Gold Colour Royal Enfield: భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకున్న క్రేజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ బైకులను యువకుల దగ్గర నుంచి పెద్ద వారి వరకు చాలా మంది ఇష్టపడతారన్నది అందరికి తెలిసిన వాస్తవం. అయితే కొంత మంది ఈ బైక్ ప్రేమికులు వారికి కావలసిన రీతిలో మోడిఫైడ్ చేసుకుంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగా ఒక వ్యక్తి తన బైకుని గోల్డెన్ బుల్లెట్ మాదిరిగా రూపొందించుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రాయల్ బుల్లెట్ 5577 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెలువడిన వీడియోలో మీరు గమనిస్తే ఈ గోల్డ్ బుల్లెట్ ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. పేరుకి గోల్డ్ బుల్లెట్ అయినా ఇది బంగారంతో తయారు కాలేదు. గోల్డ్ పెయింట్ స్కీమ్ మాత్రమే పొందింది. అందులో కూడా బైక్ కలర్ అలాగే ఉంది, అక్కడక్కడా గోల్డ్ షేడ్స్ చూడవచ్చు. ఇది బుల్లెట్ 350సీసీ బైక్ కావడం గమనార్హం.
నిజానికి గోల్డ్ కలర్ స్కీమ్ పొందే వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే గోల్డ్ కలర్ బుల్లెట్.. టర్న్ ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్ ఎగువ భాగంలో చూడవచ్చు. అంతే కాకుండా ఫుట్‌రెస్ట్‌లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ షేడ్‌లో ఉన్నాయి. ఇక ఈ బైక్ హ్యాండిల్‌బార్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న బొమ్మ లాంటిది చూడవచ్చు. ఇది కూడా గోల్డెన్ షేడ్‌లోనే ఉంది.
(ఇదీ చదవండి: వయసు 11.. సంపాదన వందల కోట్లు - చిన్నారి సక్సెస్ స్టోరీ!)
గోల్డెన్ బుల్లెట్ రైడ్ చేసే వ్యక్తి కూడా బైకుకి తగిన విధంగా బంగారు ఉంగరాలు, బ్రాస్‌లెట్, వాచ్ వంటివి ధరించాడు. ఈ బైక్ సైలెన్సర్ కూడా బంగారు రంగులోనే ఉంది. ఈ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియావైలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!)
ఈ గోల్డెన్ బైక్ గోల్డెన్ మ్యాన్ అని పిలువబడే మహారాష్ట్ర పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతానికి చెందిన 'సన్నీ వాఘురే' అనే వ్యక్తికి సంబంధించినదని తెలుస్తోంది. గతంలో కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ అనే వ్యక్తి ఏకంగా గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ టాక్సీగా ఉపయోగిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment