'బుజ్జి' ఎక్కడ తయారైందంటే?.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ | Sakshi
Sakshi News home page

'బుజ్జి' ఎక్కడ తయారైందంటే?.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

Published Thu, May 23 2024 8:55 PM

Anand Mahindra Tweet About Kalki Bujji

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కనిపించే ఓ ప్రత్యేకమైన వాహనానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో కనిపించే  వాహనం పేరు 'బుజ్జి'. ఇది ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమాలో కనిపిస్తుంది. ఇది చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఉన్న మా బృందం తయారు చేసిందని పేర్కొన్నారు. ఇది ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఏఐ టెక్నాలజీని పొందుతుందని వివరించారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

కల్కి 2898 ఏడీ
పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ'. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 27న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement