ఆధునిక కాలంలో ఎక్కువ మంది యువకులు ఇష్టపడే బైకులలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' ప్రధానంలో చెప్పుకోదగ్గవి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ఉన్న చరిత్ర అంతా.. ఇంతా కాదు. గతంలో తక్కువ తక్కువ సంఖ్యలో వినియోగంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు రోడ్డుపై విరివిగా కనిపిస్తున్నాయి.
భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు ఇప్పుడు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లభిస్తున్నాయి. అయితే 1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర కేవలం రూ. 18,700 మాత్రమే కావడం గమనార్హం. దీనికి సంబంధించిన బిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ 4567k ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడైన పోస్ట్ చూస్తే 1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర ఎలా ఉందొ తెలిసిపోతుంది. ఈ బిల్ కూడా M/s R S ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉంది. ఇందులో ఈ బైక్ ధర రూ. 18,800 అని, రూ. 250 డిస్కౌంట్ లేదా ఇతరత్రా కారణాల వల్ల తగ్గించడం వల్ల దీని ధర రూ. 18,700 అని స్పష్టమవుతోంది.
అప్పటి ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు సుమారు పది రెట్లు ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం స్టాండర్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్ ధర సుమారు రూ .1.7 లక్షల వరకు ఉంది. 1901లో 'ఇంగ్లాండ్'లోని వోర్సెస్టర్ షైర్, రెడ్దిచ్ కు చెందిన కంపెనీ తమ మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ తయారు చేసింది. ఆ తరువాత భారతీయ కార్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ లో భాగమైన భారత సంతతికి చెందిన మద్రాస్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి లైసెన్స్ పొందింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లో ఎక్కువగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను వాడేవారు. 1954లోనే ప్రభుత్వం 800 యూనిట్ల 350 సిసి బైకులను కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే అప్పట్లోనే ఈ బైక్ ఎంత ఆదరణ పొందిందో అర్థమవుతుంది.
రెడ్డిచ్ బిజినెస్ భారతదేశంలోని 'మద్రాస్ మోటార్స్'తో కలిసి 1955లో "ఎన్ఫీల్డ్ ఇండియా" ను సృష్టించింది, తద్వారా మద్రాసు లైసెన్స్ కింద 350 సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ బైక్ ఉత్పత్తి చేసింది. దాదాపు 70 సంవత్సరాలు తరువాత ఏకంగా భారతీయ మార్కెట్లో తిరుగులేని బైకుగా చెలామణి అవుతోంది. ఏడు దశాబ్దాల తరువాత కంపెనీ ఇప్పుడు దేశంలో అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment