'అలాంటిదేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా | No BMW, Mercedes Benz Says Anand Mahindra | Sakshi
Sakshi News home page

'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా

Published Tue, Sep 3 2024 4:47 PM | Last Updated on Tue, Sep 3 2024 4:57 PM

No BMW, Mercedes Benz Says Anand Mahindra

పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' మేడ్ ఇన్ ఇండియా అని చెబుతూనే అన్యదేశ్య బ్రాండ్స్ అయిన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కార్లను ఎందుకు ఎంచుకున్నారు, అని 'రతన్ దిలాన్' (Rattan Dhillon) అనే వ్యక్తి ప్రశ్నిస్తూ.. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.

దీనిపైన 'హార్మజ్ద్ సొరాబ్జీ' (Hormazd Sorabjee) స్పందిస్తూ.. ఆనంద్ మహీంద్రా నిబద్దత కలిగిన వ్యక్తి. ఈయన కేవలం ఇండియన్ బ్రాండ్ కార్లను మాత్రమే ఉపయోగితున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని అన్నారు.

ఈ విషయం మీద స్వయంగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. నేను విదేశీ బ్రాండ్ కార్లను ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. నాకు మా అమ్మ మొదట్లో తన లైట్ స్కై-బ్లూ కలర్ ప్రీమియర్ కారులో డ్రైవింగ్ నేర్పించారు. 1991 నుంచి ఇప్పటి వరకు కేవలం మహీంద్రా కార్లను మాత్రమే ఉపయోగిస్తున్నాను. నాకు కంపెనీ కేటాయించిన మొదటి కారు హిందూస్థాన్ మోటార్స్ కాంటెస్సా.

ఆ తరువాత కొన్నేళ్ళకు నేను ఆర్మడ,  బొలెరో, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యూవీ 5OO ఉపయోగించని. ఇప్పుడు లేటెస్ట్ రెడ్ స్కార్పియో ఎన్ వినియోగిస్తున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. సొంత కంపెనీ కార్లను ఉపయోగించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో వెల్లడవుతున్న ఫోటో.. మా బట్టిస్టా ఎలక్ట్రిక్ హైపర్‌కార్‌ను విడుదల చేస్తున్నప్పుడు మాంటెరీ కార్ వీక్‌లో తీసుకున్నదే. అది పాతకాలపు సిసిటాలియా. దీనిని మహీంద్రా కంపెనీ డిజైన్ చేసింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి అన్యదేశ్య కార్లను కొనుగోలు చేయలేదని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement