Modified
-
భారత సైన్యంలోకి బలిష్టమైన వాహనాలు - ఇవి చాలా స్పెషల్!
భారతదేశానికి రక్షణ కవచం 'ఇండియన్ ఆర్మీ' కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) ప్రత్యేకంగా తయారు చేసిన హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే మొదటి బ్యాచ్ డెలివరీ చేసిన టయోటా ఇప్పుడు రెండు కొత్త మోడిఫైడ్ వెర్షన్లను సైన్యానికి అందించింది. ఈ రెండు కార్లు ప్రత్యేక అవసరాల కోసం తయారైనవి.. కావున వీటికి ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ (FDV), ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ (RIV) అని పేరు పెట్టారు. ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ భారతదేశ కఠిన భూభాగాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా తయారైంది, కాగా ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి నిర్మించారు. ఇందులో ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ పరికరాలు ఉంటాయి. మొత్తానికి భారత సైన్యంలో ఇవి రెండు తప్పకుండా ఉత్తమ సేవలను అందించేలా రూపొందించారు. డిజైన్ పరంగా కొంత భిన్నంగా ఉన్న ఈ పికప్ ట్రక్కులు చాలా వరకు అదే ఫీచర్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204 పీఎస్ పవర్ అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 420 న్యూటన్ మీటర్ టార్క్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదీ చదవండి: ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా? ఇండియన్ ఆర్మీకి భారతీయ కార్ల తయారీదారులకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రారంభం నుంచి సైన్యలో మహీంద్రా, ఆ తరువాత మారుతి వాహనాలు విస్తృతమైన సేవలు అందిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు టయోటా తన హైలక్స్ ట్రక్కులతో సేవలందించడానికి అడుగులు వేస్తోంది. -
బంగారు బుల్లెట్.. ఆఖరికి సైలెన్సర్ కూడా..
Gold Colour Royal Enfield: భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకున్న క్రేజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ బైకులను యువకుల దగ్గర నుంచి పెద్ద వారి వరకు చాలా మంది ఇష్టపడతారన్నది అందరికి తెలిసిన వాస్తవం. అయితే కొంత మంది ఈ బైక్ ప్రేమికులు వారికి కావలసిన రీతిలో మోడిఫైడ్ చేసుకుంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగా ఒక వ్యక్తి తన బైకుని గోల్డెన్ బుల్లెట్ మాదిరిగా రూపొందించుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ బుల్లెట్ 5577 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెలువడిన వీడియోలో మీరు గమనిస్తే ఈ గోల్డ్ బుల్లెట్ ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. పేరుకి గోల్డ్ బుల్లెట్ అయినా ఇది బంగారంతో తయారు కాలేదు. గోల్డ్ పెయింట్ స్కీమ్ మాత్రమే పొందింది. అందులో కూడా బైక్ కలర్ అలాగే ఉంది, అక్కడక్కడా గోల్డ్ షేడ్స్ చూడవచ్చు. ఇది బుల్లెట్ 350సీసీ బైక్ కావడం గమనార్హం. నిజానికి గోల్డ్ కలర్ స్కీమ్ పొందే వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే గోల్డ్ కలర్ బుల్లెట్.. టర్న్ ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్ ఎగువ భాగంలో చూడవచ్చు. అంతే కాకుండా ఫుట్‌రెస్ట్‌లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ షేడ్‌లో ఉన్నాయి. ఇక ఈ బైక్ హ్యాండిల్‌బార్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న బొమ్మ లాంటిది చూడవచ్చు. ఇది కూడా గోల్డెన్ షేడ్‌లోనే ఉంది. (ఇదీ చదవండి: వయసు 11.. సంపాదన వందల కోట్లు - చిన్నారి సక్సెస్ స్టోరీ!) గోల్డెన్ బుల్లెట్ రైడ్ చేసే వ్యక్తి కూడా బైకుకి తగిన విధంగా బంగారు ఉంగరాలు, బ్రాస్లెట్, వాచ్ వంటివి ధరించాడు. ఈ బైక్ సైలెన్సర్ కూడా బంగారు రంగులోనే ఉంది. ఈ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియావైలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) ఈ గోల్డెన్ బైక్ గోల్డెన్ మ్యాన్ అని పిలువబడే మహారాష్ట్ర పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతానికి చెందిన 'సన్నీ వాఘురే' అనే వ్యక్తికి సంబంధించినదని తెలుస్తోంది. గతంలో కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ అనే వ్యక్తి ఏకంగా గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ టాక్సీగా ఉపయోగిస్తున్నాడు. View this post on Instagram A post shared by Amit Raviraj Shinde (@royal_bullet_5577) -
ఒకటి, రెండు కాదు.. 40 బైకులు సీజ్: కారణం ఏంటంటే?
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. రూల్స్ అతిక్రమించిన వారు ఎంతవారైనా వదిలిపెట్టే సమస్యే లేదని పోలీసులు కరాఖండిగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గోవా నగరంలో ట్రాఫిక్ పోలీసులు 40 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా రహదారులపై నడిచే ఏ వాహనమైన తప్పకుండా మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలకు లోబడి ఉండాలి. అలా కాదని మోడిఫైడ్ చేసుకుని రోడ్లమీద తిరిగితే మాత్రం జరిమానాలు భారీగా చెల్లించాల్సి వస్తుంది. గోవాలో సీజ్ చేసిన వాహనాల ఎగ్జాస్ట్ మోడిఫై చేయబడ్డాయి. వాహనంలో కంపెనీ అందించే భాగాలు కాదని కొంతమంది తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటారు. ఇదే వారిని సమస్యల్లోకి నెట్టేస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. సీజ్ చేసిన బైకులలో ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: Pakistan Crisis: చుక్కలు తాకిన మారుతి ధరలు.. ఏకంగా రూ. 21 లక్షలకు చేరిన ఆల్టో) మోడిఫైడ్ చేసిన ఎగ్జాస్ట్ సాధారణ బైకుల కంటే ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఇది ప్రజా రహదారుల్లో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా అన్ని బైకులను సీజ్ చేసినట్లు మార్గోవ్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకులలో రాయల్ ఎన్ఫీల్డ్, ఇతర స్పోర్ట్స్ బైకులు ఎక్కువ శబ్దం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కొంతమంది బైక్ ప్రేమికులు తమ వాహనాలను మరింత మాడిఫైడ్ చేసుకోవడం వల్ల ఆ శబ్దం మరింత ఎక్కువవుతుంది. 80 డెసిబుల్స్ మించిన శబ్దాన్ని ఉత్పత్తి చేసే వాహనాలు చట్ట విరుద్ధం. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. -
కశ్మీర్.. సోలార్ పవర్.. లగ్జరీ కారు
కశ్మీర్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు పదకొండేళ్లు శ్రమించి సామాన్యులకు లగ్జరీ ఫీచర్లు ఉండే అధునాతన కారును రూపొందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కారు నడిచేందుకు పెట్రోలు, డీజిల్ కాకుండా సౌరశక్తినే వినియోగించుకోవడం మరో విశేషం. కశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చెందిన బిలాల్ అహ్మద్ వృత్తిరీత్య గణిత శాస్త్ర బోధకుడు. అయితే చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీపై మక్కువ ఎక్కువ. ముఖ్యంగా లగ్జరీ కార్లు అందులో ఫీచర్లను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే తనలాంటి సామాన్యులకు లగ్జరీ కార్లు అందుబాటులో లేకపోవడం లోటుగా తోచింది. దీంతో ఇంటర్నెట్లో వీడియోల ద్వారా సమాచారం సేకరిస్తూ సాధారణ కారుకే లగ్జరీ సౌకర్యాలు అమర్చే పనిలో పడ్డాడు. సామాన్యులకు లగ్జరీ ఫీచర్లతో కారును తీసుకురావలే ఆశయంతో 2009 నుంచి బిలాల్ అహ్మద్ పని చేస్తున్నాడు. పదకొండేళ్ల శ్రమ ఫలించి ఇటీవల మోడిఫైడ్ లగ్జరీ ఫీచర్లతో కూడిన కారు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారులో లగ్జరీ ఫీచర్లకు తోడు మరొకటి ఫీచర్ కూడా జతయ్యింది. అదే సోలార్ పవర్. బడ్జెట్ ధరలో అధునాత కారు కోసం శ్రమించే క్రమంలో సోలార్ పవర్‌తో కారును తయారు చేసేందుకు బిలాల్ శ్రమించాడు. సౌర శక్తి కోసం కారుకు నలువైపులా సోలార్ ప్యానెళ్లు అమర్చాడు. అదే విధంగా పైకి తెరుచుకునే డోర్లు ఈ కారుకు కొత్త లుక్ తీసుకువచ్చాయి. Valleys first Solar car A Kashmiri mathematician teacher Bilal Ahmed innovated a solar car pic.twitter.com/F6BAx2JVFN — Basit Zargar (باسط) (@basiitzargar) June 20, 2022 చదవండి: ఎలక్ట్రిక్ బైక్ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు -
డెంగ్యూ నియంత్రణకు జన్యుమార్పిడి దోమలు!
డెంగ్యూ వ్యాధి నివారణకు ఇప్పుడు భారతదేశంలో వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి. దోమలవల్ల వ్యాపించే డెంగ్యూను.. అదే దోమలతో నివారించేందుకు మహరాష్ట్రకు చెందిన ఓ సంస్థ ప్రయోగాలు జరుపుతోంది. విజృంభిస్తున్న ప్రాణాంతక డెంగ్యూ వ్యాధిని నియంత్రించే దిశగా దృష్టి సారించిన సంస్థ... జన్యుమార్పిడి పద్ధతిలో దోమలను అరికట్టే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. భారతదేశంలో జన్యుమార్పిడి పత్తి విత్తనాలను అభివృద్ధి చేసే కంపెనీ 'మైకో' సోదర సంస్థ.. గంగాబిషన్ భికులాల్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. మహరాష్ట్రలో నెలకొన్న దోమల జన్యుమార్పిడి ప్రయోగశాల... అందులోని సాంకేతిక నిపుణులు భారతీయులే అయినప్పటికీ ఈ టెక్నాలజీని మాత్రం లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధనలను ప్రోత్సహించే ఆక్సిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈ పద్ధతిలో డెంగ్యూ దోమలు పెరిగి పెద్దవి అవకుండా శైశవ దశలోనే వాటిని అంతమొందిస్తారు. జన్యుమార్పిడి చేసిన మగదోమల వల్ల కలిగే సంతానం క్రమంగా అంతమొందుతుంది. అయితే ఈ పద్ధతిలో జరిగే సంపర్కం వల్ల ఏ ఇతర జీవులకు నష్టం కలగదని ఆక్సిటెక్ సంస్థ చెప్తోంది. లండన్ కు చెందిన పురుగులను నియంత్రించే పరిశోధనా సంస్థ ఆక్సిటెక్ ఈ జన్యుమార్పిడి దోమలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ ప్రయోగానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా డెంగ్యూ దోమలను జన్యుమార్పిడి దోమలను ప్రయోగించి నియంత్రించాలన్నది శాస్త్రవేత్తల ప్రయత్నం. ఈ సంస్థ విడుదల చేసిన జన్యు నియంత్రిత మగ దోమలు టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్ లేనప్పుడు లార్వా దశలోనే చనిపోవటం జరుగుతుంది. ఫలితంగా దోమల సంతతి తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరాలకు ప్రధానంగా కారణమయ్యే ఈడిస్ ఈజిప్టి దోమల నివారణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. అయితే జన్యుమార్పిడి మగ దోమలతో ఆడదోమల సంభోగం జరగకుండా తప్పించుకునే దశలో ఏమౌతుంది అన్న విషయంలో మాత్రం... ఇంకా సందిగ్ధత కనిపిస్తోంది. అయితే ఈ జన్యు మార్పిడి దోమలవల్ల ఎటువంటి నష్టం కలగదని, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా నిర్మూలనకు మాత్రం ఎంతగానో సహకరిస్తుందని ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న సీనియర్ సైంటిస్ట్.. డాక్టర్ దాస్ గుప్తా చెప్తున్నారు. -
లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా విజయం
కీసర, న్యూస్‌లైన్: శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు, ప్రజాదరణతో తాను విజయం సాధించినట్లు మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో ఆయన మండల పరిధి చీర్యాల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్‌ను స్వామివారికి అప్పగించినప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. దామోదర రాజనర్సింహ వంటి దిగ్గజాన్ని ఎదుర్కొన్నానని, ఫలితాలు వెలువడే ముందు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నానని చెప్పారు. శ్రీస్వామివారి ఆశీర్వాదంతోనే గెలుపొందానని, తన విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నానని పేర్కొన్నారు. ఇక నుంచి ఏ కార్యక్రమమైనా శ్రీవారి ఆశీస్సులతో చేపట్టి విజయవంతంగా పూర్తిచేసి ప్రజల మన్ననలు పొందుతానని అన్నారు. అనంతరం ఆయన చీర్యాల నుంచి నేరుగా కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. కాగా, కంటోన్మెంట్ శాసనసభ స్థానం నుంచి గెలుపొందిన సాయన్న చీర్యాల శ్రీవారి ఆశీస్సులతోనే విజయం సాధించినట్లు దేవాలయానికి సందేశం పంపారు.