bike prices
-
1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!
ఆధునిక కాలంలో ఎక్కువ మంది యువకులు ఇష్టపడే బైకులలో 'రాయల్ ఎన్ఫీల్డ్' ప్రధానంలో చెప్పుకోదగ్గవి. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ఉన్న చరిత్ర అంతా.. ఇంతా కాదు. గతంలో తక్కువ తక్కువ సంఖ్యలో వినియోగంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు రోడ్డుపై విరివిగా కనిపిస్తున్నాయి. భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు ఇప్పుడు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లభిస్తున్నాయి. అయితే 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర కేవలం రూ. 18,700 మాత్రమే కావడం గమనార్హం. దీనికి సంబంధించిన బిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాయల్ ఎన్ఫీల్డ్ 4567k ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడైన పోస్ట్ చూస్తే 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఎలా ఉందొ తెలిసిపోతుంది. ఈ బిల్ కూడా M/s R S ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉంది. ఇందులో ఈ బైక్ ధర రూ. 18,800 అని, రూ. 250 డిస్కౌంట్ లేదా ఇతరత్రా కారణాల వల్ల తగ్గించడం వల్ల దీని ధర రూ. 18,700 అని స్పష్టమవుతోంది. అప్పటి ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు సుమారు పది రెట్లు ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం స్టాండర్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్ ధర సుమారు రూ .1.7 లక్షల వరకు ఉంది. 1901లో 'ఇంగ్లాండ్'లోని వోర్సెస్టర్ షైర్, రెడ్దిచ్ కు చెందిన కంపెనీ తమ మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ తయారు చేసింది. ఆ తరువాత భారతీయ కార్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ లో భాగమైన భారత సంతతికి చెందిన మద్రాస్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి లైసెన్స్ పొందింది. రాయల్ ఎన్ఫీల్డ్ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లో ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను వాడేవారు. 1954లోనే ప్రభుత్వం 800 యూనిట్ల 350 సిసి బైకులను కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే అప్పట్లోనే ఈ బైక్ ఎంత ఆదరణ పొందిందో అర్థమవుతుంది. రెడ్డిచ్ బిజినెస్ భారతదేశంలోని 'మద్రాస్ మోటార్స్'తో కలిసి 1955లో "ఎన్ఫీల్డ్ ఇండియా" ను సృష్టించింది, తద్వారా మద్రాసు లైసెన్స్ కింద 350 సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ బైక్ ఉత్పత్తి చేసింది. దాదాపు 70 సంవత్సరాలు తరువాత ఏకంగా భారతీయ మార్కెట్లో తిరుగులేని బైకుగా చెలామణి అవుతోంది. ఏడు దశాబ్దాల తరువాత కంపెనీ ఇప్పుడు దేశంలో అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటిగా మారింది. View this post on Instagram A post shared by Being Royal (@royalenfield_4567k) -
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!
New Rules From 1st January 2022: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి నెల మాదిరిగానే రాబోయే కొత్త ఏడాది జనవరి 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఏటీఎం ఛార్జీలు: క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. (చదవండి: కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..) ఈపీఎఫ్ ఈ-నామినేషన్: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు. ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. హీరో మోటోకార్ప్: వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల ధరలు: వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి. (చదవండి: అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!) -
బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!
మీరు పండుగ సమయంలో కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీరు చేదు వార్త. దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ఈ పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి రానున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న విడిభాగాల వస్తువుల ధరల వల్ల ద్విచక్ర వాహన ధరలను పెంచాల్సి వస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల పెంపు అనేది రూ.3,000 వరకు ఉండనుంది. బైక్, స్కూటర్ వేరియంట్ బట్టి ధరలు పెరగనున్నాయి. త్వరలో రోబోయే పండుగ సీజన్ ముందు ధరలు పెంచడం విశేషం. ఈ పండుగ సీజన్లో డిమాండ్ ఆశాజనకంగా ఉంటుంది అని కంపెనీ భావిస్తుంది. హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 1.80 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది క్రితం కాలంలో విక్రయించిన 1.61 మిలియన్ యూనిట్లకంటే సుమారు 12శాతం ఎక్కువ. ఈ ఏడాది కూడా గత ఏడాది మాదిరిగానే ఉత్పత్తి, అమ్మకాలు కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం చెందాయి. (చదవండి: ఐపీఎల్ ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త!) -
బైక్ లవర్స్‌కు షాకిచ్చిన టీవీఎస్ మోటార్..!
ప్రముఖ బైక్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మరోసారి బైక్ లవర్స్‌కు షాకిచ్చింది. టీవీఎస్ అపాచీ బైక్ ధరలను గణనీయంగా పెంచింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి, అపాచీ ఆర్టీఆర్ 160 4వి ధరలను టీవీఎస్ భారీగా పెంచింది. ఈ ఏడాదిలో అపాచీ బైక్‌ల ధరలను టీవీఎస్ పెంచడం ఇది మూడోసారి. అపాచీ ఆర్టీఆర్ 160 4వి వేరియంట్ ధరను సుమారు రూ. 3000 వరకు పెంచింది. దీంతో అపాచీ ఆర్టీఆర్ 160 4వి డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 1,14,615 కాగా, డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 1,11,565 గా ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి వేరియంట్ ధరను రూ. 3,750 వరకు పెంచింది. దీంతో అపాచీ ఆర్టీఆర్ 200 4వి సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 1,33,065 కాగా, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ట్రిమ్ వేరియంట్ ధర రూ. 1,38,115 గా ఉంది. పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ప్రాంతంలోనే వర్తిస్తాయి. ఆయా ప్రాంతాలను బట్టి బైక్ ధరల్లో మార్పులు ఉండవచ్చును. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి 159.7 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్ వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 9,250 ఆర్పీఎమ్ వద్ద 17.39 బిహెచ్ పీ పవర్ అవుట్ పుట్, 7,250 ఆర్ పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్ లైట్, ట్విన్ డీఆర్ ఎల్ అప్ ఫ్రంట్, ఎల్ ఈడి టెయిల్ ల్యాంప్, ఎబీఎస్, ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ(జిటిటీ)తో వస్తుంది. ఈ స్పోర్ట్స్ కమ్యూటర్ మోటార్ సైకిల్ నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, రేసింగ్ రెడ్ కలర్ రంగులలో లభ్యం అవుతుంది. -
ఏప్రిల్ నుంచి పెరగనున్న కారు, బైక్ ధరలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి కారు, ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి ముడి సరకు ధరలు, వస్తువుల ఖర్చులు పెరగడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల పెరుగుదల వల్ల ఇప్పటికే జనవరిలోనే వాహనాల ధరలు పెరిగాయి. కేవలం స్వల్ప సమయంలోనే రెండో సారి ధరలు పెరగనున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే వివిధ మోడల్స్, వేరియంట్ల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వలన వాహనా తయారీకి అయ్యే ఖర్చు పెరుగుతుందని మారుతి సుజుకి పేర్కొంది. అందువల్ల, ఏప్రిల్‌లో కస్టమర్ల మీద అదనపు భారం పడే అవకాశం ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. నిస్సాన్ కూడా కొత్త ఎస్‌యూవీల ధరలను పెంచాలని నిర్ణయించింది. నిస్సాన్, డాట్సన్ సిరీస్‌లోని వివిధ వేరియంట్ల ధరలను విడివిడిగా పెంచనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా వాహనాల ధరలను సమీక్షిస్తున్నాయి. త్వరలోనే ధరల పెరుగుదల గురించి సంస్థలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా ఇంధన, సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలపై భారం పడుతోంది. డీజిల్ రిటైల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో కంపెనీలు రవాణా, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులు పెరిగాయి. ఈ కారణాల వల్ల బైక్ కంపెనీ ధరలను ఏప్రిల్ నుంచి పెంచనున్నాయి. ఇప్పటికే ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన ధరలను పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా ఉండటానికి తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అలాగే ప్రీమియం బైక్స్‌పై కూడా ఈ ప్రభావం పడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా ఇటీవల తీసుకొచ్చిన ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 కొత్త వేరియంట్ ధరలు 2 శాతం పెరిగాయి. చదవండి: వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా! -
3.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం
ముంబై: బీఎండబ్ల్యూ అనుబంధ ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ శుక్రవారం తన ఆర్ నైన్ టీ, ఆర్ నైన్ టీ స్కాంబ్లర్ మోడళ్ల కొత్త వెర్షన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ధరలు వరుసగా రూ.18.5 లక్షలు, రూ.16.75 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉన్నాయి. బీఎస్–6 ప్రమాణాలను కలిగిన ఈ రెండు బైకుల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటిలో 1,170 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ను అమర్చారు. కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. గంటకు గరిష్టంగా 200 వేగంతో ప్రయాణించగలవు. బీఎండబ్ల్యూ మోటోరాడ్ షోరూముల్లో ఈ కొత్త బైక్‌లను బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ చార్జింగ్‌పై స్టెర్లింగ్ అండ్ విల్సన్ కన్ను న్యూఢిల్లీ: దేశీ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో ప్రవేశించేందుకు వీలుగా ఈనెల్ ఎక్స్‌తో చేతులు కలిపినట్లు స్టెర్లింగ్ అండ్ విల్సన్ పేర్కొంది. తద్వారా సమాన వాటా (50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కాగా, క్విక్ ఎలక్ట్రిక్ చార్జర్ సౌకర్యాలతో దేశీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు స్టెర్లింగ్ జనరేటర్స్ సీఈవో సంజయ్ జాధవ్ అభిప్రాయపడ్డారు. -
జీఎస్టీ ఎఫెక్ట్: బజాజ్ బైక్స్‌పై డిస్కౌంట్
న్యూఢిల్లీ: దేశీయ మూడవ అతిపెద్ద టూవీలర్ మేకర్ బజాజ్ ఆటో బైక్ లవర్స్‌కి తీపి కబురు అందించింది. జీఎస్టీ చట్టం అమలు ప్రతిపాదన నేపథ్యంలో బైక్‌ల ధరలను తగ్గించినట్టు ప్రకటించింది. కొనుగోలు చేసిన మోటార్‌సైకిల్ మోడల్ ఆధారంగా రూ. 4500 దాకా డిస్కౌంట్ అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఈ ఆదేశాలు వెంటనే (జూన్ 14) అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఈ డిస్కౌంట్ ధరలు ప్రతి రాష్ట్రాలకు మారుతుంటాయని, మోటారుసైకిల్ మోడల్ ఆదారంగా విభిన్నంగా ఉంటాయని బజాజ్ ఆటో తెలిపింది. జూన్ 14 నుంచి జూన్ 2017 మధ్య బుకింగ్స్ , డిస్కౌంట్ల కోసం స్థానిక బజాజ్ ఆటో డీలర్లను సంప్రదించాలని కోరింది. జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైన తరుణంలో తమ వినియోగదారుకుల సరసమైన ధరల్లో బైక్ లనుఅందించాలని నిర్ణయించినట్టు బజాజ్ ఆటో అధ్యక్షుడు ఎరిక్ వాస్ చెప్పారు. ఈ డిస్కౌంట్ ద్వారా తమ కలల బైక్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు జూలై 1 వరకు వేచి చూడాల్సిన అవసర లేదన్నారు. కస్లమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్న మొట్టమొదటి దేశీయ సంస్థగా ఉండటం తమకు గర్వకారణమన్నారు. కాగా జీఎస్టీ పరిధిలో, ద్విచక్ర వాహనాలపై 28 శాతం పన్ను అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఇది 30శాతం కంటే తక్కువగా ఉంటుంది. 3500 సిసి పైగా ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లు 3 శాతం అదనపు సెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.