Khali Royal Enfield Riding: బాక్సింగ్ గురించి తెలిసినవారికి ప్రత్యేకంగా 'గ్రేట్ ఖలీ' (Great Khali) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెజ్లింగ్ అరేనాలో పాల్గొన్న భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచిన ఈయన రిటైర్ అయిన తరువాత ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అప్పటి నుంచి కొన్ని టీవీ యాడ్స్‌లో నటించడం, 2015లో పంజాబ్‌లో కాంటినెంటల్ రెజ్లింగ్ స్కూల్ ప్రారంభించడం వంటివి చేసి కాలం గడుపుతున్నారు. ఇటీవల ఖలీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదలైన ఒక వీడియోలో ఖలీ 'రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్' నడపడం చూడవచ్చు. ఈ సంఘటన చూడటానికి బొమ్మ బైకుపై ఆజానుబాహుడున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అత్యంత బరువైన బైకుల్లో ఒకటైన బుల్లెట్ ఖలీ ముందు చిన్న బైకుగా మారిపోయింది.
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది దీనిని లైక్ చేశారు. కొంత మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఖలీ బైకుని రైడ్ చేస్తూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఇంటర్‌సెప్టర్ 650, బుల్లెట్, హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ వంటి వాటిని రైడ్ చేస్తూ కూడా కనిపించాడు.
ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు..
నిజానికి ఖలీ ఎత్తు 7 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఏ బైకైనా అతని పరిణామంతో పోలిస్తే మరగుజ్జు మాదిరిగా కనిపిస్తుంది. బైకులు మాత్రమే కాకుండా ఆయన వద్ద టయోటా ఫార్చ్యూనర్, టయోటా గ్లాంజా వంటి కార్లను కలిగి ఉన్నప్పటికీ.. అతని పరిమాణానికి అనుకూలంగా కస్టమైజ్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment