అర్ణబ్ ఈజ్ కమింగ్ బ్యాక్...ట్విట్టర్ లో సందడి
న్యూఢిల్లీ: 'ఇండియా వాంట్స్ టు నో' అంటూ టీవీ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి ఈజ్ కమింగ్ బ్యాక్. అవును ఈ విషయాన్ని స్వయంగా ఆయనే దృవీకరించినట్టుగా ట్విట్టర్ లో అభినందనలు వెల్లువెత్తాయి. తనదైన స్టైల్ యాంకరింగ్‌తో...బాగా పాపులర్ అయిన అర్ణబ్ 'రిపబ్లిక్ ' అనే కొత్త వెంచర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
'నా కొత్త వెంచర్ పేరు రిపబ్లిక్. నాకు భారత ప్రజల సపోర్ట్ కావాలి' అంటూ ట్వీట్ చేశారంటూ పేర్కొంటున్నారు. మిగతా విషయాలను మరో రెండు వారాల్లో అందించినున్నట్టు పేర్కొన్నారంటున్నారు.
'రిపబ్లిక్' అనే పేరుతో వస్తున్న అర్ణబ్ గోస్వామి కొత్త మీడియా ఛానల్ 2017 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ఛానల్ లైవ్‌లోకి రానుందని సమాచారం. అలాగే ముంబైకి వెలుపల ఈ ఛానల్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తన టీంతో కొత్త వెంచర్ పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పెద్ద టీవీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.. ఒక ప్రభావవంతమైన అడ్వర్టైజింగ్ కంపెనీలు ఈ వెంచర్‌లో భాగం కానున్నాయట.
కాగా ది న్యూస్ అవర్ ప్రోగ్రామ్‌తో పేరు గడించిన అర్ణబ్ గోస్వామి తన వెంచర్ పేరును ప్రకటించిన గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అభినందనలతో పాటూ, ఛలోక్తులు, వ్యంగ్యోక్తులు వెల్లువెత్తాయి. తను పనిచేస్తున్న ఛానల్ ఎడిటర్-ఇన్-చీఫ్ పదవికి నవంబర్ 1న అర్ణబ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
While#Presstitutes r busy in Rapes of PUBLIC
There is a ray of hopes
EMERGING as #Republic .
Best Of Luck