హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే.. | Hero Ajith Kumar Venus Motorcycle Tours Launched - Sakshi
Sakshi News home page

హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే..

Published Sat, Oct 7 2023 8:23 PM | Last Updated on Sat, Oct 7 2023 8:43 PM

Hero Ajith Kumar Venus Motor Cycle Tours Launchd - Sakshi

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు హీరో 'అజిత్ కుమార్'. సినిమాల్లో బిజీగా ఉంటూ సమయం దొరికినప్పుడు ఖరీదైన బైకులపై రైడింగ్ చేస్తూ ఉంటాడు. కాగా ఈయన తాజాగా 'వీనస్ మోటార్ సైకిల్ టూర్స్' (Venus Motor Cycle Tours) అనే సంస్థ స్టార్ట్ చేసాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బైక్ రేసింగ్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్న అజిత్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ సంస్థ స్థాపించాడు. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా UAE, ఒమన్, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా సేవలను అందించనుంది. గతంలో చెప్పిన విధంగానే అజిత్ మోటార్ సైకిల్ టూర్స్ ప్రారంభించాడు.

ఈ సంస్థ వివిధ ప్రాంతాల్లో రైడింగ్ చేసేవారికి సహాయం చేస్తుంది. కావున రైడర్లు దీని ద్వారా ప్రపంచంలోనే అందమైన ప్రాంతాల్లో పర్యటించవచ్చు. సంస్థ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు..

బైకులు అద్దెకు తీసుకోవడం, అవసరమైన అంతర్జాతీయ అనుమతులను, కావాల్సిన డాక్యుమెంట్స్ పొందటానికి ఇది సాయం చేస్తుంది. ఈ నెల 23 నుంచి బైక్ టూరింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. బైక్ రైడింగ్ వెళ్లాలనుకునే వారి కోసం ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా ట్వీట్‌లో షేర్ చేసిన ఫొటోలో వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement