భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. రూల్స్ అతిక్రమించిన వారు ఎంతవారైనా వదిలిపెట్టే సమస్యే లేదని పోలీసులు కరాఖండిగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గోవా నగరంలో ట్రాఫిక్ పోలీసులు 40 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజా రహదారులపై నడిచే ఏ వాహనమైన తప్పకుండా మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలకు లోబడి ఉండాలి. అలా కాదని మోడిఫైడ్ చేసుకుని రోడ్లమీద తిరిగితే మాత్రం జరిమానాలు భారీగా చెల్లించాల్సి వస్తుంది. గోవాలో సీజ్ చేసిన వాహనాల ఎగ్జాస్ట్ మోడిఫై చేయబడ్డాయి.
వాహనంలో కంపెనీ అందించే భాగాలు కాదని కొంతమంది తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటారు. ఇదే వారిని సమస్యల్లోకి నెట్టేస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. సీజ్ చేసిన బైకులలో ఎక్కువ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉండటం గమనార్హం.
(ఇదీ చదవండి: Pakistan Crisis: చుక్కలు తాకిన మారుతి ధరలు.. ఏకంగా రూ. 21 లక్షలకు చేరిన ఆల్టో)
మోడిఫైడ్ చేసిన ఎగ్జాస్ట్ సాధారణ బైకుల కంటే ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఇది ప్రజా రహదారుల్లో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా అన్ని బైకులను సీజ్ చేసినట్లు మార్గోవ్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ తెలిపారు.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇతర స్పోర్ట్స్ బైకులు ఎక్కువ శబ్దం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కొంతమంది బైక్ ప్రేమికులు తమ వాహనాలను మరింత మాడిఫైడ్ చేసుకోవడం వల్ల ఆ శబ్దం మరింత ఎక్కువవుతుంది. 80 డెసిబుల్స్ మించిన శబ్దాన్ని ఉత్పత్తి చేసే వాహనాలు చట్ట విరుద్ధం. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment