New venture
-
స్విగ్గీకి మరో షాక్.. వేరుకుంపటికి సిద్ధమైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ గురుమూర్తి కంపెనీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇక్కడి నుంచి నిష్క్రమించి తన సొంత వెంచర్‌ను ప్రారంభించబోతున్నారని ఈ పరిణామాలు తెలిసిన వ్యక్తులను ఉటింకిస్తూ ‘మనీకంట్రోల్’ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. గత మార్చిలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ఏర్పాటు చేసిన గురుమూర్తి.. కొన్ని రోజులు తెరమరుగై మళ్లీ మే నెలలో స్విగ్గీ మాల్‌కు అధిపతిగా తిరిగి వచ్చారు. స్విగ్గీ మాల్‌ను గతంలో స్విగ్గి మ్యాక్స్ అని పిలిచేవారు. ఇది హైపర్‌లోకల్ ఆన్లైన్ షాపింగ్ విభాగం. కార్తీక్ గురుస్వామి ప్రారంభించనున్న వెంచర్ ఇప్పుడు స్విగ్గీ నిర్వహిస్తున్నలాంటిదే. అయితే ఇది ఆఫ్‌లైన్ స్పేస్‌లో ఉంటుంది. జర్మనీకి చెందిన సూపర్‌మార్కెట్ చైన్ ఆల్డీ లాంటి చవక ధరల భౌతిక దుకాణం మోడల్‌ను కార్తీక్ గురుస్వామి భారత్‌లో ప్రారంభించనున్నారు. కొన్ని నెలల క్రితం గురుమూర్తి తన వెంచర్ కన్వెనియోకు నిధుల కోసం మ్యాట్రిక్, యాక్సెల్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలను కలిశారు. ఈ వెంచర్ పేరునే ఆయన మార్చే అవకాశం ఉంది. అయితే దీనిపై గురుమూర్తి కానీ, స్విగ్గీ, మ్యాట్రిక్, యాక్సెల్ కంపెనీలు కానీ స్పందించలేదు. కాగా స్విగ్గీ మాల్‌కు అధిపతిగా దీపక్ కృష్ణమణిని నియమించింది. దీన్నిబట్టి గురుమూర్తి నిష్క్రమణకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. గత నెలలో స్విగ్గీలో చేరిన కృష్ణమణి అంతకుముందు అమెజాన్‌లో దాదాపు ఏడేళ్లు, దానికిముందు మారికోలో తొమ్మిదేళ్లు పనిచేశారు. వరుస నిష్క్రమణలు స్విగ్గీలో టాప్-లెవల్ నిష్క్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జాబితాలో గురుమూర్తి కూడా చేరనున్నారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేల్ వాజ్ కూడా తన సొంత వెంచర్‌ను ప్రారంభించడానికి నిష్క్రమించారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఇన్‌స్టామార్ట్ రెవెన్యూ అండ్ గ్రోత్ హెడ్ నిషాద్ కెంక్రే కంపెనీ విడిచిపెట్టిన కొన్ని రోజులకే మే నెలలో వైస్ ప్రెసిడెంట్, బ్రాండ్ అండ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆశిష్ లింగంనేని కూడా కంపెనీని వీడారు. అదేవిధంగా, రెవెన్యూ అండ్ గ్రోత్ విభాగాన్ని నిర్వహించే సీనియర్ వైస్ ప్రెసిడెండ్ అనూజ్ రాఠి కూడా ఫిన్‌టెక్ కంపెనీ జూపిటర్‌లో చేరేందుకు స్విగ్గీ నుంచి నిష్క్రమించారు. -
హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే..
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు హీరో 'అజిత్ కుమార్'. సినిమాల్లో బిజీగా ఉంటూ సమయం దొరికినప్పుడు ఖరీదైన బైకులపై రైడింగ్ చేస్తూ ఉంటాడు. కాగా ఈయన తాజాగా 'వీనస్ మోటార్ సైకిల్ టూర్స్' (Venus Motor Cycle Tours) అనే సంస్థ స్టార్ట్ చేసాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బైక్ రేసింగ్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్న అజిత్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ సంస్థ స్థాపించాడు. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా UAE, ఒమన్, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా సేవలను అందించనుంది. గతంలో చెప్పిన విధంగానే అజిత్ మోటార్ సైకిల్ టూర్స్ ప్రారంభించాడు. ఈ సంస్థ వివిధ ప్రాంతాల్లో రైడింగ్ చేసేవారికి సహాయం చేస్తుంది. కావున రైడర్లు దీని ద్వారా ప్రపంచంలోనే అందమైన ప్రాంతాల్లో పర్యటించవచ్చు. సంస్థ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు.. బైకులు అద్దెకు తీసుకోవడం, అవసరమైన అంతర్జాతీయ అనుమతులను, కావాల్సిన డాక్యుమెంట్స్ పొందటానికి ఇది సాయం చేస్తుంది. ఈ నెల 23 నుంచి బైక్ టూరింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. బైక్ రైడింగ్ వెళ్లాలనుకునే వారి కోసం ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా ట్వీట్లో షేర్ చేసిన ఫొటోలో వెల్లడించారు. Ajith sir's @VenusMotoTours now launched. Our best wishes and congratulations for the successful venture. | #AK #Ajith #Ajithkumar | #VidaaMuyarchi | pic.twitter.com/BK4vxVK412 — Ajith | Dark Devil (@ajithFC) October 5, 2023 -
హైదరాబాద్‌లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు
హైదరాబాద్,బిజినెస్ బ్యూరో: ఆఫీసు కార్యకలాపాలు, సమావేశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ఈవెంట్ల నిర్వహణకు కూడా వేదికగా ఉపయోగపడేలా హైదరాబాద్‌లో ’డిస్ట్రిక్ట్150’ పేరిట కొత్త వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లు కోరమ్ క్లబ్ వెల్లడించింది. దేవ్‌భూమి రియల్టర్స్ భాగస్వామ్యంలో రూ. 16.5 కోట్ల పెట్టుబడితో దీన్ని నెలకొల్పుతున్నట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో వివేక్ నారాయణ్ వెల్లడించారు. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ ) దాదాపు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ’డిస్ట్రిక్ట్150’ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇందులో ఒపెరా తరహా హాల్, పాడ్‌కాస్ట్ రికార్డింగ్ స్టూడియో, కాన్ఫరెన్స్ రూమ్‌లు, థియేటర్, జిలా బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, సబ్కో కాఫీ బ్రాండ్ మొదలైనవి ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో 8 పైగా ఇటువంటి వెంచర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి వెంచర్‌ను బెంగళూరులో నెలకొల్పుతున్నట్లు నారాయణ్ వివరించారు. (WhatsApp Latest Features: స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్) -
శ్రీ చైతన్య సమర్పించు ఇన్ఫినిటీ లెర్న్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.. ఇన్ఫినిటీ లెర్న్ పేరుతో ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కొత్త విభాగం కోసం సుమారు రూ.370 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సంస్థ ఫౌండర్, చైర్మన్ బి.ఎస్.రావు వెల్లడించారు. అంతర్గత వనరుల నుంచే ఈ నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. ‘35 ఏళ్లుగా విద్యా బోధన అందిస్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ఎడ్ టెక్ విభాగంలోకి ప్రవేశించడం సరైన సమయం. ఈ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదగాలన్నది మా లక్ష్యం. ఇందుకు మా వద్ద సరైన ప్రణాళికలు ఉన్నాయి. ఇన్ఫినిటీ లెర్న్ కంటెంట్ కోసం 100 మంది పరిశ్రమ నిపుణులు, సాంకేతిక సిబ్బందిని నియమించాం. నాణ్యతలో రాజీ పడకుండా కంటెంట్ కోసం ఇతర ఏజెన్సీలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాం’ అని వివరించారు. మెరుగైన కంటెంట్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగంలోకి ఆలస్యంగా వస్తున్నప్పటికీ విద్యార్థులకు అవసరమయ్యే మెరుగైన కంటెంట్‌తో రంగ ప్రవేశం చేస్తున్నామని శ్రీ చైతన్య కో–ఫౌండర్ సుష్మ బొప్పన తెలిపారు. ఇండియాలో ఎడ్యుకేషన్ టెక్నాలజీకి అపారమైన అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే బైజూస్, అన్ అకాడమీలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. తాజాగా శ్రీ చైతన్య విద్యాసంస్థ కూడా ఈ రంగంలో అడుగు పెట్టింది. చదవండి : అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల -
అర్ణబ్ ఈజ్ కమింగ్ బ్యాక్...ట్విట్టర్ లో సందడి
న్యూఢిల్లీ: 'ఇండియా వాంట్స్ టు నో' అంటూ టీవీ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి ఈజ్ కమింగ్ బ్యాక్. అవును ఈ విషయాన్ని స్వయంగా ఆయనే దృవీకరించినట్టుగా ట్విట్టర్ లో అభినందనలు వెల్లువెత్తాయి. తనదైన స్టైల్ యాంకరింగ్‌తో...బాగా పాపులర్ అయిన అర్ణబ్ 'రిపబ్లిక్ ' అనే కొత్త వెంచర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'నా కొత్త వెంచర్ పేరు రిపబ్లిక్. నాకు భారత ప్రజల సపోర్ట్ కావాలి' అంటూ ట్వీట్ చేశారంటూ పేర్కొంటున్నారు. మిగతా విషయాలను మరో రెండు వారాల్లో అందించినున్నట్టు పేర్కొన్నారంటున్నారు. 'రిపబ్లిక్' అనే పేరుతో వస్తున్న అర్ణబ్ గోస్వామి కొత్త మీడియా ఛానల్ 2017 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ఛానల్ లైవ్‌లోకి రానుందని సమాచారం. అలాగే ముంబైకి వెలుపల ఈ ఛానల్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తన టీంతో కొత్త వెంచర్ పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పెద్ద టీవీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.. ఒక ప్రభావవంతమైన అడ్వర్టైజింగ్ కంపెనీలు ఈ వెంచర్లో భాగం కానున్నాయట. కాగా ది న్యూస్ అవర్ ప్రోగ్రామ్‌తో పేరు గడించిన అర్ణబ్ గోస్వామి తన వెంచర్ పేరును ప్రకటించిన గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అభినందనలతో పాటూ, ఛలోక్తులు, వ్యంగ్యోక్తులు వెల్లువెత్తాయి. తను పనిచేస్తున్న ఛానల్ ఎడిటర్-ఇన్-చీఫ్ పదవికి నవంబర్ 1న అర్ణబ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. While#Presstitutes r busy in Rapes of PUBLIC There is a ray of hopes EMERGING as #Republic . Best Of Luck -
భారత్‌లో స్టార్టప్‌లకు జోష్..
నాస్కామ్ సదస్సులో ప్రధాని మోదీ - స్టార్టప్ వ్యవస్థలో సొంతముద్ర... - యువత శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకతే దన్ను - కొత్త వెంచర్లకు సర్వత్రా ఆసక్తి... శాన్‌జోస్: భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థ సొంతశైలిలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో యువత శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకత, ఔత్సాహిక ధోరణే స్టార్టప్‌లు పుట్టుకొచ్చేందుకు దన్నుగా నిలుస్తున్నాయన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా నాస్కామ్ నిర్వహించిన స్టార్టప్ సదస్సులో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ కూడా పాల్గొన్నారు. ‘భారత్ భారీస్థాయి మార్కెట్‌తో వృద్ధిపథంలో పయనిస్తోంది. ప్రతిఒక్క రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. నవకల్పన, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి భారత్, అమెరికాల మధ్య ఎప్పటినుంచో సహజసిద్ధమైన భాగస్వామ్యం ఉంది. ఇక్కడ కొత్త వెంచర్ల ఏర్పాటుకు అన్నిరకాల ప్రోతాహకాలు, సంస్థలు, అన్నింటికంటే ముఖ్యంగా అమితమైన ఆసక్తి నెలకొంది. ఇన్వెస్టర్లు కూడా రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటం లేదు. గడిచిన కొద్ది సంవత్సరాల్లో భారత్‌లో స్టారప్ వెంచర్లు భారీగా పుట్టుకొచ్చాయి. ఉద్యోగాల కల్పన, ఎంట్రప్రెన్యూర్షిప్తో పాటు దేశ ఆర్థికాభివృద్దికి ఈ స్టార్టప్ విప్లవం ఎంతగానో దోహదం చేస్తుందని భావిస్తున్నా’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారీ మార్కెట్, అపార అవకాశాలు... ఈ కార్యక్రమానికి ముందు ఇండియా-యూఎస్ కనెక్ట్ 2015 అనే మరో సదస్సు జరిగింది. టీఐఈ సిలికాన్ వ్యాలీ, ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన సీఐఐఈ ఇండియాలు దీన్ని నిర్వహించాయి. ఇందులో భారత్, అమెరికాలకు చెందిన చెరో 40 స్టార్టప్ సంస్థలు పాల్గొన్నాయి. ‘భారత్‌లోని అద్భుతమైన స్టార్టప్‌ల బృందం ఇక్కడ కొలువుదీరింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, భద్రత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, అందరికీ పరిశుద్ధమైన తాగునీరు కల్పన వంటి అనేక అంశాల్లో టెక్నాలజీ వినియోగం ద్వారా సమూలు మార్పులకు ఈ సంస్థలు కృషిచేస్తున్నాయి. స్టార్టప్లంటే కేవలం వ్యాపార విజయాలకే పరిమితం కాదు. సామాజికంగా కూడా వినూత్న మార్పులకు ఇవి బలమైన ఉదాహరణలు గా నిలుస్తున్నాయి. భారత్‌లో ఇప్పుడు దాదాపు 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం కూడా దూసుకెళ్తోంది. డిజిటల్ ఇండియా ఆలోచన రూపుదిద్దుకోవడానికి ఇవే ప్రేరణ’ అని మోదీ వివరించారు. ఏడు స్టార్టప్ ఎంవోయూలు... భారత్‌లో స్టార్టప్‌లను మరింతగా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఇరు దేశాలకు చెందిన వివిధ సంస్థల మధ్య ఏడు అవగాహన ఒప్పందాలు(ఎంఓయూ) కుదిరాయి. వివరాలివీ... - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫామ్స్, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటిటేటివ్ బయోసెన్సైస్ల మధ్య తొలి ఎంఓయూ కుదిరింది. సైన్స్ ఆధారిత ఎంట్రప్రెన్యూర్షిప్, రీసెర్చ్, విద్య, వ్యాపారాలను ప్రోత్సహించడమే దీని ప్రధానోద్దేశం. - ప్రకాశ్ ల్యాబ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. - భారత్, సిలియాన్ వ్యాలీలలో టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్లకు తగిన పరిస్థితులను కల్పించే ఉద్దేశంతో నాస్కామ్, ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్లు కలిసి పనిచేయనున్నాయి. - ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్(సీఐఐఈ), కాలిఫోర్నియా యూని వర్సిటీ హాస్ బిజినెస్ స్కూల్‌కు చెందిన లెస్టర్ సెంటర్ ఫర్ ఎంట్రప్రెన్యూర్షిప్ల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. స్టార్టప్స్ ఇంక్యుబేషన్, ఇతరత్రా అంశాల్లో సహకరించుకోవడం దీని లక్ష్యం. - లాస్ ఏంజెలిస్ క్లీన్టెక్ ఇంక్యుబేటర్‌తో కూడా సీఐఐఈ జట్టుకట్టింది. ఎంట్రప్రెన్యూర్లు, ఇన్నోవేటర్లకు క్లీన్టెక్ రంగంలో కాలిఫోర్నియా, భారత్ మార్కెట్లలో తగిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా ఒక ప్రోగ్రామ్‌ను ఈ సంస్థలు అందించనున్నాయి. - భారతీయ ఎంట్రప్రెన్యూర్లకు సీడ్ ఫండింగ్ కోసం టాటా ట్రస్ట్‌తో కూడా సీఐఐఈ ఎంఓయూ కుదర్చుకుంది. - టెక్నాలజీ రంగంలో ఎంట్రప్రెన్యూర్లకు వ్యూహాత్మక సహకారానికిగాను గూగుల్‌తోనూ సీఐఐఈ జట్టుకట్టింది. తొలినాళ్లలో మాదీ స్టార్టప్ సర్కారే... ప్రపంచంలో ఇప్పుడున్న మెగా కార్పొరేట్ సంస్థలన్నీ గతంలో స్టార్టప్‌లుగానే ప్రస్థానాన్ని ఆరంభించాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆమాటకొస్తే, కేంద్రంలో అధికారాన్ని సాధించే సమయానికి తమది కూడా స్టార్టప్ ప్రభుత్వమేనని... అనేక ఎత్తుపల్లాలను, ఇక్కట్లను ఎదుర్కొని నిలదొక్కుకున్నామని చెప్పారు. అయితే, ఇప్పుడున్న డిజిటల్ యుగంలో గతంతో పోలిస్తే స్టార్టప్‌లకు అద్భుతమైన అవకాశాలు, తగిన సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని మోదీ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు కూడా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టామనే గొప్ప అనుభూతి ఇక్కడ వాటిని ముందుకునడిపిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘దేశాల ప్రగతి పథంలో స్టార్టప్‌లు ఇంజిన్లుగానే పనిచేస్తాయి. ఇప్పుడున్న ప్రపంచంలో అన్నిరకాల వనరులను ఉపయోగించుకొని ఎదిగే సంస్థలకంటే ఐడియాలను ఆచరణలో పెట్టిన సంస్థలే దూసుకెళ్లగలుగుతున్నాయి. వినియోగదారులే ఇప్పుడు అప్లికేషన్ల సృష్టికి మూలకేంద్రంగా నిలుస్తున్నారు కూడా. అంటే ఒకరి మదిలో మెదిలిన ఆలోచన... ఒక్క ఏడాదిలో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది’ అని మోదీ వివరించారు.