజ్‌పాల్‌పై నిరసనలు మిన్నంటుతున్నాయి.  తేజ్‌పాల్‌ను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మంగళవారం మహిళా సంఘాలు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  బాధితురాలికి సంపూర్ణ న్యాయం దక్కేలా.. తేజ్‌పాల్‌పై దర్యాప్తు సాగాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు.

రెండురోజుల క్రితం బాధితురాలు తెహల్కాలో ఉద్యోగానికి రాజీనామా చేయగా.. తెహల్కా యాజమాన్యం వైఖరిపై.. కన్సల్టింగ్ ఎడిటర్‌, అసిస్టెంట్‌ ఎడిటర్‌, లిటరరీ ఎడిటర్‌ రాజీనామాలు చేశారంటూ వార్తలు పొక్కుతున్నాయి. మరోవైపు.. గోవా పోలీసుల పనితీరుపై తరుణ్‌ తేజ్‌పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు లైగింక వేధింపులు ఎదుర్కొన్న మహిళ జర్నలిస్ట్ నుంచి  గోవా పోలీసులు  వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement