Royal Enfield Bullet
-
ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్
టూవీలర్ వాహన మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్న ‘రాయల్ ఎన్ఫీల్డ్’ కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ‘ఫ్లైయింగ్ ఫ్లీ’ పేరుతో దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. విభిన్న వేరియంట్ల ద్వారా 250-750 సీసీ సామర్థ్యం కలిగిన బైక్‌లకు ధీటుగా ఈవీను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.రాయల్ ఎన్ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ్ లాల్ మాట్లాడుతూ..‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ సీ6, స్క్రాంబ్లర్-స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ ఎస్6 పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఈవీ టెక్నాలజీకి కస్టమర్లలో ఆదరణ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా కంపెనీ ఉత్పత్తులను అందిస్తుంది. కంపెనీ ఆవిష్కరించిన ఈవీ బైక్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు’ అని అన్నారు.రెండో ప్రపంచ యుద్ధం నాటి బైక్అక్టోబర్ చివరి వారంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పారాచూట్ ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు ఈ వీడియోలో చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో శత్రువులపై దండెత్తడానికి బైక్‌లను పారాచూట్ ద్వారా ల్యాండ్ చేశారు. అందుకు తగ్గట్లుగా రాయల్ ఎన్ఫీల్డ్ తేలికపాటి బైక్‌లు తయారు చేసింది. అదే మాదిరి ఈ బైక్ టీజర్ విడుదల సమయంలో పారాచూట్ ద్వారా ల్యాండ్ చేసినట్లు చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అభివృద్ధి చేసిన తేలికపాటి మోటార్‌సైకిళ్లను యుద్ధం తర్వాత విక్రయించారు.ఇదీ చదవండి: హైదరాబాద్ గోదామును డీలిస్ట్ చేసిన జొమాటోఫ్రేమ్: అల్లైడ్ అల్యూమీనియ్ ఫ్రేమ్బ్యాటరీ: బరువు తక్కువగా ఉండేందకు వీలుగా మెగ్నీషియమ్ బ్యాటరీ వాడారు.డిజైన్: రౌండ్ హెడ్‌లైట్, ఫాక్స్ ఫ్యుయెల్ ట్యాంక్ మాదిరిగా కనిపించే డిజైన్, ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది.డిస్ప్లే: టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ.సేఫ్టీ: ట్రాక్షన్ కంట్రోల్, కార్నింగ్ ఏబీఎస్, ముందు, వెనక డిస్క్ బ్రేకులుంటాయి.రేంజ్: ఒకసారి ఛార్జీ చేస్తే 150-200 కి.మీ ప్రయాణం చేసేందుకు వీలుంది. -
బంగారు బుల్లెట్.. ఆఖరికి సైలెన్సర్ కూడా..
Gold Colour Royal Enfield: భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకున్న క్రేజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ బైకులను యువకుల దగ్గర నుంచి పెద్ద వారి వరకు చాలా మంది ఇష్టపడతారన్నది అందరికి తెలిసిన వాస్తవం. అయితే కొంత మంది ఈ బైక్ ప్రేమికులు వారికి కావలసిన రీతిలో మోడిఫైడ్ చేసుకుంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగా ఒక వ్యక్తి తన బైకుని గోల్డెన్ బుల్లెట్ మాదిరిగా రూపొందించుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ బుల్లెట్ 5577 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెలువడిన వీడియోలో మీరు గమనిస్తే ఈ గోల్డ్ బుల్లెట్ ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. పేరుకి గోల్డ్ బుల్లెట్ అయినా ఇది బంగారంతో తయారు కాలేదు. గోల్డ్ పెయింట్ స్కీమ్ మాత్రమే పొందింది. అందులో కూడా బైక్ కలర్ అలాగే ఉంది, అక్కడక్కడా గోల్డ్ షేడ్స్ చూడవచ్చు. ఇది బుల్లెట్ 350సీసీ బైక్ కావడం గమనార్హం. నిజానికి గోల్డ్ కలర్ స్కీమ్ పొందే వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే గోల్డ్ కలర్ బుల్లెట్.. టర్న్ ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్ ఎగువ భాగంలో చూడవచ్చు. అంతే కాకుండా ఫుట్‌రెస్ట్‌లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ షేడ్‌లో ఉన్నాయి. ఇక ఈ బైక్ హ్యాండిల్‌బార్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న బొమ్మ లాంటిది చూడవచ్చు. ఇది కూడా గోల్డెన్ షేడ్‌లోనే ఉంది. (ఇదీ చదవండి: వయసు 11.. సంపాదన వందల కోట్లు - చిన్నారి సక్సెస్ స్టోరీ!) గోల్డెన్ బుల్లెట్ రైడ్ చేసే వ్యక్తి కూడా బైకుకి తగిన విధంగా బంగారు ఉంగరాలు, బ్రాస్లెట్, వాచ్ వంటివి ధరించాడు. ఈ బైక్ సైలెన్సర్ కూడా బంగారు రంగులోనే ఉంది. ఈ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియావైలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) ఈ గోల్డెన్ బైక్ గోల్డెన్ మ్యాన్ అని పిలువబడే మహారాష్ట్ర పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతానికి చెందిన 'సన్నీ వాఘురే' అనే వ్యక్తికి సంబంధించినదని తెలుస్తోంది. గతంలో కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ అనే వ్యక్తి ఏకంగా గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ టాక్సీగా ఉపయోగిస్తున్నాడు. View this post on Instagram A post shared by Amit Raviraj Shinde (@royal_bullet_5577) -
1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!
ఆధునిక కాలంలో ఎక్కువ మంది యువకులు ఇష్టపడే బైకులలో 'రాయల్ ఎన్ఫీల్డ్' ప్రధానంలో చెప్పుకోదగ్గవి. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ఉన్న చరిత్ర అంతా.. ఇంతా కాదు. గతంలో తక్కువ తక్కువ సంఖ్యలో వినియోగంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు రోడ్డుపై విరివిగా కనిపిస్తున్నాయి. భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు ఇప్పుడు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లభిస్తున్నాయి. అయితే 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర కేవలం రూ. 18,700 మాత్రమే కావడం గమనార్హం. దీనికి సంబంధించిన బిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాయల్ ఎన్ఫీల్డ్ 4567k ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడైన పోస్ట్ చూస్తే 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఎలా ఉందొ తెలిసిపోతుంది. ఈ బిల్ కూడా M/s R S ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉంది. ఇందులో ఈ బైక్ ధర రూ. 18,800 అని, రూ. 250 డిస్కౌంట్ లేదా ఇతరత్రా కారణాల వల్ల తగ్గించడం వల్ల దీని ధర రూ. 18,700 అని స్పష్టమవుతోంది. అప్పటి ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు సుమారు పది రెట్లు ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం స్టాండర్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్ ధర సుమారు రూ .1.7 లక్షల వరకు ఉంది. 1901లో 'ఇంగ్లాండ్'లోని వోర్సెస్టర్ షైర్, రెడ్దిచ్ కు చెందిన కంపెనీ తమ మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ తయారు చేసింది. ఆ తరువాత భారతీయ కార్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ లో భాగమైన భారత సంతతికి చెందిన మద్రాస్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి లైసెన్స్ పొందింది. రాయల్ ఎన్ఫీల్డ్ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లో ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను వాడేవారు. 1954లోనే ప్రభుత్వం 800 యూనిట్ల 350 సిసి బైకులను కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే అప్పట్లోనే ఈ బైక్ ఎంత ఆదరణ పొందిందో అర్థమవుతుంది. రెడ్డిచ్ బిజినెస్ భారతదేశంలోని 'మద్రాస్ మోటార్స్'తో కలిసి 1955లో "ఎన్ఫీల్డ్ ఇండియా" ను సృష్టించింది, తద్వారా మద్రాసు లైసెన్స్ కింద 350 సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ బైక్ ఉత్పత్తి చేసింది. దాదాపు 70 సంవత్సరాలు తరువాత ఏకంగా భారతీయ మార్కెట్లో తిరుగులేని బైకుగా చెలామణి అవుతోంది. ఏడు దశాబ్దాల తరువాత కంపెనీ ఇప్పుడు దేశంలో అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటిగా మారింది. View this post on Instagram A post shared by Being Royal (@royalenfield_4567k) -
అంత బలుపేంటి భయ్యా.. కారు ఉంటే ఇంట్లో పెట్టుకో చౌదరి సాబ్..
తనకే కారు ఉందని రెచ్చిపోయాడు.. రోడ్డు మీద స్పీడ్ పెంచి కారు నడిపి.. బైకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడగా.. పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక.. ట్విస్ట్ ఏంటంటే అతనో ‘లా’ విద్యార్థి కావడం విశేషం. వివరాల ప్రకారం.. అర్జంఘర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ బైకర్, కారు డ్రైవర్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్కార్పియో డ్రైవ్ చేస్తున్న అనుజ్ చౌదరి.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్న శ్రేయాన్ష్‌ను హై స్పీడ్‌లో కారుతో ఢీకొట్టాడు. అంతకు ముందు బైకర్‌ను బూతులు తిడుతూ.. కారుతో తొక్కించి చంపేస్తానంటూ బైకర్లను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఓ బైకర్‌ను వెనుక నుంచి కారుతో వేగంగా ఢీకొట్టాడు. కారు ఢీకొట్టడంతో కింద పడిపోయిన బైకర్.. శ్రీయాన్ష్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను అనురాగ్ అయ్యర్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అనంతరం, పీఎంవో ఇండియా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీసీపీ న్యూఢిల్లీలను ట్యాగ్ చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు శ్రేయాన్ష్ మాట్లాడుతూ.. తాను, తన స్నేహితులు కలిసి ఆరావళిలోని టెంపుల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న అనుజ్‌తో వాగ్వాదం జరిగిందన్నాడు. ట్విట్టర్ వీడియోతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుజ్ చౌదరిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కారును సీజ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @PMOIndia @ArvindKejriwal @DCPNewDelhi Please help us , the Scorpio Car driver almost killed a few of our riders and threatened to kill us by crushing us under the car. This is not what we vote for or pay taxes for no one was severely injured Gears respect riders pic.twitter.com/rcZIZvP7q4 — ANURAG R IYER (@anuragiyer) June 5, 2022 ఇది కూడా చదవండి: మ్యూజియం పై దాడి చేసిన యువకుడు... కారణం విని షాక్ అయిన పోలీసులు -
డుగ్గు డుగ్గుమంటూ .. ‘బుల్లెట్’ బైక్ ఎక్కి పోదామా!
సాక్షి, హైదరాబాద్: కరోనా అనంతరం బైక్ రైడింగ్ ఈవెంట్స్ తిరిగి రోడ్డెక్కుతున్నాయి. నగరానికి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రైడర్స్ ఇష్టపడే బైక్ టూర్ మూడేళ్ల తర్వాత మరోసారి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హిమాలయన్ ఒడిస్సీ పేరుతో నిర్వహించే ఈ బైక్ టూర్...ప్రపంచంలోని అతి పెద్ద రైడ్స్‌లో ఒకటిగా పేరొందింది. ఈ ఏడాది జులై 2న ఢిల్లీలో పునఃప్రారంభం కానున్న ఈ అడ్వంచరస్ రైడ్ 18 రోజుల పాటు హిమాలయ పర్వత ప్రాంతంలో కొనసాగుతుందని, మొత్తం 2,700 కి.మీ దూరం పాటు రైడ్ ఉంటుందని వివరించారు. చదవండి: Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు -
Crime News: బుల్లెట్ బండి మీద కన్నేశారు
పంజగుట్ట: రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పంజగుట్ట క్రైమ్ టీం అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి ఐదు లక్షలు విలువచేసే నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఏలూరు జిల్లా, జగ్గారెడ్డిగూడెంకు చెందిన దేవ సన్ని అలియాస్ మహేష్ (26) ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. సూర్యాపేట జిల్లా, ఆత్మకూరుకు చెందిన బి.మనోహర్ (21) ఇతనికి నాలుగు సంవత్సరాలుగా స్నేహితులు. త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ద్విచక్రవాహనాలు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఖరీదైన వాహనాలు దొంగిలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు దొంగతనం చేద్దామనుకున్నారు. నగరానికి వచ్చి సరూర్‌నగర్, హయత్‌నగర్, జూబ్లీహిల్స్‌తోపాటు గత ఏప్రిల్ నెలలో పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాఫర్అలీ బాగ్‌లో ఒక వాహనం దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం పంజగుట్ట క్రైమ్ ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన వాహనంపై నిందితులు పట్టుబడ్డారు. పత్రాలు చూపించమంటే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా గతంలో చేసిన దొంగతనాలగూర్చి వివరించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు ఎలా అమ్మలి, కొనే వారు ఎవరైనా దొరుకుతారా అని ఎదురుచూస్తుండగానే పోలీసులకు దొరికిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. (చదవండి: 24 గంటలు ఆగాలంటూ..) -
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సొంతం చేసుకున్న సెట్ శ్వేత
శ్వేతా వర్మ.. బిగ్‌బాస్ షోతో జనాలకు మరింత చేరువైందీ భామ. ఏదైనా సరే ఇచ్చిపడేద్దాం అంటూ చలాకీగా మాట్లాడే ఈ బ్యూటీకి బైక్ రైడింగ్‌లంటే మహా సరదా. తాజాగా ఆమె రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ఇంటికి తెచ్చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన శ్వేత అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'యుగన్ నిర్వాణను మీకు పరిచయం చేస్తున్నాను.. ఈ బైక్‌ను రైడ్ చేయాల్సిన సమయం వచ్చేసింది..' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఈ ఎన్ఫీల్డ్ బైక్ నీకు పర్ఫెక్ట్గా సెట్టయిందంటూ కామెంట్లు చేస్తున్నారు ఆమె అభిమానులు. కాగా శ్వేత.. పచ్చీస్, ద రోజ్ విల్లా, ఏకమ్, ముగ్గురు మొనగాళ్లు, మిఠాయి, మ్యాడ్, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, సంజీవని, నెగెటివ్ వంటి పలు చిత్రాల్లోనే కాక విష్ యూ హ్యాపీ బ్రేకప్ వంటి వెబ్ సిరీస్‌లోనూ నటించింది. View this post on Instagram A post shared by Swetaa varma (@iamswetaavarma) -
ఐటీ రిటర్న్ దాఖలు చేసే వారికి బంపరాఫర్..!
File ITR To Get A Chance To Win Royal Enfield Bullet: 2021 ఆర్థిక సంవత్సరానికిగాను డిసెంబర్ 31తో ఐటీ రిటర్న్ గడువు పూర్తి కానుంది. దీంతో ఐటీఆర్ ఫైలింగ్‌ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు ఆఫర్లతో ముందుకు వచ్చింది. డిసెంబర్ 31 వరకు 1000కిపైగా ఐటీఆర్ దాఖలు చేసిన(విలేజ్ లేవల్ ఎంట్రిప్యూనర్స్) వీఎల్ఈలకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బంపరాఫర్ ప్రకటించింది. 1000కిపైగా లక్ష్యాన్ని చేరుకున్న వీఎల్ఈలు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకోవచ్చునని సీఎస్సీ ట్విటర్లో పేర్కొంది. బుల్లెట్ బండి..లక్ష గెలుచుకునే అవకాశం..! కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డిజిటల్ సేవల పోర్టల్ కామన్ సర్వీసెస్ సెంటర్స్ దేశవ్యాప్తంగా 75,000 కంటే ఎక్కువ కేంద్రాలను నడుపుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 25 లక్షల మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని సీఎస్సీ ఆశిస్తోంది. ఐటీఆర్ దాఖలును మరింత వేగం పెంచడం కోసం వీఎల్ఈలకు బంపరాఫర్ ట్విటర్లో ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వీఎల్ఈలు 2021 డిసెంబర్ 31 లోగా 1000 మందితో ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ను గెలుచుకునే అవకాశం పొందనున్నారు. అంతేకాకుండా వీఎల్ఈలు రూ.1 లక్ష వరకు కమీషన్లను కూడా గెలుచుకోవచ్చునుని సీఎస్సీ పేర్కొంది . భారీగా పెరిగిన ఐటీఆర్ దాఖలు..! గత ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు పైగా ఐటీఆర్‌లు ఈ-ఫైలింగ్ అయ్యాయి. 2021 డిసెంబర్ 21వ తేదీన ఒక్కరోజే దాదాపు 8.7 లక్షల రిటర్న్‌లు దాఖలయ్యాయని ఐటీ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ కావడంతో...ఈ-ఫైలింగ్‌లో భారీ పెరుగుదల కన్పిస్తోంది. గత ఏడు రోజుల్లో 46.77 లక్షల మంది తమ ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారని తెలుస్తోంది. ATTENTION VLEs!! File 1000 ITR By December 31, 2021 And Win A ROYAL ENFIELD BULLET and Also Earn More Than Rs. 1 LAKH Commission... Last date for filing ITR - December 31, 2021#DigitalIndia #RuralEmpowerment #ITRFiling #ITR #FridayMotivation #FridayVibes #RoyalEnfield pic.twitter.com/JcNCi2HClA — CSCeGov (@CSCegov_) December 24, 2021 చదవండి: దివాలా చట్టంలో కీలక సవరణలకు కేంద్రం కసరత్తు..! -
సైలెంట్ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్
మార్కెట్లోకి ఎన్ని బైకులు వచ్చినా బుల్లెట్ బండికి ఉండే క్రేజే వేరు. యువతలో చాలామంది కలల బండి బల్లెట్టే.. అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా ఈ బండి అంటే విపరీతమైన పిచ్చి. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇంజిన్ సౌండ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. డుగ్గు డుగ్గు డుగ్గు అంటూ వచ్చే సౌండ్‌కే యువత పడిపోతారు. అయితే బుల్లెట్ సౌండ్‌పై ఉన్న మోజుతో చాలామంది బండి సైలెన్సర్లను ఎక్కువ శబ్దం వచ్చేలా ప్రత్యేకించి రూపొందించుకుంటారు. ఇవి రోడ్డుమీద వెళ్తుంటే భారీ సౌండ్‌తోపాటు శబ్ధ కాలుష్యానికి కారణంగా మారుతోంది. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసుల కన్ను ప్రత్యేకంగా తయారు చేసుకున్న బుల్లెట్ బండి సైలెన్సర్స్పై పడింది. దీంతో ప్రత్యేకించి తయారు చేయించుకున్న వందలాది రాయల్ ఎన్ఫీల్డ్ బండ్ల సైలెన్సర్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఒక్కచోట చేర్చిన ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రోలర్ సాయంతో సైలెన్సర్లను నలిపివేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్ పోలీస్ ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్ ఇప్పుడు సైలెన్స్ అయిపోయాయని ట్వీట్ చేశారు. Customized #dugudugu bandi silencers are under silence.#HyderabadCityPolice #BulletBandi pic.twitter.com/Y0lK6d13Cq — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) October 19, 2021 -
మాదాపూర్ ఆక్సిడెంట్ కేసులో మలుపు
సాక్షి, మాదాపూర్: మాదాపూర్ రోడ్డు ప్రమాదం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కారు నడిపిన యువకుడు సృజన్ కుమార్ ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సృజన్ కారుపై 11 ఈ చలాన్లు ఉన్నట్లు, ఈ 11 చలాన్లు కూడా ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్వేనని తేలింది. కాగా ఆగి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను మహేంద్ర ఎక్స్‌యూవీ కారు ఢీ కొనడంతో వెనుక కూర్చున్న ఓ యువతి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపిన మేరకు.. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నేరేడ్మెట్కు చెందిన టి.అజయ్(23) తన స్నేహితురాలు జెన్నీఫర్ డిక్రూజ్‌తో కలసి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై కొత్తగూడ వైపు నుంచి సైబర్ టవర్స్ వైపు వస్తున్నాడు. మార్గమధ్యలో సీఐఐ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగారు. చదవండి: హైదరాబాద్‌లో బస్‌పాస్‌కు రూ.1200.. ఇలా చేస్తే బెటరేమో! అదే సమయంలో మహేంద్ర ఎక్స్‌యూవీ కారును డ్రైవర్ అతి వేగంగా నడుపుతూ వచ్చి ఆగి ఉన్న బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో వెనుక కూర్చున్న జెన్నీఫర్ డిక్రూజ్‌కి బలమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అజయ్‌కు ఎడమ చేయి, ఎడమ కాలు, వెన్నుముకకు బలమైన గాయాలయ్యాయి. కార్ డ్రావర్ పరారయ్యాడు. యువతి తండ్రి జాన్‌సిరిల్ డిక్రూజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. కాగా అజయ్, జెన్నీఫర్‌కు ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆ కుంటుంబాల్లో ఈ రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఓ కుటుంబానికి కడుపుకోత మిగల్చడంతోపాటు మరో కుటుంబానికి కొడుకు ఎప్పటికి తేరుకుంటాడో తెలియని పరిస్థితిలోకి నెట్టేసింది. చదవండి: ఈ-చలాన్: హైదరాబాదీలకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు -
బుల్లెటు బండి ! ఆ డుగ్ డుగ్ వెనుక కథ ఇదేనండి !!
'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని' అంటూ పెళ్లి బరాత్‌లో నవ వధువు చేసిన డ్యాన్స్ రికార్డులు క్రియేట్ చేసింది. అంతకు ముందు నాలుగేళ్ల కిందట యూత్‌లో సంచలనం రేపి అర్జున్‌రెడ్డి మూవీ బుల్లెట్ డుగ్ డుగ్ సౌండ్స్‌తోనే మొదలవుతుంది. ఇటీవల వచ్చిన జార్జిరెడ్డి సినిమా బుల్లెట్ సాంగ్‌లో అయితే ‘వాడు వస్తుంటే వీధంతా ఇంజను సౌండు’ అంటూ సాహిత్యం కొససాగుతుంది. ఇంతగా హల్చల్ చేస్తున్న ఆ బుల్లెట్ బండి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ ? దాని సౌండు వెనుక ఉన్న కథాకమామీషులేంటో మీకు తెలుసా...! మోటార్ సైకిళ్ల చరిత్ర చాలా పెద్దగానే ఉంది. మోటార్ బైక్‌లను తొలిసారి గా ఫ్యుగోట్ కంపెనీ తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ రెండో బైక్ తయారీ సంస్థగా నిలిచింది. ప్రస్తుతం బుల్లెటు బండిని ఐషర్ మోటర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్ధ అయిన రాయల్‌ఎన్‌ఫీల్డ్ తయారుచేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ పేరులోనే ఒక రాజసం ఉంది. ఎక్కువగా రాజకీయనాయకులు ఈ బైక్‌లపై తిరుగుతుంటారు. కచ్చితంగా బుల్లెటు బైక్‌ను సొంతం చేసుకోవాలనే మోజు, క్రేజు యూత్‌లో నెలకొంది. బుల్లెటు బైక్ ఇంగ్లాండ్‌కు చెందిన రెడ్డిచ్ ఎన్ఫీల్డ్ మోటార్స్ కంపెనీ ఈ బైక్‌ను రూపొందించింది. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఆర్మీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. చెన్నైలో ప్లాంట్ ఇండియాలో బ్రిటిష్‌వాళ్ల రాకతో వారి పరిపాలనలో రాజసానికి చిహ్నంగా ఈ బైక్‌ను భారత్‌లోకి తెచ్చారు. తొలి దశలో ఇంగ్లండ్ నుంచి ఈ బైకులను ఇండియాకు తెప్పించారు. ఆ తర్వాత 1947 స్వాతంత్ర్యం వచ్చాక ఆర్మీ జవాన్లు గస్తీకాయడం కోసం బుల్లెట్ బైక్‌ను ఎంచుకోవాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇంగ్లాండ్ నుంచి బుల్లెటు బైకులను తీసురావడానికి ఖర్చు ఎక్కువగా అవుతుండడంతో చెన్నైలో తయారీ ప్లాంటు నెలకొల్పాలని నిర్ణయించారు. అలా 1952లో చైన్నెకు చెందిన మద్రాస్ మోటార్స్ ఇంగ్లాండ్‌కు చెందిన రెడ్డిచ్ కంపెనీ భాగస్వామ్యంతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాను స్థాపించారు.350 సీసీ ఇంజన్ సామర్థ్యంతో బుల్లెట్ బ్రాండ్ నేమ్‌తో బైకులు తయారు చేయడం మొదలెట్టింది రాయల్‌ఎన్‌ఫీల్డ్. మొదటి బైక్ బుల్లెట్ భారత్‌లో మొట్టమొదటిసారిగా తయారై మార్కెట్లోకి వచ్చిన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ వారి బుల్లెట్ బండే. అప్పట్లో భారత ప్రభుత్వం సుమారు 800 బుల్లెట్లను ఆర్మీ కోసం ఆర్డర్ చేసింది. మొదట్లో ఇంగ్లండ్ నుంచి విడిభాగాలు తెప్పించుకుని ఇండియాలో తయారు చేసేవారు. 1962 నాటికి అన్నిభాగాలు ఇండియాలోనే తయారు చేయడం మొదలెట్టారు. ఇప్పటికీ ఇండియన్ ఆర్మీకి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థనే బైకులను సరఫరాచేస్తోంది. హిమాలయ, ఈశాన్య భారతంలో ఆర్మీ గస్తీ విధుల్లో బుల్లెట్టు బండిది కీలకం. మేడ్ లైక్ ఏ గన్ గోస్ లైక్ ఏ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ బైక్‌లను పరిచయం చేయడానికి ముందు రెడ్డిచ్ ఎన్ఫీల్డ్ కంపెనీ లాన్ మూవర్స్‌ను కంపెనీ తయారుచేసేది. అంతేకాకుండా తుపాకులను,ఫీరంగులను తయారుచేసేది. 19వ శతాబ్ధంలో యూరప్‌లో యుద్దాలు నిరంతరం జరుగుతుండేవి. అందులో పలు దేశాలకు రైఫిల్స్, స్పోర్టింగ్ గన్లను కూడా ఈ సంస్థనే సరఫరా చేసింది. వీటి నుంచే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ట్యాగ్ వచ్చింది. అదే.. ‘మేడ్ లైక్ ఏ గన్..గోస్ లైక్ ఏ బుల్లెట్..బిల్ట్ లైక్ ఏ గన్’ బడ్జెట్ బుల్లెట్ పేరు ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల సౌండ్ ఎంత గొప్పగానో ఉంటుంది కానీ మైలేజీ చాలా తక్కువ. ఎక్కువగా ఇంధనాన్ని తాగేవి. దీంతో హీరో స్ల్పెండర్డర్ తరహాలో టారస్ పేరుతో ఎకానమీ బైకును కూడా మార్కెట్లోకి తెచ్చి రాయల్ ఎన్ఫీల్డ్. ఈ బైక్ సింగిల్ సిలిండర్, 325సీసీ డిజిల్ ఇంజన్ వేరియంట్‌తో పని చేస్తూ 6.5బీహెచ్పీ సామర్ధ్యంతో 15ఎన్‌మ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేసేది. ఈ బైక్ లీటర్ డిజీల్‌కు సుమారు 70 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చేది. టారస్ బుల్లెట్ మోడల్ బైక్ సుమారు 12 సంవత్సరాలు పాటు అందుబాటులో ఉంది. మైలేజీ భేషుగ్గా ఉన్నా దీని ధర అధికం కావడంతో ఆశించిన మేరకు సేల్స్ జరగలేదు. దీంతో కంపెనీ ఈ మెడల్ని డిస్కంటిన్యూ చేసింది. చెక్కుచెదరని డిజైన్ రాయల్ ఎన్ఫీల్డ్ ట్యాంక్‌పై ఉండే డిజైన్‌ను చైన్నెకు చెందిన కళాకారుడు రూపొందించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ పెట్రోల్ ట్యాంకులపై డిజైన్‌ను పూర్తిగా చేతులతోనే వేసేవారు. కాలక్రమేణా బుల్లెట్ బైక్‌లకు డిమాండ్ పెరగడంతో బైక్ ట్యాంక్‌లపై పిన్ స్ట్రిప్‌లను యంత్రాలను ఉయోగించి డిజైన్ చేస్తున్నారు. -
స్టైలిష్ లుక్ తో డుగ్ డుగ్ బండి వచ్చేస్తోంది
డుగ్... డుగ్.. డుగ్... శబ్దంతో రాజసం ఉట్టిపడే బైక్‌పై...అంతే రాయల్‌గా కూర్చుని రయ్యిన వెళుతుంటే... ఆ హుందానే వేరు! 'కొంత'మందికే పరిమితైన వెహికల్‌ను ధనికులు ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కుర్రకారుకు హాట్ ఫేవరెట్ అయిన ఈ బండి పల్లెటూళ్లలోనే కాదు... మహానగరాల్లోనూ క్రేజీ బైక్‌గా మారింది. అందుకే ఈ బైక్ కు మరిన్ని హంగులు యాడ్ చేసి ఆటో మొబైల్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. తాజాగా '2021 న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ను మార్పులు చేసి అందుబాటులోకి తేనున్నాయి. ‘రాయల్’ సిరీస్ గురించి సీరియస్‌గా ఫాలో అయ్యేవారికి ‘2021 న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ గురించి ఆసక్తి ఉంటుంది. ఈ బండి రకరకాల మార్పులతో వస్తున్నట్లు వినికిడి. ‘ఇంజన్’ ‘పవర్ట్రైన్’...మొదలైన ఫీచర్లను ‘మీటిమోర్ 350’ నుండి అరువు తెచ్చుకుంటుంది. కొత్త మోడల్స్‌ను తీసుకురావడంలో పేరున్న రాయల్ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొంది. రాబోయే నెలల్లో మాత్రం కొత్త మోడల్స్‌ను చూడవచ్చు అంటున్నారు. చదవండి : ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త -
తినండి.. బుల్లెట్ గెలవండి
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు దేశంలో అన్ని రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హోటల్ వ్యాపారాలు నేటికి కోలుకోలేదు. వైరస్ వ్యాప్తి ప్రారంభం అయిన నాటి నుంచి జనాలు బయటి తిండి అంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ వైభవాన్ని పొందేందుకు హోటల్ యజమానులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ ఆఫర్ జనాలను టెంప్ట్ చేయడమే కాక రెస్టారెంట్‌కు క్యూ కట్టెలా చేస్తుంది. ఆ వివరాలు.. పుణె అవుట్ స్కర్ట్స్‌లో ఉన్న శివరాజ్ హోటల్ కస్టమర్లను ఆకర్షించేందుకు.. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఓ వెరైటీ సవాలు ప్రకటించింది. ఇక ఇందులో గెలిచిన వారికి ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను బహుమతిగా ఇస్తామని తెలిపింది. ఇంతకు సవాలు ఏంటంటే 60 నిమిషాల వ్యవధిలో భారీ బుల్లెట్ థాలిని పూర్తి చేయాలని ప్రకటించింది. దాదాపు నాలుగు కేజీల బరువుండే భారీ నాన్ వెజ్ థాలిని 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసిన వారికి 1,60,000 రూపాయల ఖరీదు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ని బహుమతిగా ఇస్తామని పేర్కొన్నది. ఇక పోటీకి సంబంధించిన కండీషన్లని, థాలిలో ఉండే పదార్థాలను సూచించే మెనుకు సంబంధించిన బ్యానర్లను ముద్రించి ప్రచారం చేస్తుంది. (చదవండి: యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. రెస్టారెంట్ మూత) బుల్లెట్ థాలిలో ఉండే పదార్థాలు.. ఇక నాన్-వెజ్ బుల్లెట్ థాలిలో 4 కిలోల మటన్, వేయించిన చేపలతో తయారు చేసిన సుమారు 12 రకాల వంటకాలు ఉంటాయి. ఫ్రైడ్ సుర్మై, పామ్ఫ్రేట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తాండూరి, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, కొలంబి (ప్రాన్) బిర్యానీ వంటి వంటకాలు ఉంటాయి. ఇక ఈ థాలిని సిద్ధం చేయడానికి 55 మంది సభ్యులు పని చేశారు. స్పందన ఎలా ఉంది.. థాలిని ప్రయత్నించడానికి, పోటీలో పాల్గొనడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో తన రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారని.. పోటీ పట్ల స్పందన చాలా బాగుందని రెస్టారెంట్ యజమాని అతుల్ వైకర్ తెలిపారు. ఇక తాము కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నట్లు వైకర్ హామీ ఇచ్చారు. ఈ హోటల్ రోజుకు 65 థాలిలను విక్రయిస్తుంది. ఇక శివరాజ్ హోటల్ ఆరు రకాల భాదీ థాలిలను అందిస్తుంది - స్పెషల్ రావన్ థాలి, బుల్లెట్ థాలి, మాల్వాని ఫిష్ థాలి, పహెల్వాన్ మటన్ థాలి, బకాసూర్ చికెన్ థాలి, సర్కార్ మటన్ థాలి వంటి వెరైటీలు ఉన్నాయి. (చదవండి: దీన్ని 20 నిమిషాల్లో తింటే రూ.90 వేలు మీవే!) థాలి ధర ఎంత... ప్రతి తాలి ధర 2,500 రూపాయలు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన శివరాజ్ హోటల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఆఫర్లను పరిచయం చేస్తుంది. గతంలో, 8 కిలోల రావన్ థాలిని 60 నిమిషాల్లో పూర్తి చేయడానికి నలుగురు వ్యక్తులకు ఒక పోటీని ఏర్పాటు చేశారు. విజేతకు 5,000 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. ఇక థాలికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. (చదవండి: రెస్టారెంట్ కిచెన్‌లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!) ఇప్పటి వరకు ఎవరైనా గెలిచారా.. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా నివాసి సోమనాథ్ పవార్ బుల్లెట్ థాలిని ఒక గంటలోపు పూర్తి చేయగలిగాడని అతుల్ వైకర్ తెలిపారు. అతనికి బుల్లెట్ బహుకరించారు. (విన్నర్) -
కేజీ.. బుల్లెట్ బైకుల్లో రారాజు
కేజీ.. బుల్లెట్ బైకుల్లో రారాజు అనే మాట ‘బుల్లెట్’కు సరిగ్గా సరిపోతుంది. రివాల్వర్ బుల్లెట్లా ఇది కూడా అంతే వేగంగా దూసుకుపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే హల్చల్ చేసిన ఈ బుల్లెట్.. నేటి కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఒకప్పుడు హుందాతనానికి, శరీర సౌష్టవానికి సింబల్‌గా నిలిచి.. ఇప్పుడు యూత్ ఫేవరెట్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ సంపాదించింది. దిగువ స్థాయి పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ వీటి హవా కొనసాగుతుంది. పెనుగొండ వంటి గ్రామంలో యువకులు నెల రోజుల్లో 15 వరకు బుల్లెట్లు కొనుగోలు చేసారంటే వీటికున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. - పెనుగొండ రూరల్ లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ మారుతోంది. దానికి తగ్గట్టుగానే యూత్ స్టైల్లో కూడా డిఫరెంట్ లుక్ వచ్చింది. రకరకాల ఫ్యాషన్లు.. రోజుకొక డిజైన్.. ఇవన్నీ ఎందుకు అనుకున్నారో ఏమో నేటి యువత పాతతరాన్నే రోల్ మోడల్‌గా తీసుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్‌లో హీరోలు వాడిన కాస్ట్యూమ్స్ నుంచి కళ్లద్దాల వరకు అన్నింటినీ ఫాలో అవుతూ నలుగురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ కోవకే చెందుతూ.. తాజాగా తెరపైకి వచ్చినవే బుల్లెట్లు. ఒకప్పుడు హుందాతనానికి, శరీర సౌష్టవానికి సింబల్‌గా భావిస్తూ ఉపయోగించిన బుల్లెట్లను నేడు ఫ్యాషన్ కోసం, కొత్తగా కనిపించడం కోసం వాడుతున్నారు. ఇక యూత్ ఆసక్తిని గమనించిన కంపెనీలు రకరకాల బుల్లెట్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ‘రాయల్’ లుక్ ఇరవై ఏళ్ల కిందట ఎన్ఫీల్డ్ ఇండియా బుల్లెట్ వినియోగించే వారిలో రాజసం కనిపించేది. బండికి తగిన హుందాతనం, శరీర సౌష్టవంతో ఆకట్టుకునే వారు. బుల్లెట్ వాడేవారిని కోటీశ్వరుడిగా పరిగణించే వారు. కాలానుగుంగా పెట్రోల్ ధరలు పెరగడం, కార్ల ధరలు అందుబాటులోకి రావడంతో బుల్లెట్ల వినియోగం తగ్గింది. ఆ తరువాత కనుమరుగయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఆధునిక హంగులతో వివిధ రకాల రంగులు, అనేక మోడళ్లతో వస్తూ నేటి యువతరం హృదయాల్లో స్థానం సంపాదించేశాయి. గ్రామీణ రోడ్లలోనూ హల్చల్ చేస్తున్నాయి. హుందాతనానికి రాయల్ ఎన్ఫీల్డ్ వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఎన్ఫీల్డ్ ఇండియా బుల్లెట్ల అమ్మకాలు మనదేశంలో 1949లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో పోలీసులు, మిలటరీ వాళ్లు వీటని ఎక్కువుగా వినియోగించేవారు. 1994లో మద్రాసులో ఎన్ఫీల్డ్ ఇండియా, ఐషర్ కంపెనీలు విలీనమయ్యాయి. అప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌గా రూపాంతరం చెందింది. ఇదే కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ ట్విన్స్ పార్క్ 350, ట్విన్స్పార్క్ 500, ఎలక్ట్రా ట్విన్స్ పార్క్, క్లాసిక్ 350, క్లాసిక్ 500, క్లాసిక్ క్రోమ్, క్లాసిక్ డిసర్ట్స్ట్రోమ్, కాంటినెంటల్ జీటీ, తండర్ బార్డ్ 350, తండర్ బార్డ్ 500 వంటి పది రకాల మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్‌షోరూమ్ ధర రూ.96 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఉంది. ఆధునికతతో అందంగా.. 350, 500 సీసీతో ఐదు గేర్లతో బుల్లెట్లు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. గతంలో బుల్లెట్‌కు కిక్‌స్టార్ ఉండేది. కిక్ కొట్టాలంటే కండలు తిరిగిన శరీర సౌష్టవం కావాలని భావించేవారు. ప్రస్తుతం సెల్ఫ్స్టార్ సిస్టంతో అందుబాటులోకి వచ్చాయి. 40 కిలోమీటర్లకు పైగా మైలేజీ కూడా ఇస్తుండటంతో దీని క్రేజ్ పెరిగింది.