Royal Enfield Scram 440: దేశీయ టూ వీలర్ దిగ్గజం 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) మార్కెట్లో మరో సరికొత్త మోడల్ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ బైక్ వచ్చే సంవత్సరానికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ స్క్రామ్ 440 మోడల్ అవుతుందని సమాచారం. అంటే ఇది ఇప్పటికే మార్కెట్లో స్క్రామ్ ఆధారంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇది 411 సీసీ ఇంజిన్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ ఇప్పటికే స్క్రామ్ 411లో ఉంది.
(ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!)
ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ వంటివి అధికారికంగా విడుదలకాలేదు, త్వరలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ బైక్ స్క్రామ్ సబ్-బ్రాండ్ క్రింద ఉంటుంది. అయితే హిమాలయన్ బైక్ కంటే కూడా తక్కువ ధర వద్ద ఉంటుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న బైకుల జాబితాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రమే కాకుండా యమహా, హోండా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వారి పరిధిని విస్తరిస్తూ దేశంలో ఉనికిని మరింత చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment