Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక వేత్త & మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన మనసును దోచిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక వీడియో ట్విటర్ వేదికగా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కారు రయ్ అంటూ వచ్చి, కొన్ని క్షణాల్లోనే రోబోగా మారిన సందర్భాలు చాలానే చూసి ఉంటారు. అయితే నిజ జీవితం ఇలాంటి సన్నివేశం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు బీఎండబ్ల్యూ ఒక రోబో మాదిరిగా మారింది.
టర్కీ దేశానికీ చెందిన కంపెనీ 2016లో ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను ఎంతో ఫిదా చేసింది. వీడియో షేర్ చేస్తూ.. టర్కిష్ R&D కంపెనీ అభివృద్ధి చేసి ప్రదర్శించిన 'ట్రాన్స్‌ఫార్మర్', మన ఆర్ అండ్ డీలో కూడా ఇలాంటి ఫన్ ఉండాలంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ 'వేలు మహీంద్రా'ను ట్యాగ్ చేశారు.
ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు..
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోని లక్షల సంఖ్యలో వీక్షించగా.. వేలమంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీదే ఇలాంటి ఉత్పత్తుల మీద కూడా ద్రుష్టి పెడితే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా పరోక్షంగా వెల్లడించినట్లు స్పష్టమవుతోంది.
A real-life ‘transformer’ developed & showcased by a Turkish R&D company. We should be having such fun at our R&D too! @Velu_Mahindra ? pic.twitter.com/Ru1uK01RaA
— anand mahindra (@anandmahindra) August 7, 2023
Comments
Please login to add a commentAdd a comment